LATEST NEWS
తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి ఖాళీగా ఉందా? లేక ఖాళీ అవ్వబోతోందా? అన్న అనుమానాలు రేకెత్తేలా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి. ఆయన తాజాగా తాను తెలంగాణ సీఎం కావడం ఖాయం, దానిని ఎవరూ అడ్డుకోలేరంటూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. అంతే కాకుండా ఆయన వ్యాఖ్యలు తెలంగాణ అధికార కాంగ్రెస్ లో  అంతర్గత విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయన్న విషయాన్నీ బహిర్గతం చేశాయి.  దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  తమ కుటుంబం ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకే కట్టుబడి ఉందనీ,  పార్టీ కోసం కష్టపడిన అసలు సిసలైన నాయకులకు  గుర్తింపు దక్కాల్సిన అవసరం ఉందన్నారు.  అంతే కాకుండా  తాను   రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతానని, ఆ పదవిని తాను కచ్చితంగా చేపడతానని విస్పష్టంగా చెప్పారు.  ప్రజా సేవలో  శ్రమిస్తున్న తమ లాంటి నాయకులకు ప్రజల మద్దతు ఉన్నంతవరకు  పదవులు దక్కకుండా ఎవరూ అడ్డుకోలేరన్న కోమటిరెడ్డి..  తెలంగాణలో కొందరు నేతలు పార్టీని తమ గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తున్నారని, అలాంటి ప్రయత్నాలను సహించేది లేదని హెచ్చరించారు.  గత కొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, సీఎం మార్పు చర్చల నేపథ్యంలో  రాజగోపాల్ రెడ్డి  వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  పార్టీలో తొలి నుంచీ ఉన్న నాయకులు, మధ్యలో ఇతర పార్టీల నుంచి వచ్చి చేరి కీలక స్థానాలలో కొనసాగుతున్న నాయకుల మధ్య ఆధిపత్య పోరు అంటూ జరుగుతున్న ప్రచారానికి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వ్యాఖ్యలు బలం చేకూర్చేలా ఉన్నాయి.  సొంత పార్టీ నాయకత్వ శైలిని ప్రశ్నిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు  రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను ఒక్కసారిగా పెంచేశాయి. ఓ వైపు కొండా సురేఖ వ్యవహారం హాట్ టాపిక్ గా కొనసాగుతున్న తరుణంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో తేటతెల్లం చేశాయి.  రానున్నరోజులలో కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మరింత పెచ్చరిల్లే అవకాశాలున్నాయని పరిశీలకులు రాష్ట్ర పార్టీలో ఇటీవలి కాలంలో వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలను ఉటంకిస్తూ విశ్లేషిస్తున్నారు.   [Sensation in Telangana Politics, Komatireddy, CM Comments, Telangana CM, Telugu One]
  తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు మంత్రి కొండా సురేఖ నెక్స్ట్ స్టెప్ ఏమిటన్న దానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇందుకు బుధవారం (సెప్టెంబర్ 2) రోజంతా ఢిల్లీ వేదికగా జరిగిన హై డ్రామాయే కారణం. కొండా సురేఖ వ్యవహారంపై  హస్తినలో బుధవారం (సెప్టెంబర్ 2) కీలక పరిణామాలు జరిగాయి. ఒక వైపు ఇదే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో చర్చించారు. మరో వైపు కొండా సురేఖ కోరినప్పటికీ వారి అప్పాయింట్ మెంట్ ఆమెకు దొరక లేదు. దీనిని బట్టే కొండా సురేఖకు కేబినెట్ నుంచి ఉద్వాసన ఖాయమన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనూ కాకుండా పరిశీలకుల్లో సైతం వ్యక్తమైంది. అయితే ఈ విషయంలో  కొండా సురేఖ.. హైకమాండ్ నిర్ణయంతో సంబంధం లేకుండా సొంత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పరిశీలకులు విష్లేసిస్తున్నారు. ఇందుకు ఆమె మీడియా ఎదుట చేసిన వ్యాఖ్యలను ఉదాహరణగా చూపుతున్నారు. హస్తిన వేదికగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఆమె నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనే విమర్శనాస్త్రాలు సంధించారు. అలాగే మంత్రి పొంగులేటి సుధాకరరెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణిలపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్ హైకమాండ్ తీరునూ నిలదీశారు. హైకమాండ్ బీసీలపై ఆరోపణలు వస్తే ఒకలాగా, ఇతరులపై ఆరోపణలు వస్తే మరొకలాగా స్పందిస్తారా అని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ పేరెత్తకుండానే నిలదీశారు.  ఇక తన భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడుతూ.. పార్టీ తీసుకునే నిర్ణయంపైనే తన కార్యాచరణ అధారపడి ఉంటుందని అన్యాపదేశంగా ఒక వేళ తనను కేబినెట్ నుంచి తొలగిస్తే.. పార్టీకి రాజీనామా చేయడానికి కూడా వెనుకాడనని చెప్పారు.  ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది. ఈ పరిణామం నిస్పందేహంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు ఎదురుదెబ్బగా పరిణమిస్తుందని అంటున్నారు.  చూడాలి మరి కాంగ్రెస్ అధిష్ఠానం ఏం నిర్ణయిస్తుందో.. కొండా సురేఖ ఏ నిర్ణయం తీసుకుంటారో? [Konda Surekha Goodbye to Congress, Resign, MLA, Warangal East, By Election, Telangana Politics, Telugu One]
  నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..! తనను వద్దు అని చెప్పే అధికారం నాకు లేదు.. తన జీవితం తన ఇష్టం..! ఢిల్లీ మీడియా చిట్‌చాట్‌లో మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో స్పందించారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనపై చర్యలు తీసుకోవద్దని కోరారు. మహిళలు స్వతంత్రంగా బతకాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చెబుతున్నారని, తన కుమార్తె మాట్లాడిన అంశానికి తనను బాధ్యురాలిని చేయడం సరికాదని అన్నారు. తనపై చర్యలు తీసుకుంటే బీసీలు ఏకమవుతారని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. “నా బిడ్డ మాట్లాడితే నాకు ఎందుకు శిక్ష వేస్తారు..? నా కూతురు మాట్లాడిన దానికి నాపై చర్యలు తీసుకోవద్దు” అని ఆమె పేర్కొన్నారు. నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది. ఆమెను వద్దని చెప్పే అధికారం నాకు లేదు.. తన జీవితం తన ఇష్టం అని మంత్రి కొండా సురేఖ అన్నారు. తాను బీసీ మహిళా మంత్రినని.. తన భర్త మున్నూరు కాపు, తాను పద్మశాలి కులానికి చెందినవారినని తెలిపారు. తమ కులానికి 16 శాతం ఓట్లు ఉన్నాయని పేర్కొన్నారు. తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని స్పష్టం చేశారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండానే తన శాఖను సమర్థంగా నిర్వహిస్తున్నానని అన్నారు. ఒకవైపు కర్ణాటక కాంగ్రెస్‌లో ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా లేరంటూ ఆందోళన జరుగుతోందని.. మరోవైపు తనపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తనపై ప్రెస్‌మీట్లు పెట్టిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వెనుక ఎవరున్నారో తనకు తెలుసని కొండా సురేఖ అన్నారు. అధిష్ఠానం కూడా ఈ విషయాలను ఆలోచించాలని సూచించారు. మీనాక్షి మేడంకు తాను చెప్పాల్సిందంతా చెప్పానని తెలిపారు. తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం తప్పని అన్నారు. తనపై ఏమైనా చర్యలు తీసుకోవాలంటే ఏఐసీసీనే తీసుకోవాలని.. తాను ఏఐసీసీ సభ్యురాలినని కొండా సురేఖ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కే.