LATEST NEWS
  నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..! తనను వద్దు అని చెప్పే అధికారం నాకు లేదు.. తన జీవితం తన ఇష్టం..! ఢిల్లీ మీడియా చిట్‌చాట్‌లో మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో స్పందించారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనపై చర్యలు తీసుకోవద్దని కోరారు. మహిళలు స్వతంత్రంగా బతకాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చెబుతున్నారని, తన కుమార్తె మాట్లాడిన అంశానికి తనను బాధ్యురాలిని చేయడం సరికాదని అన్నారు. తనపై చర్యలు తీసుకుంటే బీసీలు ఏకమవుతారని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. “నా బిడ్డ మాట్లాడితే నాకు ఎందుకు శిక్ష వేస్తారు..? నా కూతురు మాట్లాడిన దానికి నాపై చర్యలు తీసుకోవద్దు” అని ఆమె పేర్కొన్నారు. నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది. ఆమెను వద్దని చెప్పే అధికారం నాకు లేదు.. తన జీవితం తన ఇష్టం అని మంత్రి కొండా సురేఖ అన్నారు. తాను బీసీ మహిళా మంత్రినని.. తన భర్త మున్నూరు కాపు, తాను పద్మశాలి కులానికి చెందినవారినని తెలిపారు. తమ కులానికి 16 శాతం ఓట్లు ఉన్నాయని పేర్కొన్నారు. తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని స్పష్టం చేశారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండానే తన శాఖను సమర్థంగా నిర్వహిస్తున్నానని అన్నారు. ఒకవైపు కర్ణాటక కాంగ్రెస్‌లో ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా లేరంటూ ఆందోళన జరుగుతోందని.. మరోవైపు తనపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తనపై ప్రెస్‌మీట్లు పెట్టిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వెనుక ఎవరున్నారో తనకు తెలుసని కొండా సురేఖ అన్నారు. అధిష్ఠానం కూడా ఈ విషయాలను ఆలోచించాలని సూచించారు. మీనాక్షి మేడంకు తాను చెప్పాల్సిందంతా చెప్పానని తెలిపారు. తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం తప్పని అన్నారు. తనపై ఏమైనా చర్యలు తీసుకోవాలంటే ఏఐసీసీనే తీసుకోవాలని.. తాను ఏఐసీసీ సభ్యురాలినని కొండా సురేఖ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కే.సీ. వేణుగోపాల్‌ అపాయింట్‌మెంట్‌ తనకు దొరకలేదని తెలిపారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశానని, తనపై వచ్చిన అంశాలపై ఆయనకు వివరణ ఇచ్చానని చెప్పారు.“ నాపై చర్యలు తీసుకునే ముందు సీఎం రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలి” అని కొండా సురేఖ అన్నారు. పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్‌రెడ్డి ఎలా చెబుతారని ప్రశ్నించారు. అలాగే మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, భట్టి విక్రమార్క భార్యకు సంబంధించిన కమీషన్ల అంశాలపై కూడా చాలా ఫిర్యాదులు వచ్చాయని ఆమె వ్యాఖ్యానించారు.  “ఆ ఫిర్యాదులపై ఎందుకు మాట్లాడటం లేదు?” అని ప్రశ్నించారు. చాలామంది రెడ్లు మాట్లాడిన సందర్భాల్లో వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కొండా సురేఖ ప్రశ్నించారు. తన విషయంలో మాత్రమే చర్యల అంశాన్ని తెరపైకి తీసుకురావడం ఏమిటని ఆమె నిలదీశారు. మంత్రి కొండా సురేఖ తాజా వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత విభేదాలు, నేతల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలపై మరోసారి చర్చకు దారితీశాయి.   Konda Surekha Delhi visit, CM Revanth Reddy, Congress high command, AICC Mallikarjun Kharge, Konda Susmita comments, Telangana cabinet reshuffle 2026, Telangana politics news, K.C. Venugopal, Meenakshi Natarajan
  ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..! మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై చర్యలు తీసుకునే ముందు సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని షాకింగ్ కామెంట్స్ చేశారు. పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రి అని రేవంత్ చెప్పుకోవడం మంత్రులు, నేతలు అసంతృప్తిగా ఉన్నారని హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయం ఒక్కసారిగా ఢిల్లీ హస్తిన వీధులకు చేరింది. కొండా సురేఖ ఆమె కుమార్తె కొండా సుస్మిత వ్యాఖ్యల దుమారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం  పార్టీ క్రమశిక్షణపై సుస్మిత చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఈ వివాదంపై స్పష్టత నిమిత్తం సురేఖకు ఇప్పటికే నోటీసులు జారీ చేసి, నివేదికను కాంగ్రెస్ అధిష్టానానికి పంపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సుమారు 60 నిమిషాల (1 గంట) పాటు సుదీర్ఘంగా భేటీ అయ్యారు. పార్టీ నియమావళిని దాటి వ్యవహరించే నేతలపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వానికి మరియు పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని ముఖ్యమంత్రి అధిష్టానానికి వివరించినట్లు సమాచారం. అయితే ఊహించని మలుపు తిరుగుతూ మంత్రి కొండా సురేఖ కూడా హుటాహుటిన ఢిల్లీకి చేరుకోవడంతో వరంగల్ రాజకీయాలతో పాటు రాష్ట్ర కాంగ్రెస్‌లోనూ తీవ్ర కలకలం రేగింది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, కొండా సురేఖ అత్యంత ఘాటుగా స్పందించారు. "నన్ను అధిష్టానం పిలవలేదు, నేనే స్వయంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అపాయింట్‌మెంట్ అడిగి ఢిల్లీకి వచ్చాను. పార్టీలో ఉన్నది మాట్లాడితే చర్యలు ఎందుకు తీసుకుంటారు?" అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త సంచలనం సృష్టించాయి. పార్టీ శ్రేణుల సంక్షేమం మరియు ప్రాంతీయ సమతుల్యత కోసమే తమ అభిప్రాయాలను వ్యక్తం చేశామని, నిజ నిజాలు చెప్పడం క్రమశిక్షణా ఉల్లంఘన కిందకు ఎలా వస్తుందని ఆమె ప్రశ్నించడం గమనార్హం. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ మీనాక్షీ నటరాజన్, టీపీసీసీ చీఫ్ బి. మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఢిల్లీలో విడివిడిగా పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ వివాదానికి వీలైనంత త్వరగా స్వస్తి చెప్పాలని అధిష్టానం భావిస్తోంది. మంత్రి వర్గంలో 100 శాతానికి పైగా క్రమశిక్షణ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి కోరుతుంటే, ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కొండా కుటుంబం తమ స్వరాన్ని బలంగా వినిపిస్తోంది. పార్టీ మూలాలకు హాని కలగకుండా, సురేఖ చేత మంత్రి పదవికి రాజీనామా చేయించి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలా? లేక కేవలం వివరణతో సరిపెట్టి వ్యవహారాన్ని సర్దుమణిగేలా చేయాలా? అనే అంశంపై ఏఐసీసీ పెద్దలు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఒకవేళ తీవ్ర చర్యలు తీసుకుంటే ఉమ్మడి వరంగల్ పరిధిలోని దాదాపు 12 నియోజకవర్గాల్లో పార్టీ సమీకరణాలపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ వేదికగా సాగుతున్న ఈ హైడ్రామాలో రాబోయే 24 గంటల్లో వెలువడే అధిష్టానం నిర్ణయమే మంత్రి కొండా సురేఖ భవిష్యత్తును నిర్ణయించనుంది.   Konda Surekha Delhi visit, Revanth Reddy Congress high command, AICC Mallikarjun Kharge, Konda Susmita comments, Telangana cabinet reshuffle 2026, Telangana politics news  
తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో  కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుకి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) విమర్శలకు పదును పెట్టింది.  బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 420 హామీలు, 13 డిక్లరేషన్లు,   6 గ్యారంటీల  అమలులో రేవంత్  ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని  ధ్వజమెత్తారు. ప్రజలను మాయమాటలతో వంచించి అధికార పీఠాన్ని దక్కించుకున్న కాంగ్రెస్, ఈ వెయ్యి రోజుల పాలన ఇసుమంతైనా సంతృప్తికరంగా లేదని విమర్శించారు.  రైతాంగం, వ్యవసాయ కూలీలు, మహిళలు, విద్యార్థుల జీవితాలతో  రేవంత్ ఆటలాడుతోందని బీఆర్‌ఎస్  ఆ  చార్జ్‌షీట్‌లో పేర్కొంది. వ్యవసాయ రంగానికి సంబంధించి రైతు భరోసా పథకం కింద   ఏటా ఎకరాకు అందిస్తామన్న  15 వేల రూపాయల  సాయాన్ని నిలిపివేసి రైతులను నిట్టనిలువునా మోసం చేసిందని విమర్శించింది.  అలాగే వ్యవసాయ కూలీలకు చెల్లిస్తామని వాగ్దానం చేసిన   12 వేల రూపాయల ఆర్థిక సాయం కూడా నీటి మూటగానే మిగిలిందని చార్జ్ షీట్ పేర్కొంది.  2 లక్షల రూపాయల  రుణమాఫీ ప్రక్రియను అసంపూర్తిగానే మిగిలిందనీ, సగం సగం లెక్కలతో రైతులకు అన్యాయం చేసిందని ఈ సందర్భంగా కేటీఆర్ విమర్శించారు.  యువత,  విద్యార్థుల భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీసిందని బీఆర్ఎస్ చార్జ్ షీట్ పేర్కొంది.  నిరుద్యోగులకు ఇస్తామని ప్రకటించిన   4 వేల రూపాయల నిరుద్యోగ భృతితో పాటు, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ హామీ పూర్తిగా నీటిమూటగా మారిపోయిందని విమర్శించింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను కాపాడటంలో విఫలమైన ప్రభుత్వం, గురుకుల పాఠశాలలను మూసివేసే దిశగా కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ చార్జిషీట్ పేర్క్ంది. విద్యార్థులకు వాగ్దానం చేసిన  5 లక్షల విద్యా భరోసా కార్డు ఆచరణకు నోచుకోలేదని, 12 వేల  కోట్ల రూపాయలకు పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయనీ, అలాగే..  మహిళలకు ఇస్తామన్న నెలకు  2 వేల 500 రూపాయల ఆర్థిక సాయం, కల్యాణలక్ష్మి పథకం కింద ఇస్తామన్న తులం బంగారం హామీలను రేవంత్ ప్రభుత్వం విస్మరించిందని పేర్కొంది.   ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు,  తెలంగాణకు జీవనాధారమైన కృష్ణా, గోదావరి నదీ జలాలపై రాష్ట్రానికి ఉన్న హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించిందని  విమర్శించారు. అంతేకాకుండా, బాధ్యతారహితమైన ఆర్థిక నిర్ణయాల వల్ల తెలంగాణను దాదాపు రూ. 4.5 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టేశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిరంకుశ విధానాలను, హామీల అమలును ప్రశ్నించిన నాయకులు, ప్రజలపై అక్రమ కేసులు బనాయిస్తూ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. [BRS chargesheet on Congress, KTR press meet, Telangana Congress 1000 days, Revanth Reddy government failures, BRS vs Congress, Telangana politics,  Telugu One]
ALSO ON TELUGUONE N E W S
ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమా "రోమాంచకం". సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్నారు. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపిన ఇంట్రెస్టింగ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఈ నెల 3న థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర విశేషాలను ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో తెలిపారు హీరో సుమంత్ ప్రభాస్. - మా మూవీ కోసం ప్రభాస్ గారిని కలవడం చాలా హ్యాపీగా అనిపించింది. నా గతం, నా జర్నీ అంతా ఒక్కసారిగా గుర్తుకువచ్చింది. ఆయనను కలిసే ముందు ఒక ఎక్స్ పెక్టేషన్ తో వెళ్లాం. ప్రభాస్ గారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మన ఫ్యాన్ బాయ్ అనే ప్రేమ ఆయనలో కనిపించింది. మా కుటుంబంలో ఎవరికీ సినిమా నేపథ్యం లేదు. సినిమాల గురించి తెలియదు. దాంతో వాళ్లు నన్ను పెద్దగా సపోర్ట్ చేయలేదు. అందరితో బాగుండు, పాజిటివ్ గా ఆలోచించు అని మాత్రం చెప్పారు.  - తెలంగాణ నేపథ్యంతో మేమ్ ఫేమస్ అనే సినిమా చేశాను. ఇక్కడి ఆడియెన్స్ బాగా చూశారు. ఆంధ్ర నేపథ్యంతో గోదారిగట్టుపైన సినిమా చేశాను. ఆ సినిమాను ఏపీ వాళ్లు ఆదరించారు. ఈ రెండు చిత్రాలతో నటుడిగా వెర్సటాలిటీ చూపించే అవకాశం దక్కింది. రోమాంచకం సినిమా హైదరాబాద్ నేపథ్యంగా సాగుతుంది. - ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాలని ప్రయత్నించే యువకుడిగా ఈ చిత్రంలో కనిపిస్తాను. ఆ క్యారెక్టర్ క్యూట్ గా, ఇన్నోసెంట్ గా ఉంటుంది. రియల్ లైఫ్ లో నేను ఎస్ఐ కావాలని మా నాన్నకు ఉండేది. డిగ్రీ చదువుతున్నప్పుడే మేమ్ ఫేమస్ మూవీలో అవకాశం వచ్చింది. - రోమాంచకం సినిమా ఆరేళ్ల నుంచి అరవై ఏళ్ల వరకు ఎవరైనా చూసి ఒకేలా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీస్ తో ఫ్రెండ్స్ తో ఎవరితో అయినా ఈ మూవీని చూడొచ్చు. నేను హీరోగా రెండు సినిమాలు చేసినా డైరెక్టర్ వేణుగోపాల్ గారు ఆయనకు ఈ క్యారెక్టర్ కు ఎలా ఉండాలో అలా మార్చుకునేందుకు ఆర్నెళ్లు వర్క్ షాప్స్ కండక్ట్ చేశారు. ఈ క్యారెక్టర్ లో ఎలా నటించాలి అనేది నాకు ఐడియా ఉంది. కానీ వర్క్ షాప్స్ తో షార్ప్ అయ్యాను. వర్క్ షాప్స్ అంతా కంప్లీట్ అయ్యాక మొదటి నుంచి చివరి దాకా నా పర్ ఫార్మ్ చూసుకుంటే ఎంతో మార్పు కనిపించింది. కొన్నిసార్లు ఒకే సీన్ రెండు మూడు నెలలు ప్రాక్టీస్ చేసిన సందర్భాలున్నాయి. - సందీప్ అన్న ఒక అవార్డ్  ఫంక్షన్ లో కలిసి ఒక క్యూట్ స్టోరీ ఉంది నువ్వు విను అన్నారు. ఆయన చెప్పాడంటే తప్పకుండా బాగుంటుందని కథ విన్నాను. వేణు అన్న చెప్పిన నెరేషన్ రెండున్నర గంటలు ఎంజాయ్ చేశాను. సందీప్ అన్న, ప్రణయ్ అన్న బయటకు అలా కనిపిస్తారు కానీ వాళ్లు చాలా స్వీట్ పర్సన్స్. వాళ్లతో ట్రావెల్ అయిన వాళ్లకు తెలుస్తుంది. - విజయ్ దేవరకొండ అన్న మా మూవీ ప్రీ రిలీజ్ కు రావడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన నా గురించి బాగా మాట్లాడటం కూడా సంతోషాన్నిచ్చింది. విజయ్ అన్నను చూసి నేను చాలా ఇన్స్ పైర్ అవుతుంటాను. రోమాంచకం సినిమా ఫస్ట్ కాపీ చూసి సందీప్ అన్న బాగా పర్ ఫార్మ్ చేశావంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. రోమాంచకం టైటిల్ కొత్తగా ఉంది ఆడియెన్స్ కు కనెక్ట్ అవుతుందా అనిపించింది. కానీ ఇప్పుడు అదొక ఊతపదంలా మారిపోతోంది. సినిమా రిలీజ్ అయ్యాక చాలా మందికి ఈ పదం వాడుకలోకి వస్తుందని నమ్ముతున్నా. - అనంతిక టాలెంటెడ్ యాక్ట్రెస్. ఆమెకు చాలా ఆర్ట్ ఫామ్స్ తెలుసు. ఏ విద్యనైనా తక్కువ టైమ్ లో నేర్చుకుంటుంది. ఆమెతో ఈ మూవీలో వర్క్ చేయడం మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. తనకు కూడా ఈ సినిమా మంచి గుర్తింపు తీసుకొస్తుంది. మా సినిమా ఆద్యంతం రోమాంచకం ఫీల్ ను ప్రేక్షకులకు కలిగిస్తుంటుంది. సినిమాలో ఫ్రెష్ నెస్ చూస్తారు. ప్రతి సీన్ మీకు నవ్వు తెప్పిస్తుంది. నాకు సినిమా చూసినంత సేపు మజా వచ్చింది. మా మూవీలో వాసుకి వైభవ్ మ్యూజిక్ ఇరగదీశాడు. రాధారమణ నా ఫేవరేట్ సాంగ్. ఇంకో లవ్ సాంగ్ ప్రభాస్ గారు రిలీజ్ చేశారు.  - హీరోగా అన్నిరకాల చిత్రాల్లో నటించాలని ఉంది. ఇప్పుడు లవ్ స్టోరీస్ వస్తున్నాయి. హీరోగా పేరొచ్చాక యాక్షన్, కమర్షియల్ ఆఫర్స్ వస్తాయేమో చూడాలి. నెక్ట్స్ ఏషియన్ బ్యానర్ లో రాజు వెడ్స్ రాంబాయి డైరెక్టర్ సాయిలు కంపాటితో ఒక మూవీ చేయబోతున్నా. ఈ నెలలోనే ఆ మూవీ స్టార్ట్ కానుంది.       [Romanchakam, Sumanth Prabhas, Sandeep Reddy Vanga, Prabhas, Vijay Deverakonda, Telugu Film News, Telugu News]  
