LATEST NEWS
న్యాయవాది మొయిజుద్దీన్ కేసులో మరో ట్విస్ట్.! న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితులకు బెయిల్ రావడం, తాజాగా చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌కు రూ.2 కోట్లు లంచం ఇచ్చి ఓ రౌడీషీటర్ బెయిల్ పొందాడని ఒవైసీ ఆరోపించారు. జైలు నుంచి ఇటీవల విడుదలైన ఆ వ్యక్తికి జైలు సూపరింటెండెంట్ సహకరిస్తున్నారని, బయటకు వచ్చిన తర్వాత మరోసారి దాడులకు కుట్ర చేస్తున్నాడని ఆయన వ్యాఖ్యానించారు.  అయితే, రూ.2 కోట్ల లంచం ఆరోపణలపై సంబంధిత జైలు అధికారులు లేదా ప్రభుత్వం నుంచి అధికారిక వివరణ వెలువడాల్సి ఉంది.సీనియర్ న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ 2026 మే 23న హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని తన నివాసం వద్ద వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందారు. తొలుత ఈ ఘటన హిట్‌అండ్‌రన్‌గా కనిపించినప్పటికీ, సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు ఇది ఉద్దేశపూర్వక దాడి అయి ఉండొచ్చని అనుమానించారు. మొయిజుద్దీన్ వక్ఫ్ ఆస్తుల ఆక్రమణలకు సంబంధించిన పలు కేసుల్లో న్యాయపోరాటం చేస్తున్నారని, గతంలో తనకు బెదిరింపులు వచ్చినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ దాడి పక్కా ప్రణాళికతో జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ కేసు దర్యాప్తులో హైదరాబాద్ పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. వక్ఫ్ ఆస్తుల వివాదాల నేపథ్యంలోనే హత్యకు కుట్ర జరిగినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించినట్లు అప్పట్లో సమాచారం వెలువడింది. కాంగ్రెస్ నేత ముజాహిద్ ఆలమ్ ఖాన్ సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.దర్యాప్తులో భాగంగా హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగినట్లు కూడా వెల్లడైంది. నిందితులు ముందుగానే పథకం రూపొందించి, వాహనంతో ఢీకొట్టి మొయిజుద్దీన్‌ను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ముజాహిద్ ఆలమ్ ఖాన్‌తో పాటు మరో ఇద్దరు నిందితులకు సెప్టెంబర్ 3న బెయిల్ మంజూరైనట్లు ‘సియాసత్’ నివేదించింది.  ఆయన తండ్రి మహబూబ్ ఆలమ్ ఖాన్‌కు అంతకుముందే ఆగస్టు 13న బెయిల్ వచ్చినట్లు కూడా ఆ నివేదిక పేర్కొంది. ఇలాంటి పరిణామాల మధ్య ఓ నిందితుడు జైలు నుంచి బయటకు రావడం, అతడికి జైలు అధికారుల సహకారం ఉందంటూ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపణలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.“రౌడీషీటర్‌కు జైలు సూపరింటెండెంట్ సహకరిస్తున్నారు. రూ.2 కోట్లు లంచం ఇచ్చి బెయిల్ తెచ్చుకున్నాడు. బయటకు వచ్చిన తర్వాత దాడులకు కుట్ర చేస్తున్నాడు” అంటూ ఒవైసీ చేసిన ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. మరోవైపు, అమాయకుల ప్రాణాలకు ముప్పు కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి నేరాలకు పాల్పడేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ఒకవైపు న్యాయవాది హత్య కేసులో కుట్ర, బెదిరింపులు, వక్ఫ్ ఆస్తుల వివాదాలపై దర్యాప్తు కొనసాగుతుండగా.. మరోవైపు జైలు వ్యవస్థపైనే అవినీతి ఆరోపణలు రావడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది       [ Asaduddin Owaisi, Chanchalguda Jail, Chanchalguda Jail Superintendent, Rs 2 Crore Bribe, Bail Controversy, Rowdy Sheeter, Khaja Moizuddin Murder Case, Hyderabad News, AIMIM, MIM, Telangana News, Jail Corruption Allegations, Waqf Property Dispute, Hyderabad Police ]
అమెరికాలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆమె కుటుంబంతో పాటు స్వగ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలానికి చెందిన దారం సుప్రియ (31) అమెరికాలో ఉద్యోగం చేస్తూ అక్కడే నివసిస్తున్నారు. రోజువారీ పనుల్లో భాగంగా కారులో ప్రయాణిస్తున్న సమయంలో మిస్సోరి రాష్ట్రంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. సుప్రియ ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి వేగంగా వచ్చిన భారీ ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. తీవ్ర గాయాల కారణంగా సుప్రియ అక్కడికక్కడే మృతి చెందారు.ఆమెతో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో భారతీయ యువతికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సుప్రియ భర్త కొడుమూరి రంజిత్, అత్తమామలు మహబూబాబాద్ పట్టణంలోని వీరభద్ర అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తున్నారు. విదేశాల్లో మంచి భవిష్యత్తు కోసం వెళ్లిన తమ కుటుంబ సభ్యురాలు ఇలా అనూహ్యంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.సుప్రియ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు, బంధువులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ప్రమాదానికి సంబంధించిన చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసేందుకు అక్కడి అధికారులు చర్యలు చేపట్టారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల విషయంలో రోడ్డు భద్రత మరోసారి చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా హైవేలపై ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తుచేస్తోంది. సుప్రియ ఆకస్మిక మరణంతో మహబూబాబాద్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.         [ Missouri Road Accident, Telangana Woman, Darama Supriya, Mahabubabad, Maripeda, US Road Accident, Indian Woman Dies, Truck Accident, America Road Accident, Telugu Woman Death, NRI Tragedy, US Highway Accident, Indian Community in USA, Road Safety, Telangana NRI Death ]  
భారత పైలట్ చెప్పిన షాకింగ్ నిజాలు..! దుబాయ్‌ నుంచి టెల్‌ అవీవ్‌ వెళ్తున్న ఫ్లైదుబాయ్‌ విమానంలో సెప్టెంబర్‌ 30న చోటుచేసుకున్న కాక్‌పిట్‌ దాడి ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విమానాన్ని నడుపుతున్న భారతీయ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌పై కో-పైలట్‌ హమామ్‌ అల్‌-హమ్మామీ దాడికి పాల్పడిన తీరుపై సంచలన వివరాలు వెల్లడయ్యాయి. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుతో మాట్లాడిన సందర్భంగా కెప్టెన్‌ ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రార్థన చేసుకుంటానని చెప్పిన కో-పైలట్‌.. ఆ తర్వాత వెనుక నుంచి తనపై దాడి చేశాడని ఆయన వివరించారు. కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. విమానం గాల్లో ప్రయాణిస్తుండగా ఒమన్‌కు చెందిన కో-పైలట్‌ హమామ్‌ అల్‌-హమ్మామీ ప్రార్థన చేసుకోవడానికి అనుమతి కోరాడు. అందుకు కెప్టెన్‌ అంగీకరించారు. అయితే, నాలుగైదు నిమిషాల తర్వాత అకస్మాత్తుగా తన తల వెనుక భాగంలో బలమైన దెబ్బ తగిలిందని మచ్చర్‌ తెలిపారు. తొలుత విమానంలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తిందేమోనని భావించానని, దాడి కొనసాగడంతో తన పక్కనే ఉన్న కో-పైలట్‌ దాడి చేస్తున్నాడని గుర్తించానని చెప్పారు.