LATEST NEWS
  రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు. సోమవారం అమరావతి అసెంబ్లీ భవనంలో సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్. వనితా రాణికి అందచేశారు. ఈ నామినేషన్ల దాఖలు ప్రక్రియలో కూటమి పార్టీ నేతలు పాల్గొని ప్రతిపాదకులుగా సంతకాలు చేశారు.రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా సానా సతీష్ రెండు సెట్ ల నామినేషన్ లను సమర్పించారు. ప్రతిపాదకులుగా చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీ నారాయణ,పంతం వెంకటేశ్వరరావు(నానాజి), తంగిరాల సౌమ్య సంతకాలు చేశారు. రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా భాష్యం రామకృష్ణ రెండు సెట్ ల నామినేషన్ లను సమర్పించారు. ప్రతిపాదకులుగా మంత్రి అచ్చెన్నాయుడు,ఎమ్మెల్యేలు బి.రామాంజనేయులు,కొలిశెట్టి శ్రీనివాస్, శ్రీరాం తాతయ్యలు సంతకాలు చేశారు. రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా చింతకాయల విజయ్ రెండు సెట్లు నామినేషన్లు సమర్పించారు. ప్రతిపాదకులుగా మంత్రి కొలుసు పార్థసారథి,ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్,సుందరపు విజయ్ కుమార్,బోడే ప్రసాద్ లు సంతకాలు చేశారు.  ఈకార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఎం. అఖిల్ కుమార్, పి.విజయ కుమారి తోపాటు కూటమి నేతలు జ్యోతుల వెంకట అప్పారావు(నెహ్రూ),వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు)వరుపుల సత్య ప్రభ,బండారు సత్యానంద రావు పాల్గొన్నారు. ఇంకా 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ తదతర నేతలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువయ్యేలా సరికొత్త  కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది. వైసీసీ హయాంలో జగన్  ప్రజలకు అందుబాటులో ఉండకుండా, కేవలం  కోటరీకే పరిమితమై దెబ్బ తిన్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలకు ముందు ప్రజలతో మమేకమైన జగన్.. అధికార పగ్గాలు చేపట్టగానే, ప్రజలకు చేరువయ్యే అన్ని మార్గాలనూ మూసేసుకున్నారు. కేవలం తన కోటరీ  మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది.  ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.   ఈ ప్రజాబాటలో  భాగంగా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ  సంయుక్తంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లనున్నాయి. జూన్ 9న సంక్షేమ పథకాలపై కేంద్రీకరిస్తూ భారీ ఎత్తున తొలి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. లబ్ధిదారులకు పథకాలు అందుతున్న తీరు, అందులో మార్పుల వంటి పలు అంశాలపై  ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తారు. ఆ తర్వాత జూన్ 12న అమరావతి వేదికగా ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా పాలనాపరమైన ఇబ్బందులు, ప్రజల సమస్యలపై వినతులను స్వీకరిస్తారు. ఇక జూన్ 15న విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పనపై స్థానిక ప్రజలు, మేధావుల నుండి నేరుగా సూచనలు, సలహాలు సేకరించనున్నారు.  వైసీపీ హయాంలో సీఎంగా ఉన్న జగన్  ప్రజలతో నేరుగా  కలిసే అవకాశాలకు తాళం వేసేశారు.   ప్రజల నుండి క్షేత్రస్థాయి ఫీడ్‌బ్యాక్ తీసుకోకపోవడంతోనే  2024 ఎన్నికల్లో వైసీపీ  కేవలం 11 స్థానాలకే  పరిమితమైందన్నది పరిశీలకుల విశ్లేషణ. ఆ రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలించిన ఎన్డీఏ కూటమి, అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ  ప్రజలతో మమేకం అయ్యే వ్యూహాలనే అనుసరిస్తున్నది. తాజాగా చేపట్టిన ప్రజాబాట. ద్వారా సామాన్య ప్రజలు తమ ప్రాంత ప్రతినిధులను, ప్రభుత్వాన్ని నేరుగా కలిసి అభిప్రాయాలను పంచుకునే అవకాశం ఏర్పడుతుంది. ఈ ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే ప్రభుత్వం భవిష్యత్తులో తన పరిపాలనను మరింత మెరుగుపరుచుకుంటూ, ప్రజామోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలవుతుందని తెలుగుదేశం కూటమి సర్కరా్  భావిస్తోంది.  
తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) అధినేత్రి  కల్వకుంట్ల కవిత.. మాటలతో గారడీ చేసే విద్యను తండ్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) నుంచి పుణికి పుచ్చుకున్నట్లుగా కనిపిస్తారు. తెలంగాణ రాజకీయాలలో ఆమె శైలి ఒకింత భిన్నంగా ఉంటుంది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ స్థాపించిన కల్వకుంట్ల కవిత రాజకీయ ఉనికి కోసం వివాదాస్పద విమర్శల దారి ఎంచుకున్నట్లుగా కనిపిస్తున్నది. అందులో భాగంగానే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు.  ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.   వర్షాల కారణంగా అమరావతి సచివాలయంలోని ముఖ్యమంత్రి కుర్చీ నీరు కారుతోందని, అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రజలు పడవల్లో తిరుగుతున్నారని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   పవన్ కళ్యాణ్‌తో కవితకు ఏవైనా రాజకీయ విభేదాలు ఉంటే, ఆమె రాజకీయ స్థాయిలో ఆయనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడాన్ని ఎవరూ తప్పుపట్టరు కానీ..  ఆమె అమరావతిపై విమర్శలు చేయడంపై ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ ఆగ్రహం వ్యక్తం అవుతంది.   రాజకీయాల్లోని విభజన, ప్రాంతీయత అంశాన్ని  గతంలో కేసీఆర్   వీలైనంతగా వాడుకున్నారు. ఇప్పుడు కవిత మళ్లీ అదే పద్ధతిని అనుసరిస్తున్నారు. అయితే ఆమె అమరావతి లక్ష్యంగా చేస్తున్న వ్యాఖ్యల పట్ల తెలుగు రాష్ట్రాలలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది.  తన రాజకీయ ఉనికి కోసం కవిత అమరావతిపై విషం కక్కడం వ్యర్థ ప్రయత్నంగా పరిశీలకులు అభివర్ణిస్తుననారు. 
ALSO ON TELUGUONE N E W S
  రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్(Devi sri prasad) హీరోగా ఎల్లమ్మ(Yellamma)అనే చిత్రంతో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి బలగం ఫేమ్ వేణు దర్శకుడు కావడం దేవి శ్రీప్రసాద్ కి సంబంధించిన లుక్ తో ఎల్లమ్మ రాక కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా మరో రాక్ స్టార్ తమన్ ఎల్లమ్మ గురించి చేసిన వ్యాఖ్యలు ఎల్లమ్మ పై మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్ మాట్లాడుతు ఎల్లమ్మ  కథ నాకు మొదటి నుంచి పూర్తిగా తెలుసు. కథ విన్నప్పుడే చాలా అద్భుతంగా అనిపించింది. ఈ తరహా కథాంశాలు టాలీవుడ్‌లో చాలా అరుదుగా వస్తాయి. ఒక వైపు టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా బిజీగా ఉంటూనే, నటుడిగా మారడం కోసం దేవిశ్రీ 100 శాతం ప్రాణం పెట్టి పనిచేస్తున్నా రు. ఆయన పడుతున్న కష్టం, చూపిస్తున్న డెడికేషన్ కచ్చితంగా వెండితెరపై భారీ స్థాయిలో ప్రతిబింబిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ యాక్టింగ్ కెరీర్‌కి  ఎల్లమ్మ ఒక మైలురాయిగా నిలుస్తుంది.  దేవిశ్రీ ప్రసాద్ 'పర్షి' అనే డప్పు కళాకారుడి క్యారక్టర్ లో  ఊరమాస్ లుక్‌లో కనిపించబోతున్నారు. Also read: Peddi: పెద్దికి ఊహించని షాక్.. అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కులసంఘాల డిమాండ్  'ఎల్లమ్మ'కి నేనే మ్యూజిక్ ని అందిస్తున్నాను. సినిమాలోని కొన్ని ప్రత్యేకమైన పాటల కోసం నన్ను అడిగారు. దేవిశ్రీ ప్రసాద్ కోసం  తప్పకుండా అద్భుతమైన ట్యూన్స్ ఇస్తానని ఒప్పుకున్నట్లు తమన్ స్పష్టం చేశారు. ఒక హీరోగా మారుతున్న తోటి మ్యూజిక్ డైరెక్టర్ చిత్రానికి మరొక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అందించడం అనేది టాలీవుడ్ చరిత్రలోనే ఒక అరుదైన మరియు బ్యూటిఫుల్ మూమెంట్ అని చెప్పాలి. ఈ క్రేజీ కాంబినేషన్ మరియు తమన్ ఇచ్చిన పాజిటివ్ స్టేట్‌మెంట్స్ చూస్తుంటే 'ఎల్లమ్మ' బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులని సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.   
టాలీవుడ్ లో క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన విక్టరీ వెంకటేష్ (Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. గతంలో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి ఎవర్గ్రీన్ సినిమాలకు రచయితగా అద్భుతమైన సంభాషణలు అందించిన త్రివిక్రమ్, తొలిసారిగా వెంకటేష్ హీరోగా నటిస్తున్న చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటేష్ కెరీర్‌లో 77వ ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ క్రేజీ చిత్రానికి ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’ (AK47) అనే వెరైటీ టైటిల్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ మూవీగా మారిన ఈ చిత్రం విడుదలపై ఒక న్యూస్ వినిపిస్తోంది. రాబోయే దసరా పండుగను టార్గెట్ చేస్తూ 2026 అక్టోబర్ 16న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. (Aadarsha Kutumbam House No 47) హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) దాదాపు భారీ బడ్జెట్‌తో ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైటిల్ వినడానికి పక్కా ఫ్యామిలీ డ్రామాలా అనిపించినప్పటికీ, ఇందులో హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులు మరియు మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇటీవల చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నారా రోహిత్ కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. మొదట ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందించాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌ను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌లోనే వెంకటేష్ ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తిగా, చేతిలో ఆఫీస్ బ్యాగ్ పట్టుకుని రోడ్డు మధ్యలో నవ్వుతూ కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. ‘మల్లీశ్వరి’ తర్వాత దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ వస్తున్న ఈ కాంబినేషన్ కోసం టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. సుమారు 100 కోట్ల బడ్జెట్ కావడం, దసరా లాంటి పెద్ద హాలిడే సీజన్ కలిసి రానుండటంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.   