సీ. వేణుగోపాల్‌ అపాయింట్‌మెంట్‌ తనకు దొరకలేదని తెలిపారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశానని, తనపై వచ్చిన అంశాలపై ఆయనకు వివరణ ఇచ్చానని చెప్పారు.“ నాపై చర్యలు తీసుకునే ముందు సీఎం రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలి” అని కొండా సురేఖ అన్నారు. పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్‌రెడ్డి ఎలా చెబుతారని ప్రశ్నించారు. అలాగే మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, భట్టి విక్రమార్క భార్యకు సంబంధించిన కమీషన్ల అంశాలపై కూడా చాలా ఫిర్యాదులు వచ్చాయని ఆమె వ్యాఖ్యానించారు.  “ఆ ఫిర్యాదులపై ఎందుకు మాట్లాడటం లేదు?” అని ప్రశ్నించారు. చాలామంది రెడ్లు మాట్లాడిన సందర్భాల్లో వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కొండా సురేఖ ప్రశ్నించారు. తన విషయంలో మాత్రమే చర్యల అంశాన్ని తెరపైకి తీసుకురావడం ఏమిటని ఆమె నిలదీశారు. మంత్రి కొండా సురేఖ తాజా వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత విభేదాలు, నేతల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలపై మరోసారి చర్చకు దారితీశాయి.   Konda Surekha Delhi visit, CM Revanth Reddy, Congress high command, AICC Mallikarjun Kharge, Konda Susmita comments, Telangana cabinet reshuffle 2026, Telangana politics news, K.C. Venugopal, Meenakshi Natarajan
ALSO ON TELUGUONE N E W S
మలయాళంలో సంచలన విజయం సాధించిన నివిన్ పౌలీ, మమితా బైజు లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ 'బెత్లెహెం కుటుంబ యూనిట్' తెలుగు రిలీజ్ విషయంలో ఊహించని షాక్ తాగింది.  ప్రేమలు లాంటి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ గిరీష్ నుంచి వస్తున్న సినిమా ఇది. మలయాళంలో ఆల్రెడీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి టాప్ గేర్‌లో దూసుకెళ్తోంది. విపరీతమైన క్రేజ్ ఉండటంతో తెలుగు డబ్బింగ్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ దక్కించుకుని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. కానీ చివరి నిమిషంలో ఈ సినిమాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. PVR, INOX, మిరజ్ లాంటి పెద్ద పెద్ద మల్టీప్లెక్స్ చైన్స్ అన్నీ ఈ సినిమా తెలుగు వెర్షన్ ను తమ థియేటర్లలో ప్రదర్శించడానికి నిరాకరించాయి. మల్టీప్లెక్స్ చైన్స్ స్క్రీన్స్ కేటాయించకపోవడంతో ఇప్పుడు ఈ సినిమా కేవలం లోకల్ మల్టీప్లెక్స్ లు, సింగిల్ స్క్రీన్స్ లో మాత్రమే రిలీజ్ కాబోతోంది. సాధారణంగా మల్టీప్లెక్స్ చైన్స్ రూల్స్ ప్రకారం ఏదైనా సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత కనీసం 6 నుంచి 8 వారాల పాటు OTT లోకి రాకూడదు. కానీ బెత్లెహెం కుటుంబ యూనిట్ ఇప్పటికే ఆగస్టులోనే మలయాళంలో థియేట్రికల్ రిలీజ్ అయింది. దాంతో డిజిటల్ స్ట్రీమింగ్ గ్యాప్ చాలా తక్కువగా ఉండబోతోంది. అతి త్వరలోనే ఈ మూవీ OTT లోకి రానుండటంతో, మల్టీప్లెక్స్ చైన్స్ తమ నిబంధనలకు విరుద్ధంగా స్క్రీన్లు ఇవ్వలేమని స్పష్టం చేశాయి. మరి ఈ వివాదం నడుమ ఎక్కువగా సింగిల్ స్క్రీన్స్ లోనే విడుదలవుతున్న ఈ మలయాళ డబ్బింగ్ ఎంటర్‌టైనర్ తెలుగు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.       [Bethlehem Kudumba Unit, Telugu Release, Nivin Pauly, Mamitha Baiju, Premalu Director, Girish AD, Mythri Movie Makers, Telugu Film News, Telugu News]  
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి గ్లామర్‌తో పాటు అద్భుతమైన నటన, పొడవైన పర్సనాలిటీతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసులను దోచుకున్న భామ ఫరియా అబ్దుల్లా. 'జాతిరత్నాలు' చిత్రంలో 'చిట్టి'గా అమాయకపు నటనతో అలరించిన ఈ హైదరాబాద్ బ్యూటీ, కేవలం నటనకే పరిమితం కాకుండా మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్‌గా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఈ పొడుగుపాటి సుందరి తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన ఒక గ్లామరస్ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తెల్లటి బికినీ తరహా డ్రెస్‌లో ఫరియా ఇచ్చిన కిల్లర్ పోజులు, హాట్ ఎక్స్‌ప్రెషన్లు కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఎప్పుడూ ట్రెడిషనల్ అండ్ బబ్లీ లుక్స్‌తో కనిపించే చిట్టిలో ఇంతటి హాట్ అండ్ బోల్డ్ యాంగిల్ కూడా ఉందా అని అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ లేటెస్ట్ విజువల్స్ చూసిన నెటిజన్లు కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. "ఫరియాలో స్టార్ హీరోయిన్‌కు కావలసిన అన్ని గ్లామర్ క్వాలిటీస్ ఉన్నాయని, టాలీవుడ్ దర్శకులు ఆమెలోని ఈ హాట్ యాంగిల్‌ను కూడా గమనించి పెద్ద సినిమాల్లో అవకాశాలు ఇవ్వాలని" కోరుతున్నారు. మరికొందరు అభిమానులైతే ఏకంగా హాలీవుడ్ రేంజ్ కటౌట్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నటిగా మాత్రమే కాకుండా ఫరియా అబ్దుల్లాలో చాలా కోణాలు ఉన్నాయి. 'బంగార్రాజు'లో స్పెషల్ సాంగ్‌తో రచ్చ చేసిన ఈ భామ.. డాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా, గేయ రచయితగా, గాయకురాలిగా కూడా తన సత్తా చాటుకున్నారు. ఇటీవల వచ్చిన 'మత్తు వదలరా 2' చిత్రంలో నటిస్తూనే పాటలు పాడి, లిరిక్స్ అందించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఫరియా కెరీర్ విషయానికి వస్తే, వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ద్విభాషా యాక్షన్ థ్రిల్లర్ 'సిగ్మా'తో పాటు విజయ్ ఆంటోనీతో కలిసి ఓ కోలీవుడ్ సినిమాలో నటిస్తున్నారు. అలాగే సత్యదేవ్‌తో ఓ క్రేజీ ప్రాజెక్ట్, తిరువీర్ సరసన 'భగవంతుడు' అనే చిత్రంలోనూ నటిస్తూ ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. సినిమాలతో నిరంతరం బిజీగా ఉంటూనే, ఇలాంటి గ్లామరస్ వీడియోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫరియా రాబోయే రోజుల్లో స్టార్ హీరోయిన్‌గా రీచ్ అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కొత్త గ్లామర్ లుక్ ఆమె కెరీర్‌కి మరిన్ని పెద్ద అవకాశాలను తెచ్చిపెడుతుందో లేదో వేచి చూడాలి.       [Faria Abdullah Glamorous Photos, Jathi Ratnalu Chitti Faria Abdullah, Faria Abdullah Latest Video Viral, Tollywood Heroine Faria Glam Look, TeluguOne Entertainment News]
    సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన మూవీ  జైలర్. దీంతో  సీక్వెల్ గా తెరకెక్కుతున్న 'జైలర్ 2 ' పై ఎలాంటి అంచనాలు ఉంటాయో చెప్పక్కర్లేదు. ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు అయితే రిలీజ్ డేట్ కోసం ఎదురుచూపులు. ఇప్పుడు ఆ ఎదురుచూపులు ఫలించి రిలీజ్ డేట్ వచ్చేయడంతో వాళ్లంతా రజిని స్టైల్ ఆఫ్ మేనరిజమ్స్ తో బిజీగా ఉన్నారు. చేతిలో తుపాకీ పట్టుకుని ఉన్న రజినీకాంత్ పవర్‌ఫుల్ పోస్టర్‌ని విడుదల చేస్తూ, దసరా కానుకగా  ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 15, 2026న థియేటర్లలోకి వస్తుందని స్పష్టంగా ప్రకటించింది. "అలప్పార కేలప్పరోమ్" అనే 'హుకుమ్' పాటలోని ఐకానిక్ క్యాచీ ట్యాగ్‌లైన్‌తో ఈ కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. టైగర్ ముత్తువేల్ పాండ్యన్ పాత్రలో రజినీకాంత్ ఇచ్చే ఎలివేషన్లు, ఆయన మానరిజమ్స్ ప్రేక్షకులను ఎలా కట్టిపడేస్తాయో మొదటి భాగంలో అందరూ చూశారు. ఇప్పుడు సీక్వెల్‌లో ఆ క్రేజ్‌ను మరింత తారాస్థాయికి తీసుకెళ్లేందుకు దర్శకుడు నెల్సన్ అత్యంత ప్రతిష్టాత్మక కథనాన్ని సిద్ధం చేశారు. ఈసారి కేవలం రజినీకాంత్ విశ్వరూపం మాత్రమే కాకుండా, భారీ తారాగణం ఈ చిత్రంలో అలరించబోతోంది. విద్యాబాలన్, ఎస్.జె. సూర్య, మిథున్ చక్రవర్తి, రమ్యకృష్ణ మరియు యోగి బాబు వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విజయ్ సేతుపతి ఒక ప్రత్యేక కామియో పాత్రలో మెరవనుండగా, మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్ మరియు హృతిక్ రోషన్ల మెరుపు నటన కూడా ఈ సీక్వెల్ స్థాయిని మరింత పెంచుతుందని టాక్ నడుస్తోంది. Also Read: రోమాంచకం మూవీపై మహేష్ బాబు షాకింగ్ రివ్యూ  మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ బాణీలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇప్పటికే విడుదలైన 'అలా బొలేలో' ప్రమోషనల్ సాంగ్ మరియు అనౌన్స్‌మెంట్ టీజర్ సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నిలిచాయి.    [ RajiniKanth, jailer 2, Nelson DilpKumar, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood, Tollywoodnews]
బుల్లితెరపై ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు 'శ్రీముఖి'. తనదైన వేగవంతమైన యాంకరింగ్, హుషారైన మాటలతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ బుల్లితెర రాములమ్మ, సోషల్ మీడియాలోనూ అంతే ఆక్టివ్‌గా ఉంటారు. తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఓ మాస్ జానపద పాటకు శ్రీముఖి వేసిన ఎనర్జిటిక్ స్టెప్పులు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'ది ప్యారడైజ్' నుంచి విడుదలైన 'యేషనాగుల కట్టమీద' పాట ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఒరిజినల్ తెలంగాణ ఫోక్ వర్షన్‌ను ఈ చిత్రంలో రీమిక్స్ చేయడంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతీ ఒక్కరూ ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలోనే శ్రీముఖి కూడా ఈ మాస్ ట్రెండింగ్‌లో భాగమై తన డ్యాన్స్ హంగామాతో అందరి దృష్టిని ఆకర్షించారు. జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూనే ఈ పాటకు శ్రీముఖి తనదైన శైలిలో డ్యాన్స్ చేశారు. వైట్ కలర్ టీషర్ట్, బ్లూ మినీ షార్ట్స్‌లో కనిపించిన ఆమె, పాటలోని ఊపుకు తగినట్లుగా మాస్ బీట్‌తో చెలరేగిపోయారు. "సెప్టెంబర్ ఎనర్జీ" అంటూ ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా, అది షేర్ చేసిన కొద్ది సమయంలోనే వైరల్ ట్రెండింగ్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు శ్రీముఖి ఎనర్జీ లెవెల్స్‌కు ఫిదా అవుతున్నారు. "బుల్లితెర రాములమ్మ అసలైన మాస్ స్టెప్పులతో ఇరగదీసింది", "శ్రీముఖి ఎనర్జీ వేరే లెవెల్" అంటూ కామెంట్ల రూపంలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పాటలోని జోష్‌కి ఆమె పర్ఫెక్ట్ టైమింగ్‌తో చేసిన డ్యాన్స్ ఎంతో ముచ్చటగా ఉందంటూ రీల్స్‌కి లైకుల వర్షం కురిపిస్తున్నారు. బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా బిజీగా ఉన్న శ్రీముఖి, పలు హిట్ టీవీ షోలు మరియు సినిమా ప్రి-రిలీజ్ ఈవెంట్లకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ నిరంతరం అలరిస్తున్నారు. టీవీ ప్రసారాలతో పాటు వెండితెరపై కూడా మంచి పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ డ్యాన్స్ వీడియోతో శ్రీముఖి మరింత క్రేజ్ సంపాదించుకున్నారు. మున్ముందు కూడా తనదైన ఎనర్జిటిక్ వీడియోలతో ప్రేక్షకులకు మరిన్ని సర్‌ప్రైజులు ఇస్తారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. https://www.instagram.com/reel/DcwTIyYzono/?       [Anchor Sreemukhi Dance Video, Yeshanagula Kattameeda Song, Srimukhi Mass Dance Steps, Nani The Paradise Songs, TeluguOne Entertainment News]
    సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'వారణాసి' తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇంత బిజీలో కూడా ఈ రోజు విడుదలైన 'రోమాంచకం' అనే సినిమా బృందానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన పోస్ట్ ఇప్పుడు చిత్రసీమలోనూ, సోషల్ మీడియాలోనూ సంచలనంగా మారింది. సూపర్ స్టార్ నుండి వచ్చిన ఈ అనూహ్యమైన ప్రశంసతో 'రోమాంచకం' చిత్ర యూనిట్ అత్యంత ఆనందంలో మునిగి తేలుతోంది. సినిమా పరిశ్రమలో చిన్న చిత్రాలకు పెద్ద హీరోల మద్దతు లభిస్తే వచ్చే మైలేజ్ సాధించే విజయం ఎంతో ఘనంగా ఉంటుంది. సరిగ్గా అదే పరిస్థితి ఇప్పుడు ఈ చిన్న సినిమాకు దక్కింది. మహేష్ బాబు ఈ చిత్రాన్ని వీక్షించి, అందులోని మేకింగ్, నటీనటుల అద్భుతమైన ప్రదర్శన మరియు దర్శకత్వ శైలిని విపరీతంగా అభినందించారు. ముఖ్యంగా యూత్ ని ఆకట్టుకునే కథాంశం, కామెడీ అండ్ హారర్ ఎలిమెంట్స్ చాలా సహజంగా కుదిరాయని ఆయన పేర్కొనడంతో ప్రేక్షకులలో ఈ సినిమాపై ఆసక్తి ఒక్కసారిగా రెట్టింపైంది. Also Read: ఎన్టీఆర్ తో సినిమాలు తెరకెక్కించిన నిర్మాతలు,చిరంజీవితో ఎందుకు సినిమాలు చేసారో తెలుసా!  నటీనటులు తమ క్యారెక్టర్లలో పూర్తిస్థాయిలో ఒదిగిపోయి అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ అందించారు. సాధారణంగా కంటెంట్ బలంగా ఉన్నప్పుడు సరైన ప్రచారం దక్కితే ఆ సినిమా రేంజ్ మారిపోతుంది. సూపర్ స్టార్ ఇచ్చిన ఈ ఒక్క ట్వీట్/పోస్ట్ తో సినిమాకు ఊహించని రేంజ్ లో పబ్లిసిటీ లభించింది. ఎంటర్ టైన్ మెంట్ పరంగా  పాజిటివ్ టాక్ తెచ్చుకుంటున్న ఈ చిత్రం, ఇప్పుడు అన్ని కేంద్రాల్లోనూ థియేటర్ల సంఖ్యను మరియు షోల సంఖ్యను పెంచుకునే దిశగా వేగంగా వెళుతోంది.     [ Mahesh Babu, Roamchakam, Sumanth Prabhas, Sandeep Reddy Vanga, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood, Tollywoodnews ]
  విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్.. మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినిమా నిద్రలో కూడా గర్వంగా చెప్పుకునే లెజండ్రిస్. తమకి మాత్రమే సాధ్యమయ్యే రీతిలో పెర్ ఫార్మ్ చేసి తెలుగు సినిమాకి గర్వాన్ని పరిచయం చేసారు. అందులో ఎన్టీఆర్ తొలి ఆద్యుడు కాగా చిరంజీవి మలి ఆద్యుడు. ఈ విషయాన్నీ ముందుగానే గమనించారేమో ఎన్టీఆర్  తో మాత్రమే సినిమాలు నిర్మిస్తూ ఎన్టీఆర్ నిర్మాతలుగా ముద్రపడిన వాళ్ళందరు చిరంజీవి తో ఆయన కెరీర్ స్టార్టింగ్ లో సినిమాలు తెరకెక్కించారు.   అందుకు రహస్యం ఏంటి అని విశ్లేషిస్తే, ప్రధానంగా రెండు అంశాలు కనిపిస్తాయి. మొదటిది: ఆ నిర్మాతలకు సినిమాలపై ఉన్న అపారమైన పిచ్చి. వర్ణించలేని ప్యాషన్. లాభనష్టాల లెక్కల కంటే, ప్రేక్షకులకు ఒక గొప్ప దృశ్యకావ్యాన్ని అందించాలనే తపన ఆ అందరిలో నరనరాన జీర్ణించుకుపోయింది. సినిమా నిర్మాణాన్ని కేవలం వ్యాపారంగా కాకుండా ఒక పవిత్రమైన కళగా  భావించారు. ప్రతి సన్నివేశం, ప్రతి పాట, కథలోని ప్రతి మలుపు పర్ఫెక్ట్‌గా ఉండాలనే వారి కోరిక మరియు రాజీపడని నైజమే వారిని అగ్ర నిర్మాతలుగా నిలబెట్టింది. రెండవది: ఎన్టీఆర్ గారి క్రమశిక్షణ, కృషిని  సినీ డిక్షనరీగా భావించే ఆ నిర్మాతలు, చిరంజీవిలో కూడా సరిగ్గా అదే రకమైన అంకితభావాన్ని చూశారు. డ్యాన్స్, ఫైట్స్, నటన  ఇలా ఏ విషయంలోనూ చిరంజీవి షార్ట్‌కట్‌లు వెతకలేదు. స్వయంకృషినే నమ్ముకుని, ప్రతి సినిమా కోసం రాత్రింబవళ్లు శ్రమించే ఆయన తత్వానికి ఎన్టీఆర్ నిర్మాతలు ఫిదా అయ్యారు. చిరంజీవి పట్టుదల, నిర్మాతల నిర్మాణ ప్యాషన్ కలిసి తెలుగు సినీ రంగానికి మరచిపోలేని సువర్ణ అధ్యాయాలను, రికార్డు కలెక్షన్లని తెలుగు సినిమాకి, ప్రేక్షకులకి   కానుకగా ఇచ్చాయి. Also read: Romachakam Movie Review Telugu: రోమాంచకం మూవీ రివ్యూ  ఇద్దరి నిర్మాతల లిస్ట్ చూసుకుంటే పుండరీ కాక్షయ్య అట్లూరి, దేవీవరప్రసాద్, తాతినేని త్రివిక్రమ్ రావు, అశ్వనీ దత్, కెఎస్ రామారావు, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత  రామానాయుడు  ఇలా తదితర ఎన్టీఆర్ నిర్మాతలగా ముద్రపడిన వాళ్ళందరు చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో సినిమాలు చేసారు. Ntr, Chiranjeevi, ks RamaRao, DeviVaraprasad, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood, Tollywoodnews
Cast: Sumanth Prabhas, Ananthika Sanilkumar, Upendra Limaye, Narendra Ravi, Venkatesh Kakumanu, Mani Agurla   Crew: Written and Directed by Venugopal Reddy Cinematography by Pawan Pappula Music by Vasuki Vaibhav Produced by Pranay Reddy Presented by Sandeep Reddy Vanga   Presented by Sandeep Reddy Vanga, the youthful drama Romanchakam featuring Sumanth Prabhas and Ananthika Sanilkumar has hit the screens today. Let us look at the review.   Plot: Anvesh (Sumanth Prabhas), a Gen-Z youngster from Hyderabad, falls in love with Mythili (Ananthika), a Telugu girl living in Chennai. After they get close, Mythili moves to a flat in Hyderabad. Things take a turn when she suddenly goes missing. A panicked Anvesh fears she might have gone to end her life. The film explores how they met, the truth behind their love, and the real reason for her sudden disappearance.   Analysis: The movie has a very simple plot that highlights modern-day relationships. While the character introductions are good, the first half soon feels routine. However, the comedy track involving friends saves the day and keeps things engaging. The interval twist lands well. The second half is completely driven by entertainment. Upendra Limaye’s police episode is a major highlight. However, the emotional reason behind the heroine leaving lacks the needed depth. Sumanth Prabhas performs much better than his previous outings. Ananthika gives a fine performance, acting expressively with her eyes. Narendra Ravi's comic timing is excellent. Director Venugopal Reddy succeeds more as a dialogue writer than a filmmaker. The songs are good, but the background score and production values are just average.   Positives: Performances by the lead cast Entertaining second half Engaging comedy episodes Good dialogues   Negatives: Direction lacks magic Confusion in the heroine's characterization Average background score and production values   Bottomline: Even though the main plot is weak, the movie offers decent laughs and entertainment throughout.   Rating: 2.5/5     Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.  
