LATEST NEWS
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది. హైవేపై వెళ్తున్న ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారు నుంచి మంటలు, పొగ రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమ య్యాడు. పరిస్థితిని గమనించి కారును రోడ్డు పక్కన ఆపి వెంటనే కిందకు దిగిపోయాడు. దీంతో డ్రైవర్ సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ కారు నుంచి బయటకు వచ్చిన కొద్దిసే పటికే మంటలు క్రమంగా తీవ్రరూపం దాల్చాయి. చూస్తుండగానే మంటలు కారు మొత్తం వ్యాపిం చాయి. కళ్లముందే కారు మంటల్లో పూర్తిగా కాలిపోవడంతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా ఆందోళనకరంగా మారింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతూ ఉండడం తో దట్టమైన పొగలు ఆ ప్రాంతం మొత్తం వ్యాపిం చాయి.  దీంతో హైవేపై వాహనాల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. అక్కడ భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఆర్జీఐఏ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అదే సమయంలో ఫైర్ సిబ్బంది కూడా హుటా హుటిన అక్కడికి చేరు కుని ఫైర్ ఇంజన్లతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువ చ్చారు. అయితే అప్పటికే మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. ప్రాథమికంగా కారులో షార్ట్ సర్క్యూట్ కారణంగానో, ఇంజన్ వేడెక్కడం వల్లనో మంటలు చెలరేగి ఉండ వచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు గల పూర్తి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హైవేపై అకస్మాత్తుగా చోటుచేసు కున్న ఈ అగ్నిప్రమాదంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.       [ Shamshabad Highway, Massive fire, Bangalore National Highway, Car fire, Car Accident, Vehicle Fire, Car Blaze, Shamshabad Car Fire, Highway Fire, RGI Airport Police, RGI Police, Fire Accident, Traffic Jam, Hyderabad Traffic ]  
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్‌ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ULC కింద పాక్షికంగా క్రమబద్ధీకరించిన, క్రమబద్ధీకరించని కాలనీలకు సంబంధించిన పెండింగ్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి.. అర్హత ఉన్న కేసులను నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించాలని అధికారులను ఆదేశించింది.ఈ మేరకు గతంలో జారీ చేసిన GO నం.455, 456, 747, 92 కింద వచ్చిన పెండింగ్‌ ULC దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించేలా ఆదివారం Memo.No.48062/ULC/A1/2026-1 జారీ చేసినట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అర్హత కలిగిన కేసుల్లో నిబంధనల ప్రకారం అవసరమైన ప్రక్రియలను పూర్తి చేసి.. క్రమబద్ధీకరణ చర్యలను తక్షణమే చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. ULC సమస్యలకు పరిష్కారం చూపేందుకు గత ప్రభుత్వం 2016లోనే జీవో జారీ చేసినప్పటికీ.. దాని అమలు జరగకపోవడంతో వేలాది దరఖాస్తులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండిపోయాయని మంత్రి తెలిపారు. దీంతో ప్రజలు తమ భూములపై హక్కులు, భూ లావాదేవీల విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంకల్పానికి అనుగుణంగా.. సహచర మంత్రులతో చర్చించి 22Aతో ముడిపడి ఉన్న సమస్యలను ఫాస్ట్‌ట్రాక్‌ విధానంలో పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పొంగులేటి తెలిపారు. ఈ నెల 16న శాసనసభ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు.. సెక్షన్‌ 22Aతో ముడిపడి ఉన్న 10 నుంచి 12 కీలక అంశాలను ఫాస్ట్‌ట్రాక్‌ విధానంలో పరిష్కరించే ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే 22A సమస్యల పరిష్కారానికి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు.అనంతరం జీఓ 118కు అనుగుణంగా మెమో, ఆ వెంటనే జీఓ 76కు అనుగుణంగా మరో మెమో జారీ చేసినట్లు చెప్పారు. 22A జాబితాలో ఉన్నప్పటికీ GHMC, HMDA, DTCP, మున్సిపల్‌ అనుమతులు కలిగిన ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ఇప్పుడు తాజాగా దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ULC దరఖాస్తుల పరిష్కారానికి స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశామని మంత్రి పేర్కొన్నారు. 22Aకు సంబంధించిన మిగిలిన సమస్యలకు కూడా వేగవంతమైన పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల నుంచి ప్రజలకు విముక్తి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న ప్రతి భూ సమస్యను పరిశీలించి.. చట్టం, నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించడమే తమ ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని పేర్కొన్నారు.       [ Telangana Government, Ponguleti Srinivas Reddy, 22A Issues, ULC Applications, Urban Land Ceiling, Telangana Revenue Department, Land Regularisation, Land Disputes, CM Revanth Reddy, Telangana Land Issues ]