  -పెద్దికి వరుస షాక్ లు  -తాజాగా షాక్ ఇచ్చిన కులసంఘాలు  -అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్  -సెన్సార్ అధికారులపై కూడా కేసు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్(Ram Charan),బుచ్చిబాబు(Buchibabu)కాంబోలో తెరకెక్కిన 'పెద్ది'(Peddi)బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. మొదటి 4 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 292.5 కోట్ల గ్రాస్ వసూలు చేసి 300 కోట్ల క్లబ్‌కి చేరువవుతోంది. ఒకవైపు వసూళ్ల వర్షం కురుస్తున్నప్పటికీ, పెద్ది  చుట్టూ వివాదాలు మాత్రం ముసురుకుంటూనే ఉన్నాయి. ఇప్పటికే కథానాయిక జాన్వీ కపూర్ క్యారక్టర్ ని  గ్లామరైజ్ చేయడంపై నెట్టింట తీవ్ర చర్చ జరుగుతుంది. తాజాగా పెద్ది మరో అతిపెద్ద వివాదంలో చిక్కుకుంది. గిరిజన సంస్కృతిని, భావోద్వేగాలని  కించపరిచే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ గిరిజన సంఘాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఈ వివాదం ఇప్పుడు కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా అధికారికంగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. సినిమాలోని వివాదాస్పద అంశాలపై గిరిజన సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ 'పెద్ది' చిత్రబృందంతో పాటు కేంద్ర సెన్సార్ బోర్డు అధికారులపై కూడా పోలీసులకి  ఫిర్యాదు చేశారు. సినిమాలో తమ ఆచారాలను, సంప్రదాయాలని తప్పుగా చూపించడమే కాకుండా, గిరిజనుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కొన్ని సంభాషణలు ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి ఈ చిత్రానికి క్లియరెన్స్ ఇచ్చిన సెన్సార్ బోర్డు అధికారులదే ఇందులో ప్రధాన తప్పు అని, అందుకే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ తో పాటు సెన్సార్ అధికారులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. also read: Vrusha karma: వృషకర్మని భారీ మొత్తానికి దక్కించుకున్న అగ్ర సంస్థ.. చైతు కెరీర్ లోనే హయ్యస్ట్ జాన్వీ కపూర్ విషయంలో దర్శకుడు బుచ్చిబాబు ఎవరి మనోభావాలనైనా గాయపరిచి ఉంటే క్షమించాలని సోషల్ మీడియా వేదికగా బహిరంగ క్షమాపణలు చెప్పారు. సదరు వివాదాస్పద సన్నివేశాలని  సవరిస్తున్నట్లు కూడా  ప్రకటించాడు. ఇప్పుడు గిరిజన సంస్కృతికి సంబంధించిన అంశం కావడంతో ఈ వివాదం అంత తేలికగా సర్దుమణిగేలా కనిపించడం లేదు.  
