LATEST NEWS
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది. తమ అభిమాన నేతను కళ్లారా చూడాలని, ఒక్కసారైనా మాట్లాడాలని కొందరు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంటారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉన్న అపారమైన గౌరవంతో ఓ యువకుడు చేసిన సాహసయాత్ర అందరినీ విస్మయానికి గురిచేసింది.    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన తాయన్న అనే యువకుడు సీఎం రేవంత్ రెడ్డికి వీరాభిమాని. తన ఇష్టమైన నాయకుడిని నేరుగా కలిసి మనసులోని భావాలను పంచుకోవాలన్న బలమైన కోరిక ఆయనలో నాటుకుపోయింది.    ఈ లక్ష్యంతోనే తాయన్న ఎంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. వాహనాలను ఆశ్రయించకుండా, ఏకంగా అక్టోబర్ 29వ తేదీన ఆదోని నుంచి హైదరాబాద్‌కు తన కాలినడక ప్రయాణాన్ని ప్రారంభించారు. దారి పొడవునా ఎండ, అలసట వంటి అనేక ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఆయన ఎక్కడా వెనకడుగు వేయలేదు.    దాదాపు 350 కిలోమీటర్ల సుదూర మార్గాన్ని అలుపెరగకుండా తొమ్మిది రోజుల పాటు నడుస్తూ ఆయన పూర్తి చేశారు. అంత దూరం నడవడం వల్ల కాళ్లకు బొబ్బలు ఎక్కినప్పటికీ, తన ఆశయం ముందు ఆ నొప్పులన్నీ లెక్కలోకి రాలేదని ఆయన నిరూపించారు.    చివరకు తొమ్మిది రోజుల ప్రయాణం ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న తాయన్న, జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి వెళ్లారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డిని ప్రత్యక్షంగా కలుసుకుని తన ఆనందాన్ని పంచుకున్నారు.    అంత దూరం నుంచి కేవలం తనను చూడటానికే నడుచుకుంటూ వచ్చిన అభిమాని తపస్సును ముఖ్యమంత్రి అభినందించారు. ఆప్యాయంగా పలకరించి శాలువా కప్పి సత్కరించడంతో పాటు కొద్దిసేపు ముచ్చటించారు.    ప్రజల నుంచి లభించే ఇలాంటి స్వచ్ఛమైన అభిమానమే తనకు మరింత బాధ్యతను పెంచుతుందని, ప్రజాసేవలో నిరంతరం ముందుకు సాగేందుకు ఇది కొండంత బలాన్ని ఇస్తుందని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.   నాయకులపై ప్రజల చూపే ఇలాంటి నిస్వార్థమైన ప్రేమ రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. తన ఆరాధ్య నేతను కలిసేందుకు ఓ సామాన్య యువకుడు పడిన తపన అందరినీ ఆకట్టుకుంటోంది.          [ CM Revanth Reddy fan, Adoni to Hyderabad walk, Jubilee Hills residence, Telangana political news, Kurnool fan meets CM ]
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా, తాజాగా ఆ జాబితాలోకి మరో క్రేజీ హీరో చేరబోతున్నారు. 'హనుమాన్' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో అసాధారణ గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో తేజ సజ్జా త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నారు. తన సినీ కెరీర్‌లో విజయాల జోరుమీదున్న ఈ యువ నటుడు, ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో అత్యంత కీలకమైన కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టేందుకు పూర్తిగా సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే తేజ సజ్జా తన పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి తన నిశ్చితార్థ వేడుకకు హాజరుకావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి వివాహ నిశ్చితార్థ ఆహ్వాన పత్రికను అందజేసి, వేడుకను విజయవంతం చేయాలని కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డితో తేజ సజ్జా భేటీ అయిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను చూసిన ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా యంగ్ హీరోకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేసి, ఆ తర్వాత హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న తేజ సజ్జా జీవితంలో ఈ కొత్త ఘట్టం ప్రారంభమవుతుండటంతో సర్వత్రా ఆనందం వ్యక్తమవుతోంది. ఈ వివాహం పూర్తిగా పెద్దలు కుదిర్చిన సంబంధమని తేజ సజ్జా ఇదివరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తన కుటుంబ సభ్యులు ఎంపిక చేసిన అమ్మాయితోనే తన వివాహం నిశ్చయమైనట్లు ఆయన తెలిపారు. త్వరలోనే జరగనున్న ఈ నిశ్చితార్థ వేడుకను అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఆ తర్వాత డిసెంబర్ నెలలో రాజస్థాన్‌లోని సుందరమైన ఉదయ్‌పూర్‌లో వివాహ వేడుకను జరపాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు సమాచారం. సినిమా పరిశ్రమకు దూరంగా ఉండే ఓ సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయిని తేజ సజ్జా వివాహం చేసుకోబోతున్నారు. కాబోయే వధువు కుటుంబం టెక్నాలజీ వ్యాపార రంగంలో ఉండగా, ఆమె తన తండగ్రితో కలిసి ఆ బిజినెస్‌లో భాగస్వామ్యంగా ఉన్నారు. అమెరికాలో పెరిగిన ఆమెకు సినిమా ప్రపంచంతో ఎలాంటి పరిచయం లేకపోవడం విశేషం. కేవలం కుటుంబ నేపథ్యానికి, వ్యక్తిగత గోప్యతకు పెద్దపీట వేస్తూ ఈ వేడుకను అత్యంత నిరాడంబరంగా కానీ ప్రైవేట్‌గా నిర్వహించాలని భావిస్తున్నారు. ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరగనున్న ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ వేడుక పూర్తయిన తర్వాత హైదరాబాద్‌లో టాలీవుడ్ సినీ ప్రముఖుల కోసం ఘనంగా రిసెప్షన్ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. వెండితెరపై అద్భుతమైన విజయాలతో ప్రేక్షకులను అలరిస్తున్న తేజ సజ్జా, రియల్ లైఫ్‌లోనూ వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండటంతో ఆయన అభిమానులు ఈ వేడుక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.       [Teja Sajja Engagement, Revanth Reddy, Tollywood News, Teja Sajja Wedding, Telugu Cinema, Telugu 