ఈ ఘటనతో విమానంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కో-పైలట్‌ ప్రవర్తన అనుమానాస్పదంగా మారడంతో కెప్టెన్‌ అప్రమత్తంగా వ్యవహరించినట్లు సమాచారం. విమాన భద్రతకు ముప్పు వాటిల్లకుండా కాక్‌పిట్‌ తలుపును లాక్‌ చేసినట్లు వెల్లడైంది. అయినప్పటికీ, కో-పైలట్‌ రెండుసార్లు తలుపు తెరిచేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. ఈ పరిణామాలు విమాన భద్రతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తించాయి. అయితే, విమాన సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. విమానం గాల్లో ఉండగా కాక్‌పిట్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం అంతర్జాతీయ విమానయాన రంగంలో చర్చనీయాంశంగా మారింది. వందలాది మంది ప్రయాణికుల భద్రతకు సంబంధించిన అంశం కావడంతో ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది.ఈ ఉదంతం విమానయాన సంస్థల్లో భద్రతా ప్రమాణాలు, సిబ్బంది ప్రవర్తన పర్యవేక్షణ, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే విధానాలపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది. విమాన సిబ్బందికి సంబంధించిన భద్రతా ప్రోటోకాల్స్‌ను మరింత పటిష్ఠం చేయాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తుచేస్తోంది.     [ Flydubai Attack, Flydubai Flight Incident, Smith Matcher, Hamam Al Hammami, Co-Pilot Attack, Cockpit Attack, Pilot Axe Attack, Dubai to Tel Aviv Flight, Benjamin Netanyahu, Indian Pilot, Mid-Air Attack, Flight Safety, Aviation Security, Flydubai News, Israel News ]  
ALSO ON TELUGUONE N E W S
అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద మాధవి సోమ నిర్మాణంలో రమణా రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘అమీర్ లోగ్’. ఈ మూవీలో ఎంసి హరి, మనోజ్, శశిధర్, వేద జలంధర్, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి ప్రధాన పాత్రల్ని పోషించారు. ఈ చిత్రం ఆగస్ట్‌లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.  హైదరాబాద్ బస్తీలోని స్నేహాన్ని, ప్రేమను, బంధాల్ని చాటి చెప్పే చిత్రంగా అందరి హృదయాల్ని గెల్చుకుంది. ఈ సినిమాలోని పాటలు హైదరాబాద్ కల్చర్‌కి ఆంథమ్‌లా మారిపోయాయి. కుర్రాళ్లకు స్పూర్తినిచ్చేలా, మంచి సందేశంతో తీసిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించింది. ఎంసి హరి, మనోజ్, శశిధర్, వేద జలంధర్, విశ్వేందర్ రెడ్డి పాత్రలకు ప్రేక్షకులకు మంచి స్పందన వచ్చింది. ఇక ఈ మూవీని రానా స్పిరిట్ మీడియా గ్రాండ్‌గా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంచి రిలీజ్ దొరకడం, ఆడియెన్స్‌ నుంచి ప్రశంసలు దక్కడంతో చిత్ర యూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ స్ట్రీమింగ్‌ చేస్తోంది. ప్రస్తుతం ‘అమీర్ లోగ్’ మూవీని అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ చేస్తోంది. ఆల్రెడీ ఓటీటీలోనూ ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీకి స్మరణ్ సాయి ఇచ్చిన సంగీతం, ఎస్వీకే సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇది కూడా చదవండి: లెజెండరీ డైరెక్టర్ సింగీతం టాప్-10 మూవీస్        [Ameer Log OTT Response, Ameer Log OTT Release, Ameer Log Movie, Rana Daggubati, Telugu Movies 2026, Latest Telugu Movies, Telugu Film News]
వైవిధ్యభరిత చిత్రాలకు పెట్టింది పేరు.. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో దర్శకుడిగా తనదైన ముద్రవేసిన సింగీతం.. తన కెరీర్ లో పలు విజయాలను చూశారు. అలాగే అనేక పురస్కారాలు సొంతం చేసుకున్నారు. అలాంటి సింగీతం కెరీర్ లో టాప్ 10 క్లాసిక్స్ ఏంటో చూద్దాం.. పంతులమ్మ: నాలుగు నంది అవార్డులు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం సొంతం చేసుకున్న మ్యూజికల్ హిట్ ఇది. రంగనాథ్, లక్ష్మి జంటగా నటించిన ఈ సినిమా 1978లో తెరపైకి వచ్చింది. సిరిమల్లె నీవే విరిజల్లు కావే అంటూ సాగే పాపులర్ గీతం ఇందులోనిదే. సొమ్మొకడిది సోకొకడిది: లోక నాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో సింగీతం రూపొందించిన తొలి చిత్రమిది. జయసుధ, రోజా రమణి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 1979లో సందడి చేసింది. అబ్బో నేరేడు పళ్ళు అంటూ సాగే పాపులర్ సాంగ్ ఈ సినిమాలోదే. ఇందులో కమల్ ద్విపాత్రాభినయం చేశారు. మయూరి: ఏకంగా 14 నంది పురస్కారాలు కైవసం చేసుకున్న క్లాసిక్ మూవీ ఇది. క్లాసికల్ డ్యాన్సర్ సుధా చంద్రన్ నిజజీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ బయోపిక్ లో.. సుధా చంద్రన్ తన పాత్రను తనే స్వయంగా పోషించడం విశేషం. 1985లో రిలీజైన ఈ సంచలన చిత్రానికిగానూ ఉత్తమ దర్శకుడిగా ఇటు నంది, అటు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలను సొంతం చేసుకున్నారు సింగీతం.  పుష్పక విమానం: మాటల్లేకుండా సింగీతం రూపొందించిన బ్లాక్ కామెడీ మూవీ ఇది. కమల్ హాసన్, అమల జంటగా నటించిన ఈ సినిమా ఒక జాతీయ పురస్కారంతో పాటు 3 ఫిల్మ్ ఫేర్ అవార్డులు,  మూడు కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డులను సొంతం చేసుకుంది. 1987లో ఈ క్లాసిక్ పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో పలు రకాల టైటిల్స్ తో  జనం ముందు నిలిచింది. విచిత్ర సోదరులు: కమల్ హాసన్ త్రిపాత్రాభినయంలో సింగీతం తెరకెక్కించిన క్లాసిక్ ఇది. ఇందులో మరగుజ్జు పాత్రని తీర్చిదిద్దిన తీరు ఇప్పటికీ చర్చనీయాంశమే. అపూర్వ సగోదరగళ్ పేరుతో ప్రధానంగా తమిళంలో తెరకెక్కిన ఈ మూవీ.. తెలుగులో విచిత్ర సోదరులు పేరుతో అనువాదమై అలరించింది. 1989లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డ్ తో పాటు రెండు తమిళనాడు స్టేట్ అవార్డులను సైతం సొంతం చేసుకుందీ సినిమా. మైఖేల్ మదన కామ రాజు: కమల్ హాసన్ నాలుగు విభిన్న పాత్రల్లో ఎంటర్టైన్ చేసిన సినిమా ఇది. సిల్వర్ జూబ్లీ ఫిల్మ్ గా రికార్డులకెక్కిన ఈ మూవీ.. అప్పట్లో ఓ సంచలనం. సింగీతం మార్క్ వినోదంతో ఎంటర్టైన్ చేసిన ఈ క్లాసిక్ 1990లో రిలీజైంది. ఆదిత్య 369: టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఓ విభిన్న ప్రయత్నం. మూడు విభిన్న కాలాల్లో సాగే ఈ చిత్రంలో కృష్ణకుమార్ గా, శ్రీ కృష్ణదేవరాయలుగా బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. 