LATEST NEWS
తెలుగుదేశం  అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని గత జగన్ సర్కార్ స్కిల్ కేసు పేరిట అక్రమంగా అరెస్టు చేసి గురువారం (సెప్టెంబర్ 10)కి సరిగ్గా మూడేళ్ల అుతున్న సందర్భంగా  రాష్ట్రవ్యాప్తంగా  నిజం గెలిచింది కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేశ్  పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో  జరిగిన  లీడర్‌షిప్ కాంక్లేవ్ సదస్సు వేదికగా ఆయనీ పిలుపు ఇచ్చారు.  సుదీర్ఘ పోరాటాలు, క్లిష్ట పరిస్థితుల్లో శ్రేణులు చేసిన త్యాగాల ఫలితంగానే  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, కార్యకర్తల శ్రమను ఎప్పటికీ మరువలేమని లోకేష్ పునరుద్ఘాటించారు.  జగన్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులో యాభై మూడు రోజుల పాటు అన్యాయంగా నిర్బంధించిన విషయాన్నిగుర్తు చేసిన లోకేష్.. ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం కక్షసాధింపు చర్యల్లో భాగంగానే  నాడు ఆ అరెస్ట్ జరిగిందన్నారు.  చివరికి న్యాయస్థానాలు,  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎలాంటి తప్పు జరగలేదని క్లీన్ చిట్ ఇవ్వడంతో నిజమే గెలిచిందని స్పష్టం చేశారు. ఈ చారిత్రక సత్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు, చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు. ఈ సదస్సు వేదికగా పార్టీ నాయకులకు లోకేశ్  పార్టీ, పర్సనల్, ప్రభుత్వం  అనే  3-పీ  మార్గదర్శకాలను నిర్దేశించారు. నాయకులు కేవలం పదవులకే పరిమితం కాకుండా వ్యక్తిగతంగా ప్రజలకు, క్షేత్రస్థాయి కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను లబ్ధిదారులకు వివరించడంతో పాటు..  పార్టీ సంస్థాగత పటిష్టత కోసం కార్యకర్తలంతా క్రియాశీలకంగా శ్రమించాలని దిశానిర్దేశం చేశారు. ఉన్నత స్థానాలకు ఎదిగే కొద్దీ మరింత వినయంగా ఉంటూ, ప్రతి ఒక్కరితోనూ మానవతా దృక్పథంతో మమేకం కావాలన్నారు.  జగన్ హయాంలో నిరుద్యోగ యువత ఎదుర్కొన్న ఇబ్బందులను ఎత్తి చూపిన లోకేష్. డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి మధ్య   వ్యత్యాసం కూడా తెలియని గత పాలకుల విధానాల వల్ల యువత భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోయిందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించామని, రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో మొత్తం ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వివరించారు.  రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పారదర్శక పాలనను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను సోషల్ మీడియా వేదికగా, క్షేత్రస్థాయిలో   తిప్పికొట్టాలని సూచించారు. పార్టీలో అంతర్గత విభేదాలకు, అహంకారాలకు  ఎట్టి పరిస్థితుల్లోనూ తావు ఉండకూడదన్న నారా లోకేష్.. ప్రస్తుతం పార్టీని  టీడీపీ 3.0 వెర్షన్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు.  అందరూ సమన్వయంతో కలిసికట్టుగా పనిచేస్తేనే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు నడిపించగలమని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకోవడం పార్టీ బాధ్యత అని, కష్టకాలంలో నిలబడిన ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు ఉంటుందని భరోసా కల్పించారు.  [TDP P3 Vertion, Nara Lokesh, Chandrababu Naidu arrest anniversary, Nijam Gelichindi program, Telugu Desam Party, AP Leadership Conclave, Telugu One]
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో నాంపల్లి కోర్టు కీలక నిర్ణయం..!  తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఎమ్మెల్సీలు తాత మధుసూదన్ అలియాస్ తాత మధు, ఎన్. నవీన్ కుమార్ రెడ్డిలకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టును పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఒక్కొక్క రికి రూ.20 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది.కేసు తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. అదే రోజు తాత మధు, నవీన్ కుమార్ రెడ్డిలు వ్యక్తిగతంగా న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.  ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజాప్రతిని ధులుగా సభా కార్యక్రమా లకు హాజరుకావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాన్ని కూడా న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సోమవారం అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల దుస్తులతో నిరసన చేపట్టిన సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సభలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ స్పీకర్ ఓఎస్డీ పొల్లేపల్లి వెంకటేశం సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని సెక్షన్ 352, 3(5)తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం తాత మధు, నవీన్ కుమార్ రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ కోరుతూ పోలీసులు సమర్పించిన నివేదికను న్యాయస్థానం పరిశీలించింది. అనంతరం ఇద్దరికీ బెయిల్ మంజూరు చేసింది. తనపై వచ్చిన అనుచిత వ్యాఖ్యల ఆరోపణలను ఎమ్మెల్సీ తాత మధు ఇప్పటికే ఖండించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, తాను స్పీకర్‌ను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తన వ్యాఖ్యల్లో స్పీకర్‌ను దూషించినట్లు భావిస్తే వాటిని ఉపసంహరిం చుకుంటున్నట్లు కూడా పేర్కొన్నారు. మరోవైపు అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనలో విధుల్లో ఉన్న పోలీసులతో బీఆర్ఎస్ నేతలు ఘర్షణకు దిగారన్న ఆరోపణలు కూడా రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. పోలీసులను అడ్డుకోవడం, దాడికి పాల్పడటం వంటి ఆరోపణలపై పలువురు బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదయ్యాయి. అయితే పోలీసులు తమ పట్ల దురుసుగా వ్యవహరించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపైనా వివాదం కొనసాగుతోంది.  ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు స్పందిస్తూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవద్దని ఆదేశించింది. అసెంబ్లీ నిబంధనల ఉల్లంఘన జరిగితే చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కే ఉంటుందని స్పష్టం చేసింది. సంబంధిత పోలీసుల వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. ఇలా స్పీకర్‌పై వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్సీల అరెస్టు, నాంపల్లి కోర్టు బెయిల్, అసెంబ్లీ వద్ద పోలీసులతో ఘర్షణ, మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసుల వ్యవహారంపై వివాదం వంటి పరిణామాలతో తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది.       (BRS MLCs, Tata Madhusudan, N Naveen Kumar Reddy, Telangana Assembly, Telangana Legislative Council, Assembly Speaker, K Chandrasekhar Rao, KCR, Damodar Rajanarsimha, BRS, Telangana Politics, Assembly Resolution, Assembly Privileges, Legislative Council Chairman, Political Controversy)
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు సోషల్ మీడియాను ఎంతవరకు యాక్టివ్‌గా వినియోగిస్తున్నారనే అంశంపై ఆయన ఆరా తీశారు. సోషల్ మీడియాను నేతలు సమర్థంగా వినియోగించాలని లోకేష్ సూచించారు. సోషల్ మీడియానే కదా అని తేలిగ్గా తీసుకోవద్దని.. దీనిపై సీరియస్‌గా దృష్టి పెట్టాలని చెప్పారు. ఏఎంసీ, కార్పొరేషన్ ఛైర్మన్లు కూడా తాము చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వివరించాలని.. ప్రభుత్వ పనితీరుపై ఓపెన్‌గా మాట్లాడాలని నేతలకు సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం సెల్ఫీ వీడియోల ద్వారా తన సందేశాన్ని ప్రజలకు చేరవేస్తున్నారని గుర్తుచేశారు. తాను కూడా సుజ్లాన్ విండ్ ప్రాజెక్టులకు శంకుస్థాపన, డీఎస్సీపై జరుగుతున్న దుష్ప్రచారానికి సంబంధించి సెల్ఫీ వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు లోకేష్ తెలిపారు. విషయం చిన్నదైనా, పెద్దదైనా ప్రజలకు వాస్తవాలను తెలియజేయాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్నారు. ప్రతిపక్షాల పని ఎప్పుడూ బురదజల్లడమేనని వ్యాఖ్యానించిన లోకేష్.. వారి దుష్ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సూచించారు. పార్టీ ఆదేశాలు, కార్యక్రమాలపై సోషల్ మీడియా టీమ్స్ తక్షణమే స్పందించేలా పనిచేయాలని అన్నారు. జగన్‌కు సంబంధించిన అంశాల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు గుడ్డిగా సమర్థిస్తున్నారని లోకేష్ విమర్శించారు. అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని.. ఈ విషయాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు.       (Minister  Nara Lokesh, Telugu Desam Party, Amaravati, Leadership Conclave, Political Communication, Public Orientation, Social Media, TDP Leaders, Social Media Strategy, CM Chandrababu, YS Jagan, YSRCP, Telugu One, Telugu News)
ALSO ON TELUGUONE N E W S
  యమదొంగలో ఎన్టీఆర్ నాచోరే నాచోరే అంటూ డాన్స్ చేస్తుంటే నోరెళ్లబెట్టి చూడాల్సిందే...కూర్చి మడతపెట్టి అని.. మహేష్ లుంగీ మడతేడితే థియేటర్ ఉగిపోయంది.. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు.. బాస్ లో ఇంకా తగ్గని గ్రేస్.. యస్  ఈపాటికే మీకు అర్ధమైపోయివుంటుంది... ఈ రోజు డాన్స్ ల్లో మొనగాడు ఎవరు.? తెలుసుకుందాం..! అలానే  మీకు ఇష్టమైన డాన్సర్ ఎవరో కామెంట్ చేయండి.. నాకు ఉదయాన్నే లేచి టీవీ ఆన్ చేసే అలవాటుంది.. ఈ రోజు కూడా ఎప్పటిలాగానే టీవీ ఆన్ చేశాను.. ఇంతలోనే ఎన్టీఆర్ యాపిల్ బ్యూటీ సాంగ్ వస్తుంది ఇక నేను ఆగుతానా తెలియకుండానే డాన్స్ మొదలుపెట్టాను.. షడన్ గా నేతమేడమొట్టికాయ కొట్టింది మా అమ్మ ఏంటి ఈ గోల అని.. మా అమ్మ తో చూడు ఎన్టీఆర్ ఎలా చేస్తున్నాడో డాన్స్ అన్నా... మా అమ్మ చిరంజీవి ఫ్యాన్.. నాకు చిరంజీవి డాన్స్ తర్వాతే ఎవరి డాన్స్ ఐనా అన్నది.. అప్పుడు మొదలయింది.. నాకు టాలీవుడ్ లో ఎవరు గొప్ప డాన్సర్ అనే లోచన..  సో ఇప్పుడు మన టాలీవుడ్ లో డాన్స్ ఎలా రూపాంతరం చెందుతూ ఒచ్చిందో ఓ లుక్ ఎద్దాం.!  ​"కాలంతో పాటు మనుషులే కాదు... మన తెలుగు సినిమా డ్యాన్స్ కూడా అప్‌డేట్ అవుతూ వచ్చింది! అప్పట్లో భావవ్యక్తీకరణగా మొదలైన ఒక చిన్న అడుగు... ఈరోజు అంతర్జాతీయ వేదికలపై మోత మోగిస్తోంది. అసలు మన టాలీవుడ్ హీరోలు డ్యాన్స్‌ని ఏ రేంజ్‌కి తీసుకెళ్లారో తెలుసా? లెట్స్ డైవ్ ఇన్!" ​"1950లు, 60లలో డ్యాన్స్ అంటే నాటకాల ప్రభావమే ఎక్కువ. కూచిపూడి, భరతనాట్యం హావభావాలు, చేతుల ముద్రలు, చిన్న చిన్న అడుగులనే డ్యాన్స్‌గా భావించేవారు. కానీ ఏఎన్నాఆర్, ఎన్టీఆర్, శోభన్ బాబు, కృష్ణ గార్ల రాకతో కథ మారింది! ​ముఖ్యంగా డ్యాన్స్‌కి ఒక స్టార్‌డమ్ తెచ్చింది మన ఏఎన్నాఆర్ గారే. మనమంతా డ్యాన్స్‌ని ప్రేమించడం స్టార్ట్ చేసింది ఆయనతోనే! ఇక మన అన్నగారు ఎన్టీఆర్ తక్కువేమీ తినలేదు... తన ఊర మాస్ డ్యాన్స్ మూమెంట్స్‌తో ప్రతి తెలుగు వాడినీ డ్యాన్సర్‌గా మార్చేశారు. స్క్రీన్ మీద ఆయన కాలు కదిపితే చాలు... థియేటర్లలో కనకవర్షం కురిసేది!" ​ "అయితే, 70ల చివరలో, 80లలో టాలీవుడ్ డ్యాన్స్ ల్యాండ్‌స్కేప్ పూర్తిగా మారిపోయింది! సౌత్ ఇండియాకే 'బ్రేక్ డ్యాన్స్'ను పరిచయం చేస్తూ మెగాస్టార్ చిరంజీవి అడుగుపెట్టారు. డ్యాన్స్ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయం మొదలైంది! చిరు వేసే స్టెప్స్‌కి ఫ్యాన్స్ థియేటర్లలో పూనకం వచ్చినట్లు ఊగిపోయేవారు. 