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం. అయితే ఆనందాన్ని పంచే ఈ టపాసుల మోతలు మన చెవులపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చట్టపరమైన నిబంధనల ప్రకారం టపాసుల శబ్దం నిర్దిష్ట పరిమితిలో ఉండాలని ఉన్నప్పటికీ, ఆ మోతాదు కూడా చెవులకు హానికరమే కావచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారతీయ నిబంధనల ప్రకారం మార్కెట్లో లభించే బాణసంచా గరిష్టంగా 125 డెసిబుల్స్‌ వరకు శబ్దం చేసేందుకు అనుమతి ఉంది. అయితే చట్టం అనుమతించినంత మాత్రాన ఆ స్థాయి శబ్దం చెవులకు పూర్తిగా సురక్షితం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా టపాసులు పేలే ప్రాంతానికి అతి సమీపంలో ఉండటం వల్ల వినికిడి శక్తి దెబ్బతినే ముప్పు తీవ్రంగా ఉంటుంది. సాధారణంగా మనుషులు మాట్లాడుకునే సాధారణ ధ్వని 60 డెసిబుల్స్‌ ఉంటే, రద్దీగా ఉండే ట్రాఫిక్‌లో అది 85 డెసిబుల్స్‌కు చేరుకుంటుంది. కానీ టపాసుల మోత ఏకంగా 125 డెసిబుల్స్‌ వరకు ఉంటుంది. డెసిబుల్స్ పది పాయింట్లు పెరిగినప్పుడు శబ్ద తీవ్రత పది రెట్లు పెరుగుతుందనే నిజాన్ని ఎవరూ విస్మరించకూడదు. సాధారణంగా బాణసంచా శబ్ద తీవ్రతను నాలుగు మీటర్ల దూరం నుంచి కొలుస్తారు. కానీ పండగ సమయంలో చాలామంది ఆ దూరాన్ని పాటించకుండా టపాసులను చేతులతో పట్టుకుని కాల్చడం లేదా అతి దగ్గరగా నిలబడటం చేస్తుంటారు. దీనివల్ల చెవులపై పడే ఒత్తిడి ఊహించినదాని కంటే ఎక్కువుగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం పెద్దలకు 140 డెసిబుల్స్‌, పిల్లలకు 120 డెసిబుల్స్‌ మించిన ఆకస్మిక శబ్దాలు అత్యంత ప్రమాదకరం. మనం పేలుడు కేంద్రానికి ఎంత దగ్గరగా ఉంటే శబ్ద తీవ్రత అంతగా పెరుగుతుంది. ఉదాహరణకు నాలుగు మీటర్ల దూరంలో 125 డెసిబుల్స్‌ ఉన్న శబ్దం, అర మీటరు దూరానికి వచ్చేసరికి సుమారు 143 డెసిబుల్స్‌ దాటుతుంది. మన చెవి లోపల ఉండే సూక్ష్మమైన కణాలు తీవ్రమైన శబ్దాలను తట్టుకోలేవు. బాణసంచా పేలే సమయంలో వచ్చే ఆకస్మిక మరియు తీవ్రమైన శబ్దాల వల్ల కర్ణభేరి దెబ్బతినే అవకాశం ఉంది. లోపలి చెవిలోని సున్నితమైన కణాలు దెబ్బతింటే అవి మళ్లీ సాధారణ స్థితికి రావు, దీనివల్ల శాశ్వత వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇరుకైన వీధుల్లో టపాసులు కాల్చినప్పుడు గోడల వల్ల ప్రతిధ్వని ఏర్పడి శబ్ద తీవ్రత మరింత పెరుగుతుంది. కాబట్టి పండగ వేళ చిన్నారులను దూరంగా ఉంచడం, తగిన చెవి రక్షణ జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ అనర్థాల నుంచి రక్షణ పొందవచ్చు.       [ Firecrackers noise decibels, Diwali ear safety precautions, Hearing loss from fireworks, Danger of firecracker noise, Diwali ear precautions, Telugu One, Telugu News ]
ALSO ON TELUGUONE N E W S
  ప్రెజెంట్ వరల్డ్ వైడ్ థియేటర్స్ దగ్గర రామాయణ పార్ట్ 1 హవా కొనసాగుతూ ఉంది. రెండు రోజులకి రాబట్టిన 221 .05 కోట్ల గ్రాస్ నే రాముడు చూపిస్తున్న చిన్న ఉదాహరణ. ఇక ఈ చిత్రంలో సీతాదేవిగా సాయి పల్లవి అత్యద్భుతంగా జీవించింది. భారతీయ ఇతిహాసాల ప్రకారం సీతాదేవి రాముడి కంటే వయసులో చాలా చిన్నది. ఈ మేరకే సీతాదేవిగా  సాయి పల్లవిలో ఆ ఛాయలు ఉన్నాయని ఫిట్ అవుతుందని మేకర్స్ ఎన్నుకున్నారు. అయితే, ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి రావడానికి ముందూ, ఆ తర్వాత కూడా సీతాదేవిగా   బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్‌ని  సంప్రదించారని, కానీ ఆమె భారీగా పారితోషికం డిమాండ్ చేయడంతో మేకర్స్ ఆమెని వద్దని అనుకున్నారనే  ప్రచారం జరిగింది. ఈ వార్తలపై రీసెంట్ గా కరీనా కపూర్ స్పందించింది. రామాయణలో సీతాదేవి  కోసం మేకర్స్ ఎప్పుడూ తనని  సంప్రదించలేదని, అసలు ఈ ప్రాజెక్ట్ గురించి తనతో ఎలాంటి చర్చలు కూడా జరగలేదని స్పష్టం చేశారు. తద్వారా రెట్టింపు పారితోషికం డిమాండ్ చేసినందుకే కరీనా కపూర్‌ని  తొలగించారన్న వదంతులలో ఏమాత్రం నిజం లేదని తేలిపోయింది.    కాకపోతే కన్నడ బ్యూటీ ' శ్రీనిధి శెట్టి సైతం సీతాదేవి కోసం ఆడిషన్స్ ఇచ్చినప్పటికీ, వివిధ కారణాల వల్ల దర్శక నిర్మాతలు ఆమెను ఎంపిక చేయలేదనేది మాత్రం నిజం. ఇది కూడా చదవండి: రామాయణ రెమ్యునరేషన్ 6 కోట్లు ఆ పిల్లలకి ఇచ్చేసిన వివేక్ ఒబెరాయ్    రెండు భాగాలకు కలిపి సాయి పల్లవి దాదాపు .12 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు (అంటే ఒక్కో భాగానికి సుమారు రూ. 6 కోట్లు) ఫిలింనగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.  ఏది ఏమైనప్పటికీ, ఎలాంటి మేకప్ లేకుండా తన సహజ సిద్ధమైన నటనతో సాయి పల్లవి సీతాదేవిగా  పూర్తి న్యాయం చేశారని, వెండితెరపై ఆమె రూపం దైవిక తేజస్సుని తలపించిందని తొలి ఆట నుంచే ప్రేక్షకులు, సినీ విమర్శకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.  మీకు నచ్చవచ్చు: రామాయణ  హైలెట్స్ ఇవే  మీకు నచ్చవచ్చు: రామాయణ రివ్యూ   [Kareena Kapoor About Ramayana Sita Role, Kareena Kapoor Rejected Sita Role In Ramayana,  Ramayana movie, Sai Pallavi, Kareena Kapoor, Tollywood News, Tollywood, Telugu Cinema, Telugu Cinema News]      
లోకనాయకుడు కమల్ హాసన్ మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. విలక్షణమైన కథలు, విభిన్నమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు దర్శకుడు ఎస్.యు. అరుణ్ కుమార్‌తో కలిసి ఓ కొత్త సినిమా చేస్తున్నారు. కమల్ హాసన్ నటిస్తున్న 237వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘సండియార్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నవంబర్ 7న కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ విడుదల చేసింది. అయితే ఈ టైటిల్ ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు కారణమవుతోంది. ఎందుకంటే సుమారు 22 ఏళ్ల క్రితం కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘విరుమాండి’ సినిమాకు మొదట ‘సండియార్’ అనే పేరునే అనుకున్నారు. 2003లో ఈ టైటిల్‌ను ప్రకటించిన సమయంలో కొన్ని రాజకీయ వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ పేరు కులపరమైన ఘర్షణలను ప్రోత్సహించేలా ఉందంటూ అభ్యంతరాలు రావడంతో వివాదం మొదలైంది. దీంతో చివరకు కమల్ హాసన్ ఆ టైటిల్‌ను మార్చి ‘విరుమాండి’గా ఖరారు చేశారు. 