హైదరాబాద్‌లో కుటుంబ కలహాలు విషాదాంతమయ్యాయి. చిన్నచిన్న గొడవలు చివరకు ఓ మహిళ ప్రాణాలు పోయేంత దారుణానికి దారితీశాయి. చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాగ్‌లింగంపల్లిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.మాచర్ల జ్యువెలరీ షాప్ సమీపంలో నరేందర్‌ (34), తేజస్వి (29) దంపతులు నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం మరోసారి ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. ఉదయం సుమారు 11:22 గంటల సమయంలో మాటామాటా పెరిగింది. అప్పటికే ఆగ్రహంతో ఉన్న నరేందర్ ఒక్కసారిగా భార్య తేజస్విపై రోకలిబండతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో తేజస్వి తీవ్రంగా గాయపడి, అధిక రక్తస్రావంతో అక్కడికక్కడే స్పృహ కోల్పోయింది.దాడి అనంతరం నరేందర్ అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే తేజస్వి మృతి చెందినట్లు గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.అసలు భార్యాభర్తల మధ్య గొడవకు కారణమేంటి? తరచూ జరుగుతున్న వివాదాలు ఇంతటి దారుణానికి ఎలా దారితీశాయి? క్షణికావేశంలోనే ఈ హత్య జరిగిందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది. ఒక్క క్షణం ఆవేశం.. ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. తగాదాలు ఎంత తీవ్రంగా ఉన్నా చర్చలతో పరిష్కరించుకోవాల్సిన సమస్య.. చివరకు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకోవడం విషాదాన్ని మిగిల్చింది.       [ Hyderabad, Bhaglingampally, Chikkadpally Police, Husband Wife Dispute, Family Dispute, Wife Murder, Husband Kills Wife, Domestic Dispute, Crime News, Telangana Crime ]
ALSO ON TELUGUONE N E W S
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. భుజం గాయం కారణంగా కొంతకాలంగా షూటింగ్స్‌కు దూరంగా ఉన్న తారక్.. ఇప్పుడు పూర్తిగా కోలుకుని తిరిగి సెట్స్‌పైకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గాయం కారణంగా ఆయనకు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ కూడా జరిగింది. ప్రస్తుతం ఫిజియోథెరపీ తీసుకుంటూ రికవరీ అవుతున్న ఎన్టీఆర్.. అక్టోబర్‌లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ షూటింగ్‌లో తిరిగి పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. ఎన్టీఆర్ గాయంతో షూటింగ్‌కు బ్రేక్ వచ్చినప్పటికీ దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రం సినిమా పనులను ఆపలేదు. తారక్ అవసరం లేని సన్నివేశాలతో పాటు ఇతర నటీనటులకు సంబంధించిన భాగాలను చిత్రీకరిస్తూ షూటింగ్‌ను కొనసాగించారు. దీంతో సినిమా నిర్మాణం పూర్తిగా నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ రీఎంట్రీ కోసం చిత్రబృందం కీలకమైన షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ‘డ్రాగన్’ విషయానికి వస్తే.. ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్, డార్క్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ఎన్టీఆర్ ‘లూగర్’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌తో ఈ పాత్రపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎన్టీఆర్ సెట్స్‌పైకి వచ్చిన తర్వాత మిగిలిన కీలక సన్నివేశాలను వేగంగా పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘డ్రాగన్’ను 2027 జూన్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. గాయం నుంచి పూర్తిగా కోలుకుని తారక్ మళ్లీ యాక్షన్ మోడ్‌లోకి వస్తుండటంతో ఈ సినిమా షూటింగ్‌పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.     [Jr NTR, NTR Dragon, NTR Dragon Movie, Jr NTR Comeback, NTR Injury, NTR Shoulder Injury, NTR Dragon Shooting, Prashanth Neel Dragon, NTR Upcoming Movie, Dragon Movie Update, Rukmini Vasanth, Anil Kapoor, Tollywood News]
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ‘ది ప్యారడైజ్’ సినిమా విడుదలైన తర్వాత అందులోని కొన్ని సన్నివేశాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పోలిన పాత్ర సినిమాలో కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఎమ్మెల్యే శంకర్ అనే పాత్రలో ప్రియదర్శి కనిపించగా.. ఆయన గెటప్, డైలాగ్స్, కొన్ని సన్నివేశాలు కేసీఆర్‌ను గుర్తు చేసేలా ఉన్నాయి. ఈ పాత్ర సినిమాల్లో కేవలం నాలుగు నిమిషాల పాటు మాత్రమే కనిపించినప్పటికీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ‘ది ప్యారడైజ్’ సినిమా చూసిన అనంతరం కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా తన స్పందనను తెలియజేశారు. తెలంగాణ భాష, సంస్కృతి, అణచివేతపై ప్రజల పోరాటాన్ని సినిమాలో చూపించిన విధానం గురించి ఆయన ప్రశంసలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యే శంకర్ పాత్రను ప్రియదర్శి అద్భుతంగా పోషించారని