Varun Tej’s upcoming entertainer Korean Kanakaraju is steadily building strong momentum even before release. Directed by Merlapaka Gandhi and produced by UV Creations, the film is currently progressing rapidly through post-production and promises a quirky Indo-Korean horror comedy setup. The project has already generated curiosity thanks to its unusual cross-cultural backdrop and the response to its promotional material. Adding to the excitement, S. Thaman’s musical single Kamsahamnida has turned into a chartbuster and helped the film gain visibility among audiences. In a significant development, reports suggest that the makers have closed major non-theatrical deals despite the current slowdown in the market. The business reflects growing confidence in the film’s content and Varun Tej’s ability to pull audiences. Industry reports now suggest that Korean Kanakaraju is being lined up for an August 7 release, with plans underway for an extensive promotional campaign. Inside buzz states that Varun Tej’s character is expected to be one of the biggest highlights of the film, while director is said to have designed a horror comedy that stands apart from his earlier works. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
Some collaborations in cinema go beyond credits and become stories of admiration, gratitude and creative trust. That seems to be the case with Singeetham and Nag Ashwin. Speaking at the Celebration of Sing Geetham event, veteran filmmaker Singeetham turned emotional and said the film’s entire credit should go to Nag Ashwin. While the original idea belonged to him, he openly admitted that bringing it to life would not have been possible without Ashwin’s support and involvement. He chose not to take full ownership of the final outcome, instead celebrating the younger filmmaker’s contribution. Nag Ashwin, in return, made it clear that he only helped a legend realize yet another innovative vision. He expressed happiness at being able to assist Singeetham and watch him deliver a film that carries his signature imagination. Their bond did not begin here. Nag Ashwin first approached Singeetham during Mahanati, seeking insights and research related to Savitri’s life. That association grew stronger over time, with Ashwin also taking the legendary director’s suggestions while shaping Kalki 2898 AD. Now, with Sing Geetham, Nag Ashwin seems to have returned that guidance in the best way possible—not through words, but by standing beside his mentor and helping his idea reach the screen. The movie is releasing on 11th June.  Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
తండేల్ ఇచ్చిన జోష్ తో నాగచైతన్యNnaga Chaitanya)విరూపాక్ష ఇచ్చిన జోష్ తో కార్తీక్ దండు(Karthik Dandu)కలిసి 'వృషకర్మ'(vrushakarma)చేస్తున్న విషయం తెలిసిందే. మైథలాజికల్, అడ్వెంచరస్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుండటంతో పాటు ప్రచార చిత్రాలు కూడా మంచి ఇంపాక్ట్ కలిగిస్తుండటంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. సినీ సర్కిల్స్ లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. ఇందుకు నిదర్శనంగా నాన్ దియేట్రికల్ హక్కుల కోసం అగ్ర ఛానళ్లు తీవ్రంగా పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే  భారీ మొత్తానికి 'జీ' తెలుగు ద‌క్కించుకున్న‌ట్టు స‌మాచారం.  నాగచైతన్య కెరీర్‌లోనే అత్యధిక ధర పలికిన శాటిలైట్ రైట్స్‌గా 'వృషకర్మ' సరికొత్త రికార్డుని క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉందని సమాచారం. ఇందుకు సంబంధించి త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రానున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ బిగ్ బడ్జెట్ మైథికల్ అడ్వెంచర్ మూవీలో చైతన్య సరసన 'గోల్డెన్ లెగ్ బ్యూటీ   మీనాక్షి చౌదరి కథానాయికగా చేస్తుంది. అలాగే విలక్షణ నటుడు జయరాం, టాలీవుడ్ కమెడియన్ సత్య మరియు బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం 'లాపతా లేడీస్' ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న 'స్పర్ష్ శ్రీవాస్తవ' నెగెటివ్ షేడ్ ఉన్న కీలక రోల్ లో  కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్ర యూనిట్ రాజస్థాన్‌లోని అద్భుతమైన లోకేషన్లలో ఒక కీలకమైన మేజర్ షెడ్యూల్‌ని  విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం దాదాపు 90 శాతం షూటింగ్ పనులను పూర్తి చేసుకోగా అక్టోబరులో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. Also read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై రాహుల్ రామకృష్ణ విమర్శలు.. నా లెక్కలకి సమాధానం ఇస్తారా!  'అర్జున్' అనే ఒక సాహసోపేతమైన నిధి అన్వేషకుడి (ట్రెజర్ హంటర్) క్యారక్టర్ లో చైతన్య  కనిపించబోతున్నాడు. బ్రహ్మగిరి పర్వతాల నేపథ్యంలో సాగే నిధి అన్వేషణ, ఆ క్రమంలో చైతుకి  ఎదురయ్యే వింతైన మార్మిక ప్రపంచం చుట్టూ  కథ తిరుగుతుందివిజువల్ ఎఫెక్ట్స్,గ్రాఫిక్స్‌కి అత్యంత ప్రాధాన్యత ఉన్న ఈ చిత్రాన్ని  శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC) బ్యానర్‌పై బి. వి. ఎస్. ఎన్. ప్రసాద్, సుకుమార్  రైటింగ్స్' సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాంతార ఫేమ్ బి. అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ డైరెక్టర్.  