Presented by blockbuster director Sandeep Reddy Vanga and produced under the Bhadrakali Pictures banner, "Romanchakam" stars Sumanth Prabhas and Ananthika Sanilkumar in the lead roles. The film is produced by Pranay Reddy Vanga and directed by debutant Venu Gopal Reddy. Blending love, humour and suspense, the film is gearing up for a grand worldwide theatrical release on the 3rd of this month as an interesting, youthful entertainer. Ahead of the release, hero Sumanth Prabhas spoke about the film during an interview held today. It felt really special and happy to meet Prabhas garu for our movie. Meeting him brought back memories of my past and my entire journey. We went to meet him with certain expectations, but Prabhas garu received us very warmly. I could see the love for a true fanboy in him. No one in my family has a film background, and they don't know much about the industry. So, they didn't really support me much. They only told me to be good to everyone and to think positively. I acted in a film called Mem Famous, which was set against a Telangana backdrop, and it was well received by audiences here. Later, I did Godarigattupaina, which had an Andhra backdrop, and that film was appreciated by audiences in Andhra Pradesh. These two films gave me an opportunity to showcase my versatility as an actor. Romanchakam is set against the backdrop of Hyderabad. In this film, I play a young man who completes his engineering and tries to start a startup company. The character is cute and innocent. In real life, my father wanted me to become an SI. I got the opportunity to act in Mem Famous while I was pursuing my degree. Romanchakam is a film that people from the age of six to sixty can enjoy equally. You can watch it with your family or friends. Although I had already done two films as a hero, director Venu Gopal garu conducted workshops for six months to help me transform myself according to what the character demanded. I had an idea of how to portray the character, but the workshops helped me sharpen my performance. When I look at my performance from the beginning to the end after completing all the workshops, I can see a huge difference. There were even occasions when we practised a single scene for two or three months. I met Sandeep anna at an awards function, and he told me, "There is a cute story. Listen to it." Since he was telling me the story, I felt it would definitely be good. When Venu anna narrated the script, I enjoyed all two and a half hours of it. Sandeep anna and Pranay anna may appear a certain way from the outside, but they are actually very sweet people. Those who have travelled with them would know that. I was very happy that Vijay Deverakonda anna attended our pre-release event. It was also very encouraging to hear him speak so positively about me. I have always been greatly inspired by Vijay anna. After watching the first copy of Romanchakam, Sandeep anna complimented me, saying that I had performed very well. Initially, I wondered whether the title Romanchakam, which is quite unique, would connect with the audience. But now it is almost becoming a catchphrase. I believe that after the film's release, many people will start using this word in their everyday conversations. Ananthika is a very talented actress. She knows several art forms and can learn anything in a very short time. Working with her on this film was a great experience. I believe this film will also bring her good recognition. The movie gives the audience a Romanchakam feeling from beginning to end. You will notice a lot of freshness in the film. Every scene will make you laugh. I had a lot of fun while watching the movie. Vasuki Vaibhav has delivered fantastic music for our film. Radharaman is my favourite song. Prabhas garu also released another love song from the movie. I want to act in all kinds of films as a hero. Right now, I am getting love-story scripts. Once I establish myself as a hero, let's see if I start receiving action and commercial film offers. Next, I will be doing a film with director Saailu Kampati, the director of Raju Weds Rambai, under the Asian banner. The film will begin this month itself. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Irumudi has turned into a career-defining success for Ravi Teja, with the film crossing the ₹200 crore gross mark worldwide and continuing to draw strong crowds well into its second and third weekends. The success has also surprised the team, particularly because the film has managed to turn its theatrical run into a highly profitable one across the Telugu states and overseas. Director Shiva Nirvana believes a major part of the film’s impact came from how Ravi Teja was presented as Irumudi Trinadh. Speaking about his approach to the character, he said that every filmmaker wants to leave a distinct impression when given the opportunity to work with a star. His intention was to make audiences remember Ravi Teja through Trinadh even after leaving the theatre, and he feels the actor’s performance made that possible. The director also explained why the film chose to explore some