'డ్యాన్స్ సరిగ్గా లేకపోతే సినిమా బాగోలేనట్లే' అనే స్థాయికి ట్రెండ్ సెట్ చేశారు. ఆయనతో పాటు బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌గారలు కూడా తమదైన శైలిలో వైవిధ్యాన్ని తీసుకొచ్చి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు!" ప్రభుదేవా, లారెన్స్ డ్యాన్స్ క్లిప్స్... ఆ వెంటనే రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ పొతినేనిల హై-స్పీడ్, అక్రోబాటిక్ డ్యాన్స్ మూమెంట్స్. ​"90ల నాటికి ప్రభుదేవా, లారెన్స్ వంటి యంగ్ కొరియోగ్రాఫర్లు రావడం, అక్రోబాటిక్స్, ఫ్లెక్సిబిలిటీ, హై-ఎనర్జీ మూమెంట్స్ తారస్థాయికి చేరాయి. ​ఇక 2000ల తర్వాత పరిస్థితి ఏంటి? జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, రామ్ పోతినేని వంటి యంగ్ జనరేషన్ హీరోలు మన టాలీవుడ్ డ్యాన్స్ బెంచ్‌మార్క్‌ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లారు! క్లాసికల్ బేస్, హిప్ హాప్, పాపింగ్ అండ్ లాకింగ్, మూన్‌వాక్స్‌తో 'స్టైలిష్ డ్యాన్స్'కి బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోయారు. స్టిల్... ఈ నిమిషం కూడా ఏదో ఒక కొత్త డ్యాన్స్ మూమెంట్ మనల్ని ఫిదా చేయడానికి రెడీ అవుతూనే ఉంది. మన మాస్టర్లు కూడా తమ ప్రభావాన్ని చాటుతూనే ఉన్నారు. అప్పటి భావవ్యక్తీకరణ నాట్యం నుండి ఇప్పటి అంతర్జాతీయ గ్లోబల్ ట్రెండ్ వరకు... తెలుగు సినిమా డ్యాన్స్ ప్రయాణం ఒక అద్భుతం, మన అభిమానులకి ఒక విజువల్ ఫీస్ట్! ​సో... మనతో పాటే అప్‌డేట్ అవుతున్న డ్యాన్స్‌కి గట్టిగా ఒక 'ఓయ్' చెప్పేద్దాం! అంతకంటే ముందు... మీరు చేస్తున్న డ్యాన్స్‌ని ఒక్క నిమిషం హోల్డ్‌లో ఉంచి, మన టాలీవుడ్ హీరోల్లో మీకు ఎవరి డ్యాన్స్ అంటే పిచ్చి ఇష్టం? ఏ సిగ్నేచర్ మూమెంట్స్ అంటే ప్రాణం? అనేది కింద కామెంట్స్ ద్వారా మాతో షేర్ చేసుకోండి. బికాజ్... డ్యాన్స్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ ఫర్ యు అండ్ మీ! వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్‌డేట్స్ కోసం ఛానెల్‌కి సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్!".     [Chiranjeevi, Balakrishna, Nagarjuna, venkatesh, Ntr, Allu arun, Ram Chran,Telugu Cinema, Telugu CinemaNews, Tollywood, Tollywood News]  
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రానున్న పాన్ ఇండియా మూవీ 'రాకా'పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ట్రేడ్ వర్గాల్లో ఇప్పుడు ఈ మూవీ బడ్జెట్, బన్నీ రెమ్యునరేషన్ గురించి హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. అసలు అల్లు అర్జున్ ఈ సినిమాకి ఫిక్స్డ్ రెమ్యునరేషన్ కాకుండా ఒక మైండ్ బ్లోయింగ్ ప్లాన్ వేశారని తెలుస్తోంది. సాధారణంగా ఏ స్టార్ హీరో అయినా సినిమా మొదలవడానికి ముందే తమ రెమ్యునరేషన్ సెటిల్ చేసుకుంటారు. కానీ అల్లు అర్జున్ మాత్రం 'రాకా' మూవీకి పూర్తి భిన్నమైన రూట్‌ ఎంచుకున్నారు. ఫిక్స్డ్ పారితోషికం తీసుకునే బదులు, ప్రాఫిట్ షేరింగ్ పద్ధతికి మొగ్గు చూపినట్లు టాక్ వినిపిస్తోంది. అంటే సినిమా విడుదలయ్యాక వచ్చే లాభాల్లో వాటా బన్నీ ఖాతాలోకి వెళ్తుంది. ఒకవేళ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో బంపర్ హిట్ కొడితే, ప్రాఫిట్ షేరింగ్ ద్వారా అల్లు అర్జున్ అందుకునే మొత్తం ఏకంగా*రూ. 300 కోట్లకు చేరుకునే అవకాశం ఉందట. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక హీరో ఒకే సినిమాకి ఇంతటి భారీ స్థాయిలో ప్రాఫిట్ షేరింగ్ అందుకోవడం డెఫినెట్‌గా ఒక రేర్ రికార్డ్ అనే చెప్పాలి. అయితే బన్నీ ఈ డిసిషన్ తీసుకోవడానికి ఒక బలమైన కారణం ఉంది. 'రాకా' సినిమాను ప్రొడక్షన్ పరంగా ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా సన్ పిక్చర్స్ బ్యానర్‌పై అత్యంత భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా రూ. 600 కోట్లు ఉంటుందని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ దశలోనే దాదాపు 50 శాతం బడ్జెట్ పూర్తయిందని ప్రచారం సాగుతోంది. ఇంత భారీ ప్రాజెక్ట్ నిర్మించే సమయంలో ప్రొడ్యూసర్లపై అదనంగా ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో, బన్నీ తన అడ్వాన్స్ రెమ్యునరేషన్‌ను పక్కన పెట్టి ప్రాఫిట్ షేరింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇది కేవలం ఆయన కాన్ఫిడెన్స్ మాత్రమే కాదు, నిర్మాతకు ఇచ్చే బిగ్గెస్ట్ సపోర్ట్ కూడా. హాలీవుడ్ లెవెల్ అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నారు. ఒక హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం, ఇండియాలోనే కాకుండా గ్లోబల్ మార్కెట్‌లోనూ సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.       [Allu Arjun Remuneration, Allu Arjun 300 Crore, Raaka Remuneration, Raaka Movie, Profit Sharing, Raaka Budget, Telugu Film News, Telugu News]  
భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే 'జాతీయ చలనచిత్ర అవార్డుల' (National Film Awards) ప్రదానోత్సవానికి సంబంధించి ఒక చారిత్రాత్మక మార్పు చోటుచేసుకోబోతోంది. దశాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయానికి స్వస్తి పలుకుతూ ఈ ప్రతిష్ఠాత్మక వేడుకను దేశ రాజధాని ఢిల్లీ వెలుపల నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. లభించిన సమాచారం ప్రకారం, 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని గుజరాత్‌లోని ఏక్తా నగర్ (Ekta Nagar) లో నిర్వహించనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహమైన 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' నెలకొన్న ఈ ప్రాంగణంలోనే ఈసారి సినీ దిగ్గజాలకు పురస్కారాలు అందించబోతుండటం విశేషం. ఈ నెలలో గుజరాత్ పర్యటనకు వెళ్లనున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఏక్తా నగర్ వేదికగా ఈ పురస్కారాలను విజేతలకు అందజేయనున్నారు. సాధారణంగా ప్రతి ఏటా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లోనే ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే తొలిసారిగా దేశ రాజధానిని దాటి మరో రాష్ట్రంలో ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్ జరగనుండటంతో భారతీయ సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి వ్యక్తమవుతోంది. కాగా, 2024 సంవత్సరానికి సంబంధించిన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతల జాబితాను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఢిల్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో 'ఆర్టికల్ 370' ఉత్తమ చిత్రంగా ఎంపికవ్వగా, యామీ గౌతమ్ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. అలాగే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ సంయుక్తంగా ఉత్తమ నటుడి పురస్కారాన్ని దక్కించుకున్నారు. నాన్-ఫీచర్ విభాగంలో 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ - ఏక్తా కా ప్రతీక్' చిత్రానికి గాను దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ ఉత్తమ దర్శకత్వ పురస్కారం గెలుచుకున్నారు. ఢిల్లీ దాటి ఈ వేడుకను నిర్వహించడం పట్ల చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులు, సినీ విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశ రాజధానికే పరిమితం కాకుండా భారతదేశంలో ఉన్న విభిన్న సాంస్కృతిక కేంద్రాల్లో ఇలాంటి జాతీయ స్థాయి కార్యక్రమాలు జరగడం వల్ల ప్రాంతీయ ప్రాముఖ్యత మరింత పెరుగుతుందని విశ్లేషిస్తున్నారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌ను దాటి గుజరాత్ నర్మదా నదీ తీరాన జరిగే ఈ వేడుక ఏ స్థాయిలో విజయ‌వంతమవుతుందో చూడాలని దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.     [72nd National Film Awards, National Film Awards Gujarat Ekta Nagar, President Droupadi Murmu, Mammootty Kartik Aaryan Award, TeluguOne TMDB Movie News]
  సెంటిమెంట్, ప్రభంజనం, ఊపు, ఉత్సాహం పర్సన్స్ కే కాదు తెలుగు సినిమాకి కూడా ఉంటుంది. ఒక సూపర్ డూపర్ హిట్ రాగానే ఆ వెంటనే వచ్చే మరో సినిమాకి ప్రేక్షకుల సంఖ్య ఘననీయంగా పెరుగుతుంది. మరి అంచనాలు ఉన్న సినిమా అయితే కలెక్షన్స్ లెక్కట్టుకోవడానికి టైం కూడా దొరకదు.  ది ప్యారడైజ్.. నాచురల్ స్టార్ నాని సగర్వంగా సెల్యులాయిడ్ పై ల్యాండ్ అవుతున్న మూవీ. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకుడు కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు, సినిమా కాన్సెప్ట్ కూడా ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను మరింత పెంచాయి. మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ సాధించిన సంచలన విజయం తెలిసిందే. ఈ విజయం వెనక మాములు టికెట్ ధరలతో ప్రేక్షకుల ముందుకు రావడం కూడా ఒక కారణం. ఎందుకంటే సినిమా బాగుందని టాక్ రావడం, రేట్స్ కూడా రీజనబుల్ గా ఉండటంతో ఫ్యామిలీ ప్రేక్షకులు సైతం ఎక్కడ నా ఇరుముడి అంటూ థియేటర్స్ బాట పెట్టి షో పొరపాటున లేట్ అయినా వార్నింగ్ లు ఇచ్చే పరిస్థితి. దీంతో  ‘ది ప్యారడైజ్’ కూడా సాధారణ టికెట్ ధరలతో విడుదలైతే పెద్ద ప్లస్ పాయింట్ గా మారుతుందనే  అభిప్రాయంతో ప్యారడైజ్  మేకర్స్  ఉన్నట్టుగా సినీ సర్కిల్స్ లో టాక్ వినపడుతుంది .ముఖ్యంగా నాని సినిమాలకి  ఫ్యామిలీ ఆడియెన్స్ ఏ స్థాయిలో వస్తారో తెలిసిందే     Also read: పెళ్లిపై టాప్ హీరోయిన్ కీలక వ్యాఖ్యలు: ఆనందంగా ఉండాలంటే అది చాలు    ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నిజం ఏంటంటే టికెట్ ధరలు అందుబాటులో ఉంటే పండుముసలి కూడా థియేటర్స్ లో సినిమా చూడటం తథ్యం. ఎందుకంటే ఈ విశ్వంలో  ఎంటర్ టైన్ మెంట్ తో మంచిని చెప్పే ఒకే ఒక్క సాధనం సినిమా. ప్యారడైజ్ రిలీజ్ డేట్ ఈ నెల 24 .     [The Paradise, irmudi, Nani, Raviteja, Ticket Prices, Telugu Cinema, Telugu CinemaNews, Tollywood, Tollywood News, Srikanth Odela]
బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్ బాస్' గ్రాండ్ లాంచ్‌లో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. హిందీ బిగ్ బాస్ 20వ సీజన్ ప్రారంభ వేదికపైకి అడుగుపెట్టిన ఒక కంటెస్టెంట్ తన నెలవారీ ఆదాయాన్ని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. బాలీవుడ్ సూపర్‌స్టార్, షో హోస్ట్ సల్మాన్ ఖాన్ సైతం ఆ కంటెస్టెంట్ సంపాదన వినగానే ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. బిగ్ బాస్ వేదికపైకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ గేమర్, యూట్యూబర్ తన్మయ్ సింగ్‌తో సల్మాన్ ఖాన్ ముచ్చటించారు. ఈ క్రమంలోనే ఆయన వృత్తి, సంపాదన గురించి సల్మాన్ ఆరా తీశారు. డిజిటల్ మాధ్యమంలో ఎంత సంపాదిస్తున్నావని సల్మాన్ అడగ్గా, తన్మయ్ తన నెలవారీ ఆదాయం ఎంతో సల్మాన్ చెవిలో రహస్యంగా చెప్పాడు. అయితే ఆ సంఖ్య విన్న సల్మాన్ వెంటనే ఆశ్చర్యం ఆపుకోలేక, "ఏంటి.. నువ్వు నెలకు ఏకంగా 30 లక్షల రూపాయలు సంపాదిస్తున్నావా?" అని బహిరంగంగానే అడిగేశారు. దీంతో తన్మయ్ సింగ్ మైండ్ బ్లాంక్ అయ్యే ఆదాయ వివరాలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. తన సంపాదన అంతా లీగల్‌గా వచ్చే వైట్ మనీయేనని, పన్నులు చెల్లించి చెక్కుల రూపంలోనే అందుకుంటానని తన్మయ్ స్పష్టం చేశాడు. గేమింగ్ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకుని ఈ స్థాయిలో ఆదాయం ఆర్జించడం పట్ల సల్మాన్‌తో పాటు ప్రేక్షకులు కూడా తీవ్రంగా ఆశ్చర్యపోయారు. డిజిటల్ ప్రపంచంలో 'స్కౌట్‌ఓపీ' (ScoutOP) పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న తన్మయ్ సింగ్‌కు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. కేవలం యూట్యూబ్‌లోనే అతనికి 50 లక్షలకు పైగా (5 Million) సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. తన ఛానెల్‌లో పబ్‌జీ, ఇతర లైవ్ గేమింగ్ వీడియోలతో పాటు లైఫ్‌స్టైల్ వ్లాగ్స్ పోస్ట్ गर्दै యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, గేమర్లు బుల్లితెర రియాలిటీ షోలలో అడుగుపెట్టి సంచలనాలు సృష్టిస్తున్నారు. బిగ్ బాస్ వంటి పెద్ద వేదికపైకి అడుగుపెట్టడమే కాకుండా, మొదటి రోజే తన భారీ సంపాదనతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన తన్మయ్, ఇకపై హౌస్‌లో తన గేమ్‌ప్లేతో ఎంతటి హంగామా చేయబోతున్నాడో అని నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండటంతో, బిగ్ బాస్ 20వ సీజన్‌పై యూత్‌లో క్రేజ్ మరింత పెరిగింది. రానున్న రోజుల్లో హౌస్‌లో తన్మయ్ ఎలాంటి వినోదాన్ని పంచుతాడో, ఇతర కంటెస్టెంట్లకు ఎలాంటి పోటీ ఇస్తాడో చూడాలి.     [Bigg Boss 20 Hindi, Salman Khan Bigg Boss, Tanmay Singh ScoutOP, ScoutOP Monthly Income, TeluguOne TMDB Movie News]