2004లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత కమల్ హాసన్ మళ్లీ అదే టైటిల్‌ను తన కొత్త సినిమాకు పెట్టడం విశేషంగా మారింది. అప్పట్లో వివాదాల కారణంగా వదులుకున్న పేరునే ఇప్పుడు మరోసారి తన సినిమా కోసం ఎంచుకోవడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే ఈ కొత్త సినిమా ‘విరుమాండి’కి సీక్వెల్ కాదు. దర్శకుడు ఎస్.యు. అరుణ్ కుమార్‌తో కమల్ హాసన్ చేస్తున్న పూర్తిగా కొత్త ప్రాజెక్ట్ ఇది. ఇక విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ విషయానికి వస్తే.. ఇందులో కమల్ హాసన్ చాలా గంభీరమైన లుక్‌లో కనిపిస్తున్నారు. కారు కిటికీలో నుంచి రివాల్వర్ పట్టుకుని శత్రువులపై దాడికి సిద్ధమైనట్టుగా ఆయన కనిపిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. కారు డోర్‌పై రక్తపు మరకలు, చేతిలో తుపాకీతో కమల్ కనిపిస్తున్న విధానం చూస్తుంటే సినిమా యాక్షన్, ప్రతీకార నేపథ్యంలో తెరకెక్కనుందనే ఆసక్తి కలుగుతోంది. అయితే చిత్ర కథకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర బృందం ఇంకా వెల్లడించలేదు. ఇది కూడా చదవండి: మళ్లీ కెమెరా ముందుకు సీఎం విజయ్: డైరెక్టర్ ఎవరంటే.? ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. సునీల్ కె.ఎస్. సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీతలైన అన్బరివ్ యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు. సి.ఎస్. బాలచందర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, అమృత రామ్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. ఎస్. డిస్నీ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే.. కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 7నే ఈ సినిమా షూటింగ్‌ను కూడా ప్రారంభించనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఒకప్పుడు వివాదానికి కారణమైన ‘సండియార్’ పేరును ఇప్పుడు మళ్లీ తెరపైకి తీసుకొచ్చిన కమల్ హాసన్.. ఈ సినిమాతో ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి. మీకు నచ్చవచ్చు: గ్లామర్ నుంచి నటవిశ్వరూపం వరకు.. అనుష్కకు స్టార్‌డమ్ తెచ్చిన టాప్ 10 సినిమాలివే.!       [Kamal Haasan, Kamal Haasan New Movie, Sandiyar Movie, Sandiyar First Look, Kamal Haasan Birthday, SU Arun Kumar, Anirudh Ravichander, Virumaandi Movie, Raaj Kamal Films International, Kamal Haasan 237th Film]
ఇండియన్ చిత్ర పరిశ్రమకి దొరికిన అరుదైన నటుల్లో వివేక్ ఒబెరాయ్ ఒకరు. బాలీవుడ్ కి చెందిన ఈ నట శిఖరం రక్తచరిత్ర పార్ట్ 1 , పార్ట్ 2 ద్వారా తెలుగు ప్రేక్షకుల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ప్రస్తుతం రామాయణలో రావణుడి మిత్రుడు, రావణుడి సోదరి శూర్పణఖ మనసు పడే మొదటి ఇష్టసఖి 'విద్యుత్ జీవుడు' గా మెప్పించాడు.  కాకపోతే ఎడిటింగ్ లో విద్యుత్ జీవుడి  సీన్స్ చాలా వరకు కట్ అయ్యాయనే విషయం అర్ధమవుతుంది. ఎందుకంటే ఒకే ఒక్క సీన్ లో ఆ క్యారక్టర్ వస్తుంది. తాజాగా వివేక్  ఒబెరాయ్  తమ గొప్ప మనసుతో ఆదర్శంగా నిలిచాడు.రామాయణ ద్వారా అందుకున్న 6 కోట్ల భారీ రెమ్యునరేషన్‌ ని క్యాన్సర్‌తో పోరాడుతున్న నిరుపేద చిన్నపిల్లల వైద్య చికిత్స కోసం నేరుగా విరాళంగా ఇచ్చాడు. ఈ మేరకు చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రాను స్వయంగా కలిసి, ఆ మొత్తాన్ని క్యాన్సర్ బాధితుల సహాయార్థం కేటాయించాలని కోరారు.  కేవలం సినిమా రెమ్యునరేషన్‌ను వదులుకోవడంతో ఆగకుండా, తన జీవితంలో అత్యంత మైలురాయి అయిన 50వ పుట్టినరోజు సందర్భంగా తీవ్రమైన క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న 50 మంది పేద చిన్నారుల పూర్తి వైద్య ఖర్చులను తానే  స్వయంగా భరిస్తున్నట్లు ప్రకటించి గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారు. ఇది కూడా చదవండి : మహాశక్తి ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే: దటీజ్ నయనతార! తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజును ఇలాంటి గొప్ప సామాజిక సేవకు వినియోగించడం ద్వారా ఆయన ఎన్నో నిరుపేద కుటుంబాల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతున్నారు. ఈ అద్భుతమైన ఉదారతా గుణం గురించి తెలుసుకున్న నెటిజన్లు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా వివేక్ ఒబెరాయ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.  సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి రియల్ హీరోలు ఉండటం అరుదు అని, ఆయన చూపిన చొరవ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అని కామెంట్లు చేస్తున్నారు. సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా ఆయన తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం ప్రస్తుతం టాలీవుడ్ మరియు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.   మీకు నచ్చవచ్చు :ఇద్దరిలో బెస్ట్ పెర్ఫార్మ్ ఇచ్చింది ఈ హీరోనే! మీకు నచ్చవచ్చు :రామాయణ మూవీ రివ్యూ!   [Vivek Oberoi Ramayana Remuneration Donation, Vivek Oberoi, Ramayana movie, Vivek Oberoi donation, cancer children treatment, Tollywood News, Tollywood, Telugu Cinema, Telugu Cinema News]  