పేర్కొన్నారు. సినిమాలో ఆ పాత్రకు లభించిన స్పందనను కూడా ఆయన ప్రస్తావించారు. ఇదిలా ఉంటే.. ‘ది ప్యారడైజ్’లో కేసీఆర్‌తో పాటు దివంగత నటుడు నందమూరి తారక రామారావును పోలిన పాత్ర కూడా కనిపిస్తుంది. ఎన్టీఆర్ లుక్‌లో పి. విజయ్ కుమార్ చిన్న గ్లింప్స్‌లో కనిపించారు. అలాగే ఇటీవల కన్నుమూసిన పలువురు సినీ ప్రముఖులకు, కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్‌కు కూడా చిత్రబృందం ప్రత్యేక నివాళి అర్పించింది. దీంతో సినిమాలోని ఈ అంశాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మరోవైపు సినిమాలో కేసీఆర్‌ను పోలిన పాత్రకు ఇచ్చిన ప్రాధాన్యతపై తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. దీనిపై కేటీఆర్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి విమర్శలు చేసినట్లు సదరు కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ‘ది ప్యారడైజ్’ కథ కల్పితమైనదే కాగా, అందులోని కొన్ని పాత్రలు, సన్నివేశాలు వాస్తవ జీవితంలోని ప్రముఖులను పోలి ఉండేలా రూపొందించినట్లు తెలుస్తోంది.       [Nani The Paradise, The Paradise Movie, KTR The Paradise Review, KTR On The Paradise, KCR Character In The Paradise, Priyadarshi The Paradise, Nani Srikanth Odela, The Paradise KCR Role, Telugu Cinema News, Tollywood Latest News]
నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘దాదా’ కూడా ఒకటి. బాలయ్య, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మొదటి నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తదుపరి షెడ్యూల్‌ను మైసూర్‌లో నిర్వహించేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. ఈ నెల 29 నుంచి అక్కడ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మైసూర్ షెడ్యూల్‌లో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్ కోసం చిత్రబృందం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. అయితే బాలకృష్ణ మాత్రం అక్టోబర్ 5 నుంచి షూటింగ్‌లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకు ఇతర నటీనటులతో అవసరమైన సన్నివేశాలను పూర్తి చేసేందుకు దర్శకుడు ప్లాన్ చేసినట్లు సమాచారం. దీంతో ఎలాంటి గ్యాప్ లేకుండా షూటింగ్‌ను కొనసాగిస్తూ సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేయాలని టీమ్ భావిస్తోంది. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరి కలయికలో వస్తున్న ‘దాదా’పై సహజంగానే ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో బాలయ్యను దర్శకుడు మరో కొత్త తరహా పాత్రలో చూపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన సినిమా అప్డేట్స్, బాలయ్య లుక్‌పై అభిమానుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక మైసూర్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత సినిమా షూటింగ్ మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. బాలకృష్ణ అక్టోబర్ 5 నుంచి సెట్స్‌లోకి అడుగుపెట్టనుండటంతో ఆయనకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ అప్‌డేట్‌తో ‘దాదా’పై నందమూరి అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. సినిమా విడుదల తేదీ, ఇతర వివరాలను చిత్రబృందం త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.     [Balakrishna Dada, Dada Movie, NBK Dada Movie, Balakrishna Gopichand Malineni, Dada Shooting, Dada Movie Shooting, NBK Upcoming Movie, Balakrishna Latest Movie, Nandamuri Balakrishna, Telugu Cinema News]
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ "రణబాలి". ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై "రణబాలి" సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అక్టోబర్ 16న విజయదశమి పర్వదినం సందర్భంగా "రణబాలి" సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.  ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నుంచి ఇంట్రెస్టింగ్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. "రణబాలి" నెవర్ ఫర్ గెట్ ది ట్రూత్ పేరుతో 4 ఎపిసోడ్స్ డాక్యుమెంటరీ సిరీస్ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. యూట్యూబ్ లో ఈ నెల 28వ తేదీన ఫస్ట్ ఎపిసోడ్ 'ది ఫెమైన్ వి ఫర్ గాట్' స్ట్రీమింగ్ కు రానుంది. ఈ నెల 30న సెకండ్ ఎపిసోడ్ 'ది హిస్టరీ వి ఫర్ గాట్', అక్టోబర్ 2న మూడో ఎపిసోడ్ 'ది మెన్ వి ఫర్ గాట్' స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. నాలుగో ఎపిసోడ్ 'ది లాస్ట్ లోడ్' స్ట్రీమింగ్ డేట్ ను త్వరలో ప్రకటించనున్నారు. చరిత్రకు రెండు పార్శ్వాలు ఉన్నాయి. ఒకటి మనకు చెప్పింది, మరొకటి ఎవరికీ తెలియకుండా సమాధి చేయబడింది. మనకు తెలియకుండా చరిత్రలో కనుమరుగు చేసిన ఆ నిజాలను చెప్పబోతోంది 4 ఎపిసోడ్ల రణబాలి ట్రూత్ సిరీస్. రణబాలి ప్రపంచం నుంచి ఎక్స్ క్లూజివ్ బిహైండ్ ది సీన్స్ కంటెంట్ తో ఈ డాక్యుమెంటరీ సిరీస్ రాబోతోంది.     [ranabaali movie as series, vijay devarakonda new movie, rashmika, rahul sanrityan, telugu movie news, telugu cinema latest updates]