'ఆర్డీఎక్స్' (RDX) లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ నహాస్ హిదాయత్ దర్శకత్వంలో, మలయాళ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఐయామ్ గేమ్' (I'm Game) ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. దాదాపు మూడేళ్ళ గ్యాప్ తర్వాత దుల్కర్ నటించిన మలయాళ చిత్రం ఇది. దీనికి తోడు ఇది ఆయన కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన 40వ సినిమా కావడం, పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మరి గ్యాంబ్లింగ్, బెట్టింగ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో.. ట్విట్టర్ (X) లో జనాలు ఏమంటున్నారో చూద్దాం. దుల్కర్ సల్మాన్ డ్యాన్ జాన్ అనే కేర్‌లెస్ గ్యాంబ్లర్ పాత్రలో కనిపించారు. లక్ ని నమ్ముకుని బెట్టింగ్స్ వేసే ఒక కుర్రాడు అనుకోకుండా ఒక పెద్ద క్రైమ్ అండ్ ఫాంటసీ నెట్‌వర్క్‌లో ఎలా చిక్కుకున్నాడు అనేదే కథ. ప్రమోషన్స్ అండ్ ట్రైలర్‌లో ఎక్కడా రివీల్ చేయని సర్ ప్రైజింగ్ ఫాంటసీ ఎలిమెంట్స్ థియేటర్లో గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయని నెటిజన్లు చెప్తున్నారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో వచ్చే ప్రతీ సీన్ చాలా రేసీగా, ఇంట్రెస్టింగ్‌గా సాగుతుందట. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. దుల్కర్ వన్ మేన్ షో అనే చెప్పాలి. మాస్ అవతార్‌లో దుల్కర్ ఎనర్జీ వేరే లెవెల్. యాక్షన్ సీన్స్, డైలాగ్ డెలివరీలో దుల్కర్ విశ్వరూపం చూపించారు. ఇక ఆంటోనీ వర్గీస్ (పెప్పే) పాత్ర సినిమాకి మరో పెద్ద అసెట్. దుల్కర్, పెప్పేల కాంబినేషన్ సీన్స్, వారి మధ్య వచ్చే యాక్షన్ బ్లాక్స్ థియేటర్లను షేక్ చేస్తున్నాయి. జేక్స్ బిజోయ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అండ్ 'లూసర్' సాంగ్ థియేటర్‌లో పూనకాలు తెప్పిస్తున్నాయి. విజువల్స్ కూడా ఆకట్టుకున్నాయి అంటున్నారు. అయితే, సినిమాలో కొన్ని మైనస్‌లు కూడా ఉన్నాయంటున్నారు. సెకండ్ హాఫ్‌లో డ్రామా కొంచెం స్లో అవ్వడం, రన్ టైమ్ దాదాపు 2 గంటల 53 నిమిషాలు ఉండడం వల్ల అక్కడక్కడా కొద్దిగా సాగదీసినట్టు అనిపిస్తుంది. అయినప్పటికీ, ఓవరాల్‌గా నహాస్ హిదాయత్ టేకింగ్, విఎఫ్‌ఎక్స్, యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. ఓవరాల్‌గా ట్విట్టర్ టాక్ చూస్తే.. 'ఐయామ్ గేమ్' మాస్ అండ్ ఫాంటసీ లవర్స్‌కి ఒక పక్కా థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ అభిమానులకు ఈ సినిమా ఒక సాలిడ్ విందు అని చెప్పవచ్చు.        [I'm Game Twitter Review, I'm Game Movie Review, I'm Game Review Telugu, Dulquer Salmaan, Im Game Review, Kayadu Lohar, Nahas Hidhayath, Telugu Film News, Telugu News]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
  మనదేశంలో చాలామందికి ఉదయాన్నే లేవగానే వేడివేడిగా ఒక కప్పు టీ పడాల్సిందే. అలసటను పారద్రోలి శరీరానికి, మనస్సుకు తక్షణ ఉత్సాహాన్ని ఇవ్వడంలో టీ కీలక పాత్ర పోషిస్తుంది. రోజుకు ఒకటి రెండు కప్పుల టీ తాగడం సాధారణ అలవాటు అయినప్పటికీ, చాలామంది రోజులో పదే పదే టీ తాగుతుంటారు. అయితే, ఇలా పరిమితికి మించి ఎక్కువ మొత్తంలో టీ తాగడం వల్ల ఎముకలు బలహీనపడతాయని, శరీరంలో కాల్షియం స్థాయిలు గణనీయంగా పడిపోతాయని సోషల్ మీడియాలో నిరంతరం వార్తలు ప్రచారమవుతుంటాయి. ఈ ప్రచారం వినగానే టీ ప్రేమికుల్లో తీవ్ర ఆందోళన మొదలవుతుంది. అసలు టీ తాగడానికి, ఎముకల ఆరోగ్యానికి మధ్య ఉన్న అసలు సంబంధం ఏమిటి? అతిగా టీ తాగడం వల్ల ఎముకల సాంద్రత తగ్గి ఆస్టియోపోరోసిస్ వంటి ప్రమాదకర సమస్యలు వస్తాయా? ఈ విషయాలపై వైద్య నిపుణులు మరియు పరిశోధకులు వెల్లడించిన శాస్త్రీయ నిజాలను వివరంగా తెలుసుకోవడం ఆరోగ్య స్పృహ ఉన్న ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. పరిశోధనల ప్రకారం టీలో  కెఫిన్  అనే సమ్మేళనం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ప్రతి కప్పు టీలో దాదాపు 30 నుండి 50 మిల్లీగ్రాముల వరకు కెఫిన్ ఉంటుంది. మనం అధిక మొత్తంలో కెఫిన్ తీసుకున్నప్పుడు, అది మూత్రపిండాల (కిడ్నీల) ద్వారా శరీరంలోని కాల్షియం మూత్రం రూపంలో బయటకు విసర్జించబడేలా చేస్తుంది. సాధారణంగా మనం ప్రతి 60 మిల్లీగ్రాముల కెఫిన్ తీసుకున్నప్పుడు, శరీరం నుండి సుమారు 1 నుండి 2 మిల్లీగ్రాముల కాల్షియం నష్టపోతామని వైద్య అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంటే రోజుకు 4 నుండి 5 కప్పుల కంటే ఎక్కువ మోతాదులో టీ తాగే వారిలో కాల్షియం లోపం ఏర్పడే అవకాశాలు స్వల్పంగా పెరుగుతాయి. ముఖ్యంగా, మనం తీసుకునే రోజువారీ ఆహారంలో కాల్షియం శాతం తక్కువగా ఉన్నప్పుడు, ఈ కెఫిన్ ప్రభావం ఎముకల ఆరోగ్యంపై స్పష్టంగా కనిపిస్తుంది. ఎముకల నుండి కాల్షియం కరిగిపోవడం వల్ల వయసు పెరిగే కొద్దీ ఎముకలు లొసుగుబారి, త్వరగా విరిగిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. అయితే ఇక్కడే మరొక ఆసక్తికరమైన సైంటిఫిక్ కోణం దాగి ఉంది. టీలో కేవలం కెఫిన్ మాత్రమే కాకుండా  ఫ్లేవనాయిడ్లు  (Flavonoids) మరియు  ఫైటోఈస్ట్రోజెన్లు  అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల క్షీణతను అడ్డుకోవడంలో మరియు ఎముకల సాంద్రతను (Bone Mineral Density) మెరుగుపరచడంలో ఎంతో సాయపడతాయి. ముఖ్యంగా గ్రీన్ టీ మరియు బ్లాక్ టీలలో ఉండే పాలిఫెనాల్స్ అనే కాంపౌండ్లు ఎముకలను పునర్నిర్మించే  ఆస్టియోబ్లాస్ట్  కణాల పనితీరును వేగవంతం చేస్తాయని, అదే సమయంలో ఎముకలను కరిగించే  ఆస్టియోక్లాస్ట్  కణాల చర్యలను అదుపు చేస్తాయని రీసెర్చ్‌లో తేలింది. కాబట్టి మిితంగా అంటే రోజుకు 2 నుండి 3 కప్పుల టీ తాగే వారిలో ఎముకలు బలహీనపడటం అటుంచి, పైగా ఎముకల ఆరోగ్యం మరింత బలపడుతుందని బహుళ అధ్యయనాలు నిరూపించాయి. మరి టీ తాగే అలవాటు ఉన్నవారు ఎముకల బలాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొదటిది టీ తాగే పరిమాణాన్ని రోజుకు 2 లేదా 3 కప్పులకు పరిమితం చేసుకోవడం చాలా మంచిది. రెండవది, టీ చేసేటప్పుడు అందులో తగినంత పాలు ఉపయోగించడం వల్ల, టీ ద్వారా కోల్పోయే స్వల్ప కాల్షియంను పాలలోని ఉత్కృష్టమైన కాల్షియం భర్తీ చేస్తుంది. భోజనం చేసిన వెంటనే లేదా ఐరన్, కాల్షియం సప్లిమెంట్లు తీసుకునే సమయంలో టీ తాగకపోవడం ఉత్తమం, ఎందుకంటే టీలోని టాన్సిన్లు పోషకాల శోషణను అడ్డుకుంటాయి. మీ రోజువారీ ఆహారంలో పాలు, పెరుగు, ఆకుకూరలు, రాగులు మరియు విటమిన్ డి లభించే పదార్థాలను సమృద్ధిగా చేర్చుకుంటే టీ వల్ల ఎముకలకు ఎలాంటి నష్టం జరగదు. కాబట్టి టీని పరిమితంగా, సరైన పద్ధతిలో ఆస్వాదిస్తే ఆరోగ్యానికి ఎలాంటి భయం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. How much tea is safe for bones,tea and bone health myths vs reality.