ఇటీవలి కాలంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ జోనర్ సిరీస్‌ల హవా నడుస్తోంది. అయితే వాటికి భిన్నంగా పూర్తిస్థాయి యూత్ ఫుల్, లైట్-హార్టెడ్ కంటెంట్‌తో ప్రేక్షకులను పలకరించే ప్రయత్నాలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఆ కోవలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జియో హాట్‌స్టార్‌'లో ఇటీవల విడుదలైన వెబ్ సిరీస్ 'పార్ట్ టైమర్స్'. తనూజ పుట్టస్వామి, జ్ఞానేశ్వరి కాండ్రేగుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ను దర్శకుడు సంపత్ కుమార్ తోట తెరకెక్కించారు. ప్రస్తుతం 8 ఎపిసోడ్లు అందుబాటులోకి వచ్చిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం. ఈ కథ అంతా తేజు (జ్ఞానేశ్వరి), సింధు (తనూజ) అనే ఇద్దరు భిన్నమైన మనస్తత్వాలు ఉన్న అమ్మాయిల చుట్టూ తిరుగుతుంది. శ్రీమంతుల కుటుంబంలో పుట్టినా సొంత కాళ్లపై నిలబడాలనే పట్టుదలతో ఇల్లు వదిలేసి క్యాబ్ నడుపుకునే తేజు ఒకవైపు... బాబాయ్ వేధింపులు, ఇష్టం లేని పెళ్లి నుంచి తప్పించుకోవడానికి సిటీకి వచ్చిన సింధు మరోవైపు. వీరిద్దరూ ఒకే ఫ్లాట్‌ను షేర్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే మొదటి నుంచీ వీరి మధ్య ఉన్న మనస్పర్థల కారణంగా నిత్యం గొడవలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో వారి కెరీర్‌లో ఎదురైన సవాళ్లు ఏమిటి? ఇద్దరి జీవితాలు ఏ మలుపు తిరిగాయి అనేదే ప్రధాన కథాంశం. దర్శకుడు సంపత్ కుమార్ తోట ఎంచుకున్న పాయింట్ బాగానే ఉన్నప్పటికీ, కథనంలో బలం లేకపోవడం సిరీస్‌కు ప్రధాన బలహీనతగా మారింది. రెండు విభిన్న పాత్రల మధ్య వచ్చే సంఘర్షణలు, అపార్ట్‌మెంట్ కమ్యూనిటీ కామెడీ ట్రాక్స్ ద్వారా వినోదాన్ని పంచే ప్రయత్నం చేసినా అది పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. బలమైన ఎమోషనల్ సీన్లు పడకపోవడం, కామెడీ సీన్లు కాస్త కృత్రిమంగా అనిపించడంతో ప్రేక్షకులు కథలో మమేకం కావడం కొంచెం కష్టమే. నటీనటుల విషయానికి వస్తే జ్ఞానేశ్వరి, తనూజ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. తమ పరిధి మేరకు చక్కటి నటనను కనబరిచారు. ముఖ్యంగా ఇండిపెండెంట్ గర్ల్‌గా జ్ఞానేశ్వరి, అమాయకత్వంతో కూడిన పాత్రలో తనూజ ఆకట్టుకున్నారు. సాంకేతికంగా వివేక్ ఛాయాగ్రహణం, భరత్ మంచిరాజు సంగీతం సిరీస్‌కు తగినట్లుగా పర్వాలేదనిపిస్తాయి. ఎడిటింగ్ విభాగం ఇంకాస్త శ్రద్ధ వహించి ఉంటే బాగుండేది. ప్రస్తుతం తొలి విడతగా వచ్చిన ఎపిసోడ్లలో కథ ఒకే చోట తిరుగుతున్నట్లు అనిపించినప్పటికీ, నటీనటుల స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల కొన్ని సీన్లు చూసేలా ఉన్నాయి. ప్రస్తుతం డిజిటల్ మాధ్యమంలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ తదుపరి రాబోయే ఎపిసోడ్లలోనైనా కథలో వేగం పుంజుకుని ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో వేచి చూడాలి.
  నందమూరి  కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన అభిమన్యు తో తెలుగు పరిశ్రమపై టేక్ ఆఫ్ అయిన  భామ 'రమ్య' ఉరఫ్ దివ్య స్పందన. కన్నడ సినీ రంగానికి చెందిన రమ్య అక్కడ అనేక హిట్ సినిమాల ద్వారా భారీ అభిమాన ఘనాన్ని సంపాదించింది. పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ (ఎంపి)  గా  కూడా  నిలిచిందంటే రమ్య సినీ హవా ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు.  రీసెంట్ గా రమ్య ఇచ్చిన  ఇంటర్వ్యూ లో పెళ్లి గురించి ప్రస్తావన వచ్చింది. ఎందుకంటే రమ్య ఇంకా పెళ్లి చేసుకోలేదు. రమ్య మాట్లాడుతు 'అసలు పెళ్లి చేసుకోవడం అంత ముఖ్యమా? ఖచ్చితంగా కాదు! నా వ్యక్తిత్వాన్ని, నా గుర్తింపుని పెళ్లి నిర్ణయించలేదు. వివాహం చేసుకోకుండా కూడా మనుషులు చాలా సంతోషంగా జీవించగలరు. సమాజం తరచుగా వ్యక్తులకి  రెండు ప్రతిపాదనలు మాత్రమే ఇస్తుందని, "ఒకటి మీరు వివాహం చేసుకోవాలి, లేదా మీరు సంతోషంగా ఉండాలి" అని చెబుతుందని, అందులో మనకు ఏది కావాలో మనమే ఎంచుకోవాలి. అయితే ఈ అభిప్రాయం అందరికీ ఒకేలా వర్తించదు. పెళ్లి బంధాన్ని నేను పూర్తిగా వ్యతిరేకించడం లేదు.     Also Read: ఇద్దరిలో గెలవబోతుంది ఎవరో తెలిసిపోయింది: ఎందుకంటే ఆ సీక్రెట్ బయటకొచ్చింది!  ఇద్దరి వ్యక్తుల మధ్య మంచి స్నేహం, ఒకే రకమైన జీవిత సూత్రాలు, విలువలు, ఒకరిపై ఒకరికి లోతైన అవగాహన ఉన్నప్పుడు వివాహం చేసుకోవడం ఎంతో అందమైన అనుభవం. కానీ కేవలం సామాజిక ఒత్తిడికి లొంగిపోయి, ఏదో ఒక వయసులో పెళ్లి చేసుకోవాలనే కారణంతో మాత్రమే బంధంలోకి అడుగుపెట్టడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.  రమ్య వయసు ప్రస్తుతం 43 ఏళ్ళు. అసలు పేరు దివ్య స్పందన. స్క్రీన్ నేమ్ రమ్య.      [Ramya , Divya Spandana, Maarriage, Kalyan Ram, Happiness, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News ]  