  లేడీ సూపర్ స్టార్ హోదాలో బిగ్ హీరోల రేంజ్ లో నిన్న రిలీజైన మాస్ అండ్ ఫాంటసీ మూవీ 'మహాశక్తి' కి నయనతార కట్ అవుట్స్ చాలా ఏరియాస్ లో దర్శనమిచ్చాయి. టాక్ కూడా పర్లేదనే స్థాయిలోనే వస్తుండటంతో ఫెస్టివల్ మూడ్, వీకెండ్ ని ఎలా ఉపయోగించుకుంటుందనే ఆసక్తి ట్రేడ్ సర్కిల్స్ లో ఉంది.   తొలి రోజు 2.07 కోట్ల గ్రాస్ వసూళ్లని సాధించి మంచి ఆరంభాన్ని నమోదు చేసింది. అందులో తమిళ వర్షన్ సుమారు1.75 కోట్ల నెట్ కాగా  తెలుగు వర్షన్ 16.95 లక్షల వరకు గ్రాస్ సాధించట్టుగా చెప్తున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 777 థియేటర్లలో 2,159 షోలలో ప్రదర్శితమవ్వగా 1,36,397 టికెట్లు అమ్ముడయ్యాయి. సగటున 20.7% ఆక్యుపెన్సీ నమోదైంది.  తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో మహాశక్తికి విశేష స్పందన లభించింది. ముందస్తు బుకింగ్స్ అడ్వాన్స్ నివేదికల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో ₹11.05 లక్షల వసూళ్లతో 27% ఆక్యుపెన్సీ నమోదు కాగా, తెలంగాణలో 5.74 లక్షలతో 17% ఆక్యుపెన్సీ నమోదైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు రెండూ కలిపి మొత్తం తెలుగు అడ్వాన్స్ కలెక్షన్స్ లో దాదాపు 98% వాటాను సాధించడం విశేషం. తమిళంలో మూకుత్తి అమ్మన్ 2 కాగా అగ్ర దర్శకుడు సుందర్ సి తెరకెక్కించాడు. నయనతారతో పాటు రెజీనా కాసాండ్రా, ఉర్వశి మరియు దునియా విజయ్ కాంబినేషన్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచింది. ఇది కూడా చదవండి: నటి దాడి కేసులో కీలక మలుపు: అతను.. ఆ... వీడియోస్ తీసాడా!   కుటుంబ ప్రేక్షకులు ఈ ఫాంటసీ డివైన్ కామెడీని చూడటానికి థియేటర్లకు తరలివస్తుండటంతో వీకెండ్ లో ఈ వసూళ్లు మరిన్ని రికార్డులను తిరగరాసే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి వాళ్ళ నమ్మకం ప్రకారమే రాబోయే రోజుల్లో నయనతార బాక్స్ ఆఫీస్ వద్ద ఏ మేర కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి. మీకు నచ్చవచ్చు :మహాశక్తి రివ్యూ  మీకు నచ్చవచ్చు :సీన్ మూవీ రివ్యూ    [Nayanthara Mahasakthi First Day Collections, Nayanthara Mahasakthi first day collections, Mahasakthi box office collection day 1, Mookuthi Amman 2 Day 1 collection, Mahasakthi Telugu occupancy report, Tollywood News, Tollywood, Telugu Cinema, Telugu Cinema News]  
Nitesh Tiwari's ambitious epic Ramayana, featuring Ranbir Kapoor, Sai Pallavi and Yash in lead roles, has crossed the Rs. 200 crore mark worldwide within two days of its theatrical release. The film has reportedly grossed Rs. 221.05 crore worldwide, marking a strong start for the two-part cinematic adaptation. However, the film witnessed a noticeable decline in domestic collections on its second day. After opening with Rs. 64.85 crore net in India on Thursday, November 5, the film collected approximately Rs. 48.05 crore net on Friday, registering a 25.9% drop. With this, the film's two-day India net collection stands at Rs. 112.90 crore, while the domestic gross has reached Rs. 134.80 crore. The overseas market contributed another Rs. 86.25 crore gross, taking the worldwide total to Rs. 221.05 crore.  The Hindi version continues to be the biggest contributor, collecting Rs. 35.50 crore on Day 2. The Kannada version added Rs. 5.15 crore, while the Telugu version contributed Rs. 4.75 crore. Tamil and Malayalam versions collected Rs. 1.50 crore and Rs. 1.15 crore respectively.  Also Read: Kamal turns Sandiyar and raises anticipation  Despite the second-day decline, crossing Rs. 200 crore worldwide in just 48 hours is a significant milestone. The film's performance over the weekend will be crucial in determining whether it can build on its opening and maintain momentum across markets. Produced by Namit Malhotra and directed by Nitesh Tiwari, Ramayana stars Ranbir Kapoor as Lord Rama, Sai Pallavi as Sita and Yash as Ravana. The film also features Ravi Dubey as Lakshman. Check Out: Yash scores a hat-trick of Rs.100 crore openers                      Shocking: Bomb threat for Amitabh's Jalsa Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
నటులకి సమాజంలో ఉండే గుర్తింపు తెలిసిందే. బయట ఎక్కడైనా అనుకోకుండా కనపడితే చాలు షేక్ హాండ్స్ ఇవ్వడం సెల్ఫీలు దిగడం లాంటివి అభిమానులు, ప్రేక్షకులు చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఆ నటులే తీవ్ర వివాదంలో చిక్కుకుంటే అవాక్కవయ్యి పూర్తి విషయాలని పిన్ టూ పిన్ గమనిస్తుంటారు. కేరళలోని కొచ్చి నగరంలో వెలుగుచూసిన నటుల సంచలన కేసు సినిమా కథను తలపించేలా అనూహ్యమైన మలుపులు తిరుగుతోంది. ప్రముఖ నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ జాన్సన్ కే. వర్గీస్ పై నటి అథుల్య చంద్ర మరియు ఆమె సహచరులు చేసిన దాడి, ఆపై వెలుగులోకి వచ్చిన దారుణమైన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ మొత్తం ఉదంతంలో పోలీసుల దర్యాప్తులో ఒక్కొక్కటిగా బయటపడుతున్న నిజాలు అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి. ఈ నెల  2వ తేదీ సాయంత్రం సుమారు 6:30 గంటల ప్రాంతంలో కొచ్చిలోని ఎస్సెస్ స్ప్రింగ్‌డేల్ అపార్ట్‌మెంట్స్‌కు రమ్మంటూ డాక్టర్ జాన్సన్‌కు అత్యవసర వైద్య సహాయం కావాలనే నెపంతో ఫోన్ కాల్ వచ్చింది. నటి అథుల్య చంద్ర కుటుంబానికి డాక్టర్‌గా పరిచయం ఉండటంతో, ఆమె మేనత్త ఆరోగ్యం బాగాలేదని చెప్పగానే డాక్టర్ వెంటనే ఆ ఫ్లాట్‌కు వెళ్లారు.   కానీ అక్కడికి వెళ్లిన తర్వాతే అసలు మోసం బయటపడింది. ఆ ఫ్లాట్‌లో నటి అథుల్య చంద్ర, నటుడు అలాగే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ బిబిన్ పెరుంపిళ్లైతో పాటు మరో 12 మంది వ్యక్తులు సిద్ధంగా ఉన్నారు.అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లగానే డాక్టర్‌ను బలవంతంగా కుర్చీలో కూర్చోబెట్టి, గదిలో బందీగా ఉంచి భయానక వాతావరణం సృష్టించారు. అంతేకాకుండా, డాక్టర్ వద్ద నుండి రెండు మొబైల్ ఫోన్లు, ఒక వాచ్, ఇయర్‌పాడ్స్ వంటి విలువైన వస్తువులను బలవంతంగా లాక్కున్నారు. ఇది కూడా చదవండి :సీన్ మూవీ ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్!   