  -పవన్ కళ్యాణ్ పై రాహుల్ రామకృష్ణ సంచలన ట్వీట్  -ఆర్భాటాలు పక్కన పెడతారా! -మీ ఫ్యాన్ గా అడుగుతున్నానంటూనే చురకలు  టాలీవుడ్ యాక్టర్ 'అర్జున్ రెడ్డి' ఫేమ్ రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియా వేదికగా చేసిన కొన్ని ట్వీట్లు ప్రస్తుతం రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. సమాజంలో జరిగే విభిన్న పరిణామాలపై ఎప్పటికప్పుడు ముక్కుసూటిగా స్పందించే రాహుల్ రామకృష్ణ, తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని లక్ష్యంగా చేసుకుని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వరుస ప్రశ్నాస్త్రాలు సంధించారు.  తన ట్వీట్‌లో 'పవన్ కళ్యాణ్ గారు, మీ ఆర్భాటాలు, గొప్పలు కాసేపు పక్కన పెడితే సమాచార హక్కు చట్టం RTI యాక్ట్ కింద మీరు నిర్వహించే ప్రతి శాఖలోని అన్ని విభాగాల్లో సమాచారాన్ని ప్రజలకు వెల్లడిస్తున్నారా? ముందస్తు సమాచార బహిర్గతానికి సంబంధించిన సెక్షన్ 4.1(బి)  ని మీ శాఖల్లో పూర్తిస్థాయిలో అమలు చేశారా సార్? నేను మీ అభిమానిగా మాత్రమే ఈ ప్రశ్న అడుగుతున్నాను.ప్రజాప్రతినిధులుగా మీరు మా ప్రశ్నలకు నిరంతరం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ప్రశ్నించినంత మాత్రాన నన్ను తప్పుగా భావించవద్దు. ప్రశ్నలు అడిగినంత మాత్రాన నేనేమీ దేశద్రోహిని కాను అంటూ ట్వీట్ చేసాడు. Also read: Peddi: ఏడ్చేసిన రామ్ చరణ్.. వీడియో వైరల్ అంతటితో ఆగకుండా గిరిజన ప్రాంతాల్లో చట్టాల అమలు, పర్యావరణ అంశాలపై కూడా రాహుల్ తీవ్రమైన ప్రశ్నలు గుప్పించారు. గిరిజన హక్కులకు సంబంధించిన పెసా చట్టం, 1/70 చట్టం, అలాగే గ్రామసభ చట్టం అమలుకి  సంబంధించిన గ్రౌండ్ లెవెల్ ఫలితాలని  దయచేసి ప్రజలకి తెలియచేయాలి. ఏపీ ప్రభుత్వం లేదా పవన్ కళ్యాణ్ శాఖ ఆధ్వర్యంలో చేసినట్లు చెబుతున్న అటవీకరణ కార్యక్రమాల వివరాలని కూడా బహిర్గతం చేయాలి. ఒక స్వతంత్ర సంస్థ ధృవీకరించిన లెక్కల ప్రకారం చూస్తే ఆ గణాంకాలు చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి. నేను స్వయంగా ఆర్టీఐ ద్వారా దాఖలు చేసి, గుర్తించిన ఫలితాల ఆధారంగానే ఈ వివరాలను అడుగుతున్నానని చెప్పిన రామకృష్ణ  తన ట్వీట్ ముగింపులో 'జై తెలంగాణ' అని నినదించడం విశేషం.  
టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ (SS Thaman) కేవలం వెండితెరపైనే కాకుండా లైవ్ కాన్సర్ట్ లు, మ్యూజికల్ షోలతోనూ ప్రేక్షకులను అలరిస్తుంటారు. తాజాగా జరిగిన ప్రెస్ మీట్‌లో తన అప్ కమింగ్ మ్యూజికల్ కాన్సెప్ట్‌ 'ఓజీ టూర్'కు సంబంధించిన విషయాలను పంచుకున్నారు. ఈ షో వెనుక ఉన్న అసలు మోటివ్ ఏంటనేది తమన్ వెల్లడించారు. ప్రెస్ మీట్ ఇంటరాక్షన్‌లో భాగంగా ఒక జర్నలిస్ట్ తమన్‌ను ప్రశ్నిస్తూ.. "ఈ మ్యూజిక్ కాన్సర్ట్ వెనుక ఉన్న ప్రధాన మోటివ్ ఏంటి? ఇది కమర్షియల్ యాంగిలా లేక చారిటీ కోసమా?" అని అడిగారు. దీనికి తమన్ ఏమాత్రం తడుముకోకుండా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్‌గా సమాధానమిచ్చారు. "నేను ఒక షో చేస్తున్నాను అంటే అది కచ్చితంగా చారిటీ కోసమే ఉంటుంది. నా సొంత లాభం కోసం, నా కోసం నేను ఎప్పుడూ ఇలాంటి మ్యూజికల్ షోలు చేసుకోను" అని స్పష్టం చేశారు. తమన్ నోట వచ్చిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. అంతేకాదు, ఈ కాన్సర్ట్ ద్వారా వచ్చే మొత్తం రెవెన్యూ పూర్తిగా సేవా కార్యక్రమాలకే వెళ్తుందని ఆయన చెప్పారు. ఈ షో ద్వారా ఎంత మొత్తం కలెక్ట్ అయింది, దాన్ని ఎక్కడెక్కడ చారిటీకి ఉపయోగించామనే పూర్తి వివరాలను కూడా తానే స్వయంగా పబ్లిక్‌కు అనౌన్స్ చేస్తానని తమన్ వెల్లడించారు. షో కంప్లీట్ అయిన వారం రోజుల్లోనే ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ప్రతి ఒక్క పైసా లెక్కను అధికారికంగా బయటపెడతానని జర్నలిస్టుల సాక్షిగా తమన్ ప్రామిస్ చేశారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సమాజం పట్ల బాధ్యతతో తమన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలతో పాటు సినీ అభిమానులు ఎంతగానో అభినందిస్తున్నారు. కేవలం కమర్షియల్ లబ్ది కోసమే కాకుండా ఇలాంటి సేవా దృక్పథంతో మ్యూజికల్ ఈవెంట్స్ ప్లాన్ చేయడం గర్వించదగ్గ విషయమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.   