1991లో ఈ క్లాసిక్ థియేటర్స్ లో ఎంటర్టైన్ చేసింది. బృందావనం: నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, రమ్యకృష్ణ జంటగా నటించిన మ్యూజికల్ హిట్ ఇది. ఈ సినిమాకి గానూ బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా నంది పురస్కారం సొంతం చేసుకున్నారు సింగీతం. 1992లో ఈ క్లాసిక్ విడుదలైంది. మేడమ్: రాజేంద్ర ప్రసాద్ లేడీ గెటప్ లో భలేగా ఎంటర్టైన్ చేసిన సినిమా ఇది. సౌందర్య హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం రెండు విభాగాల్లో నంది పురస్కారాలను కైవసం చేసుకుంది. 1994లో ఈ మూవీ సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చింది. భైరవ ద్వీపం: తొమ్మిది నంది పురస్కారాలతో సంచలనం సృష్టించిన జానపద చిత్రం.. భైరవద్వీపం. బాలకృష్ణ, రోజా జంటగా నటించిన ఈ క్లాసిక్.. అప్పట్లో విశేషాదరణ పొందింది. 1994లో ఈ జనరంజక చిత్రం సందడి చేసింది.         [Singeetham Top 10 Movies, Singeetham Best Movies, Singeetham Classic Movies, Singeetham Srinivasa Rao, Singeetham Passed Away, Singeetham Death, Singeetham Movies, Telugu Film News, Telugu News]  
తెలుగు సినిమా గొప్ప ప్రయోగశీల దర్శకుల్లో ఒకరైన సింగీతం శ్రీనివాసరావు ఇక లేరు. 94 ఏళ్ల వయసులో శనివారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో తెలుగు సినిమా మాత్రమే కాదు.. భారతీయ చిత్ర పరిశ్రమలోనూ ఓ గొప్ప అధ్యాయం ముగిసినట్టైంది. సింగీతం శ్రీనివాసరావు పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చే సినిమాలు ‘పుష్పక విమానం’, ‘ఆదిత్య 369’, ‘భైరవ ద్వీపం’, ‘మయూరి’ వంటి ప్రయోగాత్మక చిత్రాలే. అప్పటి పరిస్థితుల్లో ఊహించడానికే కష్టమైన కాన్సెప్ట్స్‌ను తెరపై చూపించిన దర్శకుడిగా సింగీతానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. https://x.com/TelanganaCMO/status/2106577647224668566 సింగీతం మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు వరుసగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయన మృతికి తీవ్ర సంతాపం తెలిపారు. వైవిధ్యమైన కథాంశాలు, వినూత్నమైన ఆలోచనలను తెరపై ఆవిష్కరిస్తూ తెలుగు సినిమాకు కొత్త దారులు చూపిన సృజనాత్మక దర్శకుడు సింగీతం అని కొనియాడారు. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకే కాకుండా భారతీయ చిత్ర రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. https://x.com/tarak9999/status/2106442381600104682 మరోవైపు సింగీతం మృతిపై జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. ‘ఆదిత్య 369’, ‘పుష్పక విమానం’, ‘మయూరి’ వంటి సినిమాలను గుర్తు చేసుకున్న ఎన్టీఆర్.. కాలానికి ముందే ఆలోచించి, తరాలు మారినా కొత్తగా అనిపించే సినిమాలు అందించిన దార్శనికుడిగా సింగీతాన్ని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. https://x.com/APDeputyCMO/status/2106572482828484763 ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సింగీతం మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘పుష్పక విమానం’, ‘విచిత్ర సోదరులు’, ‘మయూరి’, ‘ఆదిత్య 369’, ‘మైకేల్ మదన కామరాజు’ వంటి సినిమాల్లో ఆయన చేసిన ప్రయోగాలను గుర్తు చేసుకున్నారు. 94 ఏళ్ల వయసులోనూ ‘సింగ్ గీతం’ సినిమాకు దర్శకత్వం వహించడం సినిమాపై ఆయనకున్న అంకితభావానికి నిదర్శనమని పవన్ పేర్కొన్నారు. ఇక నందమూరి బాలకృష్ణకు సింగీతం శ్రీనివాసరావుతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఆదిత్య 369’, ‘భైరవ ద్వీపం’, ‘శ్రీకృష్ణార్జున విజయం’ వంటి విభిన్నమైన చిత్రాలు వచ్చాయి. బాలకృష్ణ కెరీర్‌లో ఈ సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంది. సింగీతం మృతిపై బాలకృష్ణ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన తమ కుటుంబానికి ఎంతో సన్నిహితుడని గుర్తు చేసుకున్నారు. ‘ఆదిత్య 369’ తెలుగు సినిమాకే కాకుండా భారతీయ సినిమాకు కొత్త గుర్తింపు తీసుకొచ్చిందని, ‘భైరవ ద్వీపం’ జానపద చిత్రాల్లో ఇప్పటికీ ప్రత్యేకంగా నిలిచిందని పేర్కొన్నారు. సింగీతం మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని బాలకృష్ణ అన్నారు. https://x.com/KChiruTweets/status/2106587307427959273 సింగీతం శ్రీనివాసరావు ఓ విజనరీ అని చిరంజీవి కొనియాడారు. కొత్త ఆలోచనలను తెరపై ఆవిష్కరించేందుకు ఆయన చూపించిన ఊహాశక్తి, ధైర్యం భారతీయ సినిమాకు ఎన్నో మరపురాని చిత్రాలను అందించిందని పేర్కొన్నారు. సినిమాకు ఆయన చేసిన సేవలను ఎప్పటికీ ఎంతో గౌరవంతో, అభిమానంతో గుర్తు చేసుకుంటామని అన్నారు.       [Singeetham Srinivasa Rao, Singeetham Passed Away, Singeetham Death, Singeetham Movies, Telangana CM Revanth Reddy, Chiranjeevi, Nandamuri Balakrishna, Pawan Kalyan, Jr NTR]  
Singeetham Srinivasa Rao, one of Telugu cinema’s most celebrated and versatile filmmakers, has passed away. The veteran director breathed his last in Chennai, according to reports. He was 95.  Singeetham was known for constantly experimenting with storytelling and filmmaking across languages and genres. After beginning his career as an assistant to legendary filmmaker K. V. Reddy, he made his directorial debut with Neethi Nijayithi in 1972 and went on to establish a distinctive identity with films such as Mayuri, Pushpaka Vimana, Aditya 369, Bhairava Dweepam, Madam and several others.  His collaboration with Kamal Haasan resulted in some of his most memorable films, including Pushpaka Vimana, Apoorva Sagodharargal and Michael Madana Kama Rajan. Pushpaka Vimana, made without conventional dialogue, remains one of the most unconventional films in Indian cinema, while Aditya 369 continues to be remembered as a landmark Telugu science-fiction film. What made Singeetham's journey even more remarkable was his continued passion for cinema well into his 90s. Earlier this year, he returned to the director's chair with Sing Geetham, produced by Nag Ashwin under Vyjayanthi Movies. The film, released in June 2026, marked his 61st directorial venture and came at the age of 94.  With a career spanning over five decades and multiple languages, Singeetham Srinivasa Rao leaves behind a body of work that stands out for its imagination, technical experimentation and willingness to explore subjects beyond conventional commercial cinema. His passing marks the loss of one of Indian cinema's true experimental filmmakers.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.     