Sumanth is gearing up for the release of Mahendragiri Varahi, a devotional supernatural thriller that has generated curiosity with its teaser and trailer. The film has now completed its censor formalities with a U/A certificate and is scheduled to hit theatres on September 11. What makes the film interesting is its contemporary protagonist. Sumanth plays a YouTuber who investigates superstitions and questions the existence of God. While the film has been compared with Murari because of certain elements surrounding a curse, Sumanth has clarified that the core story is entirely different and is deeply rooted in Vedas, Puranas and Indian mythology. The film reportedly took shape well before the recent rise in devotional cinema. Sumanth revealed that he has been associated with the project for nearly three years, suggesting that its subject was not developed as a response to the current trend. Director Santhossh Jagarlapudi’s knowledge of mythology appears to be central to the screenplay. Interestingly, the film also brings together Sumanth and Siddhu Jonnalagadda in a serious dramatic setting. Siddhu plays an intense cameo, with their combination expected to be one of the film's key highlights. Aishwarya Rajesh is also playing a prominent role. Made on the biggest budget of Sumanth's career, the film has invested heavily in VFX and production design. Anup Rubens has scored the music and background score. Sumanth has particularly singled out the interval, pre-climax and climax portions, suggesting that the movie will incredible highs to audiences.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
  వర్షాకాలం రాగానే చల్లటి గాలి, ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు పలు రకాల ఆరోగ్య, సౌందర్య సమస్యలు కూడా మొదలవుతాయి. వర్షంలో తడవడం, తేమతో కూడిన వాతావరణం వల్ల కాళ్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో చాలామందిని వేధించే ప్రధాన సమస్య పగిలిన మడమలు మరియు పొడిబారిన పాదాలు. వర్షపు నీటిలోని బాక్టీరియా, బురద, మరియు వాతావరణంలో పెరిగే తేమ వల్ల పాదాల చర్మం నెర్రలు బారి పగుళ్లు ఏర్పడతాయి. కొన్నిసార్లు ఈ పగుళ్ల నుంచి తీవ్రమైన నొప్పి, రక్తం కారడం లేదా ఇన్ఫెక్షన్లు రావడం జరుగుతుంది. అందుకే ఈ సీజన్‌లో ముఖ సంరక్షణతో పాటు పాదాల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఎంతో అవసరం. వర్షాకాలంలో పగిలిన మడమల సమస్య నుంచి ఉపశమనం పొందడానికి, పాదాలను మెరిసేలా మార్చుకోవడానికి నిపుణులు ఒక అద్భుతమైన చిట్కాను సూచిస్తున్నారు. అదే ఇంట్లోనే చేసుకునే సహజ సిద్ధమైన పెడిక్యూర్! ప్రతిరోజూ పార్లర్‌కు వెళ్లాల్సిన పనిలేకుండా, ఇంట్లోనే లభించే వస్తువులతో వారానికి 2 సార్లు ఈ పెడిక్యూర్ చేసుకోవడం వల్ల పగిలిన మడమల సమస్య నుంచి 100 శాతం విముక్తి లభిస్తుంది. ఈ పెడిక్యూర్ ప్రక్రియ పాదాలలోని మృతకణాలను తొలగించి, చర్మానికి అవసరమైన తేమను అందించి పాదాలను ఎంతో మృదువుగామారుస్తుంది. ఈ హోమ్ మేడ్ పెడిక్యూర్ చేయడం అత్యంత సులభం. ముందుగా ఒక వెడల్పాటి బకెట్ లేదా టబ్‌లో పగిలిన పాదాలు మునిగేంత గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. అందులో 1 నుండి 2 చెంచాల ఎప్సమ్ సాల్ట్ లేదా సాధారణ ఉప్పు, కొద్దిగా మైల్డ్ షాంపూ మరియు ఒక నిమ్మకాయ రసం పిండాలి. ఈ నీటిలో మీ పాదాలను దాదాపు 15 నుండి 20 నిమిషాల పాటు నానబెట్టాలి. గోరువెచ్చని నీటి వల్ల పాదాలపై ఉన్న గట్టి చర్మం మరియు పగుళ్లు మృదువుగా మారుతాయి. నిమ్మకాయలోని యాంటీబాక్టీరియల్ గుణాలు బాక్టీరియాను అంతం చేస్తే, ఉప్పు అలసటను తగ్గించి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. పాదాలు బాగా నానిన తర్వాత ప్యూమిస్ స్టోన్ (Pumice Stone) లేదా ఫుట్ స్క్రబ్బర్ సహాయంతో మడమలను సున్నితంగా రుద్దాలి. దీనివల్ల పాదాలపై ఉన్న మృతకణాలు (Dead Cells) సులభంగా తొలగిపోతాయి. స్క్రబ్బింగ్ పూర్తయిన తర్వాత పాదాలను మంచి నీటితో కడిగి శుభ్రమైన తువ్వాలుతో తుడుచుకోవాలి. అనంతరం పాదాలకు తగినంత తేమను అందించడానికి కొబ్బరి నూనె, ఆలివ్ నూనె లేదా మంచి మోయిశ్చరైజింగ్ క్రీమ్‌ను రాసి 2 నుండి 3 నిమిషాల పాటు బాగా మసాజ్ చేయాలి. రాత్రి పూట ఈ పెడిక్యూర్ చేసుకుని, ఆ తర్వాత సుతిమెత్తని కాటన్ సాక్స్ (Socks) ధరించి నిద్రపోవడం వల్ల నూనె చర్మంలోకి బాగా ఇంకి పాదాలు పట్టులాగా మారుతాయి. వారానికి కనీసం 2 సార్లు ఈ పద్ధతిని క్రమం తప్పకుండా పాటిస్తే కేవలం 2 వారాల్లోనే పగిలిన మడమలు పూర్తిగా నయమై, పాదాలు అందంగా తయారవుతాయి. దీనితో పాటు వర్షాకాలంలో తడి బూట్లు, తడి సాక్స్ ఎక్కువ సేపు వేసుకోకూడదు. వర్షంలో తడిసిన వెంటనే పాదాలను శుభ్రమైన నీటితో కడుక్కుని పొడిగా ఉంచుకోవాలి. సులభమైన ఈ జాగ్రత్తలు పాటిస్తూ, వారానికి రెండుసార్లు పెడిక్యూర్ చేయడం వల్ల వర్షాకాలంలో కూడా మీ పాదాల అందం, ఆరోగ్యం 100 శాతం పదిలంగా ఉంటాయి.     Pedicure twice a week for soft feet, monsoon foot care tips, and remedies.
  మన భారతీయ వంటకాల్లో పచ్చళ్లకు ఉన్న స్థానమే వేరు. రోజూ తినే ఆహారంలో కాస్త పచ్చడి నంచుకుంటే ఆ రుచే వేరు, మనసుకు కలిగే తృప్తి వేరు. అయితే నేటి ఆధునిక జీవనశైలిలో చాలామంది బరువు పెరగడం, కొలెస్ట్రాల్ పెరగడం, గుండె సమస్యలు లేదా ఇతర ఆరోగ్య కారణాల వల్ల నూనె వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలని భావిస్తున్నారు. సాధారణంగా తెలుగు ఇళ్లలో పచ్చళ్లు చేయాలంటే నూనెలో ఎండుమిర్చి, ఇతర దినుసులు వేయించడం లేదా పచ్చడికి భారీగా తిరగమాత (తాళింపు) వేయడం ఆనవాయితీగా వస్తోంది. కానీ నూనె ఒక్క చుక్క కూడా వాడకుండా, ఎంతో ఘుమఘుమలాడే సువాసనతో, నోరూరించే రుచితో పాటు 100 శాతం నిండు ఆరోగ్య ప్రయోజనాలను అందించే  ఆయిల్ ఫ్రీ కొత్తిమీర పచ్చడి  (Oil Free Coriander Chutney) ని క్షణాల్లో తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? పోషకాలతో నిండిన కొత్తిమీరతో చేసే ఈ సాంప్రదాయ వంటకం కేవలం నోటికి రుచిని అందించడమే కాకుండా శరీరానికి దివ్యమైన ఆరోగ్య వరప్రదాయినిగా పనిచేస్తుంది. కొత్తిమీరను ప్రతిరోజూ మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో రకాల విటమిన్లు మరియు ఖనిజాలు అందుతాయి. కొత్తిమీరలో విటమిన్ ఎ, విటమిన్  