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
ప్రతి వ్యక్తికి నేటికాలంలో ఇల్లు, ఆఫీసు అంటూ రెండు ప్రదేశాలు ముఖ్యంగా మారాయి.  ఒకటి కుటుంబ సభ్యులతో కలసి ఉండేది అయితే రెండవది కుటుంబ సభ్యులను పోషించడానికి మరొక ప్రదేశంలో విభిన్న వ్యక్తులతో కలిసి పనిచేసే స్థలం. చాలామంది ఆఫీసులో ఒత్తిడి ఎదుర్కుంటున్నామని చెబుతూ ఉంటారు. ఆఫీసులో గనుక పని ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటే అది మానసిక ఆరోగ్యాన్ని, వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అయితే కొన్ని చిన్న చిన్న మార్పులు, చిట్కాలతో ఒత్తిడి నుండి బయట పడవచ్చు. ఇవి నేరుగా ఆఫీసుకు వెళ్లి పని చేసే వారికి అయినా,  లేక వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి అయినా చాలా చక్కగా పని చేస్తాయి.  అవేంటో తెలుసుకుంటే.. పనుల జాబితా.. ఈ చిట్కా ఖచ్చితంగా  సహాయపడుతుంది. ఉదయాన్నే డైరీలో రోజు పనులను రాసుకోవాలి. పైన తేలికైన పనులను,  దిగువన ఎక్కువ సమయం,  శ్రద్ధ అవసరమయ్యే పనులను లిస్ట్  చేయాలి. ఇది  మనస్సు గందరగోళం లేకుండా క్లారిటీగా  ఉంచడానికి సహాయపడుతుంది.  రోజులో ఆ పనులు చేయాలి, ఈ పనులు చేయాలి.. వాటిని ఎప్పుడు చేయాలో అనుకుంటూ  అతిగా ఆలోచించడాన్ని తగ్గిస్తుంది. బ్రేక్ ముఖ్యం..  ఎంత పని ఉన్నా సరే.. గంటల తరబడి కూర్చుని పని చేయడం తప్పు. ప్రతి 25-30 నిమిషాల పని తర్వాత 5 నిమిషాల విరామం తీసుకోవాలి. నీరు త్రాగడం,  కళ్ళు మూసుకోవడం  లేదా కొద్దిగా శరీరాన్ని రిలాక్స్ చేసుకోవడం.. ఇవన్నీ  మనసు అలసిపోకుండా  విశ్రాంతిని ఇస్తాయి.   ఒత్తిడిని తగ్గిస్తాయి. నో చెప్పడం నేర్చుకోండి.. ఇది అతి ముఖ్యమైన చిట్కా ఏమిటంటే.. ప్రతి పనినీ, మీటింగ్‌నీ లేదా పనిని.. ఇట్లా ఏదైనా సరే.. ఆఫీసులో  అదనపు బాధ్యతను ఎప్పుడూ తీసుకోకూడదు. చాలా మంది కాస్త మంచిగా మాట్లాడుతూ,  కాస్త పొగుడుతూ ఏదైనా పని చేసిపెట్టమని అడుగుతూ ఉంటారు.  అలాంటి సందర్భాలలో  మర్యాదగా తిరస్కరించాలి.  ఇది  మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎందుకంటే అదనపు పని భారం ఒత్తిడికి దారి తీస్తుంది.  ప్రతి ఒక్కరూ నో చెప్పడం నేర్చుకోవాలి. ఇది ఎంతో సహాయపడుతుంది. శారీరక శ్రమ..  పనిలో బిజీగా ఉన్నప్పటికీ, ప్రతిరోజూ 15-30 నిమిషాలు నడవడం, యోగా చేయడం లేదా తేలికపాటి వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. ఇది సహజ ఒత్తిడిని తగ్గించే మార్గం.  ఒత్తిడి హార్మోన్లు వ్యాయామం వల్ల తగ్గుతాయి. వ్యాయమం మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇది  ఫిట్‌గా ఉంచుతుంది. డెస్క్ దగ్గరే కూర్చుని చేయగల యోగా భంగిమలు కొన్ని ఉంటాయి.  అలాంటివి చేసినా బాగుంటుంది.                          *రూపశ్రీ.