తెలుగు సినిమా చరిత్రలో ప్రయోగం అనే మాట వినిపించిన ప్రతిసారీ గుర్తొచ్చే పేర్లలో సింగీతం శ్రీనివాసరావు పేరు ముందుంటుంది. 1931 సెప్టెంబర్ 21న నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలో జన్మించిన ఆయన.. మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచే కళలు, సాహిత్యం, సినిమాలపై ఆసక్తి పెంచుకున్న సింగీతం.. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు కె.వి.రెడ్డి దగ్గర అసోసియేట్‌గా సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ‘పాతాళ భైరవి’, ‘మాయాబజార్’ వంటి అద్భుతాలను తెరకెక్కించిన కె.వి.రెడ్డి వద్ద పనిచేయడం ఆయన ఆలోచనా విధానంపై ఎంతో ప్రభావం చూపింది. అనంతరం కన్నడలో ‘సంస్కార’ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. చివరకు 1970లో ‘నీతి నిజాయితీ’తో దర్శకుడిగా తన తొలి అడుగు వేశారు. దర్శకుడిగా మారిన తర్వాత సింగీతం ఒకే తరహా కథలకు పరిమితం కాలేదు. ‘అమెరికా అమ్మాయి’, ‘సొమ్మొకడిది సోకొకడిది’, ‘పంతులమ్మ’, ‘తరం మారింది’, ‘మయూరి’ వంటి చిత్రాలతో తనలోని విభిన్న కోణాలను చూపించారు. ముఖ్యంగా 1987లో వచ్చిన ‘పుష్పక విమానం’ ఆయన కెరీర్‌లోనే కాదు.. భారతీయ సినిమా చరిత్రలోనే ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. దాదాపు డైలాగులు లేకుండా కేవలం విజువల్స్, నటన, సంగీతం, సౌండ్‌తో కథను చెప్పిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కమల్ హాసన్, అమల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం జాతీయ అవార్డును కూడా అందుకుంది. ఇక సింగీతం కెరీర్‌లో మరో మైలురాయి ‘ఆదిత్య 369’. 1991లో వచ్చిన ఈ సినిమా టైమ్ ట్రావెల్, చరిత్ర, సైన్స్ ఫిక్షన్ అంశాలను కలిపి తెలుగు ప్రేక్షకులకు అప్పట్లోనే ఒక సరికొత్త అనుభూతిని అందించింది. ఆ తర్వాత ‘భైరవ ద్వీపం’తో జానపద ఫాంటసీని మరో స్థాయిలో చూపించారు. ‘మయూరి’ వంటి బయోపిక్ తరహా కథను తెరకెక్కించడంతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేశారు. ‘దిక్కత్ర పార్వతి’ చిత్రానికి జాతీయ అవార్డు అందుకోగా.. ‘పుష్పక విమానం’కు ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ పురస్కారం లభించింది. ‘మయూరి’కి ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ దర్శకుడి అవార్డు, ‘పుష్పక విమానం’కు కన్నడ విభాగంలో ఫిల్మ్‌ఫేర్ అవార్డు సహా పలు పురస్కారాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. వ్యక్తిగత జీవితానికి వస్తే.. సింగీతం శ్రీనివాసరావు భార్య లక్ష్మీ కల్యాణి. అయితే ఆమె ఇప్పటికే కన్నుమూశారు. సింగీతం వ్యక్తిగత జీవితాన్ని పెద్దగా ప్రచారంలోకి తీసుకురాకుండా ఎక్కువగా సినిమాలకే తన సమయాన్ని కేటాయించారు. వయసు 90 దాటిన తర్వాత కూడా ఆయనలో సినిమా మీద ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. 2026లో 94 ఏళ్ల వయసులోనూ ‘సింగ్ గీతం’ చిత్రానికి దర్శకత్వం వహించారు. దశాబ్దం విరామం తర్వాత మళ్లీ సినిమా చేయడం సినిమా పట్ల ఆయనకు ఉన్న తపనకు నిదర్శనంగా నిలిచింది. దాదాపు ఆరు దశాబ్దాల సినీ ప్రయాణంలో సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ, కామెడీ, బయోపిక్, ప్రయోగాత్మక చిత్రాలు.. ఇలా ఎన్నో జానర్లను టచ్ చేసిన సింగీతం.. తెలుగు సినిమా ప్రయోగాలకు ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిన దర్శకుడిగా నిలిచిపోయారు.     [Singeetam Srinivasa Rao Biography, Singeetam Srinivasa Rao Life Story, Singeetam Srinivasa Rao Movies, Singeetam Srinivasa Rao Career, Singeetam Srinivasa Rao Family, Singeetam Srinivasa Rao Awards, Pushpaka Vimanam Director, Aditya 369 Director, Bairava Dweepam Director, Legendary Telugu Directors]
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూశారు. ఆయన మృతి వార్తతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ.. తెలుగు సినిమాకు ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించిన ఈ లెజెండరీ దర్శకుడు 94 ఏళ్ల వయసులో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్టోబర్ 3న తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తెలుగు మాత్రమే కాకుండా దక్షిణాది సినీ పరిశ్రమల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.  సింగీతం అంటేనే ప్రయోగాలకు మరో పేరు.. సింగీతం శ్రీనివాసరావు పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చే చిత్రాల్లో ‘పుష్పక విమానం’, ‘ఆదిత్య 369’, ‘భైరవ ద్వీపం’, ‘మయూరి’, ‘సొమ్మొకడిది సోకొకడిది’ వంటి సినిమాలు ఉంటాయి. ముఖ్యంగా ఎలాంటి డైలాగులు లేకుండా తెరకెక్కించిన ‘పుష్పక విమానం’, టైమ్ ట్రావెల్ నేపథ్యంలో రూపొందిన ‘ఆదిత్య 369’ ఆయన ఆలోచనా విధానానికి అద్దం పడతాయి. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ తదితర భాషల్లో పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన.. కథను కొత్తగా చెప్పడంలో తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్నారు. ఇక సింగీతం శ్రీనివాసరావు కెరీర్‌లో ఎన్నో అవార్డులు, గౌరవాలు కూడా ఉన్నాయి. ‘పుష్పక విమానం’ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోగా.. ‘మయూరి’కి పలు నంది అవార్డులు దక్కాయి. ‘భైరవ ద్వీపం’కు ఆయనకు నంది ఉత్తమ దర్శకుడి అవార్డు లభించింది. వయసు 94 ఏళ్లు వచ్చిన తర్వాత కూడా సినిమా మీద తన ఆసక్తిని మాత్రం ఆయన వదులుకోలేదు. 