సి, విటమిన్  కె లతో పాటు ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం మరియు పీచు పదార్థం (ఫైబర్) సమృద్ధిగా ఉంటాయి. నూనె లేకుండా ఈ పచ్చడిని తయారు చేసినప్పుడు అందులోని పోషక విలువలు ఏమాత్రం నశించకుండా 100 శాతం శరీరానికి నేరుగా అందుతాయి. కొత్తిమీరలో ఉండే అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని హానికర ఫ్రీ రాడికల్స్‌ను అంతం చేసి రోగనిరోధక శక్తిని విశేషంగా పెంపొందిస్తాయి. ముఖ్యంగా రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, హై బీపీని అదుపు చేయడంలో మరియు మధుమేహం ఉన్నవారిలో గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్ధీకరించడంలో ఈ ఆయిల్ ఫ్రీ పచ్చడి సమర్థవంతంగా పనిచేస్తుంది. జీర్ణవ్యవస్థను వేగవంతం చేసి గ్యాస్, అసిడిటీ మరియు కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఈ అద్భుతమైన నూనె లేని కొత్తిమీర పచ్చడి తయారు చేసుకోవడానికి మన ఇంట్లో ఎప్పుడూ లభించే దినుసులే సరిపోతాయి. ఈ పచ్చడి తయారీ కోసం 2 కప్పుల తాజా కొత్తిమీర (బాగా కడిగి తరిగినది), మీ కారానికి సరిపడా 4 నుండి 6 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 టీస్పూన్ జీలకర్ర, చిన్న నిమ్మకాయ పరిమాణంలో చింతపండు, రుచికి సరిపడా రాతి ఉప్పు మరియు కొద్దిగా రుచిని పెంచడానికి 2 టేబుల్ స్పూన్ల వేయించిన పల్లీలు లేదా పుట్నాల పప్పును సిద్ధం చేసుకోవాలి. తయారీ విధానం అత్యంత సులభం! మొదటగా చింతపండును కొద్దిగా వేడి నీటిలో నానబెట్టుకోవాలి. అనంతరం ఒక బాణలిలో నూనె వేయకుండా కేవలం పచ్చిమిర్చి, జీలకర్రను డ్రై రోస్ట్ (డ్రైగా వేయించడం) చేసుకోవాలి. పల్లీలను కూడా విడిగా వేయించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లేదా సాంప్రదాయ రోలు తీసుకుని మొదట వేయించిన పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, వేయించిన పల్లీలు, నానబెట్టిన చింతపండు మరియు ఉప్పు వేసి బరకగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత తాజా కొత్తిమీరను అందులో వేసి కొద్దిగా నీళ్లు చిలకరించి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే! ఎలాంటి నూనె లేదా తాళింపు అవసరం లేకుండా ఘుమఘుమలాడే హెల్తీ కొత్తిమీర పచ్చడి సిద్ధమవుతుంది. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కొద్దిగా కలుపుకుని తిన్నా, ఇడ్లీ, దోస, ఉప్మా, పెసరట్టు, గారెలు లేదా రోటీలలోకి నంచుకుని తిన్నా రుచి అద్భుతంగా ఉంటుంది. జీరో ఆయిల్ కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి మరియు డయాబెటిస్, గుండె జబ్బులు ఉన్నవారికి ఇది 100 శాతం పర్ఫెక్ట్ హెల్త్ డైట్ చట్నీగా నిలుస్తుంది.       Kothimeera pachadi without oil guide, healthy zero oil coriander green chutney.
  ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ప్రజల రోజువారీ జీవితం ఒక కప్పు కాఫీతోనే మొదలవుతుంది. పొద్దున్నే వేడివేడిగా కాఫీ తాగితే వచ్చే ఆ ఉత్సాహం, రిఫ్రెష్‌మెంట్ మాటల్లో చెప్పలేం. అయితే ఇప్పటివరకు కాఫీ తాగడం వల్ల నిద్రలేమి లేదా అసిడిటీ వస్తుందని చాలామంది భావించేవారు. కానీ మన ఆరోగ్యాన్ని, ముఖ్యంగా జీర్ణవ్యవస్థలో అత్యంత కీలకమైన కాలేయాన్ని (Liver) కాపాడడంలో కాఫీ ఒక దివ్యౌషధంగా పనిచేస్తుందని ఇటీవలి వైద్య పరిశోధనలు వెల్లడించాయి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా సరైన పద్ధతిలో కాఫీని తీసుకోవడం వల్ల లివర్ సమస్యల నుంచి 100 శాతం రక్షణ లభిస్తుందని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మన శరీరంలో కాలేయం అనేది ఒక ప్రాకృతిక ఫిల్టర్ లాంటిది. మనం తినే ఆహారంలోని విష పదార్థాలను బయటకు పంపడంలో, రక్త శుద్ధిలో లివర్ ది ముఖ్యమైన పాత్ర. అయితే మారిన జీవనశైలి, కొవ్వు పదార్థాల వినియోగం వల్ల ఫ్యాటీ లివర్ (Fatty Liver) వంటి సమస్యలు ఎంతోమందిని వేధిస్తున్నాయి. వైద్య నివేదికల ప్రకారం, రోజూ 2 నుండి 3 కప్పుల కాఫీ తాగేవారికి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) వచ్చే ప్రమాదం దాదాపు 20% నుండి 30% వరకు తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. కాఫీలో సమృద్ధిగా ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు, ఫినోలిక్ సమ్మేళనాలు కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తాయి. అంతేకాకుండా, తీవ్రమైన లివర్ వ్యాధులైన కాలేయ క్షయత (Liver Cirrhosis) మరియు లివర్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కాఫీ సంచలనాత్మక ఫలితాలను చూపిస్తోంది. అధ్యయనాల ప్రకారం, రోజుకు 3 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగే వ్యక్తులలో లివర్ సిర్రోసిస్ వచ్చే అవకాశం ఏకంగా 40% నుండి 50% వరకు తగ్గుతుంది. కాఫీలోని కెఫీన్ కణాల వాపును (Inflammation) తగ్గించి, లివర్ కణజాలం గట్టిపడకుండా (Fibrosis) నిరోధిస్తుంది. సాధారణంగా రక్త పరీక్షలలో కాలేయ పనితీరును తెలిపే ALT, AST మరియు GGT వంటి ఎంజైమ్‌ల స్థాయిలు అధికంగా ఉంటే లివర్ దెబ్బతిన్నట్లు భావిస్తారు. అయితే కాఫీ క్రమం తప్పకుండా తాగే వారిలో ఈ ఎంజైమ్‌ల స్థాయిలు 100% సమతుల్యంగా ఉంటాయని వైద్యులు నిరూపించారు. అయితే కాఫీ తాగే పద్ధతిపైనే దాని ఆరోగ్య ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి. కాలేయానికి పూర్తిస్థాయి రక్షణ లభించాలంటే కాఫీని ఎప్పుడూ పంచదార (Sugar), కృత్రిమ తీపి పదార్థాలు మరియు ఎక్కువ కొవ్వు ఉన్న పాలు లేకుండా తీసుకోవడం శ్రేష్ఠం. సాధారణ బ్లాక్ కాఫీ (Black Coffee) లేదా ఫిల్టర్ కాఫీ తాగడం వల్ల కాలేయానికి 100% గరిష్ట ప్రయోజనాలు అందుతాయి. అధికంగా చక్కెర మరియు మీగడ కలిపిన కాఫీలు తాగడం వల్ల ఉపయోగం కంటే హాని ఎక్కువ జరుగుతుంది. కాబట్టి రోజుకు 2 నుండి 3 కప్పుల బ్లాక్ కాఫీని మీ డైట్‌లో భాగం చేసుకుని, మీ లివర్ ఆరోగ్యాన్ని సురక్షితంగా కాపాడుకోండి.       black coffee benefits for liver disease, prevent liver cirrhosis, drinking coffee.