  మన శరీరం మన ఆరోగ్య స్థితికి సంబంధించి నిరంతరం అనేక రకాల సంకేతాలను ఇస్తూనే ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా శ్వాసకోశ వ్యవస్థలో ఉత్పత్తయ్యే శ్లేష్మం లేదా తెమడ (Phlegm) రంగును బట్టి మన ఊపిరితిత్తులు మరియు గొంతు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో చాలా సులభంగా అంచనా వేయవచ్చు. వర్షాకాలం, చలికాలం లేదా వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు దగ్గుతో పాటు తెమడ రావడం సర్వసాధారణం. అయితే చాలామంది ఈ తెమడ రంగును ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. సైంటిఫిక్ అధ్యయనాల ప్రకారం శ్లేష్మం రంగు మన శరీరంలో ఏ రకమైన ఇన్ఫెక్షన్ లేదా వ్యాధి ముదిరిందో స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి తెమడ వేర్వేరు రంగుల్లోకి మారడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలను, వైద్య సంకేతాలను ప్రతీ ఒక్కరూ అవగాహన చేసుకోవడం ఎంతైనా అవసరం. సాధారణంగా ఆరోగ్యకరమైన మనుషుల్లో తెమడ స్పష్టంగా, పారదర్శకంగా (Clear Phlegm) లేదా స్వల్పమైన తెలుపు రంగులో ఉంటుంది. నీరు, ప్రొటీన్లు, యాంటిబాడీలు మరియు లవణాలతో కూడిన ఈ పారదర్శక తెమడ శ్వాసకోశ మార్గాలను తేమగా ఉంచడానికి, బయటి నుండి వచ్చే దుమ్ము ధూళిని అడ్డుకోవడానికి సహజ రక్షణ కవచంలా పనిచేస్తుంది. అయితే ఒకవేళ ఈ తెమడ విపరీతంగా పెరిగితే అలర్జీలు లేదా ఎలర్జిక్ రినిటిస్ వంటి సమస్యలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఇక తెమడ కాస్త చిక్కగా మారి తెల్లటి రంగులోకి (White Phlegm) మారితే, శ్వాసనాళాల్లో వాపు లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని సూచిస్తుంది. ముఖ్యంగా ఆస్తమా, బ్రోన్కైటిస్ లేదా నెమ్ము (Congestion) చేసినప్పుడు పిండం లాంటి చిక్కటి తెల్ల తెమడ రావడం కనిపిస్తుంది. అత్యంత సాధారణంగా చాలామందిలో కనిపిచేది పసుపు లేదా ఆకుపచ్చ రంగు తెమడ (Yellow or Green Phlegm). తెమడ పసుపు రంగులోకి మారడం అనేది మన నిరోధక వ్యవస్థ ఇన్ఫెక్షన్‌తో పోరాడటం ప్రారంభించిందనడానికి స్పష్టమైన సంకేతం. శరీరంలో వైట్ బ్లడ్ సెల్స్ (తెల్ల రక్త కణాలు) బాక్టీరియాతో పోరాడి చనిపోయినప్పుడు అందులోని మైలోపెరాక్సిడేస్ అనే ఎంజైమ్ వల్ల శ్లేష్మం పసుపు నుంచి క్రమంగా ముదురు ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. ఇది తీవ్రమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, సైనసైటిస్, నిమోనియా లేదా సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు నిదర్శనం. కాబట్టి తెమడ ఆకుపచ్చగా మారి కొన్ని రోజులకు పైగా ఉంటే వెంటనే యాంటీబయోటిక్ చికిత్స కోసం డాక్టర్‌ను సంప్రదించాలి.       Blood in phlegm symptoms and lung health, phlegm color meaning and infection signs.
  నేటి ఆధునిక జీవనశైలిలో వేగంగా బరువు తగ్గడానికి మరియు పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవడానికి అనేకమంది ఆశ్రయిస్తున్న ప్రసిద్ధ పద్ధతుల్లో  డిటాక్స్ వాటర్  ఒకటి. నీళ్లలో నిమ్మకాయ ముక్కలు, దోసకాయ, అల్లం, పుదీనా, లేదా రకరకాల పండ్ల ముక్కలు వేసి నానబెట్టి, ఆ నీటిని రోజంతా తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోయి బరువు తగ్గుతారనే ప్రచారం సోషల్ మీడియాలో విపరీతంగా సాగుతోంది. అయితే డిటాక్స్ వాటర్ నిజంగానే బరువు తగ్గిస్తుందా లేక ఇదొక సాధారణ మార్కెటింగ్ భ్రమ మాత్రమేనా అనే అంశంపై ఆరోగ్య నిపుణులు, పోషకాహార నిపుణులు స్పష్టమైన సైంటిఫిక్ నిజాలను వెల్లడిస్తున్నారు. ఎలాంటి నిజాలు దాగి ఉన్నాయో శాస్త్రీయంగా తెలుసుకోవడం ఆరోగ్య స్పృహ ఉన్న ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. ముందుగా డిటాక్స్ వాటర్ తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలు లేదా టాక్సిన్లు దానంతట అవే బయటకు వెళ్తాయని అనుకోవడం ఒక పెద్ద పొరపాటు. మన మానవ శరీరంలో కాలేయం (లివర్) మరియు మూత్రపిండాలు (కిడ్నీలు) నిరంతరం పనిచేస్తూ వ్యర్థాలను బయటకు పంపే అద్భుతమైన సహజ సిద్ధమైన వ్యవస్థను కలిగి ఉన్నాయి. దీనికోసం ప్రత్యేకంగా ఎలాంటి డిటాక్స్ పానీయాలు తాగాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ, క్రమం తప్పకుండా డిటాక్స్ వాటర్ తీసుకోవడం వల్ల శరీరానికి ఒక ప్రధానమైన మేలు జరుగుతుంది. అది నీటి శాతాన్ని పెంచడం లేదా హైడ్రేషన్‌గా ఉంచడం. సాధారణ నీటిని సరిగా తాగలేని వారు, పండ్లు మరియు మూలికల సువాసన ఉన్న ఈ నీటిని రుచికరంగా భావించి ఎక్కువ మొత్తంలో తాగుతారు. శరీరం సరిగ్గా హైడ్రేట్ అయినప్పుడు మెటబాలిజం అంటే జీవక్రియ రేటు స్వల్పంగా మెరుగుపడుతుంది, ఇది పరోక్షంగా కేలరీలను వేగంగా ఖర్చు చేయడానికి తోడ్పడుతుంది. డిటాక్స్ వాటర్‌లో వేసే నిమ్మకాయ, పుదీనా, అల్లం వంటి పదార్థాల వల్ల నీటికి విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు మరియు శోథ నిరోధక (యాంటీ ఇన్‌ఫ్లమేటరీ) గుణాలు లభిస్తాయి. ఇవి జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి, కడుపు ఉబ్బరం తగ్గించడానికి మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి కొంతవరకు సహాయపడతాయి. ముఖ్యంగా భోజనానికి ముందు తగినంత నీరు తాగడం వల్ల పొట్ట నిండిన భావన కలిగి, ఆహారం తక్కువగా తింటారు. దీనివల్ల క్యాలరీల గ్రహంపు తగ్గి బరువు నియంత్రణలో ఉంటుంది. అంతే తప్ప, కేవలం ఈ నీరు తాగడం వల్లే పొట్టలోని కొవ్వు కరిగిపోతుందని భావించడం శాస్త్రీయంగా నిరూపించబడలేదు. నిలకడైన బరువు తగ్గుదల అనేది సరైన పోషకాహారం, శారీరక వ్యాయామంపై ఆధారపడి ఉంటుంది.       Detox drinks benefits and side effects guide, scientific truth about belly fat detox water.