2026లోనే దాదాపు పదేళ్ల విరామం తర్వాత మరో సినిమాకు దర్శకత్వం వహించేందుకు మెగాఫోన్ పట్టారు. ఈ వయసులోనూ సినిమా తీయడానికి సిద్ధపడటం అప్పట్లో సినీ వర్గాల్లో ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. సినిమాను కేవలం వినోదంగా కాకుండా ఒక ప్రయోగశాలగా భావించి.. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించిన దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావు ఒకరు. ఆయన తీసిన ఎన్నో సినిమాలు విడుదలైన సమయంలోనే కాకుండా.. సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా క్లాసిక్స్‌గా నిలిచాయి. అలాంటి అరుదైన దర్శకుడు ఇక లేరనే వార్తతో సినీ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఆయన మృతి తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయానికి ముగింపు పలికినట్టుగా భావిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ ఈ వర్డ్ ని ఇష్టపడని వారంటూ ఈ భూమ్మీద ఉండరు. జూలో జంతువులు సైతం ప్లీజ్.. ఎక్కడ.. ఫ్రీ, మీకు పుణ్యం ఉంటుంది చెప్తారా అని కాళ్లవేళా పడే పరిస్థితి.  ఫ్రీ అనే వర్డ్ అంత సమ్మోహతని దాచుకుంది. మరి ఇప్పుడు ఒక సినిమా నన్ను చూసి మేఘాలయ ట్రిప్ ఫ్రీ గా వెళ్లండని అంటుంది. అదేంటో చూద్దాం    అగ్ర దర్శకుడు నాగ్ అశ్విన్ చేతుల మీదుగా రీసెంట్ గా  కొత్త తరం క్రైమ్ కామెడీ చిత్రం 'బా బా బ్లాక్ షీప్' ట్రైలర్ ఘనంగా విడుదలయ్యింది. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై వేణు దొణెపూడి నిర్మాణంలో గుణి మంచికంటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్‌తోనే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.  ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నే  మేకర్స్ ఏకంగా ఉచిత మేఘాలయ ట్రిప్ ఆఫర్‌ను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఆఫర్ ప్రకారం, 'బా బా బ్లాక్ షీప్' సినిమాకు సంబంధించి నిర్వహించే ఒక కాంటెస్ట్‌లో పాల్గొని గెలుపొందిన మొత్తం 10 మంది అదృష్టవంతులకు ఉచితంగా మేఘాలయ పర్యటనకు వెళ్లే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు నిర్మాత వేణు దొణెపూడి అధికారికంగా వెల్లడించారు. మేఘాలయలోని అద్భుతమైన లొకేషన్లలో పూర్తి స్థాయిలో చిత్రీకరించిన ఈ సినిమా చూడటంతో పాటు, ప్రేక్షకులకు స్వయంగా ఆ అందాలను వీక్షించే అవకాశం దక్కడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.     ఇది కూడా చదవండి: ఫ్యాన్ వార్స్: ఎవరి కోసం..స్నేహం వర్సెస్ సోషల్ మీడియా వేధింపులు మరి మేఘాలయ అందాలు చూడాలంటే  అక్టోబర్ 9న మీ అభిమాన థియేటర్ లో బా బా బ్లాక్ షీప్ చూసేయండి.   [Baa Baa Black Sheep Movie Offer, Baa Baa Black Sheep Trailer, Nag Ashwin Release Baa Baa Black Sheep, Meghalaya Trip Offer, Chitralayam Studios, Baa Baa Black Sheep Movie, Upendra Limaye, Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]        
అభిమానులు.. వీరాభిమానులు..కామన్ ఆడియెన్స్ కి ఆ రెండు కేటగిరిలు థియేటర్ లో మస్తు మాజాని ఇస్తారు. హీరోకి మాత్రం దేవదూతలు అని చెప్పవచ్చు. ఈ విషయాన్ని కాదనే సాహసం ఎవరు చెయ్యలేరు.  కానీ ఒక విషయంలో ఆ రెండు జోనర్స్ ని నింపుకున్న వాళ్లపై  డౌట్ కొడుతూ ఉంది.  తెలుగు సినీ పరిశ్రమలో హీరోల నడుమ ఉండే అనుబంధానికి, సోషల్ మీడియా వేదికగా సాగుతున్న అభిమానుల వివాదాలకి నడుమ తీవ్ర వ్యత్యాసం కనిపిస్తోంది. టాలీవుడ్ ప్రముఖ హీరోలందరూ వ్యక్తిగతంగా ఎంతో ఆప్యాయంగా, క్లోజ్ ఫ్రెండ్స్‌గా మెలుగుతుంటారు. పండగలు, వేడుకలు, పార్టీలు లేదా సినిమా ప్రమోషన్లలో ఒకరినొకరు కలుసుకున్నప్పుడు పరస్పర గౌరవంతో నవ్వుతూ కరచాలనం చేసుకోవడం మనం తరచుగా చూస్తుంటాం. కానీ, ఇంటర్నెట్ వేదికలపై మాత్రం వారి అభిమానుల మధ్య జరుగుతున్న సైబర్ యుద్దాలు రోజురోజుకూ సరిహద్దులు దాటుతున్నాయి. రీసెంట్‌గా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ అసోసియేషన్ల నడుమ పెరిగిపోతున్న ఈ వికృత సంస్కృతిపై పలువురు సినీ విశ్లేషకులు, స్వయంగా అగ్ర కథానాయకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆన్‌లైన్ సైబర్ పోరులో అత్యంత విచారకరమైన విషయం ఏంటంటే... ఎడిటింగ్ యాప్‌లు, ఏఐ టెక్నాలజీ (AI tools) ద్వారా ప్రత్యర్థి హీరోల ముఖాలను మార్ఫింగ్ చేయడం. ఒక హీరో కుటుంబాన్ని లేదా వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేలా వికృతమైన మీమ్స్ తయారు చేయడం, జుగుప్సాకరమైన వ్యాఖ్యలు రుద్దడం రోజువారీ పరిపాటిగా మారింది. తమ అభిమాన నటుడి సినిమా కలెక్షన్లను పెంచి చూపిస్తూ, వేరే హీరో సినిమా రికార్డులను తక్కువ చేసి చూపే క్రమంలో ఈ నెగెటివిటీ వందల శాతం ముదిరిపోతోంది. ఒకప్పుడు కేవలం థియేటర్ల వద్ద ఫ్లెక్సీలు, పోస్టర్ల గొడవలతో ముగిసే ఫ్యాన్ వార్స్, నేడు సోషల్ మీడియా వేదికగా బూతులు, మార్ఫింగ్ మార్ఫింగ్ ఫోటోలతో హద్దులు మీరుతుండటం టాలీవుడ్ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని దెబ్బతీస్తోంది. ఇది కూడా చదవండి: ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ కల్ట్ రిలీజ్ డేట్ ఫిక్స్: ఏ సినిమాకి షాక్!   