సూపర్‌స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘ధర్మన్’ కూడా ఒకటి. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను చిత్రబృందం శరవేగంగా పూర్తి చేస్తోందని, 2027 పొంగల్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  రజనీకాంత్, అశ్వత్ మారిముత్తు కాంబినేషన్‌లో వస్తున్న ‘ధర్మన్’ను ఫ్యామిలీ డ్రామాతో పాటు యాక్షన్ అంశాలతో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ కీలక దశలో ఉంది. ఇటీవల దర్శకుడు అశ్వత్ మారిముత్తు సినిమా సెట్స్‌కు సంబంధించిన కొన్ని విషయాలను పంచుకుంటూ.. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం చిత్రబృందం సిద్ధమవుతోందని తెలిపారు. దీంతో సినిమాలో యాక్షన్‌కు కూడా మంచి ప్రాధాన్యత ఉంటుందని అర్థమవుతోంది. ఇక 2027 సంక్రాంతి సీజన్‌కు ఇప్పటికే పలు తెలుగు సినిమాలు తమ రిలీజ్ ప్లాన్స్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్ ‘ధర్మన్’ కూడా పొంగల్ రేసులో చేరే అవకాశం ఉందన్న వార్తలు ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక విడుదల తేదీ ప్రకటన రాలేదు. షూటింగ్‌ను అనుకున్న సమయానికి పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. రజనీకాంత్ సినిమాలకు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉండటంతో ‘ధర్మన్’ రిలీజ్‌పై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా పొంగల్ సీజన్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తే బాక్సాఫీస్ దగ్గర మంచి పోటీ కనిపించే అవకాశం ఉంది. ప్రస్తుతం శరవేగంగా సాగుతున్న షూటింగ్‌ను బట్టి చూస్తే ‘ధర్మన్’ టీమ్ పొంగల్ 2027ను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే చివరకు సినిమా ఏ తేదీన థియేటర్లలోకి వస్తుందో అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.     [Rajinikanth Dharman, Dharman Movie, Rajinikanth Dharman Release Date, Dharman Pongal 2027, Rajinikanth New Movie, Ashwath Marimuthu Dharman, Rajinikanth Upcoming Movies, Dharman Shooting, Tamil Cinema News, Rajinikanth Latest News]
దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి సినీ ప్రయాణం 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2001లో ‘స్టూడెంట్ నెం.1’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రాజమౌళి.. అప్పటి నుంచి ప్రతి సినిమాతో తన స్థాయిని పెంచుకుంటూ వచ్చారు. సినిమా సినిమాకూ మరింత పెద్దగా కలలు కంటూ, తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన 25 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియాలో అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాజమౌళి కెరీర్‌ను పరిశీలిస్తే ‘సింహాద్రి’, ‘ఛత్రపతి’, ‘మగధీర’, ‘ఈగ’, ‘బాహుబలి’ రెండు భాగాలు, ‘ఆర్ఆర్ఆర్’ వరకు ప్రతి సినిమా ప్రత్యేకంగా నిలిచింది. ముఖ్యంగా ‘బాహుబలి’తో తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఆయన.. ‘ఆర్ఆర్ఆర్’తో మరోసారి ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చాటారు. ఒక్కో సినిమాతో ప్రేక్షకుల అంచనాలను పెంచుతూ వచ్చిన రాజమౌళి.. 25 ఏళ్ల తర్వాత కూడా అదే ఉత్సాహంతో, మరింత పెద్ద కలతో ముందుకు సాగుతున్నారంటూ ప్రశంసలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం రాజమౌళి ‘వారణాసి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. రాజమౌళి 25 ఏళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ప్రయాణాన్ని గుర్తుచేస్తూ చేసిన ఓ ప్రత్యేక పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలన్నింటినీ ప్రస్తావిస్తూ.. ప్రతి సినిమాతో ఇంకా ఏదో గొప్పది చేయాలనే తపనను కొనసాగిస్తున్నారంటూ ప్రశంసించారు. 25 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం పూర్తయినా రాజమౌళిలోని ఆ తపన ఏమాత్రం తగ్గలేదని, ఇప్పుడు ఆ ప్రయాణం ‘వారణాసి’ వైపు సాగుతోందని పేర్కొన్నారు. దీంతో రాజమౌళి తదుపరి సినిమా కోసం అభిమానులు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ‘వారణాసి’తో ఆయన ఎలాంటి కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.     [SS Rajamouli, 25 Years of SS Rajamouli, Rajamouli 25 Years, Rajamouli Cinema Journey, SS Rajamouli Career, Varanasi Movie, Mahesh Babu Varanasi, Rajamouli Varanasi, Telugu Cinema, Tollywood News]