ఆదివారం అనే మాట వినగానే మన ముఖాల్లో సంతోషకరమైన చిరునవ్వు వస్తుంది. ఇది కుటుంబంతో సమయం గడపడానికి,  పని నుండి విరామం తీసుకోవడానికి కేటాయించబడిన రోజుగా పరిగణిస్తారు. చిన్నప్పుడు పిల్లలు ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుందా అని ఎదురుచూసేవారు.. కానీ ఇప్పుడు పిల్లలు పెద్దలు కూడా ఆదివారం కోసం ఎదురుచూడటం సాధారణమైపోయింది.  భారతదేశంలో ప్రభుత్వ కార్యాలయాలకు  ఆదివారం వారపు సెలవుదినంగా ఉంటుంది. కానీ ఆదివారం అనేది మొదటి నుండి సెలవు దినంగా ఉన్నది కాదని,  ఆదివారం సెలవు దినం కావడం వెనుక చాలా ఆసక్తికరమైన సంఘటన ఉంది. దాని గురించి తెలుసుకుంటే.. కార్మిక హక్కులు.. బ్రిటిష్ పాలన కాలంలో  ఆదివారంను వారపు సెలవు దినంగా ఎంచుకున్నారు. దీని  వెనుక ఒక  కథ ఉంది. ఆదివారం సెలవు వెనుక కథ.. ప్రస్తుత కాలం ఆదివారంతో చేసే ఎంజాయ్మెంట్ ఎప్పుడూ ఉండేది కాదు.  ఎందుకంటే  బ్రిటిష్ పాలనలో భారతదేశంలోని వస్త్ర మిల్లులలో, ముఖ్యంగా ముంబైలోని కార్మికుల పరిస్థితులు దారుణంగా ఉండేవి. వారు వారానికి ఏడు రోజులు విరామం లేకుండా పని చేయాల్సి వచ్చింది. వారం మొత్తం ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల ఆరోగ్యం చాలా దెబ్బతినేది. ఈ క్లిష్ట సమయంలో నారాయణ్ మేఘాజీ లోఖండే వారి హీరో అయ్యాడు. 7ఏళ్ల పోరాటం.. కార్మికుల దుస్థితిని చూసి లోఖండే వారి హక్కుల కోసం గొంతు విప్పాడు. 1881,  1884 మధ్య ఎన్నో నిరసనలు నిర్వహించి బ్రిటిష్ పరిపాలకులకు చాలా సందేశాలను పంపాడు. అతని విజ్ఞప్తిపై వేలాది మంది కార్మికులు ఏకమయ్యారు. కానీ అది చిన్న పోరాటం కాదు. ఈ ఉద్యమం ఏడు సంవత్సరాలు కొనసాగింది. చివరికి కార్మికుల సంఘీభావం,  లోఖండే ప్రయత్నాలకు బ్రిటిష్ ప్రభుత్వం లొంగిపోయింది.   జూన్ 10, 1890న, భారతదేశంలో  ఆదివారం అధికారికంగా వారపు సెలవు దినంగా ప్రకటించబడింది. ఆదివారం సెలవు వెనుక అసలు కారణం.. ఆదివారం సెలవు దినంగా ఎంచుకోవడం వెనుక మతపరమైన,  ఆచరణాత్మక కారణాలు రెండూ ఉన్నాయి. ఆ సమయంలోభారతదేశాన్ని క్రైస్తవ మతాన్ని ఆచరించే బ్రిటిష్ వారు పరిపాలించారు. వారికి ఆదివారం చర్చికి వెళ్లడానికి సరైన రోజు. అందువల్ల ఆదివారం సెలవు దినంగా ఎంచుకున్నారు. భారతీయ సంస్కృతి,  హిందూ మతంతో అనుసంధానిస్తూ ఆదివారం సూర్యభగవానుడికి,  కొన్ని ప్రాంతాలలో ఖండోబాకు అంకితం చేయబడిందని ఒక వాదన ముందుకు వచ్చింది. బ్రిటిష్ వారిలాగే భారతీయ కార్మికులు కూడా విశ్రాంతి,  పూజ కోసం ఒక రోజును కలిగి ఉండాలి. 1700 సంవత్సరాల చరిత్ర.. ఆదివారాన్ని విశ్రాంతి దినంగా చేయడం అనేది  భారతదేశంలో పుట్టినది కాదు. దీని చరిత్ర చాలా కాలం నాటిది. 321 ADలో, రోమన్ చక్రవర్తి కాన్‌స్టాంటైన్ ది గ్రేట్ మొదట ఆదివారాన్ని రోమన్ సామ్రాజ్యం అంతటా విశ్రాంతి దినంగా ప్రకటించాడు. క్రమంగా ఈ సంప్రదాయం యూరప్,  తరువాత బ్రిటన్ పరిపాలనా వ్యవస్థలో భాగమైంది.  వారు దానిని భారతదేశానికి తీసుకువచ్చారు. అంతే తప్ప భారతీయులకు ప్రత్యేకంగా ఈ ఆదివారం సెలవు వెనుక ఎలాంటి ప్రాధాన్యత లేదు.                                        *రూపశ్రీ.