ఈ పరిణామాలపై టాలీవుడ్ ప్రముఖులు సైతం ఘాటుగానే స్పందిస్తున్నారు. ఆన్‌‌లైన్ ట్రోలింగ్, ఆక్రోశం వల్ల ఏ ఒక్కరికీ ప్రయోజనం లేదని, అభిమానం అనేది సేవా కార్యక్రమాలు మరియు క్రమశిక్షణలో కనిపించాలే తప్ప పక్కవారిపై విషం చిమ్మడంలో కాదని హీరోలు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నిజం ఏంటంటే మనం మన హీరోని అభిమానించనట్టే అవతలి వాళ్ళు కూడా తమ హీరోని అభిమానిస్తుంటారు. అది సినీసృష్టిలో దాగి ఉన్న రహస్యం. అందరు ఉంది సినిమాని బతికించడానికి, ఎదిగేలా చెయ్యడానికి.    [Tollywood Fan Wars Social Media Morphing, Tollywood Fan Wars, Social Media Morphing Telugu Cinema, Toxic Fandom Tollywood, Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]      
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
భార్యాభర్తలు ఒకరికి ఒకరు టైం కేటాయించుకోవడం ఎందుకు ముఖ్యం.! ​భార్యాభర్తలు ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఒకరి కోసం ఒకరు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించుకోవడం దాంపత్య జీవితంలో అత్యంత కీలకమైన అంశం. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఉద్యోగం, వ్యాపారం, పిల్లల చదువులు, ఇంటి పనులు, ఆర్థిక బాధ్యతలతో రోజంతా గడిచిపోతుంటుంది. ఈ హడావుడిలో దంపతులు ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి, మనసులో విషయాలను పంచుకోవడానికి సమయం దొరకడం కష్టం. అయితే, కేవలం ఒకే ఇంట్లో  జీవించడం మాత్రమే కాకుండా, ఒకరికొకరు క్వాలిటీ టైమ్ కేటాయించుకోవడం చాలా అవసరం . భార్యాభర్తలు ఒకరికొకరు టైమ్ కేటాయించుకోవడం వల్ల వైవాహిక బంధంలో జరిగే అద్భుతాలు తెలుసుకుంటే..  కష్టాలలో నిలబెడుతుంది. ఎంతటి కష్టసమయంలోనైనా దంపతులను కలిపి ఉంచేది వారి మధ్య ఉన్న అనుబంధమే. రోజూ కొంత సమయం ఒకరి కోసం ఒకరు కేటాయించుకోవడం వల్ల ఇద్దరి మధ్య బంధం మరింత గట్టిపడుతుంది. ఒకరి ఆలోచనలు, ఆశయాలు, భయాలు మరొకరు అర్థం చేసుకోవడానికి ఈ సమయం సహాయపడుతుంది. దీనివల్ల భాగస్వామి పట్ల ప్రేమ, గౌరవం పెరుగుతాయి. గొడవలు తగ్గుతాయి.. చాలా కాపురాల్లో వచ్చే చిన్న చిన్న గొడవలకు లేదా విభేదాలకు ప్రధాన కారణం సరిగ్గా మాట్లాడుకోకపోవడమే. రోజూ కాసేపు ఎలాంటి ఫోన్లు, టీవీలు లేకుండా ఒకరితో ఒకరు మాట్లాడటం వల్ల మనసులోని భ్రమలు, అపోహలు తొలగిపోతాయి. భాగస్వామి చెప్పేది శ్రద్ధగా వినడం వల్ల మన సమస్యలను వారు అర్థం చేసుకుంటున్నారనే నమ్మకం కలుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.. ఆఫీసు పని, కుటుంబ బాధ్యతల వల్ల కలిగే శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించడంలో భాగస్వామితో గడిపే సమయం అద్భుతంగా పనిచేస్తుంది. రోజంతా పడిన కష్టాన్ని మరిచిపోయి, భాగస్వామితో కాసేపు నవ్వుతూ మాట్లాడినా లేదా చిన్న నడకకు వెళ్లినా మనసుకు ఎంతో ఉపశమనం లభిస్తుంది. భాగస్వామి ఇచ్చే ధైర్యం ఎలాంటి ఒత్తిడినైనా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. జీవితం ఎప్పుడూ కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది.. వివాహమై కొన్ని సంవత్సరాలు గడిచాక చాలామందిలో జీవితం రొటీన్‌గా మారిపోయిందనే భావన వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం చాలా అవసరం. కలిసి కాఫీ తాగడం, కొత్త ప్రదేశాలకు వెళ్లడం లేదా పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం వంటివి వైవాహిక జీవితంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. పిల్లలకు మార్గదర్శనం.. పిల్లలు ఎప్పుడూ తల్లిదండ్రులను చూసే విషయాలు నేర్చుకుంటారు. ఇంట్లో భార్యాభర్తలు ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూ, ప్రేమగా సమయం గడుపుతుంటే పిల్లలు కూడా ప్రేమ, అనురాగాలు ఉన్న వాతావరణంలో పెరుగుతారు. ఇది వారిలో మానసిక స్థిరత్వాన్ని పెంచుతుంది. భవిష్యత్తులో వారు కూడా మంచి సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకోవడానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది. మార్పులను గ్రహించవచ్చు.. కాలంతో పాటు మనుషుల ఆలోచనలు, అలవాట్లు మారుతుంటాయి. పెళ్లి సమయానికి ఉన్న భాగస్వామి, కొన్నేళ్ల తర్వాత శారీరకంగా, మానసికంగా మారవచ్చు. తరచూ మాట్లాడుకోవడం వల్ల భాగస్వామిలో వస్తున్న మార్పులను, వారి కొత్త అవసరాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల జీవితంలో ఏ దశలోనైనా ఒకరికొకరు అండగా నిలబడటం తేలికవుతుంది. భార్యాభర్తలు ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం అనేది ఒక బాధ్యత మాత్రమే కాదు, అది దాంపత్య జీవితానికి పునాది వంటిది. రోజూ కనీసం ఒక అర గంట పాటు ఫోన్లకు దూరంగా ఉండి,  మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటే, ఎలాంటి సమస్యలనైనా సులభంగా దాటవచ్చు. ఎంత బిజీగా ఉన్నా భాగస్వామికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మాత్రమే వైవాహిక బంధం సుదీర్ఘకాలం సంతోషంగా, ఆరోగ్యకరంగా సాగుతుంది.                      *రూపశ్రీ.  