అన్ని జీవరాశులకు ఆహారమే శక్తినవనరు. అయితే మనిషికి మాత్రం ఆహారంలో ఎన్నో ఛాయిస్ లు ఉన్నాయి. కానీ  ఏది పడితే అది, ఎలా పడితే అలా తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. కొందరు అనారోగ్యం చేసినప్పుడు లేదా కొన్ని రకాల ట్రీట్మెంట్ లలో ఉన్నప్పుడు పత్యం చేయమని చెబుతారు.   పత్యం ఆహారంలో ఉన్నప్పుడు వంకాయను తినకూడదని చెబుతూ ఉంటారు.  సాధారణంగా  సాంప్రదాయ ఆయుర్వేదం, నాటు వైద్యంలో కొన్నిరకాల అనారోగ్య సమస్యలతో ఉన్నవారికి వంకాయ తినకూడదని సిఫారసు చేస్తారు.  సాధారణ రోజుల్లో వంకాయ రుచికరమైన, పోషకాలున్న కూరగాయ అయినప్పటికీ, పత్యం వేళల్లో దీనిని మినహాయించడానికి అనేక కారణాలు ఉన్నాయి. వంకాయను పత్యం ఉన్నప్పుడు ఎందుకు తీసుకోకూడదో వివరంగా తెలుసుకుంటే.. వంకాయ.. వంకాయను ఆయుర్వేదంలో వాత, పిత్త దోషాలను పెంచే ఆహారంగా పరిగణిస్తారు. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి ఉన్నప్పుడు లేదా రోగ నివారణకు పత్యం ఉంటున్నప్పుడు వంకాయ తింటే వాత దోషం పెరిగి నొప్పులు, జాయింట్లలో ఇబ్బందులు వస్తాయి. వంకాయ విత్తనాల్లో , తోలులో కొన్ని రకాల సహజ కాంపౌండ్లు ఉంటాయి. ఇవి సున్నితమైన చర్మం ఉన్నవారిలో, లేదా ఇప్పటికే దద్దుర్లు, దురదలు, అలర్జీలతో బాధపడుతున్న వారిలో సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. ఔషధాల ప్రభావం సరిగ్గా పనిచేయాలన్నా చర్మ సంబంధిత పత్యంలో వంకాయకు దూరంగా ఉండాలి. వంకాయ అరుగుదలకు కాస్త సమయం తీసుకుంటుంది. శరీరంలో అనారోగ్యం ఉన్నప్పుడు జీర్ణక్రియ మందగిస్తుంది. అటువంటి సమయంలో సులభంగా అరగని వంకాయను తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో ఎక్కడైనా గాయాలు, పుండ్లు ఉన్నప్పుడు లేదా శస్త్రచికిత్సలు జరిగినప్పుడు నాటు వైద్యంలో ప్రత్యేక పత్యం సూచిస్తారు. వంకాయ శరీరంలో వేడిని,   దురదను పెంచి పుండ్లు త్వరగా మానకుండా అడ్డుకుంటుందని చెప్తారు. వంకాయ సోలనేసి కుటుంబానికి చెందిన కూరగాయ. ఇందులో సోలనైన్ అనే కాంపౌండ్ ఉంటుంది. సాధారణ ఆరోగ్యంతో ఉన్నవారికి ఇది పెద్దగా ఇబ్బంది కలిగించకపోయినా, పత్యం చేసేవారిలో , మందులు వాడేవారిలో ఇది జీర్ణ వ్యవస్థపై , నాడీ వ్యవస్థపై స్వల్ప ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ కారణాల వల్లనే పత్యం సమయంలో శరీరం త్వరగా కోలుకోవడానికి, ఔషధాలు ఎలాంటి సమస్య లేకుండా పనిచేయడానికి వంకాయకు దూరంగా ఉండాలని పెద్దలు , ఆయుర్వేద వైద్యులు సలహా ఇస్తారు. పత్యం పూర్తయి శరీరం పూర్తి ఆరోగ్యాన్ని పుంజుకున్న తర్వాతే వంకాయను ఆహారంలో తిరిగి చేర్చుకోవడం మంచిది.                          *రూపశ్రీ.