ఈ వివాదాన్ని రాజీ చేసుకోవాలంటే ఏకంగా 6 కోట్లు డిమాండ్ చేశారని, డబ్బులు ఇవ్వకపోతే ఆయనకు సంబంధించిన వ్యక్తిగత ప్రైవేట్ ఫోటోలు మరియు చాట్‌లను సోషల్ మీడియాలో లీక్ చేస్తామని తీవ్రంగా బెదిరించినట్లు డాక్టర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ బెదిరింపుల నేపథ్యంలో తీవ్ర మనోవేదనకు గురైన డాక్టర్ జాన్సన్, రెండు రోజుల తర్వాత కడవంత్రా పోలీసులను ఆశ్రయించి అధికారికంగా ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసులో వెంటనే స్పందించి నటి అథుల్య చంద్ర, బిబిన్ పెరుంపిళ్లై మరియు కె.బి. విష్ణులతో సహా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ కేసు ఇంకా విచారణ దశలో ఉండగానే, ఈ ఉదంతం మరో కొత్త మలుపు తిరిగింది. అరెస్టయిన నటి తరఫు బంధువైన మరో మహిళ ఇన్ఫోపార్క్ పోలీసులను ఆశ్రయించి డాక్టర్ జాన్సన్‌పై ప్రతిఘటనగా తీవ్రమైన బలాత్కార ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేశారు. గతేడాది నగరంలోని ఇన్ఫోపార్క్ సమీపంలో ఉన్న ఒక హోటల్‌లో డాక్టర్ జాన్సన్ తనకు మద్యం తాగించి, స్పృహ కోల్పోయిన తర్వాత లైంగిక దాడికి పాల్పడ్డారని ఆ మహిళ తన ఫిర్యాదులో ఆరోపించారు. అంతేకాకుండా, ఆ సమయంలో తన అశ్లీల చిత్రాలను డాక్టర్ రహస్యంగా రికార్డు చేశారనే అనుమానం ఉందని కూడా ఆమె పేర్కొన్నారు. ఈ తాజా ఫిర్యాదు ఆధారంగా ఇన్ఫోపార్క్ పోలీసులు డాక్టర్ జాన్సన్‌పై కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఈ మొత్తం ఘటనలో హానీట్రాప్ కోణం, బ్లాక్‌మెయిల్ వ్యూహం దాగి ఉన్నాయా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లను ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం ప్రత్యేక బృందాలు పంపించాయి. కేరళ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన ఈ కేసులో పరారీలో ఉన్న మిగతా 9 మంది నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఒకవైపు డాక్టర్ ఇచ్చిన దోపిడీ, కిడ్నాప్, బెదిరింపుల కేసు... మరోవైపు నటి బంధువు ఇచ్చిన అత్యాచార ఆరోపణల కేసుతో ఈ ఉదంతం ఇటు సినీ వర్గాలలోనూ, అటు సాధారణ ప్రజలలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మీకు నచ్చవచ్చు :రామాయణ మూవీ రివ్యూ  మీకు నచ్చవచ్చు :మహాశక్తి మూవీ రివ్యూ  [Malayalam Actors Doctor Attack Rape Case Twist, Kochi doctor assault case, Malayalam actress arrested, Athulya Chandra, Dr Johnson Varghese, Tollywood News, Tollywood, Telugu Cinema, Telugu Cinema News]  
  వరుస సూపర్ హిట్ హ్యాట్రిక్స్ తో పాన్ ఇండియా వ్యాప్తంగా క్రేజీ టాక్ గా మారాడు సూర్య.  నిన్న విడుదలైన 'సీన్' కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఎనామస్ గా హిట్ టాక్ వస్తుంది. ఇక అభిమానుల ఆనందం గురించి అయితే చెప్పక్కర్లేదు. ఇది మా సూర్య రేంజ్ ఈ  దీపావళి సరికొత్త కాంతులని తెచ్చిందని  సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఫస్ట్ డే ఎంత రాబట్టిందో చూద్దాం. ట్రేడ్ నివేదికల ప్రకారం  తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా  34.25 కోట్ల గ్రాస్ వసూళ్లని సాధించి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డునెలకొల్పింది. ఇండియా గ్రాస్ కలెక్షన్లు 22.25 కోట్లు కాగా  ఓవర్సీస్ మార్కెట్‌12 కోట్ల గ్రాస్. దీంతో మరో సారి వరల్డ్ బాక్స్ ఆఫీస్ వద్ద సూర్య స్టామినా ఏ పాటిదో తెలియచేసినట్లయింది. తమిళనాడు రాష్ట్రంలోనే తొలిరోజు ముందస్తు టికెట్ల రూపంలో  9.6 కోట్ల వసూళ్లు రావడం సూర్యా స్టార్‌డమ్‌కు నిదర్శనం.తమిళనాడులో ముఖ్యంగా చెన్నై నగరంలో 834 షోలకు గాను 72.3 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఇది కూడా చదవండి: మహాశక్తి మూవీ రివ్యూ  అలాగే తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ నగరంలో 287 షోలలో 60.8 శాతం ఆక్యుపెన్సీ నమోదవ్వగా, విశాఖపట్నం (69.0%) మరియు విజయవాడ (61.8%) నగరాల్లో అత్యధిక ఆక్యుపెన్సీ రేటు నమోదైంది. తొలిరోజు దక్కిన పాజిటివ్ టాక్, వీకెండ్ బుకింగ్స్ వేగవంతంగా సాగుతుండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరిన్ని భారీ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగు వెర్షన్ 15.7 శాతం వాటాతో  3.00 కోట్ల నెట్ వసూళ్లు. జితు మాధవన్ దర్శకుడు కాగా నజ్రియా హీరోయిన్. మీకు నచ్చవచ్చు :రామాయణ ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్  మీకు నచ్చవచ్చు : సాయి దుర్గ తేజ్ ఎంగేజ్మెంట్    [scene Movie First Day collections, Scene Movie First Day Box Office Collections, Suriya Scene Worldwide Opening Day Collection, Scene Movie India Net Collection, Tollywood, Tollywood News, Telugu Cinema, Telugu Cinema News]    
‘హనుమాన్‌’, ‘మిరాయ్‌’ సినిమాలతో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో తేజ సజ్జా త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఇప్పటికే తన పెళ్లి విషయాన్ని స్వయంగా వెల్లడించిన ఆయన, ఇప్పుడు తన జీవితంలో కీలకమైన వేడుకకు సంబంధించిన ఆహ్వానాలను అందించే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తేజ సజ్జా తన నిశ్చితార్థ ఆహ్వానాన్ని అందించారు.  తేజ సజ్జా వివాహం పెద్దలు కుదిర్చిన సంబంధమని గతంలోనే స్పష్టం చేశారు. తన తల్లిదండ్రులు చూసిన అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యానని వెల్లడించారు. నవంబర్‌లో నిశ్చితార్థం, డిసెంబర్‌లో వివాహ వేడుక జరగనున్నట్లు తెలిపారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లిని నిర్వహించాలనుకుంటున్నట్లు చెప్పారు. పెళ్లిని భారీ హంగామాతో కాకుండా ప్రైవేట్‌ వేడుకగా జరుపుకోవాలనేది తన అభిమతమని కూడా పేర్కొన్నారు. ఇక తేజ సజ్జా చేసుకోబోయే అమ్మాయి సినీ పరిశ్రమకు చెందిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాదని ఆయన వెల్లడించారు. ఆమె కుటుంబం టెక్నాలజీ వ్యాపారంలో ఉందని, ఆమె తన తండ్రితో కలిసి ఆ వ్యాపారంలో పనిచేస్తున్నారని చెప్పారు. అమెరికాలో పెరిగిన ఆమెకు సినిమా రంగంతో పెద్దగా పరిచయం లేదని, అదే తనకు నచ్చిందని తేజ తెలిపారు. అయితే కాబోయే భార్య పేరును మాత్రం వెల్లడించలేదు. ఆమె వ్యక్తిగత గోప్యతను కాపాడాలనే ఉద్దేశంతోనే వివరాలను పరిమితంగా పంచుకున్నారు. నవంబర్‌లో నిశ్చితార్థం, డిసెంబర్‌లో ఉదయ్‌పూర్‌లో వివాహం, ఆ తర్వాత హైదరాబాద్‌లో రిసెప్షన్‌ నిర్వహించేలా ప్రణాళిక ఉన్నట్లు తేజ గతంలో వెల్లడించారు. మరి ఈ వేడుకకు టాలీవుడ్‌ నుంచి ఎవరెవరు హాజరవుతారు? తేజ సజ్జా పెళ్లి వేడుకలు ఎలా జరగబోతున్నాయి? అన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.     [Teja Sajja Engagement, Teja Sajja Wedding, Revanth Reddy, Teja Sajja Engagement Invitation, Teja Sajja Udaipur Wedding, HanuMan Hero, Teja Sajja Bride, Telugu Cinema News]
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
జీవితంలో ఎవరికైనా హార్ట్ అటాక్ లేదా గుండెపోటు వచ్చినప్పుడు మొదటి ఐదు నిమిషాలు ప్రాణాలను కాపాడటంలో అత్యంత కీలకమైనవిగా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండెకు రక్తప్రసరణకు అడ్డంకి ఏర్పడినప్పుడు బాధితుడిలో తీవ్రమైన ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చల్లటి చెమటలు, వికారం, చేతులు లేదా దవడలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సంక్షోభ సమయంలో చాలామంది ఏం చేయాలో తెలియక ఆందోళన చెంది అమూల్యమైన సమయాన్ని వృథా చేస్తుంటారు. కానీ, అంబులెన్స్ వచ్చే వరకు చేసే చిన్నపాటి జాగ్రత్తలు కూడా బాధితుడి ప్రాణాలను నిలబెట్టడంలో అద్భుతంగా సహాయపడతాయి. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు మరియు మధుమేహం ఉన్నవారిలో ఛాతీ నొప్పి లేకుండానే ఇతర లక్షణాలు కనిపించే అవకాశం ఉన్నందున, అనుమానం వచ్చిన క్షణంలోనే అప్రమత్తం కావడం చాలా ముఖ్యమైన విషయమని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎవరికైనా గుండెపోటు లక్షణాలు కనిపించిన వెంటనే చేయవలసిన మొదటి మరియు అత్యంత ముఖ్యమైన పని భారతదేశంలో అత్యవసర సేవల నంబర్లయిన 108 లేదా 112కు కాల్ చేసి అంబులెన్స్‌ను పిలవడం. నొప్పి በటానంతట అదే తగ్గుతుందేమోనని ఎదురుచూడకుండా ఉండాలి. బాధితుడిని సొంత వాహనంలో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయడం కంటే అత్యవసర సిబ్బందిని పిలవడం మంచిది, ఎందుకంటే అంబులెన్స్ సిబ్బంది దారిలోనే అవసరమైన ప్రాథమిక వైద్య సహాయం ప్రారంభించగలరు. అంబులెన్స్ వచ్చే వరకు బాధితుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ నడవనివ్వకూడదు. శారీరక శ్రమను పూర్తిగా నిలిపివేసి, వీలైనంత సౌకర్యంగా కూర్చోబెట్టాలి లేదా వెనుకకు తగిన ఆధారం ఇచ్చి విశ్రాంతి తీసుకునేలా చూడాలి. అలాగే బాధితుడి శరీరంపై బిగుతుగా ఉన్న దుస్తులు, టై వంటి వాటిని వదులుగా చేయాలి. బాధితుడిని ఒక్క క్షణం కూడా ఒంటరిగా వదిలిపెట్టకుండా పక్కనే ఉంటూ వారి స్పృహ మరియు శ్వాసలో ఏవైనా మారుతున్నాయా అని నిరంతరం గమనిస్తూ ఉండాలి. ఒకవేళ బాధితుడు అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి, సాధారణంగా శ్వాస తీసుకోకపోతే అది ప్రాణాంతకమైన కార్డియాక్ అరెస్ట్ లక్షణం కావచ్చని గుర్తించాలి. వెంటనే అత్యవసర సేవల సిబ్బందికి సమాచారం అందించి, సీపీఆర్ (CPR) ప్రక్రియను ప్రారంభించాలి. సీపీఆర్ శిక్షణ పొందిన వారు ఛాతీ మధ్య భాగంలో రెండు చేతులను ఒకదానిపై మరొకటి ఉంచి గట్టిగా, నిమిషానికి 100 నుంచి 120 సార్లు చొప్పున వేగంగా కంప్రెషన్లు ఇవ్వాలి. పెద్దవారిలో ఈ విధంగా ఛాతీని నొక్కడం వల్ల మెదడుతోపాటు ఇతర ముఖ్యమైన అవయవాలకు రక్తప్రసరణ నిరంతరం కొనసాగుతుంది. ఇది కూడా చదవండి: కేలరీలు తక్కువ.. పోషకాలు ఎక్కువ: పాలకూర ఇడ్లీ స్పెషల్ రెసిపీ! శిక్షణ లేని వ్యక్తులు కూడా అత్యవసర సేవల ఫోన్ లైన్ ద్వారా ఇచ్చే సూచనలను శ్రద్ధగా పాటిస్తూ హ్యాండ్స్-ఓన్లీ CPR అందించవచ్చు. ఒకవేళ అందుబాటులో AED (Automated External Defibrillator) యంత్రం ఉంటే దానిని తెచ్చి, అందులోని వాయిస్ సూచనలను అనుసరించి వైద్య సిబ్బంది వచ్చే వరకు అమర్చాలి. గుండెపోటు వచ్చిన వ్యక్తికి ఎలాంటి ఇంటి చిట్కాలు చేయడం, నీళ్లు లేదా ఆహారం తాగించడం వంటివి చేయకూడదు. బాధితుడు స్పృహ కోల్పోయినప్పుడు నోట్లో నీళ్లు లేదా మాత్రలు బలవంతంగా వేయడం ఊపిరితిత్తులలోకి ద్రవాలు వెళ్లేలా చేసి మరింత ప్రమాదకరంగా మారుతుంది. డాక్టర్ల సలహా లేదా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలాంటి మందులను కూడా సొంతంగా ఇవ్వకూడదని గుర్తుంచుకోవాలి. గుండెపోటు సమయంలో గుండె కండరాలకు రక్తప్రసరణ ఎంత త్వరగా పునరుద్ధరిస్తే, ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. సరైన సమయంలో స్పందించి సరైన పద్ధతులు పాటించడం వల్ల గుండె కండరాలకు జరిగే నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. బాధితుడిని ఎటైనా నడిపించడం, మెట్లు ఎక్కించడం లేదా అనవసరమైన శారీరక శ్రమకు గురిచేయడం ప్రాణాలకే ముప్పు తెస్తుంది. కేవలం ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తూ, మానసిక ధైర్యాన్ని నింపుతూ అంబులెన్స్ వచ్చే వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎంతోమంది ప్రాణాలను విజయవంతంగా కాపాడవచ్చు. అత్యవసర సమయాల్లో ఇటువంటి ప్రాథమిక విషయాలపై ప్రతి ఒక్కరికీ కచ్చితమైన అవగాహన ఉండటం అత్యంతావశ్యకం. మీకు నచ్చవచ్చు: రోగ నిరోధక శక్తిని పెంచే, హెల్దీ మొలకల చాట్ రెసిపీ! పాలు, బాదం కంటే శక్తినిచ్చే పొద్దుతిరుగుడు గింజల అద్భుత లాభాలు!       Heart Attack First Aid, Emergency Life Saving Steps, Cardiac Arrest Response, Recognize Heart Attack Symptoms, Medical Emergency Tips, Doctor Health Advice, Health Tips In Telugu.