 అంతర్జాతీయ వృద్దుల దినోత్సవం..  అనుభవాల సారం వృద్దుల జీవితం.. ! వయసు పైబడిన ప్రతి ఒక్కరి అనుభవం సమాజానికి గొప్ప మార్గదర్శకం. ప్రతి ఏటా అక్టోబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం జరుపుకుంటాం. ముసలివాళ్లు అయిపోయారు, ఇక వాళ్లతో ఏం పని అని కొందరు అనుకుంటూ ఉంటారు.  కానీ  జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసి, ఎన్నో పాఠాలను నేర్చుకున్న వారు వృద్దులు.  వృద్ధుల త్యాగాలను, వారు అందించిన సేవలను గుర్తుచేసుకోవడానికి ,  వారి పట్ల మన బాధ్యతను గుర్తుచేసుకోవడానికి,  అంతర్జాతీయ వృద్దుల దినోత్సవం ఎంతగానో సహాయపడుతుంది. వృద్దుల ప్రాధాన్యత,  వారి విషయంలో ఉండాల్సిన బాధ్యత,  సమాజంలో వారి పాత్ర మొదలైన విషయాలను వివరంగా తెలుసుకుంటే.. వృద్దుల జీవితం..  తీపి జ్ఞాపకాలు, చేదు అనుభవాలు, కష్టాలు, విజయాలు అన్నీ కలగలిపిన ఒక గొప్ప పుస్తకం వృద్ధుల జీవితం. జీవితంలో ఏది మంచి, ఏది చెడు అనే విషయాన్ని అనుభవంతో తెలుసుకున్న వారు మన ఇళ్లలో ఉండటం ఒక రక్షణ కవచం లాంటిది. కుటుంబం కోసం, సమాజం కోసం తమ యవ్వనాన్ని, శ్రమను ధారపోసిన వారు వృద్ధాప్యంలో మన నుంచి ఆశించేది కేవలం కొద్దిపాటి ప్రేమ, ఆప్యాయత , గౌరవం మాత్రమే. సమయమే ఇవ్వడం లేదు.. ఈనాటి వేగవంతమైన డిజిటల్ యుగంలో చాలామంది కుటుంబాల్లో పెద్దవారికి సరైన సమయం కేటాయించడం లేదు. ఒంటరితనం అనేది వారిని వేధించే అతిపెద్ద సమస్యగా మారుతోంది. వారితో రోజూ కొద్దిసేపు ప్రశాంతంగా మాట్లాడటం, వారి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకోవడం, వారి అనుభవాలను వినడం వల్ల వారికి కొండంత బలంతో పాటు మనసుకి ఎంతో సంతోషం లభిస్తుంది. సంరక్షణ.. వృద్ధుల సంక్షేమం, భద్రత, వారి ఆరోగ్య సంరక్షణ మనందరి ప్రాథమిక బాధ్యత. వారి అనుభవాల ద్వారా లభించే జ్ఞానాన్ని  గౌరవించాలి,  వారు తమ జీవితంలో కష్టాల నుండి బాధల నుండి నేర్చుకున్న విషయాలు కుటుంబంలో ఎందరికో ముందుజాగ్రత్తలు నేర్పుతాయి.  వారి వృద్ధాప్య జీవితం ప్రశాంతంగా, గౌరవప్రదంగా సాగేలా చూడటమే మనం వారికి ఇచ్చే నిజమైన కానుక. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా మన ఇంట్లో, మన చుట్టుపక్కల ఉన్న పెద్దలందరికీ సేవ చేయడం, వారిని ఎల్లప్పుడూ ఆనందంగా చూసుకోవడం కోసం కనీస చిరు ప్రయత్నం అయినా చెయ్యాలి. పిల్లలిచ్చే గౌరవమే కొండంత ఆనందం.. వృద్దులకు తమ పిల్లలు ఇచ్చే గౌరవమే కొండంత ఆనందాన్ని ఇస్తుంది.  సాధారణంగా కొన్ని ఇళ్లలో మనవళ్లు,  మనవరాళ్లు వృద్దులను చీదరించుకుంటూ,  చిరాకు పడుతూ.. వారితో మాట్లాడటానికి  ఇష్టపడరు. కానీ తమ తల్లిదండ్రులను పిల్లలు గౌరవిస్తూ వారితో ఆప్యాయంగా బాధ్యతగా ఉంటే.. వారి పిల్లలు కూడా తమ అవ్వ తాతల పట్ల ఎంతో ఆదరంగా, ప్రేమగా ఉండగలుగుతారు.  కాబట్టి వృద్దులను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు.                             *రూపశ్రీ.  
 అంతర్జాతీయ వృద్దుల దినోత్సవం..  అనుభవాల సారం వృద్దుల జీవితం.. ! వయసు పైబడిన ప్రతి ఒక్కరి అనుభవం సమాజానికి గొప్ప మార్గదర్శకం. ప్రతి ఏటా అక్టోబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం జరుపుకుంటాం. ముసలివాళ్లు అయిపోయారు, ఇక వాళ్లతో ఏం పని అని కొందరు అనుకుంటూ ఉంటారు.  కానీ  జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసి, ఎన్నో పాఠాలను నేర్చుకున్న వారు వృద్దులు.  వృద్ధుల త్యాగాలను, వారు అందించిన సేవలను గుర్తుచేసుకోవడానికి ,  వారి పట్ల మన బాధ్యతను గుర్తుచేసుకోవడానికి,  అంతర్జాతీయ వృద్దుల దినోత్సవం ఎంతగానో సహాయపడుతుంది. వృద్దుల ప్రాధాన్యత,  వారి విషయంలో ఉండాల్సిన బాధ్యత,  సమాజంలో వారి పాత్ర మొదలైన విషయాలను వివరంగా తెలుసుకుంటే.. వృద్దుల జీవితం..  తీపి జ్ఞాపకాలు, చేదు అనుభవాలు, కష్టాలు, విజయాలు అన్నీ కలగలిపిన ఒక గొప్ప పుస్తకం వృద్ధుల జీవితం. జీవితంలో ఏది మంచి, ఏది చెడు అనే విషయాన్ని అనుభవంతో తెలుసుకున్న వారు మన ఇళ్లలో ఉండటం ఒక రక్షణ కవచం లాంటిది. కుటుంబం కోసం, సమాజం కోసం తమ యవ్వనాన్ని, శ్రమను ధారపోసిన వారు వృద్ధాప్యంలో మన నుంచి ఆశించేది కేవలం కొద్దిపాటి ప్రేమ, ఆప్యాయత , గౌరవం మాత్రమే. సమయమే ఇవ్వడం లేదు.. ఈనాటి వేగవంతమైన డిజిటల్ యుగంలో చాలామంది కుటుంబాల్లో పెద్దవారికి సరైన సమయం కేటాయించడం లేదు. ఒంటరితనం అనేది వారిని వేధించే అతిపెద్ద సమస్యగా మారుతోంది. వారితో రోజూ కొద్దిసేపు ప్రశాంతంగా మాట్లాడటం, వారి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకోవడం, వారి అనుభవాలను వినడం వల్ల వారికి కొండంత బలంతో పాటు మనసుకి ఎంతో సంతోషం లభిస్తుంది. సంరక్షణ.. వృద్ధుల సంక్షేమం, భద్రత, వారి ఆరోగ్య సంరక్షణ మనందరి ప్రాథమిక బాధ్యత. వారి అనుభవాల ద్వారా లభించే జ్ఞానాన్ని  గౌరవించాలి,  వారు తమ జీవితంలో కష్టాల నుండి బాధల నుండి నేర్చుకున్న విషయాలు కుటుంబంలో ఎందరికో ముందుజాగ్రత్తలు నేర్పుతాయి.  వారి వృద్ధాప్య జీవితం ప్రశాంతంగా, గౌరవప్రదంగా సాగేలా చూడటమే మనం వారికి ఇచ్చే నిజమైన కానుక. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా మన ఇంట్లో, మన చుట్టుపక్కల ఉన్న పెద్దలందరికీ సేవ చేయడం, వారిని ఎల్లప్పుడూ ఆనందంగా చూసుకోవడం కోసం కనీస చిరు ప్రయత్నం అయినా చెయ్యాలి. పిల్లలిచ్చే గౌరవమే కొండంత ఆనందం.. వృద్దులకు తమ పిల్లలు ఇచ్చే గౌరవమే కొండంత ఆనందాన్ని ఇస్తుంది.  సాధారణంగా కొన్ని ఇళ్లలో మనవళ్లు,  మనవరాళ్లు వృద్దులను చీదరించుకుంటూ,  చిరాకు పడుతూ.. వారితో మాట్లాడటానికి  ఇష్టపడరు. కానీ తమ తల్లిదండ్రులను పిల్లలు గౌరవిస్తూ వారితో ఆప్యాయంగా బాధ్యతగా ఉంటే.. వారి పిల్లలు కూడా తమ అవ్వ తాతల పట్ల ఎంతో ఆదరంగా, ప్రేమగా ఉండగలుగుతారు.  కాబట్టి వృద్దులను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు.                             *రూపశ్రీ.  