uncomfortable aspects of society, particularly in its portrayal of teachers and the Guru Swamy character. According to Shiva, the intention was never to target an entire profession or community, but to acknowledge that vulnerable situations can sometimes push even otherwise good people towards wrong choices. He felt showing those darker realities was necessary to make the film’s positive aspects more firmly resonate. Ravi Teja’s performance was central to that approach, with Shiva saying the actor gave him complete freedom to explore the darker side of the character without diluting it. The filmmaker wanted audiences to walk out with a heavy heart rather than treat Irumudi as just another commercial entertainer. The strong response from women and audiences across generations appears to have given that emotional approach a much wider reach than the team initially anticipated. The producers too admit that the film has gone far beyond their expectations. Mythri Movie Makers revealed that they expected Irumudi to perform well, but even they were surprised by the pace of its collections and profitability. With strong footfalls continuing even on weekdays, the production house is now in discussions with its OTT partner about extending the theatrical window, citing the continued audience interest as the reason. With the film still maintaining momentum despite new releases entering the market, the final theatrical numbers remain difficult for even its makers to predict. What started as a Ravi Teja–Shiva Nirvana collaboration has now become one of the biggest and most unusual theatrical successes of the actor’s career, with Irumudi Trinadh seemingly becoming the image Shiva Nirvana wanted audiences to carry home.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలంటే కేవలం భారీ విజువల్స్, వందల కోట్ల బడ్జెట్, స్టార్ కాస్టింగ్ మాత్రమే ఉంటే సరిపోదని మరోసారి రుజువైంది. బలమైన కథ, గుండెలను తాకే భావోద్వేగాలు ఉంటే చిన్న చిత్రాలు కూడా ప్రపంచ స్థాయి బాక్సాఫీస్‌ను షేక్ చేయగలవని అనేక సినిమాలు నిరూపించాయి. మన దగ్గర వచ్చిన 'హనుమాన్' వంటి చిత్రాలు అల్ప బడ్జెట్‌తో వచ్చి ఊహించని వసూళ్లు సాధించినట్లే, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఒక చైనీస్ ఫ్యామిలీ డ్రామా భారీ సంచలనం సృష్టిస్తోంది. అదే 'డియర్ యూ' (Dear You). హాంగ్‌చున్ లాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం చైనీస్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర తిరగరాస్తోంది. 2026 ఏప్రిల్ 30న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా సుమారు 14 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో (మన భారతీయ కరెన్సీలో రూ. 132 కోట్లు) రూపుదిద్దుకుంది. అయితే ఈ చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం బాక్సాఫీస్ వద్ద రాబట్టిన వసూళ్లు చూసి గ్లోబల్ ట్రేడ్ వర్గాలు సైతం నోరెళ్లబెడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా చైనాతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో ఏకంగా 300 మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. అంటే ఇండియన్ రూపాయిల్లో ఈ వసూళ్లు దాదాపు రూ. 2,849 కోట్లకు పైగానే ఉండటం విశేషం! పెట్టిన పెట్టుబడికి ఏకంగా ఇరవై రెట్లకు పైగా లాభాలను తీసుకొచ్చి 2026లో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద సంచలనాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. చైనీస్ భాషలో 'డియర్ యూ' అంటే 'అమ్మమ్మకు ప్రేమలేఖ' అనే ఆత్మీయ భావం వస్తుంది. అప్పులు, కుటుంబ సమస్యల్లో కూరుకుపోయిన ఒక యువకుడు, థాయ్‌లాండ్‌లో కోటీశ్వరుడిగా స్థిరపడ్డాడని భావిస్తున్న తన తాతను వెతికేందుకు బయలుదేరడంతో ఈ కథ ప్రారంభమవుతుంది. తీరా అక్కడికి వెళ్లాక దశాబ్దాల క్రితం నాటి ఒక హృదయవిదారక రహస్యం బయటపడుతుంది. వలసల నేపథ్యం, మానవ అనుబంధాలు, ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ తిరిగే ఈ డ్రామా ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తోంది. ఈ సినిమాకు వస్తున్న ఊహించని రెస్పాన్స్ చూసి మేకర్స్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 4న ఉత్తర అమెరికా (USA) థియేటర్లలో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం గ్లోబల్ ఫిలిం వర్గాల్లో 'డియర్ యూ' మూవీ వసూళ్లపైనే చర్చ నడుస్తోంది. ఎలాంటి అర్భాటాలు లేకుండా కేవలం భావోద్వేగాల బలంతో ఏకంగా రూ. 2800 కోట్లకు పైగా కొల్లగొట్టిన ఈ చిత్రం, రాబోయే రోజుల్లో గ్లోబల్ వైడ్‌గా ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తుందో వేచి చూడాలి!
తెలుగు సినీ ప్రియులకు ఎంతటి క్రేజీ రికార్డులైనా సుపరిచితమే, కానీ పొరుగున ఉన్న కన్నడ ఇండస్ట్రీలో 90ల నాటి ఒక చిత్రం సృష్టించిన రికార్డులు మాత్రం ప్రపంచ సినిమా చరిత్రలోనే అరుదైనవి. కన్నడ హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ కాంబినేషన్‌లో, రియల్ స్టార్ ఉపేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన 'ఓం' (Om - 1995) చిత్రం భారతీయ సినీ చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. 1995 మే 19న విడుదలైన ఈ సినిమా, 2013-2015 నాటికి ఏకంగా 550 సార్లు రీ-రిలీజ్ అయి 'లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్' (Limca Book of Records)లో స్థానం సంపాదించుకుంది. మాఫియా, అండర్‌వరల్డ్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ 'ఓం' చిత్రం అప్పట్లో ఇండియన్ సినిమాకు సరికొత్త గ్యాంగ్‌స్టర్ డ్రామా ట్రెండ్‌ను పరిచయం చేసింది. అంతవరకు ఎవరూ ఊహించని రీతిలో రియల్ లైఫ్ అండర్‌వరల్డ్ డాన్‌లు, రౌడీలను ఈ సినిమాలో ప్రత్యక్షంగా నటింపజేయడం ఒక ఎత్తయితే... ఉపేంద్ర మార్క్ రివర్స్ స్క్రీన్ ప్లే, శివరాజ్‌కుమార్ మాస్ ఇంటెన్స్ యాక్టింగ్ ప్రేక్షకులను థియేటర్లలో పూనకాలు తెప్పించాయి. రూ. 75 లక్షల స్వల్ప బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా ఆ రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ. 10 కోట్లకు పైగా గ్రాస్ సాధించి 'ఇండస్ట్రీ హిట్'గా నిలిచింది. ఈ సినిమా రన్ మరియు రీ-రిలీజ్ రికార్డులను పరిశీలిస్తే విస్తుపోవాల్సిందే. 