చాలా మంది రాత్రి సమయంలో పడుకునే ముందు లేదా అర్ధరాత్రి పూట తమ పాదాల అరికాళ్ళలో తీవ్రమైన మంట, భరించలేని వేడి, మరియు దురద వంటి చికాకులను విపరీతంగా అనుభవిస్తుంటారు. వైద్య ప్రపంచంలో ఈ విచిత్రమైన మరియు బాధాకరమైన పరిస్థితిని  బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్  అని పిలుస్తారు. ఇది కేవలం వాతావరణ వేడి వల్ల లేదా రోజంతా తిరిగినడవడం వల్ల వచ్చే సాధారణ అలసట మాత్రమే కాదు. శరీరంలో అంతర్గతంగా తలెత్తుతున్న కొన్ని ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలకు ఇది ఒక స్పష్టమైన హెచ్చరిక సంకేతం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాదాలలో ఈ రకమైన మంట మరియు చికాకు రావడానికి అత్యంత ప్రధానమైన కారణాలలో అదుపులో లేని మధుమేహం మొదటి స్థానంలో ఉంది. రక్తంలో చక్కెర స్థాయిలు తీవ్రంగా హెచ్చుతగ్గులకు గురైనప్పుడు, అది శరీరంలోని సున్నితమైన నరాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. దీనివల్ల  డయాబెటిక్ న్యూరోపతి  అనే అనారోగ్య పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్య ఉన్నవారికి నరాల పనితీరు మందగించి, పాదాల అరికాళ్ళలో సూదులతో గుచ్చినట్లుగా నొప్పి, తిమ్మిరి, తీవ్రమైన వేడి మరియు దురద వంటి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. మధుమేహంతో పాటు శరీరంలో పోషకాల లోపం కూడా ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. ముఖ్యంగా మన శరీరంలో నరాల ఆరోగ్యానికి అత్యంతావసరమైన విటమిన్ బి12 లోపించినప్పుడు నరాల బలహీనత ఏర్పడుతుంది.  ఈ విటమిన్ లోపం కారణంగా వచ్చే నరాల బలహీనత నరాల చికాకుగా మారి పాదాలలో తీవ్రమైన మంటను కలిగిస్తుంది. కేవలం పోషకాల లోపమే కాకుండా, థైరాయిడ్ గ్రంధి పనితీరు తక్కువగా ఉండటం, అలాగే మూత్రపిండాల వైఫల్యం లేదా కిడ్నీ రుగ్మతల కారణంగా శరీరంలో పేరుకుపోయే వ్యర్థ విషపదార్థాలు కూడా నరాలను దెబ్బతీసి ఈ చికాకుకు కారణమవుతాయి. ఇది కూడా చదవండి:బిల్వ ఆకులతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. ఎవరికి మేలు? ఎవరికి డేంజర్? అలాగే, అధికంగా మద్యం సేవించే అలవాటు ఉన్నవారిలో కూడా ఈ సమస్య అధికంగా కనిపిస్తుంటుంది. క్రమం తప్పకుండా అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం నేరుగా నరాలను బలహీనపరుస్తుంది. దీనివల్ల పాదాలలో తిమ్మిర్లు రావడంతో పాటు సూదితో గుచ్చినట్లుగా తీవ్రమైన నొప్పి, వేడి అనుభూతి కలుగుతాయి. ఈ రకమైన లక్షణాలు శరీరంలో నాడీ వ్యవస్థ దెబ్బతింటుందనడానికి సంకేతంగా భావించాలి. ఈ అనారోగ్య లక్షణాలను ఎట్టి పరిస్థితులలోనూ తేలికగా తీసుకోవడం గానీ, సొంత వైద్యం చేసుకోవడం గానీ చేయకూడదు. రాత్రిపూట పాదాలలో మంట మరియు దురద వంటి సమస్యలు తరచూ వేధిస్తుంటే, వెంటనే వైద్యులను సంప్రదించి అవసరమైన రక్త పరీక్షలు మరియు నరాల పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. సరైన సమయంలో సమస్య మూలాలను గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం ద్వారా మాత్రమే భవిష్యత్తులో వచ్చే పెను ముప్పుల నుండి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మీకు నచ్చవచ్చు:లిపిడ్ ప్రొఫైల్, అంటే ఏమిటి? గుండెను కాపాడుకునే సులభమైన మార్గం! భారతదేశానికి ,జంబుద్వీపం అనే పేరు ఎలా వచ్చింది? ఆసక్తికరమైన చరిత్ర!       Burning Feet At Night, Itchy Feet Causes, Nighttime Foot Discomfort, Nerve Health Warnings, Medical Reasons For Foot Burning, Doctor Health Advice, Health Tips In Telugu.  
చాలామందికి ఉదయం నిద్రలేవగానే వేడివేడి టీ లేదా కాఫీ తాగడం ఒక అలవాటుగా ఉంటుంది. కొందరైతే కప్పులో నుంచి ఆవిరి వస్తున్నప్పుడే ఆస్వాదిస్తూ తాగుతుంటారు. టీ చల్లారిపోతే రుచి తగ్గుతుందని, వేడిగా ఉంటేనే బాగుంటుందని భావిస్తారు. అయితే ఇలా మరీ వేడిగా ఉన్న పానీయాలను ప్రతిరోజూ తాగే అలవాటు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపవచ్చని తాజా వైద్య పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా ఆహారాన్ని నోటి నుంచి కడుపులోకి తీసుకెళ్లే అన్నవాహికపై ఈ అధిక వేడి తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. టీ లేదా కాఫీ తాగడమే ఇక్కడ అసలు సమస్య కాదు, వాటిని ఎంత వేడిగా తాగుతున్నామన్నదే ముఖ్యం. పదేపదే అత్యధిక ఉష్ణోగ్రత ఉన్న పానీయాలను తీసుకోవడం వల్ల అన్నవాహిక లోపలి పొర దెబ్బతింటుంది. కాలక్రమేణా ఇది ప్రాణాంతక క్యాన్సర్ ప్రమాదంతో ముడిపడి ఉండవచ్చని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అసలు ఎంత ఉష్ణోగ్రత ఉన్న పానీయాలు ప్రమాదకరం, ఆహార నాళానికి నష్టం ఎలా కలుగుతుంది అనే విషయాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం చాలా అవసరం. మన నోటి నుంచి ఆహారం, ద్రవాలను కడుపులోకి చేరవేసే కండరాలతో కూడిన గొట్టంలాంటి భాగాన్ని అన్నవాహిక లేదా ఈసోఫేగస్ అంటారు. దీని లోపలి ఉపరితలంపై సున్నితమైన శ్లేష్మ పొర ఉంటుంది, ఇది అన్నవాహికను రక్షిస్తుంది. మనం పదేపదే మరీ వేడిగా ఉన్న టీ, కాఫీలను తాగినప్పుడు ఆ తీవ్రమైన వేడి ఈ రక్షణ పొరను తీవ్రంగా గాయపరుస్తుంది. శరీరం దెబ్బతిన్న కణాలను తిరిగి బాగు చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ, తరచూ అధిక వేడికి గురికావడం వల్ల కణాలు దెబ్బతినడం, వాపు రావడం పదేపదే జరుగుతుంది. దీర్ఘకాలంలో కణాల్లో అసాధారణ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిధిలోని అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధనా సంస్థ (IARC) 65 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న పానీయాలను తాగడాన్ని మానవులకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్న అంశంగా వర్గీకరించింది. దీనిని గ్రూప్ 2A కింద పేర్కొన్నారు. అంటే అత్యంత వేడి పానీయాలు అన్నవాహిక పొలుసుల కణ క్యాన్సర్‌తో సంబంధం కలిగి ఉండవచ్చని పరిశోధనల్లో ఆధారాలు ఉన్నాయి. అయితే 65 డిగ్రీలు దాటిన పానీయం ఒక్కసారి తాగినంత మాత్రాన క్యాన్సర్ రాదని, పదేపదే ఆ అలవాటు ఉండటమే ప్రమాదకరమని వైద్యులు తేల్చిచెప్పారు. ఇది కూడా చదవండి:పరగడుపున, టీ లేదా కాఫీ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి! ఈ విషయాలు తెలిసిన తర్వాత చాలామందికి టీ, కాఫీలు పూర్తిగా మానేయాలా అనే సందేహం కలుగుతుంది. కానీ అలా చేయాల్సిన అవసరం లేదు; ప్రధాన సమస్య టీ, కాఫీలలో ఉండే పదార్థాలు కాదు, వాటిని అత్యంత వేడిగా తాగడమే. కాబట్టి పానీయం తయారు చేసిన వెంటనే తాగకుండా కొద్దిసేపు చల్లారనివ్వాలి. నోరు, నాలుక లేదా గొంతు కాలేంత వేడిగా ఉన్నప్పుడు తీసుకోకుండా, మీకు సౌకర్యంగా అనిపించేంత వెచ్చగా మారిన తర్వాతే తాగడం ఎప్పుడూ శ్రేయస్కరం. మరీ వేడిగా ఉండే పానీయాలు ఒక్కటే అన్నవాహిక క్యాన్సర్‌కు కారణం కావు. పొగాకు వినియోగం, మద్యపానం ఈ క్యాన్సర్‌కు గుర్తించిన ఇతర ముఖ్యమైన ప్రమాద కారకాలు. వయస్సు పెరగడం, దీర్ఘకాలికంగా యాసిడ్ రిఫ్లక్స్ సమస్య ఉండటం కూడా ముప్పును పెంచుతాయి. ఆహారం మింగడంలో ఇబ్బంది కలగడం, కారణం తెలియకుండా బరువు తగ్గడం లేదా ఛాతీలో నిరంతర నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు నచ్చవచ్చు:లిపిడ్ ప్రొఫైల్, అంటే ఏమిటి? గుండెను కాపాడుకునే సులభమైన మార్గం!              గుండె వేగం, సాధారణంగా ఉన్నా పక్షవాతం రావచ్చా? వైద్యులు హెచ్చరిస్తున్న విషయాలివే!         Hot Tea And Coffee Risks, Dangers Of Scalding Hot Drinks, Health Warning Hot Beverages, Esophageal Health Tips, Coffee And Tea Side Effects, Doctor Health Advice, Health Tips In Telugu.