సినిమాకు టాక్ ఎలా ఉన్నా బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు రాబట్టాలంటే హీరోకి ఉన్న క్రేజ్, సినిమాపై ఉన్న హైప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని నటించిన ‘ది ప్యారడైజ్’ విషయంలోనూ అదే జరుగుతోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కలెక్షన్ల విషయంలో మాత్రం దూసుకెళ్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.136 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ‘ది ప్యారడైజ్’ నాని కెరీర్‌లోనే అత్యంత వేగంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకున్న సినిమాగా ఇప్పటికే రికార్డు సృష్టించింది. మూడో రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర సినిమా జోరు కొనసాగింది. ఆ రోజు దాదాపు రూ.22 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు సమాచారం. మరోవైపు ఇండియా నెట్ కలెక్షన్లను పరిశీలిస్తే మూడు రోజుల్లో రూ.76.40 కోట్లు రాబట్టినట్లు తాజా ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. ఓవర్సీస్‌లోనూ సినిమాకు మంచి స్పందన లభించడంతో మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల మార్క్‌ను దాటింది. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘దసరా’కు మంచి స్పందన రావడంతో ‘ది ప్యారడైజ్’పై మొదటి నుంచీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే మొదటి రోజు నుంచే సినిమా భారీ వసూళ్లు సాధిస్తోంది. ముఖ్యంగా తెలుగు వెర్షన్ బాక్సాఫీస్ దగ్గర ప్రధానంగా దూసుకెళ్తుండగా, హిందీ, తమిళ వెర్షన్లు కూడా తమవంతు వసూళ్లు అందిస్తున్నాయి. ఇక మూడ్రోజుల్లోనే రూ.136 కోట్ల గ్రాస్ సాధించిన ‘ది ప్యారడైజ్’.. ఇదే జోరు కొనసాగిస్తే త్వరలోనే రూ.150 కోట్ల మార్క్‌ను కూడా అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే రానున్న రోజుల్లో సినిమా వసూళ్లు ఏ స్థాయిలో కొనసాగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. మిక్స్‌డ్ టాక్‌ను దాటుకుని నాని సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత దూరం వెళ్తుందో చూడాలి.       [Nani The Paradise, The Paradise Box Office Collection, Nani The Paradise Collections, The Paradise 3 Days Collections, Nani Movie Box Office, Nani Latest Movie, The Paradise Worldwide Collections, Srikanth Odela, Nani Movies, Telugu Cinema News]
Ranbir Kapoor, Sai Pallavi and Yash starrer Ramayana has unveiled two new character posters, offering a glimpse into the contrasting worlds of Ravana and the Ram-Lakshmana-Sita trio. The posters have added to the curiosity around Nitesh Tiwari’s ambitious adaptation of the Indian epic. Yash’s poster presents him as Ravana in a regal and imposing avatar. Dressed in traditional attire and adorned with a bright golden crown, precious gems, layered pearl necklaces and heavy gold bracelets, the actor commands the frame. His intense gaze and authoritative presence underline the grandeur associated with the legendary ruler of Lanka. The second poster captures Ram, Sita and Lakshmana during their Vanvas. Ranbir Kapoor, Sai Pallavi and Ravi Dubey are presented in a composed and divine setting, offering a sharp contrast to Ravana’s imposing appearance. Together, the posters hint at the central conflict between the forces of good and evil that forms the core of the epic. Produced by Namit Malhotra and Monster Mind Creations, Ramayana is being mounted on a global scale. AR Rahman and Hans Zimmer are composing the music for the two-part film, while the previously released trailer and the Jai Jai Ram song have generated significant attention. Ramayana Part 1 is slated for a Diwali 2026 release, with Part 2 scheduled for Diwali 2027.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
నేటి ఆధునిక డిజిటల్ యుగంలో ఫిట్‌నెస్ ట్రాకర్లు, స్మార్ట్ వాచీలు మరియు స్మార్ట్ రింగ్‌లు మన జీవితంలో ఒక భాగమైపోయాయి. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనం ఎన్ని అడుగులు వేసాం, ఎన్ని కేలరీలు ఖర్చు చేశాం, గుండె కొట్టుకునే వేగం ఎంత అనే వివరాలతో పాటు రాత్రి వేళ మనం ఎంత ప్రశాంతంగా నిద్రపోయాం అనే విషయాలను కూడా ఈ స్మార్ట్ పరికరాలు క్షణాల్లో లెక్కించి చూపిస్తున్నాయి. స్మార్ట్ వాచ్ ధరించి పడుకునే చాలామంది ఉదయాన్నే లేవగానే తమ యాప్‌లో  స్లీప్ స్కోర్  ఎంత వచ్చిందో చూసుకోవడం ఒక అలవాటుగా మారిపోయింది. 100 కి 80 లేదా 90 స్కోర్ వస్తే అబ్బా ఈరోజు బాగా నిద్రపోయాం అని సంతోషపడటం, అదే 60 లేదా 70 పాయింట్లు వస్తే తీవ్రమైన అసంతృప్తికి లోనై మనశ్శాంతిని పాడుచేసుకోవడం తరచూ జరుగుతుంటుంది. అసలు డిజిటల్ డివైజ్‌లలో కనిపించే ఈ  100 శాతం స్లీప్ స్కోర్  నిజంగా సాధించడం సాధ్యమేనా, అసలు ఈ స్కోర్లు ఎంతవరకు ఖచ్చితమైనవి అనే విషయాలపై నిద్ర శాస్త్రవేత్తలు మరియు వైద్య నిపుణులు అత్యంత ఆసక్తికరమైన నిజాలను వెల్లడించారు. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఏ మనిషికి కూడా నిద్ర పరికరాలలో 100 శాతం స్లీప్ స్కోర్ రావడం అనేది దాదాపు అసాధ్యం. మానవ శరీరం మరియు మెదడు యొక్క నిర్మాణం అత్యంత సంక్లిష్టమైనది. మన నిద్ర ప్రధానంగా నాలుగు విభిన్న దశలలో సాగుతుంది. అవి లైట్ స్లీప్, డీప్ స్లీప్, రెమ్ (REM  రఫిడ్ ఐ మూవ్‌మెంట్) స్లీప్ మరియు మనం మధ్యమధ్యలో మేల్కొనే స్వల్ప విరామాలు. ఆరోగ్యకరమైన మనిషి రాత్రి వేళ పడుకున్నప్పుడు ఈ విభిన్న దశల గుండా వరుసగా పదేపదే పయనిస్తాడు. సాధారణంగా ప్రశాంతమైన రాత్రి నిద్రలో డీప్ స్లీప్ అనేది మొత్తం నిద్ర సమయంలో దాదాపు 15 నుంచి 25 శాతం వరకు ఉంటుంది. అలాగే డ్రీమ్ స్టేజ్ అని పిలిచే రెమ్ స్లీప్ 20 నుంచి 25 శాతం వరకు, లైట్ స్లీప్ 50 నుంచి 60 శాతం వరకు విస్తరించి ఉంటుంది. మన మెదడు మరియు శరీరం సంపూర్ణంగా రీఛార్జ్ అవ్వడానికి, కణజాలాలు పునరుద్ధరణ చెందడానికి ఈ నాలుగు దశల సమతుల్యత అత్యంత అవసరం. స్మార్ట్ పరికరాలు మన హృదయ స్పందనల రేటు, శరీర కదలికలు మరియు చర్మ ఉష్ణోగ్రతల ఆధారంగా ఒక అంచనాతో స్కోరును లెక్కిస్తాయి తప్ప, అవి మన మెదడు తరంగాలను నేరుగా కొలవలేవు. ఆస్పత్రులలో చేసే సైంటిఫిక్ 'పాలిసోమ్నోగ్రఫీ' (PSG) స్లీప్ స్టడీ పరీక్షల ద్వారా మాత్రమే నిద్ర యొక్క కచ్చితమైన దశలను లెక్కించగలరు. మన చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ లేదా వేలికి ఉన్న స్మార్ట్ రింగ్ రాత్రి వేళ మనం చిన్నగా కదిలినా లేదా హృదయ స్పందనల్లో స్వల్ప మార్పులు వచ్చినా దానిని లేచినట్లుగా లేదా అసౌకర్యంగా ఉన్నట్లుగా భావించి స్కోరును తగ్గించేస్తాయి. దీనివల్ల 100 శాతం స్కోర్ సాధించడం సైంటిఫిక్‌గా వీలుపడదు. పైగా స్మార్ట్ పరికరాల్లో 100 కి 100 స్కోర్ రావాలని నిరంతరం తపించడం వల్ల 'ఆర్థోసోమ్నియా' (Orthosomnia) అనే కొత్త తరహా మానసిక ఒత్తిడికి ప్రజలు గురవుతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పర్‌ఫెక్ట్ స్లీప్ స్కోర్ రాకపోవడం వల్ల కలిగే ఈ ఆందోళన వల్ల అసలైన నిద్ర మరింత దూరమైపోతుంది. రోజువారీ జీవితంలో 85 శాతం లేదా అంతకంటే ఎక్కువ స్కేలింగ్ స్కోర్ లభిస్తే అది అత్యుత్తమమైన ఆరోగ్యకరమైన నిద్రగానే పరిగణించాలి. కాబట్టి డిజిటల్ స్క్రీన్లపై కనిపించే సంఖ్యలు మరియు గ్రాఫ్‌లను చూసి భయపడటం మానేసి, మన శరీరం ఇచ్చే సహజమైన సంకేతాలను గమనించడం అలవాటు చేసుకోవాలి. ఉదయం లేచిన తర్వాత మీరు రోజంతా ఉత్సాహంగా, చురుగ్గా, అలసట లేకుండా పనిచేయగలుగుతున్నారా లేదా అనేదే మీ నిద్ర నాణ్యతకు నిజమైన కొలమానం. ప్రశాంతమైన నిద్ర కోసం రాత్రి పడుకోవడానికి 1,2 గంటల ముందే మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల స్క్రీన్లను పక్కన పెట్టడం, చీకటిగా ప్రశాంతంగా ఉండే గదిని ఎంచుకోవడం, రోజూ ఒకే సమయానికి పడుకుని ఒకే సమయానికి లేచే నిద్ర వేళలను పాటించడం అత్యంత ముఖ్యం. డిజిటల్ స్కోర్ల వెనుక పరుగులు తీయడం కంటే సహజమైన జీవనశైలి మార్పులతో ప్రశాంతమైన నిద్రను సొంతం చేసుకోవడమే ఉత్తమమైన మార్గం.     [ Sleep Score, Sleep Trackers, Smart Watch, Smart Ring, Sleep Stages, REM Sleep, Deep Sleep, Polysomnography, Orthosomnia, Sleep Quality ]    
నేటి వేగవంతమైన ప్రపంచంలో చాలామంది బరువు తగ్గడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. జిమ్‌లకు వెళ్లడం, కఠినమైన డైటింగ్ పాటించడం, రకరకాల వ్యాయామాలు చేయడం ద్వారా బరువు తగ్గితే అది సంతోషించదగ్గ విషయమే. అయితే మీరు ఎలాంటి డైటింగ్ చేయకుండా, వ్యాయామం చేయకుండా, ఆహార అలవాట్లలో ఎటువంటి మార్పులు చేసుకోకుండానే ఉన్నట్టుండి వేగంగా బరువు తగ్గిపోతున్నారా? అయితే ఈ హెచ్చరిక మీ కోసమే! శారీరక శ్రమ లేకుండానే బరువు తగ్గడాన్ని వైద్య పరిభాషలో  అన్ ఎక్స్‌ప్లైన్డ్ వెయిట్ లాస్  అంటారు. ఇది కేవలం ఏదో సాధారణ అలసట అని భావించి నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. ఇటీవల జరిగిన అనేక వైద్య పరిశోధనలు మరియు అధ్యయనాలు ఈ విధంగా కారణం లేకుండా బరువు తగ్గడం అనేది క్యాన్సర్ ప్రాథమిక లక్షణాలలో ప్రధానమైనదని స్పష్టం చేస్తున్నాయి. వైద్య నిపుణులు మరియు పరిశోధకుల ప్రకారం, ఆరు నెలల నుంచి ఏడాది వ్యవధిలో మీ మొత్తం శరీర బరువులో 5 శాతం లేదా అంతకంటే ఎక్కువ బరువు తగ్గితే దానిని తీవ్రమైన ఆరోగ్య సమస్యగా పరిగణించాలి. ఉదాహరణకు 70 కిలోల బరువున్న వ్యక్తి ఎలాంటి ప్రయత్నం లేకుండానే 6 నెలల్లో దాదాపు 3.5 నుంచి 4 కిలోల బరువు తగ్గితే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరం. మన శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందడం ప్రారంభించినప్పుడు, అవి శరీరంలోని శక్తిని మరియు పోషకాలను వేగంగా గ్రహించడం మొదలుపెడతాయి. క్యాన్సర్ కణాలు ప్రతిరూపాలను తయారు చేసుకునే క్రమంలో కండరాల ప్రోటీన్లను, కొవ్వును వేగంగా కరిగిస్తాయి. దీనివల్ల శరీరం తన కండరాల బలాన్ని కోల్పోయి వేగంగా సన్నబడుతుంది. ముఖ్యంగా పాంక్రియాటిక్ (క్లోమ గ్రంథి) క్యాన్సర్, స్టమక్ (పొట్ట) క్యాన్సర్, ఈసోఫేగియల్ (అన్నవాహిక) క్యాన్సర్ మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్‌లలో ఈ అకస్మాత్తుగా బరువు తగ్గడం అనేది అత్యంత స్పష్టమైన తొలి లక్షణంగా కనిపిస్తుంది. అధ్యయనాల ప్రకారం, పాంక్రియాటిక్ మరియు పొట్ట క్యాన్సర్ బారిన పడిన బాధితులలో ఏకంగా 80 శాతం కంటే ఎక్కువ మంది వ్యాధి ప్రారంభ దశలోనే తీవ్రమైన బరువు తగ్గుదలకు గురవుతున్నారని ఆధారాలు చెబుతున్నాయి. అంతేకాకుండా బ్లడ్ క్యాన్సర్లు అయిన లింఫోమా మరియు ల్యుకేమియాతో బాధపడేవారిలో కూడా ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా బరువు తగ్గడం, రాత్రి వేళల్లో తీవ్రంగా చెమటలు పట్టడం మరియు నిరంతరం జ్వరం రావడం వంటి లక్షణాలు విస్తృతంగా కనిపిస్తాయి. అనేక రకాల క్యాన్సర్లలో కణితి కణాలు కొన్ని రకాల ప్రొటీన్లు, సైటోకిన్లు మరియు హార్మోన్లను రక్తం లోకి విడుదల చేస్తాయి. ఇవి మెదడులోని ఆకలిని నియంత్రించే కేంద్రాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. దీనివల్ల ఎంత మంచి ఆహారం కళ్లముందు ఉన్నా తినాలనే ఆసక్తి లేకపోవడం, కొద్దిగా తినగానే పొట్ట నిండిపోయినట్లు అనిపించడం, రుచి మరియు వాసన తెలియకపోవడం వంటి మార్పులు వస్తాయి. ఈ పరిస్థితిని క్యాన్సర్ కాచెక్సియా  అంటారు. దీనివల్ల రోగి వేగంగా బరువు కోల్పోవడమే కాకుండా తీవ్రమైన నీరసానికి లోనవుతాడు. అందువల్ల ఎవరైనా తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గుతుంటే, దానికి తోడు నిరంతర అలసట, పొట్టలో నొప్పి, జీర్ణ సమస్యలు ఉంటే వెంటనే రక్త పరీక్షలు, స్కానింగ్ ద్వారా అసలు కారణాన్ని తెలుసుకోవాలి. క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తి స్థాయిలో నయం చేసే అవకాశాలు 90 శాతానికి పైగా ఉంటాయి కాబట్టి, శరీరంలో వచ్చే ఈ చిన్న మార్పును ఎప్పటికీ తేలికగా తీసుకోకండి.     [ Unexplained Weight Loss, Cancer Symptoms, Cancer Warning Signs, Pancreatic Cancer, Stomach Cancer, Esophageal Cancer, Lung Cancer, Lymphoma, Leukemia, Cancer Cachexia ]    
వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అని అంటారు. కానీ వయస్సు 40 ఏళ్లకు చేరుకునేసరికి శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. మునుపటి కంటే త్వరగా అలసిపోవడం, ఉత్సాహం తగ్గడం, చర్మంపై ముడతలు రావడం వంటి అనేక సమస్యలు మొదలవుతాయి. అయితే సరైన జీవనశైలి మరియు ఆరోగ్యకరమైన దినచర్యను పాటించడం ద్వారా 40 ఏళ్ల వయస్సులో కూడా 20 ఏళ్ల యువకుడిలా అత్యంత ఎనర్జిటిక్‌గా మరియు కాంతివంతంగా కనిపించడం ఖచ్చితంగా సాధ్యమే. దానికి మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఐదు ముఖ్యమైన మరియు అత్యంత సులువైన అలవాట్లను మీ జీవితంలో భాగం చేసుకోవాల్సి ఉంటుంది. మొదటిది, ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. రోజుకు కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు నడక, యోగా లేదా తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇది కండరాల బలాన్ని పెంచడమే కాకుండా జీవక్రియను వేగవంతం చేస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారిలో వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు మరియు శరీరం ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది. రెండవది, సరైన నిద్ర. రాత్రి వేళ కనీసం 7 నుంచి 8 గంటల గాఢ నిద్రపోవడం శరీరానికి ఎంతో అవసరం. మనం నిద్రపోతున్న సమయంలోనే మన శరీర కణాలు తమను తాము పునరుద్ధరించుకుంటాయి. సరిపడా నిద్ర లేకపోతే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి ముఖంపై ముడతలు, కళ్ల కింద నల్లటి వలయాలు మరియు తీవ్రమైన అలసట ఆవరిస్తాయి. మూడవది, శరీరానికి తగినంత నీటిని అందించడం. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. నీరు పుష్కలంగా తాగడం వల్ల చర్మం తేమగా ఉండి సహజమైన కాంతితో మెరుస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నాల్గవది, సమతుల్య ఆహారం తీసుకోవడం. మన ఆహారంలో పండ్లు, ఆకుకూరలు, గింజలు, ప్రొటీన్లు మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక చక్కెర మరియు నూనె పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ బారిన పడకుండా కాపాడి యవ్వనంగా ఉంచుతాయి. ఐదవది, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం. నేటి ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి అనేది వృద్ధాప్యానికి ప్రధాన శత్రువుగా మారింది. ప్రతిరోజూ ధ్యానం, ప్రాణాయామం చేయడం లేదా మీకు నచ్చిన హాబీలకు కొంత సమయం కేటాయించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత ఉన్నప్పుడు శరీరంలోని హార్మోన్లు సమతుల్యంగా ఉండి ముఖంలో సహజమైన వర్చస్సు కనిపిస్తుంది. ఈ ఐదు రోజూవారి సరళమైన అలవాట్లను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా 40 ఏళ్ల తర్వాత కూడా మీరు నిత్య యవ్వనంతో, అధిక శక్తితో మీ జీవితాన్ని నూతన ఉత్సాహంతో ఆస్వాదించవచ్చు.     [ Health After 40, Healthy Lifestyle, Exercise, Quality Sleep, Hydration, Balanced Diet, Antioxidants, Stress Management, Meditation, Healthy Aging ]    