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం మందులపైనే ఆధారపడటం సరిపోతుందా? మనం తీసుకునే ఆహారం, పోషకాలు, జీవనశైలి కూడా గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయా? ఈ వీడియోలో హార్ట్ హెల్త్, పోషకాహారం (Nutrition), సమీకృత ఆహారం (Samikrutha Aharam) గురించి డాక్టర్ జి. లక్ష్మణరావు Consultant Herbalist వివరించారు. మన శరీరంలో కనిపించే లక్షణాలను, రోజువారీ జీవనశైలిని గమనించి ఆహారపు అలవాట్లలో అవసరమైన మార్పులు చేసుకోవడం గురించి ఆయన సూచనలు అందించారు. గుండె ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు, సమతుల్యమైన మరియు సమీకృత ఆహారం, రోజువారీ జీవనశైలి వంటి అంశాలపై ఈ వీడియోలో చర్చించారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఆహారానికి ఉన్న ప్రాధాన్యతను ఈ వీడియో వివరిస్తుంది. అలాగే, ప్రతి ఆరోగ్య సమస్యకు వెంటనే మందులపైనే ఆధారపడకుండా, సమస్యకు సంబంధించిన లక్షణాలు, ఆహారం, జీవనశైలి వంటి అంశాలను కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని డాక్టర్ ప్రస్తావించారు. ముఖ్య గమనిక: ఈ వీడియో ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. ఇప్పటికే వైద్యుడు సూచించిన మందులను స్వయంగా ఆపడం లేదా మార్చడం చేయకండి. గుండెకు సంబంధించిన లక్షణాలు లేదా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్య నిపుణుడిని సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి  TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)  
వాతావరణ మార్పులు, జలుబు, ఇన్ఫెక్షన్లు లేదా సైనస్ సమస్యల వల్ల శ్వాసనాళాల్లో చిక్కటి కఫం పేరుకుపోతుంటుంది. దీనివల్ల శ్వాస తీసుకోవడం కష్టంగా మారడమే కాకుండా నీరసం, గొంతు బొంగురుపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. సాధారణంగా దీని ఉపశమనం కోసం యాంటీబయోటిక్స్ లేదా ఇతర మందులు వాడుతుంటారు, కానీ ఇవి ప్రతిసారీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోగా శరీరానికి హాని కలిగించే అవకాశం ఉంది. ఔషధాల ప్రమేయం లేకుండా, ఇంట్లోనే  రెండు  ప్రభావవంతమైన పద్ధతుల ద్వారా కొన్ని నిమిషాల్లోనే కఫం నుంచి ఉపశమనం పొందవచ్చు. వైద్యులు రికమెండ్ చేస్తున్న ఈ చిట్కాలు ఏమిటో తెలుసుకుంటే.. హెర్బల్ స్టీమ్.. సాధారణ నీటి ఆవిరి పట్టుకోవడం వల్ల శ్వాసనాళాలు కాసేపు రిలాక్స్ అవుతాయి కానీ.. గట్టిగా ఉన్న కఫం కరగదు. నీటిలో కొన్ని రకాల సహజ మూలికలను చేర్చి ఆవిరి పట్టినప్పుడు, ఆ ఆవిరి ఊపిరితిత్తుల లోతుల్లోకి వెళ్లి కఫాన్ని సులభంగా కరిగిస్తుంది. కావాల్సిన పదార్థాలు.. పుదీనా ఆకులు.. 10 నుండి 12 తులసి ఆకులు..  10 నుండి 12 హిమాలయన్ పింక్ సాల్ట్..  1 టీస్పూన్ తురిమిన అల్లం..  అర అంగుళం నీరు.. ఆవిరి రావడానికి సరిపడా ఇందులోని పదార్థాల ప్రత్యేకత..  పుదీనాలో ఉండే మెంతోల్ శ్వాసనాళాలను తెరిచి కఫాన్ని పలుచన చేస్తుంది.  తులసిలోని యాంటీమైక్రోబయల్ గుణాలు ఇన్ఫెక్షన్ కలిగించే సూక్ష్మజీవులను నశింపజేసి, వాపును తగ్గిస్తాయి.  హిమాలయన్ ఉప్పు కఫాన్ని కరిగించడానికి తోడ్పడతుంది.   అల్లం గొంతు మంటను తగ్గించి శ్వాసకోశాల్లోని వ్యర్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. తయారీ , ఉపయోగించే విధానం.. ఒక పాత్రలో నీటిని తీసుకుని బాగా మరిగించాలి. స్టవ్ ఆపివేసిన తర్వాత, ఆ వేడి నీటిలో పుదీనా, తులసి ఆకులు, హిమాలయన్ సాల్ట్ , తురిమిన అల్లం వేయాలి. వెంటనే పాత్రపై ఒక టవల్ మూసి రెండు నిమిషాల పాటు ఉంచాలి. దీనివల్ల ఆ మూలికలలోని ఆరోమాటిక్ ఆయిల్స్ నీటిలోకి విడుదలవుతాయి. ఆ తర్వాత పాత్ర మూత తీసి, ముఖాన్ని   తగినంత దూరంలో ఉంచి, తలను టవల్‌తో లేదా దుప్పటితో  కప్పుకోవాలి. ముక్కు , నోటి ద్వారా లోతుగా శ్వాస తీసుకుంటూ 5 నుండి 10 నిమిషాల పాటు ఆవిరిని పీల్చాలి. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు ఈ విధంగా చేయడం వల్ల శ్వాసకోశాల్లో పేరుకుపోయిన కఫం త్వరగా కరిగిపోతుంది. డీప్ ఎక్స్‌పాన్షన్ బ్రీతింగ్ వ్యాయామం.. ఆవిరి పద్ధతితో పాటు డీప్  ఎక్స్‌పాన్షన్ ప్రత్యేక శ్వాస వ్యాయామాన్ని కలిపి చేసినప్పుడు ఫలితం మరింత వేగంగా ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల లోపలి భాగాల్లో చిక్కుకున్న కఫాన్ని పైకి నెట్టి, సులభంగా బయటకు వచ్చేలా చేస్తుంది. చేసే విధానం.. మొదట ఒక కుర్చీలో నిటారుగా, శరీరాన్ని ప్రశాంతంగా ఉంచి కూర్చోవాలి. ముక్కు ద్వారా శ్వాసను ఎంత వీలైతే అంత లోతుగా లోపలికి తీసుకోవాలి. శ్వాస తీసుకున్న తర్వాత, దానిని 3 నుండి 4 సెకన్ల పాటు ఊపిరితిత్తుల్లోనే పట్టి ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తుల్లో ఒత్తిడి పెరిగి, నాళాలకు అతుక్కుపోయిన కఫం వదులవుతుంది. తరువాత పెదవులను కొవ్వొత్తిని ఊదుతున్నట్లుగా చిన్నగా చేసి, నోటి ద్వారా గాలిని బలంగా బయటకు వదలాలి. ఈ పద్ధతిని వరుసగా 5 నుండి 7 సార్లు పునరావృతం చేయాలి. ఇది ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా శ్వాసనాళాలను శుభ్రపరుస్తుంది. ముగింపు.. జలుబు, దగ్గు లేదా మొండి కఫంతో బాధపడుతున్నప్పుడు ఈ రెండు సహజ పద్ధతులను క్రమం తప్పకుండా పాటించడం వల్ల ఎలాంటి మందుల అవసరం లేకుండానే ఊపిరితిత్తులు శుభ్రపడి, హాయిగా శ్వాస తీసుకోగలుగుతారు.                           *రూపశ్రీ.