ఉలవచారు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. కానీ ఉలవలు కేవలం రుచికరమైన ఆహారం మాత్రమే కాదు.. మన సంప్రదాయ ఆహార విధానంలో వీటికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా నల్ల ఉలవలను ఆహారంగా ఎలా ఉపయోగించాలి? వాటి వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటి? అనే విషయాలు చాలామందికి తెలియకపోవచ్చు. ఈ వీడియోలో 35 సంవత్సరాల ఆయుర్వేద అనుభవం ఉన్న Dr. Chittibhotla Madhusudhana Sharma గారు ఉలవల గురించి సులభమైన తెలుగులో వివరించారు. నల్ల, తెల్ల, ఎర్ర ఉలవల్లో ఉన్న తేడాలు, నల్ల ఉలవలను ఎందుకు ప్రత్యేకంగా భావిస్తారు, ఉలవల్లో ఉండే పోషకాలు, ఫైబర్ జీర్ణక్రియకు ఎలా ఉపయోగపడుతుంది వంటి విషయాలను ఇందులో తెలుసుకోవచ్చు. అలాగే ఉలవలు బరువు నియంత్రణకు ఉపయోగపడతాయా? రోజువారీ ఆహారంలో ఉలవలను ఎలా చేర్చుకోవాలి? ఉలవచారు లేదా ఇతర రూపాల్లో తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవచ్చు? ఉలవలు తింటే కిడ్నీలో రాళ్లు కరుగుతాయనే ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉంది? వంటి ముఖ్యమైన సందేహాలకు కూడా ఈ వీడియోలో వివరణ లభిస్తుంది. మన వంటింట్లో సులభంగా లభించే ఉలవలను సరైన విధంగా ఆహారంలో చేర్చుకోవడం ద్వారా వాటి పోషక విలువలను ఎలా పొందవచ్చో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. గమనిక: కిడ్నీలో రాళ్లు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఆహారంలో మార్పులు చేసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి. ఉలవలను ఏదైనా వ్యాధికి చికిత్సగా భావించి వైద్య చికిత్సను నిలిపివేయకండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
ప్రతిరోజూ ఉదయం ఉడకబెట్టిన గుడ్డు తినడం చాలామందికి అలవాటు. శారీరక బలానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కోడిగుడ్డును అత్యంత చౌకైన , సమర్థవంతమైన ఆహారంగా నిపుణులు చెబుతుంటారు. అయితే  చాలామంది గుడ్డు తినేటప్పుడు తెల్లసొనను మాత్రమే తిని, పచ్చసొనను తీసి పక్కన పడేస్తుంటారు. పచ్చసొన తింటే శరీరంలో కొలెస్ట్రాల్ లేదా చెడు కొవ్వు పెరిగిపోతుందని, గుండె ఆరోగ్యానికి మంచిది కాదని, బరువు పెరుగుతారని రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. అలాగే చిన్న పిల్లలకు పచ్చసొన ఇస్తే అరగదని భావించేవారు కూడా ఉన్నారు. కానీ ఇవన్నీ కేవలం శాస్త్రీయ ఆధారం లేని అపోహలు మాత్రమే అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.  నిజానికి గుడ్డులోని అసలైన పోషక నిధి పచ్చసొనలోనే దాగి ఉంటుంది. పచ్చసొనలో ఉన్న ముఖ్యమైన పోషకాలు , వాటి ప్రాముఖ్యత గుడ్డులోని సంపూర్ణ పోషక విలువలు మన శరీరానికి అందాలంటే పచ్చసొనను తీసివేయకుండా పూర్తిగా తినడం ఎంతో అవసరం. పచ్చసొనలో లభించే ప్రధానమైన పోషకాలు మన శరీరానికి ఏ విధంగా తోడ్పడతాయో వివరంగా తెలుసుకుంటే.. మెదడు అభివృద్ధికి.. గుడ్డు పచ్చసొనలో కోలిన్ అనే పోషక పదార్థం అధిక పరిమాణంలో ఉంటుంది. ఇది మెదడు సరైన రీతిలో పనిచేయడానికి , జ్ఞాపకశక్తిని పెంచడానికి ఎంతో ముఖ్యం. విశేషమేమిటంటే, ఎదుగుతున్న చిన్న పిల్లలలో మెదడు వికాసానికి , నరాల వ్యవస్థ నిర్మాణానికి కోలిన్ అత్యంత కీలకంగా పనిచేస్తుంది. నరాల బలానికి, రక్తకణాల తయారీకి విటమిన్ బి12.. పచ్చసొనలో విటమిన్ బి12 సమృద్ధిగా లభిస్తుంది. ఇది కొత్త రక్తకణాలు తయారవ్వడానికి, శరీరం చురుగ్గా ఉండటానికి , నరాల ఆరోగ్యానికి చాలా అవసరం. సాధారణంగా మనం తినే శాఖాహారంలో ఈ విటమిన్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే శాఖాహార లోపాలను భర్తీ చేసుకోవడానికి గుడ్డు పచ్చసొన ఒక గొప్ప ఆహార మూలంగా పనిచేస్తుంది. కంటి చూపుకు, రోగనిరోధక శక్తికి విటమిన్ ఏ..  ఇందులో ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరచడంలో ఎంతో సాయపడుతుంది. అలాగే శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలపరిచి, పలురకాల ఇన్ఫెక్షన్లు , వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. థైరాయిడ్ పనితీరుకు సెలీనియం..  గుడ్డు పచ్చసొనలో సెలీనియం అనే ముఖ్యమైన ఖనిజ లవణం ఉంటుంది. ఇది థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి , శరీరంలో జీవక్రియల వేగాన్ని నియంత్రించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. గుడ్డును పూర్తిగా ఎందుకు తినాలి? గుడ్డు తెల్లసొనలో కేవలం ప్రోటీన్ మాత్రమే లభిస్తుంది, కానీ పచ్చసొనలో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ , మేలైన పోషకాలన్నీ నిండి ఉంటాయి. కేవలం తెల్లసొన మాత్రమే తింటే గుడ్డు నుంచి వచ్చే పూర్తి పోషకాహార ప్రయోజనాలను మనం కోల్పోయినట్లే అవుతుంది. అందుకే అనవసరమైన భయాలు, అపోహలు పక్కన పెట్టి రోజువారీ ఆహారంలో గుడ్డును పచ్చసొనతో సహా పూర్తిగా తీసుకోవడం వల్ల  ఆరోగ్యం ఎంతగానో మెరుగవుతుంది.                      *రూపశ్రీ.