ఆధునిక కాలంలో ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండానే మనస్సులో ఆందోళన, భయం, ఒక రకమైన అశాంతి కలగడం చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.  బయటకు  పరిస్థితులన్నీ బాగున్నప్పటికీ, లోపల ఏదో తెలియని బెంగ మనశ్శాంతిని దూరం చేస్తుంది. దీనికి ఏదో పెద్ద సమస్యే కారణం కావాల్సిన అవసరం లేదు. మనకు తెలియకుండానే మనం పాటించే కొన్ని చిన్న చిన్న జీవనశైలి అలవాట్లే మన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ, ఆందోళనను పెంచుతాయని నిపుణులు చెప్తున్నారు. అవేంటో వివరంగా తెలుసుకుంటే.. శారీరక శ్రమ లేకపోవడం.. శారీరక శ్రమ లేకపోవడం  మనసుపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. రోజంతా ఒకే చోట కూర్చుని ఉండటం వల్ల శరీరంలో రక్తప్రసరణ మందగించడమే కాకుండా, మనస్సుకు ఉపశమనం కలిగించే హార్మోన్ల విడుదల తగ్గుతుంది. క్రమం తప్పకుండా చిన్నపాటి వ్యాయామం లేదా నడక చేయడం వల్ల మెదడులో ఎండోర్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి మూడ్‌ను మెరుగుపరుస్తాయి. శారీరక చురుకుదనం తగ్గినప్పుడు మనస్సులో నెగిటివ్ ఆలోచనలు పెరిగి ఆందోళనకు దారితీస్తాయి. సోషల్ మీడియా.. నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వినియోగం శృతిమించడం మానసిక అశాంతికి మరో ముఖ్యమైన కారణం. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు నిరంతరం ఫోన్ స్క్రీన్‌ను చూడటం, ఇతరుల జీవితాలతో మన జీవితాన్ని పోల్చుకోవడం వంటివి తెలియకుండానే ఒత్తిడిని పెంచుతాయి. డిజిటల్ స్క్రీన్ల నుంచి వచ్చే కాంతి నిద్ర లేమికి కారణమవుతుంది. సరిపడా నిద్ర లేకపోవడం వల్ల మెదడు అలసిపోయి, చిరాకు , భయాలు పెరిగే అవకాశం ఉంది. చెడు అలవాట్లు.. మద్యపానం లేదా ఇతర వ్యసనాలు తాత్కాలికంగా ఉపశమనాన్ని ఇచ్చినట్లు అనిపించినప్పటికీ, ఎక్కువ  కాలంలో అవి మానసిక ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తాయి. ఇవి నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపి, ఆందోళన తీవ్రతను మరింత పెంచుతాయి. శరీరం ఈ పదార్థాలపై ఆధారపడటం మొదలైనప్పుడు  అశాంతి మరింత తీవ్రమవుతుంది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు.. మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి రోజూ కొంత సమయం వ్యాయామానికి కేటాయించడం, సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించి నచ్చిన పనులపై దృష్టి పెట్టడం, క్రమశిక్షణతో కూడిన ఆహారపు అలవాట్లు , మంచి నిద్రను అలవర్చుకోవడం ఎంతో అవసరం. జీవనశైలిలో చేసుకునే ఈ చిన్న మార్పులు మానసిక ఒత్తిడిని తగ్గించి జీవితంలో ప్రశాంతతను నింపుతాయి.                                                                                                                                                  *రూపశ్రీ.
మధుమేహం ఉన్నవారు రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడానికి ఆహారం, జీవనశైలి, ఒత్తిడి నియంత్రణతో పాటు వివిధ సంప్రదాయ పద్ధతుల గురించి కూడా తెలుసుకోవాలని అనుకుంటారు. అలాంటి వారికి ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన విషయాలను Dr. Ch. Madhusudhana Sharma ఈ వీడియోలో వివరిస్తున్నారు. మధుమేహం విషయంలో శరీరంలోని జీవక్రియలు, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి వంటి అంశాల పాత్ర ఏమిటి? సంప్రదాయ వైద్యంలో ఉపయోగించే కొన్ని సహజ పదార్థాలను ఎలా పరిగణిస్తారు? అనే విషయాలను డాక్టర్ వివరిస్తున్నారు. ఈ వీడియోలో ప్రత్యేకంగా 5 రకాల పొడులు/చూర్ణాల గురించి ప్రస్తావించారు: త్రిఫల చూర్ణం, పసుపు, మెంతులు, పొడపత్రి (మధునాశిని), కాకరకాయ పొడి.  ఈ పదార్థాలను సంప్రదాయ వైద్య విధానంలో ఎలా ఉపయోగిస్తారు? వాటి ప్రత్యేకత ఏమిటి? మధుమేహం ఉన్నవారు వీటి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి? వంటి అంశాలను వీడియోలో వివరంగా తెలుసుకోవచ్చు. అలాగే, మధుమేహాన్ని కేవలం మందులతో మాత్రమే కాకుండా ఆహారం, జీవనశైలి, శారీరక చురుకుదనం, మానసిక ఒత్తిడి నియంత్రణ వంటి అంశాలతో కలిపి ఎలా నిర్వహించుకోవాలనే విషయాలపై కూడా వీడియోలో అవగాహన కల్పిస్తున్నారు. డయాబెటిస్ మందులు ఇప్పటికే వాడుతున్నవారు తమంతట తాముగా మందుల మోతాదును తగ్గించడం లేదా ఆపడం చేయకూడదు. ఈ వీడియోలో చెప్పే పొడులు లేదా ఇతర సహజ పదార్థాలను ఉపయోగించే ముందు మీ వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది. త్రిఫల, పసుపు, మెంతులు, మధునాశిని, కాకరకాయ పొడుల గురించి డాక్టర్ ఏం చెబుతున్నారు? మధుమేహం నియంత్రణలో ఆహారం, జీవనశైలి, ఒత్తిడి నిర్వహణ ఎందుకు ముఖ్యమైనవి? తెలుసుకోవడానికి పూర్తి వీడియోను చూడండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. డయాబెటిస్ మందులను వైద్యుల సలహా లేకుండా ఆపడం లేదా మోతాదు మార్చడం చేయకండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)