1995లో తొలిసారి విడుదలైనప్పుడు ఈ సినిమా కర్ణాటక వ్యాప్తంగా 175 రోజులకు పైగా (Silver Jubilee) ఘనవిజయం సాధించింది. ముఖ్యంగా బెంగళూరు నగర చరిత్రలోనే ఒకేసారి మూడు ప్రధాన థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకున్న మొదటి కన్నడ చిత్రంగా 'ఓం' రికార్డులకెక్కింది. థియేటర్ల నుంచి వెళ్లిపోయిన ప్రతిసారీ ప్రేక్షకుల డిమాండ్ మేరకు నిర్మాతలు ఈ చిత్రాన్ని మళ్లీ మళ్లీ విడుదల చేస్తూ వచ్చారు. బెంగళూరులోని ఐకానిక్ 'కపాలి' థియేటర్‌లోనే ఈ చిత్రాన్ని ఏకంగా 30 సార్లు రీ-రిలీజ్ చేశారు! కర్ణాటకలోని సుమారు 400కి పైగా థియేటర్లలో ప్రతి రెండవ వారం లేదా నెలల వ్యవధిలో ఈ సినిమా మళ్లీ మళ్లీ విడుదలవుతూ ప్రదర్శించబడేది. అలా 1995 నుండి దాదాపు రెండు దశాబ్దాల పాటు ఎటువంటి టీవీ ప్రీమియర్ లేదా డీవీడీలు లేకుండా కేవలం థియేటర్లలోనే ప్రదర్శిస్తూ 550 సార్లు రీ-రిలీజ్ మార్కును దాటి ప్రపంచ రికార్డు సృష్టించింది. కేవలం కన్నడలోనే కాకుండా ఈ సినిమా భారతీయ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమాను తెలుగులో రాజశేఖర్ కథానాయకుడిగా 'ఓంకారం' పేరుతో స్వయంగా ఉపేంద్రే రీమేక్ చేయగా, హిందీలో సన్నీ డియోల్ హీరోగా 'అర్జున్ పండిత్' పేరుతో రీమేక్ చేశారు. తెలుగులో కూడా ఈ చిత్రం 100 రోజుల రన్‌ను సొంతం చేసుకోవడం విశేషం. చివరకు 20 ఏళ్ల సుదీర్ఘ థియేట్రికల్ రన్ తర్వాత, 2015 మార్చిలో డిజిటల్ రిమాస్టర్ మరియు DTS సౌండింగ్‌తో 100కి పైగా థియేటర్లలో భారీగా రీ-రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఆగస్ట్ 2015లో 'ఉదయ్ టీవీ' (Udaya TV) ఈ సినిమా శాటిలైట్ హక్కులను రూ. 10 కోట్లకు కొనుగోలు చేసింది. 20 ఏళ్ల పాత సినిమాకు 10 కోట్ల బిజినెస్ జరగడం అప్పట్లో నేషనల్ లెవల్లో సంచలనం సృష్టించింది. నేడు ఎన్నో సినిమాలు పాన్-ఇండియా లెవల్లో వందల కోట్లు సాధిస్తున్నప్పటికీ, 550 సార్లు థియేటర్లలో మళ్లీ మళ్లీ విడుదలై ప్రేక్షకులను హౌస్‌ఫుల్ బోర్డులతో అలరించిన 'ఓం' సాధించిన ఈ అరుదైన రికార్డును భవిష్యత్తులో కూడా ఏ చిత్రం చెరిపివేయలేదనడంలో ఎలాంటి సందేహం లేదు.       [Om Kannada Movie Records, Shivarajkumar Om Movie, Upendra Om Re Release Record, Om Movie Limca Record 550 Times, Kannada Cult Classic Om]
    మాస్ మహారాజా రవితేజ.. ఈ పేరు వినడం ఆలస్యం అభిమానులు, ప్రేక్షకులు పోటీ పడి మరి రవితేజ మేనరిజమ్స్, డైలాగ్స్ తో రెచ్చిపోతారు. ప్రస్తుతం ఇరుముడితో సందడి చేస్తూ 200 కోట్ల క్లబ్ లోకి చేరాడు. పైగా ఎంటైర్ తన కెరీర్ లోనే సూపర్ డూపర్ హిట్. ఈ క్రమంలో రవితేజకి సంబంధించిన ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉంది.  ఈ క్రమంలో తాజాగా హల్ చల్ చేస్తున్న న్యూస్ ఏంటో చూద్దాం రవితేజ అసలు పేరు 'భూపతిరాజు రవిశంకర్ రాజు'  ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో జన్మించిన రవిశంకర్ రాజు. చదువు పూర్తి చేసిన తర్వాత సినిమాలపై ఉన్న  ఆసక్తితో చెన్నై బాట పట్టారు. 1980వ దశకంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తూనే, తెరపై కనిపించడానికి చిన్న చిన్న అవకాశాల కోసం ప్రయత్నించారు. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ మూవీ 'దొంగ మొగుడు' కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు.  Also Read: 270 సినిమాల్లో 180 ఫ్లాపులు:చివరికి 350 కోట్ల బ్లాక్‌బస్టర్‌తో అదరగొట్టిన మీ లెజెండరీ హీరో చిత్రీకరణ సమయంలో  రాఘవేంద్రరావు గారు రవితేజలోని  ఉత్సాహాన్ని, నటన పట్ల ఉన్న అంకితభావాన్ని గమనించారు. ఒక రోజు షూటింగ్ గ్యాప్‌లో రవితేజని  రాఘవేంద్రరావు పిలిచి, "నీ పేరులో ఎంతో శక్తి ఉంది, కానీ స్క్రీన్ నేమ్ చాలా షార్ప్‌గా, క్యాచీగా ఉండాలి. పైగా నీ పేరుని పిలవాలన్నా ఇబ్బందిగా ఉందని 'రవి' అనే పదం నుంచి 'రవి', దానికి 'తేజస్సు' లేదా 'కాంతి' అనే అర్థం వచ్చేలా 'తేజ' అనే పదాన్ని కలిపి 'రవితేజ' అనే పేరుని ఫిక్స్ చేసారు.  అలా 'దొంగ మొగుడు' చిత్ర సెట్స్‌పైనే రవిశంకర్ రాజుకు 'రవితేజ' అనే నామకరణం జరిగింది. దొంగమొగుడులో చిరంజీవి డ్యూయల్ రోల్ పోషించగా ఒక క్యారక్టర్ పేరు రవితేజ..అందుకే రాఘవేంద్ర రావు గారు  రవితేజ అని రవితేజకి నిర్ణయించారని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. 1987 లో విడుదలైన దొంగమొగుడు బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ టాక్ తో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.     [ Ravi Teja, Donga Mogudu, Chiranjeevi, Irmudi, Telugu Cinema, Telugu Cinema News, Tollywood]    
కామెడీ కింగ్ అల్లరి నరేష్, హీరోయిన్లు సురభి, రాశీ సింగ్, విష్ణుప్రియ భీమినేని, ప్రిషా సింగ్ కాంబినేషన్‌లో వస్తున్న సరికొత్త ఫాంటసీ ఎంటర్‌టైనర్ 'రంభ ఊర్వశి మేనక'. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో హాస్య మూవీస్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. కథ విషయానికి వస్తే... రాజమండ్రికి చెందిన తండ్రీ కొడుకులుగా వి.కె. నరేష్, అల్లరి నరేష్ కనిపిస్తారు. వీరి వద్ద వంశపారంపర్యంగా ఒక మ్యాజిక్ బుక్ ఉంటుంది. దానిపై సరిగ్గా ముగ్గు వేస్తే రంభ, ఊర్వశి, మేనక అనే దేవకన్యలు భూమిపైకి వస్తారని తండ్రి చెబుతాడు. దాంతో హీరో ఏకంగా 25 ఏళ్ల పాటు కష్టపడి ఆ ముగ్గు ప్రయత్నం ఫలించేలా చేసి, దేవకన్యలైన రంభ (రాశీ సింగ్), ఊర్వశి (విష్ణుప్రియ), మేనక (ప్రిషా సింగ్)లను భూమిపైకి రప్పిస్తాడు. అలా ఇంద్రలోకం నుంచి వచ్చిన దేవకన్యల వల్ల భూమిపై ఎలాంటి వినోదం పండింది? హీరో వారి నుంచి ఏం కోరుకున్నాడు? అనేది ఈ సినిమా ప్రధాన కథాంశం. సెన్సార్ స్క్రీనింగ్ సమయంలో మొదట ఈ సినిమా టైటిల్‌పై, అలాగే కొన్ని సన్నివేశాలపై సెన్సార్ బోర్డ్ అభ్యంతరాలు వ్యక్తపరిచింది. టైటిల్ మార్చాలని కూడా సూచించారు. అయితే చిత్ర యూనిట్ కథ యొక్క ఆవశ్యకతను సెన్సార్ బోర్డు సభ్యులకు పక్కాగా వివరిస్తూ వారిని ఒప్పించగలిగింది. కొన్ని మార్పులు చేర్పులు చేసిన తర్వాత సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి UA16+ సర్టిఫికెట్ ఇచ్చి రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఈ సినిమా రన్‌టైమ్ విషయానికి వస్తే, ప్రేక్షకులను ఎక్కడా బోర్ కొట్టించకుండా కథను ఎంతో ఫన్‌గా, గ్రిప్పింగ్‌గా చెప్పడానికి 2 గంటల 20 నిమిషాలు (140 నిమిషాలు) రన్‌టైమ్‌ను లాక్ చేశారు. అల్లరి నరేష్, వి.కె. నరేష్ మధ్య వచ్చే కామెడీ సీన్లు, ఇంద్రుడిగా వెన్నెల కిషోర్ చేసిన హంగామా, భామల గ్లామర్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయని సెన్సార్ టాక్ చెప్తోంది. పెద్దగా బుర్రకు పనిచెప్పకుండా థియేటర్‌లో ప్రశాంతంగా కూర్చుని హ్యాపీగా నవ్వుకునేలా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ బావుందట. కామెడీతో పాటు ఎమోషన్ కూడా బాగా పండింది అంటున్నారు.       [Rambha Urvasi Menaka, Movie Review, Allari Naresh, Vishnu Priya, Raashi Singh, Telugu Film News, Telugu News]  