మలబద్ధకం సమస్యతో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. సరిగ్గా మలవిసర్జన కాకపోవడం, మలం గట్టిగా రావడం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రోజువారీ జీవితాన్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. ఇలాంటి సమస్యలకు సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు ఎంతో ఉపయోగపడతాయి. ఈ వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ మలబద్ధకం సమస్యకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను వివరించారు. వాము, బెల్లం, కరక్కాయ పెచ్చుల వంటి సహజ పదార్థాల ఉపయోగాలు, జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో వాటి పాత్ర గురించి తెలియజేశారు. మలబద్ధకం సమస్యకు కారణాలు ఏమిటి? పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి? మలవిసర్జన సాఫీగా జరిగేందుకు ఎలాంటి ఆహారపు అలవాట్లు పాటించాలి? వాము, బెల్లం, కరక్కాయలను ఎలా ఉపయోగించాలి? మలబద్ధకం సమస్యను తగ్గించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. సహజమైన పద్ధతులతో జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారికి ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది. మలబద్ధకం సమస్య తరచూ వేధిస్తున్నా, తీవ్రమైన కడుపునొప్పి లేదా మలంలో రక్తం కనిపించినా వైద్యులను సంప్రదించడం అవసరం. మలబద్ధకం సమస్యకు ఆయుర్వేదంలో సూచించే సహజ పరిష్కారాలు, వాము, బెల్లం, కరక్కాయ పెచ్చుల ఉపయోగాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
నేటి కాలంలో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్ లు, కంప్యూటర్లు మన దైనందిన జీవితంలో ప్రధాన భాగమైపోయాయి. ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు స్క్రీన్ వైపు చూడటం చాలా మందికి అలవాటుగా మారిపోయింది. సోషల్ మీడియా వాడకం, ఆఫీస్ పని లేదా వినోదం కోసం గంటల తరబడి డివైజ్‌ల ముందే గడపడం సర్వసాధారణం అయింది. ఈ నేపథ్యంలో స్క్రీన్ టైమ్ ఎక్కువైతే దుష్పభావాలు ఉంటాయని వైద్యులు కూడా చెబుతున్నారు. అయితే తాజాగా..  ఈ విషయం గురించి  వైద్య నిపుణులు , పరిశోధకులు చెబుతున్న విస్తుపోయే నిజాలేంటో వివరంగా తెలుసుకుంటే.. నిపుణుల అభిప్రాయం ప్రకారం కేవలం స్క్రీన్ ముందు గంటల తరబడి కూర్చోవడం వల్ల నేరుగా పక్షవాతం వస్తుందని చెప్పలేము. అయితే ఎక్కువ సమయం స్క్రీన్ చూస్తూ గడపడం అనేది ఒక రకమైన నిశ్చల జీవన శైలితో ముడిపడి ఉంటుంది. ఈ విధంగా శారీరక శ్రమ లేకుండా రోజంతా ఒకే చోట కూర్చునే అలవాటు వల్ల క్రమంగా అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా బరువు పెరగడం, హై బ్లడ్ ప్రెషర్, మధుమేహం , చెడు కొలెస్ట్రాల్  వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నీ కూడా పక్షవాతం ముప్పును పెంచే ప్రధాన కారణాలలో ముఖ్యమైనవిగా వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అమెరికన్ స్ట్రోక్  అసోసియేషన్  కు చెందిన జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం అరవై  సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న వారు రోజులో కనీసం ఎనిమిది గంటల పాటు శారీరక శ్రమ లేకుండా కేవలం కూర్చునే పనులలో  గడిపితే, వారిలో పక్షవాతం వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుందని తేలింది. అయితే ఇది నేరుగా స్క్రీన్ వల్ల జరిగే నష్టం కాకపోయినా, ఎక్కువ సమయం కదలకుండా కూర్చునే స్వభావం వల్ల కలిగే దుష్పరిణామం అని పరిశోధకులు పేర్కొంటున్నారు. కాబట్టి స్క్రీన్ చూసే గంటలను మాత్రమే లెక్కగట్టి ప్రమాదాన్ని అంచనా వేయలేము. ఎందుకంటే రోజంతా కంప్యూటర్ ముందు పని చేసే వ్యక్తి క్రమం తప్పకుండా వ్యాయాయం చేస్తుంటే, అస్సలు శారీరక శ్రమ లేని వ్యక్తితో పోలిస్తే అతనిలో ప్రమాదం కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే రాత్రి సమయాల్లో ఎక్కువ సేపు మొబైల్ లేదా ల్యాప్టాప్ వాడటం వల్ల నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. నిద్రలేమి సమస్య ఏర్పడినప్పుడు అది రక్తపోటును , జీవక్రియలను నియంత్రించడం కష్టం చేస్తుంది. దీనివల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా హైపర్ టెన్షన్, డయాబెటిస్, ఊబకాయం , గుండె జబ్బులు ఉన్నవారు తమ ఆరోగ్యం పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అధిక రక్తపోటు అనేది పక్షవాతానికి దారితీసే అత్యంత ముఖ్యమైన కారకాల్లో ఒకటి కాబట్టి, బీపీని ఎప్పుడూ అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. యువత కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పక్షవాతం కేవలం వృద్ధులలోనే వస్తుందని అనుకోవడం  పొరపాటు. మారుతున్న జీవన శైలి కారణంగా నేడు యువతలో కూడా ఇలాంటి ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. అయితే ఉద్యోగరీత్యా లేదా చదువురీత్యా ఎప్పుడూ స్క్రీన్ ముందు పనిచేయాల్సిన వారు పూర్తిగా డివైజ్ లను పక్కన పెట్టడం సాధ్యం కాదు. అలాంటి వారు కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. జాగ్రత్తలు.. రోజూ గంటల తరబడి ఒకే చోట కదలకుండా కూర్చోకుండా మధ్యమధ్యలో చిన్న బ్రేక్ లు  తీసుకోవడం మంచిది. కుర్చీలోంచి లేచి కొద్దిసేపు నడవడం, ఫోన్ మాట్లాడేటప్పుడు గదిలో తిరగడం, అలాగే రోజూవారీ జీవితంలో తగినంత శారీరక శ్రమ ఉండేలా చూసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెద్దలు ప్రతి వారం కనీసం నూట యాభై నిమిషాల పాటు ఏదైనా వ్యాయామం లేదా నడక వంటి శారీరక కార్యకలాపాలు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.  వీటితో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, పొగత్రాగడం వంటి అలవాట్లకు దూరంగా ఉండటం , ప్రశాంతమైన నిద్ర  చాలా అవసరం. గుర్తుంచుకోవాల్సిన విషయం.. కేవలం స్క్రీన్ టైమ్ తగ్గించడం వల్ల మాత్రమే పక్షవాతం రాకుండా నివారించలేము. ముఖ్యంగా బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు వాటిని అదుపులో ఉంచుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పక్షవాతం బారిన పడకుండా ఉండాలంటే శరీరానికి తగిన వ్యాయామం ఇస్తూ, ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం ఎంతో ముఖ్యం. ఒకవేళ ఎవరికైనా ముఖం ఒకవైపు వంకరపోవడం, శరీరంలో అకస్మాత్తుగా బలహీనత రావడం, మాట తడబడటం, చూపు మందగించడం లేదా విపరీతమైన తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.                                                                                                                                          *రూపశ్రీ*