నేటి డిజిటల్ యుగంలో ఆరోగ్య స్పృహ, ఫిట్‌నెస్ పట్ల శ్రద్ద పెరిగాయి. జిమ్‌లకు వెళ్లేవారు, బరువు తగ్గాలనుకునేవారు లేదా కండరాల పుష్టి కోసం ప్రయత్నం చేసేవారు ప్రోటీన్ షేక్స్, హెల్త్ సప్లిమెంట్లు, డిజైనర్ ప్రోటీన్ బార్ల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కానీ, మన తాతల తండ్రుల కాలంలో ఎలాంటి ప్రొటీన్ పౌడర్లు ఉండేవి కావు. అయినా వారు ఎంతో బలంగా, శక్తివంతంగా, దీర్ఘకాలిక ఆరోగ్యంతో జీవించారు. దానికి కారణం వారు రోజూ తీసుకునే సంప్రదాయ భారతీయ ఆహారమే! మన ప్రాంతీయ వాతావరణం, రుతుపవనాలు , పాతకాలపు వంట పద్ధతుల ఆధారంగా మన పళ్లెంలో చేరే రోజూవారీ ఆహారంలో ప్రోటీన్లు పుష్కలంగా లభించేవి. ఆధునిక ఆహార అలవాట్ల వల్ల కాలక్రమేణా మనం మరచిపోయిన, కానీ మన తాతల కాలంలో క్రమం తప్పకుండా తిన్న 10 శక్తివంతమైన ప్రోటీన్ ఆహారాలు ఉన్నాయి.  నిజానికి ఇవన్నీ ప్రోటీన్ సూపర్ ఫుడ్స్.. అవేంటో తెలుసుకుంటే..  ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం:  ఉలవలు.. ఒకప్పుడు పల్లెల్లో ప్రతి ఇంట్లో క్రమం తప్పకుండా వాడే ధాన్యాల్లో ఉలవలు ముఖ్యమైనవి. శాకాహారంలో ప్రోటీన్ అత్యధికంగా లభించే ఆహారాల్లో ఇది ఒకటి. మన తాతలు రోజంతా కష్టపడి పనిచేయడానికి అవసరమైన శక్తిని ఈ ఉలవలే ఇచ్చేవి. ఉలవ చారు, ఉలవ పప్పు, చట్నీలు లేదా గుగ్గిళ్ల  రూపంలో వీటిని తీసుకునేవారు. ప్రోటీన్‌తో పాటు ఇందులో ఐరన్, పీచు పదార్థం , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కిడ్నీ రాళ్లను నివారించడంలోనూ, శరీరంలో కొవ్వును తగ్గించడంలోనూ అద్భుతంగా పనిచేస్తాయి. సత్తు పిండి.. ఇది శనగలను వేయించి, మెత్తగా పొడి చేసి తయారుచేసే సంప్రదాయ ఆహారం. ప్రోటీన్ షేక్స్‌కు ఇది పూర్వీకుల కాలం నాటి దేశీ వెర్షన్ అని చెప్పవచ్చు. వేసవికాలంలో సత్తు పిండిని నీళ్లు, నిమ్మరసం, మసాలాలతో కలిపి  తాగేందుకు వాడేవారు. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా, కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. నాణ్యమైన ప్రోటీన్ , ఫైబర్ ఉన్న సత్తు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. నల్ల శనగలు.. ఈ రోజుల్లో తెల్ల శనగలు వాడకం పెరిగినప్పటికీ, పూర్వకాలంలో నల్ల శనగలదే హవా రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే గుడాలుగా  తినడం లేదా కూరల్లో వాడటం చేసేవారు. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా వేయించిన నల్ల శనగలను తీసుకెళ్లేవారు. ఇవి త్వరగా పాడవవు, తింటే కడుపు నిండుగా ఉంటుంది. ఇవి ప్లాంట్ బేస్డ్   ప్రోటీన్‌తో పాటు ఐరన్‌ను సమృద్ధిగా అందిస్తాయి.  బొబ్బర్లు / అలసందలు.. బొబ్బర్లు లేదా అలసందలు ఒకప్పుడు ప్రతీ ఇంట్లోనూ రెగ్యులర్‌గా వండే కూర ధాన్యం. వీటిలో అత్యధిక మోతాదులో ప్రోటీన్, ఫైబర్, ఫోలేట్ , ఐరన్ ఉంటాయి. నాటు దినుసులు , మసాలాలతో నెమ్మదిగా ఉడికించి చేసే బొబ్బర్ల కూర లేదా గుడాలు శరీరానికి మంచి బలాన్ని ఇస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి. మట్కీ / మోత్ బీన్స్.. రాజస్థాన్ వంటి పొడి వాతావరణం కలిగిన ప్రాంతాలలో ఎక్కువగా పండే మట్కీ లేదా మోత్ బీన్స్ చిన్నగా ఉన్నప్పటికీ పోషకాల గని. ఇవి చూడటానికి పెసల సైజ్ లో ఉంటాయి. కానీ వీటి రంగు మాత్రం భిన్నంగా ఉంటుంది.  తక్కువ నీటితో పండే ఈ పంట రైతులకు, ప్రజలకు ప్రధాన ప్రోటీన్ మూలంగా ఉండేది. వీటిని మొలకలెత్తించి తినడం లేదా కారంగా కూర వండుకోవడం చేసేవారు. ధాన్యాలను మొలకెత్తించడం వల్ల వాటిలోని ప్రోటీన్ , ఇతర పోషకాలను శరీరం సులభంగా గ్రహిస్తుందని మన పూర్వీకులకు ముందే తెలుసు. మినపప్పు.. నేడు మినపప్పును కేవలం ఇడ్లీ, దోస పిండి లేదా పోపులకే పరిమితం చేశాం. కానీ, పూర్వకాలంలో మినపప్పుతో వడలు, మినప రొట్టెలు, మినప సున్నుండలు వంటి బలమైన పదార్థాలు తయారుచేసి తినేవారు. మినపప్పులో ప్రోటీన్‌తో పాటు క్యాల్షియం, పొటాషియం, ఐరన్ మెండుగా ఉంటాయి. బియ్యం లేదా తృణధాన్యాలతో కలిపి మినపప్పును తిన్నప్పుడు అది శరీరానికి పూర్తిస్థాయి ప్రోటీన్‌ను అందిస్తుంది.  ఇంట్లోనే తయారుచేసిన తాజా పనీర్.. పాకెట్లలో లభించే ప్యాక్ చేసిన పనీర్ కాకుండా, మన అమ్మమ్మలు గేదె లేదా ఆవు పాల నుంచి తాజా నిమ్మరసం పిండి పనీర్ తయారు చేసేవారు. ఈ తాజా పనీర్‌లో ఎలాంటి రసాయనాలు ఉండవు. ఇది నాణ్యమైన ప్రోటీన్ , క్యాల్షియంను ఉచితంగా శరీరానికి అందిస్తుంది. ఎముకల గట్టితనానికి, కండరాల పునరుద్ధరణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.  వేయించిన వేరుశనగలు..   నట్స్ అనగానే ఈ రోజుల్లో బాదం, జీడిపప్పు, పిస్తా గుర్తుకొస్తాయి. కానీ పేదవాడి బాదం పప్పు అయిన వేరుశనగలు పోషకాల్లో దేనికీ తీసిపోవు. సాయంత్రం పూట తినుబండారంగా, లేదా బెల్లంతో కలిపి పల్లీ పట్టీ రూపంలో పూర్వీకులు వీటిని రోజూ తినేవారు. వేరుశనగల్లో ప్రోటీన్‌తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. రాజగిరా / అమరాంత్ గింజలు.. రాజగిరాను  ఉపవాసాల సమయంలో ఎక్కువగా తింటుంటారు. కానీ పూర్వకాలంలో దీన్ని రోజూ ఆహారంలో భాగం చేసుకునేవారు. రాజగిరా గింజల్లో శరీరం స్వయంగా తయారుచేసుకోలేని 9 రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇది సంపూర్ణ ప్రోటీన్ కలిగిన అతికొద్ది వృక్షాహారాలలో ఒకటి. రాజగిరా లాడ్డు, జావ, రొట్టెల రూపంలో  తీసుకోవడం వల్ల ఎముకలు గట్టిపడతాయి. నువ్వులు .. పరిమాణంలో చిన్నవిగా ఉన్నప్పటికీ నువ్వులలో ఉండే పోషకాలు అపారం. నువ్వుల పొడి, నువ్వుల చట్నీ, నువ్వుల ఉండలు మన సంప్రదాయ ఆహారంలో భాగం. నువ్వులలో కేవలం క్యాల్షియం, మంచి కొవ్వులే కాకుండా విలువైన ప్రోటీన్ కూడా ఉంటుంది. నువ్వులను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల కండరాలు బలంగా మారడమే కాకుండా చర్మం, జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫిట్‌నెస్ అంటే విదేశీ ఆహార అలవాట్లను లేదా ప్యాక్ చేసిన హెల్త్ పౌడర్లను గ్రైండ్ చేయడం కాదు. మన ఇంట్లోనే, మన పూర్వీకులు తిన్న సంప్రదాయ ధాన్యాలు , పప్పు దినుసులలోనే శరీరానికి అవసరమైన అసలైన బలం దాగి ఉంది.  దైనందిన ఆహారంలో మళ్లీ ఈ పాతకాలపు ఆహారాలను భాగం చేసుకుంటే ఆరోగ్యకరమైన శరీరం లభిస్తుంది.