The Odyssey is turning its late theatrical run into a fascinating box-office story. After overtaking Spider-Man: Brand New Day internationally during the August 28–30 weekend, Christopher Nolan’s epic came within just $146 of beating the superhero blockbuster in the North American daily chart on Monday, August 31. The Monday numbers were almost unbelievable. Spider-Man: Brand New Day collected $1,921,191 domestically, while The Odyssey posted $1,921,045. That means the two films were separated by just $146, with Spider-Man retaining the No. 1 position by the narrowest possible margin. What makes the result particularly striking is the difference in their theatrical runs. Brand New Day was on its 32nd day, while The Odyssey was already on its 46th day. Despite being two weeks older, Nolan’s film virtually matched one of the biggest superhero blockbusters ever made on a regular Monday. The Odyssey had a domestic cume of approximately $565.8 million after Monday, while Brand New Day had reached nearly $893.7 million. The international weekend makes the story even more interesting. From August 28–30, The Odyssey generated approximately $48.7 million internationally, beating Brand New Day, which collected around $44 million. Globally, Spider-Man still won the weekend with about $66.2 million, compared with $63 million for Nolan’s film, but the international result shows just how strong The Odyssey continues to be this deep into its run. South Korea has emerged as a particularly spectacular market for The Odyssey. The film added more than 1.06 million admissions over the weekend, taking its Korean total to 8.86 million and making it the most-watched foreign release of the year in the country. It also remained comfortably ahead of Brand New Day there, which added roughly 250,000 admissions over the same weekend. The contrast between the two films is what makes the trade story compelling. Brand New Day is enjoying a historic run, having already crossed $2.33 billion worldwide and remaining No. 1 domestically for a fifth consecutive weekend. The Odyssey, meanwhile, has quietly developed exceptional legs, reaching around $1.55 billion worldwide despite being seven weekends into its theatrical journey. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
  ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన మూలికా సంపదలో హిమాలయ పర్వత ప్రాంతాల్లో మాత్రమే లభించే  పహాడీ వెల్లుల్లి  లేదా  హిమాలయన్ సింగిల్ క్లోవ్ గార్లిక్  ఎంతో ప్రత్యేకమైనది. దీనిని సాధారణంగా కశ్మీరీ వెల్లుల్లి అని కూడా పిలుస్తారు. సాధారణంగా మనం వంటల్లో వాడే వెల్లుల్లి పాయల కంటే ఇది పరిమాణంలో చిన్నగా, ఒకే ఒక్క పాయగా (Single Clove) గుండ్రంగా ఉంటుంది. అయితే ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, మన సాధారణ వెల్లుల్లితో పోలిస్తే ఈ పహాడీ వెల్లుల్లిలో దాదాపు 7 రెట్లు అధికంగా పోషకాలు మరియు ఔషధ గుణాలు దాగి ఉంటాయని ఆయుర్వేద నిపుణులు మరియు శతాబ్దాల వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. హిమాలయాలలోని స్వచ్ఛమైన వాతావరణం, మంచు నీరు మరియు ప్రత్యేకమైన నేల స్వభావం దీనికి అపరిమితమైన శక్తిని అందిస్తాయి. పహాడీ వెల్లుల్లిలో అత్యధిక గాఢత కలిగిన  అల్లిసిన్  (Allicin) అనే అద్భుతమైన ఆర్గానోసల్ఫర్ సమ్మేళనం ఉంటుంది. సాధారణ వెల్లుల్లి కంటే ఇందులో 300 శాతం ఎక్కువ అల్లిసిన్ నిల్వలు ఉంటాయి, ఇది మన శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. దీనితో పాటు పహాడీ వెల్లుల్లిలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, ఐరన్, కాపర్, మాంగనీస్, విటమిన్ బి6 మరియు విటమిన్ సీ పుష్కలంగా లభిస్తాయి. రోజుకు కేవలం 2 నుండి 3 పహాడీ వెల్లుల్లి పాయలను పరగడుపున నమిలి తింటే, శరీరంలో రోగనిరోధక శక్తి దాదాపు 50 శాతం వరకు పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది శరీరంలో ఉండే有害 ఉచిత రాడికల్స్ (Free Radicals) ను నిరోధించి కణాల క్షీణతను 40 శాతం వరకు అడ్డుకుంటుంది. హృదయ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి పహాడీ వెల్లుల్లి ఒక వరప్రసాదం లాంటిది. ఇది రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించి, రక్త ప్రసరణను 35 శాతం వరకు మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా పహాడీ వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (LDL) మరియు ట్రైగ్లిజరైడ్ల స్థాయిలు 20 శాతం నుండి 25 శాతం వరకు తగ్గుతాయి. అంతేకాకుండా అధిక రక్తపోటు (High Blood Pressure)ను నియంత్రించడంలో ఇది 90 శాతం సమర్థవంతంగా పనిచేస్తుంది. రక్తనాళాలను రిలాక్స్ చేసి, బ్లడ్ క్లాట్స్ (రక్తపు గడ్డలు) ఏర్పడే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.       how to use pahadi garlic daily,pahadi garlic vs normal garlic benefits.
      చర్మంపై అకస్మాత్తుగా కనిపించే చిన్నచిన్న పులిపిర్లు (Warts) చాలామందిని వేధించే ప్రధాన సౌందర్య మరియు ఆరోగ్య సమస్య. ఇవి ముఖం, మెడ, చేతులు, కాళ్లపై ఏర్పడి చర్మ సౌందర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా కొన్నిసార్లు తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తాయి. సాధారణంగా ఇవి హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) అనే ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి. చాలామంది వీటిని తగ్గించుకోవడానికి పార్లర్లు, క్లినిక్‌ల చుట్టూ తిరుగుతూ వేలాది రూపాయలు ఖర్చు చేస్తుంటారు. అయితే మన వంటింట్లోనే దొరికే ఒక చిన్న చిటికెడు పసుపుతో ఎటువంటి నొప్పి లేకుండా, సహజ సిద్ధంగా ఈ పులిపిర్లను తొలగించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు మరియు చర్మ వైద్యులు సూచిస్తున్నారు. పసుపులో  కర్కుమిన్ (Curcumin) అనే అత్యంత శక్తివంతమైన జీవక్రియ సంబంధిత సమ్మేళనం ఉంటుంది. ఇది అద్భుతమైన యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. కర్కుమిన్ వైరస్‌ల పెరుగుదలను సమర్థవంతంగా నిరోధించి, చర్మ కణాలను పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అధ్యయనాల ప్రకారం పసుపును క్రమంగా ఉపయోగించడం వల్ల దాదాపు 70 శాతం నుండి 80 శాతం వరకు పులిపిర్ల సమస్య నయమవుతుంది. పసుపులోని సహజ ఎక్స్‌ఫోలియేటింగ్ గుణాలు పులిపిరు కణజాలాన్ని నెమ్మదిగా ఎండబెట్టి, చర్మం నుండి విడిపోయేలా చేస్తాయి. ఈ సహజ వైద్యం కోసం పసుపును ఉపయోగించడం చాలా సులభం. ఒక చిన్న గిన్నెలో అర స్పూన్ పసుపు పొడిని తీసుకుని, దానికి కొన్ని చుక్కల ఆవనూనె లేదా వెజిటబుల్ ఆయిల్ కలిపి చిక్కటి పేస్ట్‌లా తయారు చేయాలి. ఆవనూనెలో ఉండే విటమిన్ ఇ మరియు పసుపులోని యాంటీ వైరల్ గుణాలు కలిపి వేగవంతమైన ఫలితాలను ఇస్తాయి. ఈ పేస్ట్‌ను పులిపిరి ఉన్న ప్రాంతంలో మాత్రమే ఖచ్చితంగా అప్లై చేసి, దానిపై ఒక కాటన్ బ్యాండేజ్ లేదా ప్లాస్టర్ వేసి రాత్రంతా ఉంచాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు క్రమం తప్పకుండా 2 నుండి 3 వారాల పాటు చేస్తే పులిపిరు పరిమాణం 50 శాతం వరకు తగ్గి, క్రమంగా రాలిపోతుంది.       How to remove warts with turmeric, painless home remedies for warts.
మన వంటింట్లో లభించే సుగంధ ద్రవ్యాలలో పసుపుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. శతాబ్దాలుగా మన సాంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో పసుపును ఒక దివ్యౌషధంగా ఉపయోగిస్తున్నారు. సాధారణంగా మనం ప్రతిరోజూ వంటల్లో పసుపు పొడిని ఉపయోగిస్తుంటాం. అయితే మార్కెట్‌లో లభించే పసుపు పొడి కంటే పచ్చి పసుపు కొమ్ముల్లో 30 శాతం నుండి 50 శాతం వరకు అధికంగా ఔషధ గుణాలు, పోషకాలు దాగి ఉంటాయని వైద్య నిపుణులు మరియు ఇటీవలి పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. పసుపును ప్రాసెస్ చేసి పొడిగా మార్చే క్రమంలో అందులో ఉండే సహజ నూనెలు, సువాసన మరియు కీలక పోషకాలు కొంతవరకు నశిస్తాయి. కానీ పచ్చి పసుపును నేరుగా తీసుకోవడం వల్ల శరీరానికి లభించే ప్రయోజనాలు అపారం. పచ్చి పసుపులో  కర్కుమిన్  (Curcumin) అనే శక్తివంతమైన జీవక్రియ సంబంధిత సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక అద్భుతమైన యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్‌గా పనిచేస్తుంది. పచ్చి పసుపులో 3 శాతం నుండి 5 శాతం వరకు అధిక గాఢత కలిగిన కర్కుమిన్ లభిస్తుంది, ఇది శరీరంలో వాపును తగ్గించడంలో మరియు కణజాలాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీనికి తోడు పచ్చి పసుపులో శరీరానికి అవసరమైన ఫైబర్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ సి, విటమిన్ బి6 మరియు ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున 2 నుండి 3 గ్రాముల పచ్చి పసుపు ముక్కను నమిలి తినడం లేదా దాని రసాన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ దాదాపు 40 శాతం వరకు బలపడుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో పచ్చి పసుపును మించిన ఔషధం లేదు. దీనిలోని  జింజరాల్  (Gingerol) సమ్మేళనం మరియు సహజ ఫైబర్ జీర్ణ రసాల ఉత్పత్తిని పెంచి, పేగుల కదలికలను వేగవంతం చేస్తాయి. భోజనానికి ముందు చిన్న పచ్చి పసుపు ముక్కను తినడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి మరియు యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు 70 శాతం వరకు తగ్గుతాయి. అంతేకాకుండా, పచ్చి పసుపు కాలేయంలో ఉండే టాక్సిన్లను తొలగించి, లివర్ ఫంక్షన్‌ను 25 శాతం వేగవంతం చేసే సహజ డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తుంది. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, ఇన్సులిన్ నిరోధకతను నియంత్రించడంలో కూడా ఎంతగానో తోడ్పడుతుంది.       how to use raw turmeric daily, curcumin benefits of fresh turmeric.
నేటి డిజిటల్ యుగంలో ఆరోగ్య స్పృహ, ఫిట్‌నెస్ పట్ల శ్రద్ద పెరిగాయి. జిమ్‌లకు వెళ్లేవారు, బరువు తగ్గాలనుకునేవారు లేదా కండరాల పుష్టి కోసం ప్రయత్నం చేసేవారు ప్రోటీన్ షేక్స్, హెల్త్ సప్లిమెంట్లు, డిజైనర్ ప్రోటీన్ బార్ల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కానీ, మన తాతల తండ్రుల కాలంలో ఎలాంటి ప్రొటీన్ పౌడర్లు ఉండేవి కావు. అయినా వారు ఎంతో బలంగా, శక్తివంతంగా, దీర్ఘకాలిక ఆరోగ్యంతో జీవించారు. దానికి కారణం వారు రోజూ తీసుకునే సంప్రదాయ భారతీయ ఆహారమే! మన ప్రాంతీయ వాతావరణం, రుతుపవనాలు , పాతకాలపు వంట పద్ధతుల ఆధారంగా మన పళ్లెంలో చేరే రోజూవారీ ఆహారంలో ప్రోటీన్లు పుష్కలంగా లభించేవి. ఆధునిక ఆహార అలవాట్ల వల్ల కాలక్రమేణా మనం మరచిపోయిన, కానీ మన తాతల కాలంలో క్రమం తప్పకుండా తిన్న 10 శక్తివంతమైన ప్రోటీన్ ఆహారాలు ఉన్నాయి.  నిజానికి ఇవన్నీ ప్రోటీన్ సూపర్ ఫుడ్స్.. అవేంటో తెలుసుకుంటే..  ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం:  ఉలవలు.. ఒకప్పుడు పల్లెల్లో ప్రతి ఇంట్లో క్రమం తప్పకుండా వాడే ధాన్యాల్లో ఉలవలు ముఖ్యమైనవి. శాకాహారంలో ప్రోటీన్ అత్యధికంగా లభించే ఆహారాల్లో ఇది ఒకటి. మన తాతలు రోజంతా కష్టపడి పనిచేయడానికి అవసరమైన శక్తిని ఈ ఉలవలే ఇచ్చేవి. ఉలవ చారు, ఉలవ పప్పు, చట్నీలు లేదా గుగ్గిళ్ల  రూపంలో వీటిని తీసుకునేవారు. ప్రోటీన్‌తో పాటు ఇందులో ఐరన్, పీచు పదార్థం , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కిడ్నీ రాళ్లను నివారించడంలోనూ, శరీరంలో కొవ్వును తగ్గించడంలోనూ అద్భుతంగా పనిచేస్తాయి. సత్తు పిండి.. ఇది శనగలను వేయించి, మెత్తగా పొడి చేసి తయారుచేసే సంప్రదాయ ఆహారం. ప్రోటీన్ షేక్స్‌కు ఇది పూర్వీకుల కాలం నాటి దేశీ వెర్షన్ అని చెప్పవచ్చు. వేసవికాలంలో సత్తు పిండిని నీళ్లు, నిమ్మరసం, మసాలాలతో కలిపి  తాగేందుకు వాడేవారు. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా, కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. నాణ్యమైన ప్రోటీన్ , ఫైబర్ ఉన్న సత్తు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. నల్ల శనగలు.. ఈ రోజుల్లో తెల్ల శనగలు వాడకం పెరిగినప్పటికీ, పూర్వకాలంలో నల్ల శనగలదే హవా రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే గుడాలుగా  తినడం లేదా కూరల్లో వాడటం చేసేవారు. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా వేయించిన నల్ల శనగలను తీసుకెళ్లేవారు. ఇవి త్వరగా పాడవవు, తింటే కడుపు నిండుగా ఉంటుంది. ఇవి ప్లాంట్ బేస్డ్   ప్రోటీన్‌తో పాటు ఐరన్‌ను సమృద్ధిగా అందిస్తాయి.  బొబ్బర్లు / అలసందలు.. బొబ్బర్లు లేదా అలసందలు ఒకప్పుడు ప్రతీ ఇంట్లోనూ రెగ్యులర్‌గా వండే కూర ధాన్యం. వీటిలో అత్యధిక మోతాదులో ప్రోటీన్, ఫైబర్, ఫోలేట్ , ఐరన్ ఉంటాయి. నాటు దినుసులు , మసాలాలతో నెమ్మదిగా ఉడికించి చేసే బొబ్బర్ల కూర లేదా గుడాలు శరీరానికి మంచి బలాన్ని ఇస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి. మట్కీ / మోత్ బీన్స్.. రాజస్థాన్ వంటి పొడి వాతావరణం కలిగిన ప్రాంతాలలో ఎక్కువగా పండే మట్కీ లేదా మోత్ బీన్స్ చిన్నగా ఉన్నప్పటికీ పోషకాల గని. ఇవి చూడటానికి పెసల సైజ్ లో ఉంటాయి. కానీ వీటి రంగు మాత్రం భిన్నంగా ఉంటుంది.  తక్కువ నీటితో పండే ఈ పంట రైతులకు, ప్రజలకు ప్రధాన ప్రోటీన్ మూలంగా ఉండేది. వీటిని మొలకలెత్తించి తినడం లేదా కారంగా కూర వండుకోవడం చేసేవారు. ధాన్యాలను మొలకెత్తించడం వల్ల వాటిలోని ప్రోటీన్ , ఇతర పోషకాలను శరీరం సులభంగా గ్రహిస్తుందని మన పూర్వీకులకు ముందే తెలుసు. మినపప్పు.. నేడు మినపప్పును కేవలం ఇడ్లీ, దోస పిండి లేదా పోపులకే పరిమితం చేశాం. కానీ, పూర్వకాలంలో మినపప్పుతో వడలు, మినప రొట్టెలు, మినప సున్నుండలు వంటి బలమైన పదార్థాలు తయారుచేసి తినేవారు. మినపప్పులో ప్రోటీన్‌తో పాటు క్యాల్షియం, పొటాషియం, ఐరన్ మెండుగా ఉంటాయి. బియ్యం లేదా తృణధాన్యాలతో కలిపి మినపప్పును తిన్నప్పుడు అది శరీరానికి పూర్తిస్థాయి ప్రోటీన్‌ను అందిస్తుంది.  ఇంట్లోనే తయారుచేసిన తాజా పనీర్.. పాకెట్లలో లభించే ప్యాక్ చేసిన పనీర్ కాకుండా, మన అమ్మమ్మలు గేదె లేదా ఆవు పాల నుంచి తాజా నిమ్మరసం పిండి పనీర్ తయారు చేసేవారు. ఈ తాజా పనీర్‌లో ఎలాంటి రసాయనాలు ఉండవు. ఇది నాణ్యమైన ప్రోటీన్ , క్యాల్షియంను ఉచితంగా శరీరానికి అందిస్తుంది. ఎముకల గట్టితనానికి, కండరాల పునరుద్ధరణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.  వేయించిన వేరుశనగలు..   నట్స్ అనగానే ఈ రోజుల్లో బాదం, జీడిపప్పు, పిస్తా గుర్తుకొస్తాయి. కానీ పేదవాడి బాదం పప్పు అయిన వేరుశనగలు పోషకాల్లో దేనికీ తీసిపోవు. సాయంత్రం పూట తినుబండారంగా, లేదా బెల్లంతో కలిపి పల్లీ పట్టీ రూపంలో పూర్వీకులు వీటిని రోజూ తినేవారు. వేరుశనగల్లో ప్రోటీన్‌తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. రాజగిరా / అమరాంత్ గింజలు.. రాజగిరాను  ఉపవాసాల సమయంలో ఎక్కువగా తింటుంటారు. కానీ పూర్వకాలంలో దీన్ని రోజూ ఆహారంలో భాగం చేసుకునేవారు. రాజగిరా గింజల్లో శరీరం స్వయంగా తయారుచేసుకోలేని 9 రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇది సంపూర్ణ ప్రోటీన్ కలిగిన అతికొద్ది వృక్షాహారాలలో ఒకటి. రాజగిరా లాడ్డు, జావ, రొట్టెల రూపంలో  తీసుకోవడం వల్ల ఎముకలు గట్టిపడతాయి. నువ్వులు .. పరిమాణంలో చిన్నవిగా ఉన్నప్పటికీ నువ్వులలో ఉండే పోషకాలు అపారం. నువ్వుల పొడి, నువ్వుల చట్నీ, నువ్వుల ఉండలు మన సంప్రదాయ ఆహారంలో భాగం. నువ్వులలో కేవలం క్యాల్షియం, మంచి కొవ్వులే కాకుండా విలువైన ప్రోటీన్ కూడా ఉంటుంది. నువ్వులను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల కండరాలు బలంగా మారడమే కాకుండా చర్మం, జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫిట్‌నెస్ అంటే విదేశీ ఆహార అలవాట్లను లేదా ప్యాక్ చేసిన హెల్త్ పౌడర్లను గ్రైండ్ చేయడం కాదు. మన ఇంట్లోనే, మన పూర్వీకులు తిన్న సంప్రదాయ ధాన్యాలు , పప్పు దినుసులలోనే శరీరానికి అవసరమైన అసలైన బలం దాగి ఉంది.  దైనందిన ఆహారంలో మళ్లీ ఈ పాతకాలపు ఆహారాలను భాగం చేసుకుంటే ఆరోగ్యకరమైన శరీరం లభిస్తుంది.  
రోజూ కొన్ని నిమిషాలు ఓం చాంటింగ్ చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుందని యోగా నిపుణులు చెబుతున్నారు. ఉద్గీత్ ప్రాణాయామం (Udgitha Pranayama) లో లోతుగా శ్వాస తీసుకుని, నెమ్మదిగా శ్వాసను వదులుతూ “ఓం” అని దీర్ఘంగా ఉచ్చరిస్తారు. ఈ ప్రక్రియ శ్వాసపై దృష్టిని కేంద్రీకరించడంతో పాటు మనసును రిలాక్స్ చేయడంలో సహాయపడవచ్చు. ఈ వీడియోలో ఉద్గీత్ ప్రాణాయామం అంటే ఏమిటి? దీన్ని ఎలా చేయాలి? ఓం చాంటింగ్ తర్వాత 2–3 సెకన్ల పాటు ఉండే విరామానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి? అలాగే స్ట్రెస్, బీపీ, గుండె ఆరోగ్యం, నిద్రలేమి వంటి అంశాలపై దీని ప్రభావం గురించి తెలుసుకుందాం. అయితే ప్రతి ఒక్కరికీ అన్ని రకాల ప్రాణాయామాలు ఒకే విధంగా సరిపోవు. ఎవరెవరు ఉద్గీత్ ప్రాణాయామం చేయకుండా ఉండాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి ముఖ్యమైన విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. గమనిక: ప్రాణాయామం ఆరోగ్యానికి సహాయకరంగా ఉండవచ్చు కానీ ఇది వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. బీపీ, గుండె సంబంధిత సమస్యలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రాణాయామం ప్రారంభించే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)