 భారతదేశ  పరిమళం ఇప్పుడు సప్త సముద్రాల ఆవలి దేశాల వాతావరణంతో మేళవిస్తోంది. ఆ దేశాల సంస్కృతులు, సంప్రదాయాలు మనకంటే పూర్తిగా భిన్నమైనవి. మనం మన పెరటి మొక్కగా అంతకంటే ఎక్కువ ఇంటి దేవతగా  భావించి, ప్రతి ఉదయం, సాయంత్రం నీళ్ళు పోసి పూజించే  తులసి, ఇప్పుడు ప్రపంచంలోని ప్రధాన ముస్లిం దేశాల మొదటి ఎంపికగా మారింది. ఈ మాట తెలియగానే చాలామందికి ఆశ్చర్యం వేస్తుంది.  కానీ  ఇటీవలి డేటా , వాణిజ్య నివేదికలు ఒక ఆశ్చర్యకరమైన నిజాన్ని వెల్లడించాయి. బంగ్లాదేశ్, మలేషియా , ఇండోనేషియా వంటి దేశాలలో భారతీయ తులసికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇది కేవలం వాణిజ్యానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, భారతీయులుగా తెలుసుకోవాల్సిన విషయం. తులసిని కేవలం మొక్కగా బావించే ఎంతోమంది విదేశీయులు కూడా తులసికి ఎందుకంత గొప్ప ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. విదేశాలలో తులసి.. సనాతన ధర్మంలో, తులసిని కేవలం ఒక మొక్కగా మాత్రమే కాకుండా, "సాక్షాత్తు లక్ష్మీదేవి" స్వరూపంగా భావిస్తారు. పెరట్లో తులసి ఉన్న ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశించలేదని శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ నేడు, ఈ నమ్మకం అన్ని హద్దులను దాటింది. ఇటీవలి నివేదికల ప్రకారం, తులసి,  దాని సారాలు భారతదేశం నుండి పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ , మలేషియా వంటి ఆగ్నేయాసియా దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి అవుతున్నాయి. ఆశ్చర్యకరంగా, ఈ దేశాలు దీనిని కేవలం ఒక మొక్కగా మాత్రమే కాకుండా, ఒక "దివ్య ఔషధం"గా స్వీకరిస్తున్నాయి. విదేశాలలో తులసికి ఆదరణ.. విదేశాలలో తులసి ఆదరణ  వెనుక విజ్ఞానం  ఆధ్యాత్మికతల కలయికను ప్రతిబింబించే అనేక లోతైన , తార్కిక కారణాలు ఉన్నాయి. నయంకాని వ్యాధులకు సర్వరోగ నివారిణిగా తులసి పనిచేస్తుంది. ఈ దేశాలలో ఆయుర్వేదంపై నమ్మకం పెరిగింది. అక్కడి శాస్త్రవేత్తలు కూడా క్యాన్సర్, మధుమేహం , శ్వాసకోశ వ్యాధుల చికిత్సలో తులసి ప్రభావవంతంగా పనిచేస్తుందని గుర్తించి దాన్ని వైద్యంలో భాగం చేస్తున్నారట. హలాల్ గుర్తించిన మూలిక.. మలేషియా , ఇండోనేషియా వంటి దేశాలలో, "హలాల్" ఉత్పత్తులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తులసి ఉత్పత్తులు సహజమైనవి , స్వచ్ఛమైనవి, వీటిలో నిషేధిత రసాయనాలు ఏవీ ఉండవు. ఈ కారణంగానే అక్కడి ముస్లిం సమాజంలో వీటికి ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. తులసి టీ.. భారతీయ "తులసి టీ" కి ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రజలు కెఫిన్‌ను వదిలిపెట్టి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి , రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి తులసి సారాన్ని ఆశ్రయిస్తున్నారు. తులసితో టీ తయారు చేసుకుని తాగుతున్నారు. మతపరమైన దృక్కోణం నుండి చూస్తే ప్రతి భారతీయుడు దీన్ని  గర్వంగా భావించాలి. మనం విష్ణువుకు ఎంతో ప్రతీకరమైనదిగా  పిలుచుకునే మొక్క పరిమళం ఇప్పుడు విభిన్నమైన ప్రార్థనా పద్ధతులున్న ఇళ్లకు చేరుతోంది. సనాతన సంస్కృతి పూజించే ప్రకృతిలోని ప్రతి అంశం మానవులకు ఎంతో మేలు చేసేది, ఆరోగ్యం చేకూర్చేది అనేటువంటి దానికి ఇదొక నిదర్శనం.   ప్రపంచ మార్కెట్లో తులసికి ప్రాధాన్యత.. భవిష్యత్తులో తులసి ప్రపంచ మూలికా మార్కెట్‌కు బిలియన్ల డాలర్ల మేర దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. గత మూడేళ్లలో గల్ఫ్ దేశాలకు తులసి ఎగుమతులు 30-40% పెరిగాయట. దుబాయ్ , సౌదీ అరేబియాలోని విలాసవంతమైన స్పా మరియు బ్యూటీ పార్లర్లలో ఇప్పుడు తులసి ఆధారిత ఫేస్ మాస్క్‌లు , నూనెలను ప్రీమియం ట్రీట్మెంట్ లో భాగంగా గా అందిస్తున్నారట. భారతీయులకు ఎంతో పవిత్రమైన,  ఆయుర్వేదంలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నట్టు పేర్కొన్న తులసిని భారతీయులు చిన్నతనం చేయకుండా ఉపయోగించుకోవాలి.                                      *రూపశ్రీ.
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో, మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది శరీరానికి కావలసిన పోషకాలను సరిగ్గా అందజేయలేకపోతున్నారు. ఈ క్రమంలో శరీరంలో విటమిన్లు, ఖనిజాల లోపాన్ని భర్తీ చేయడానికి చాలామంది ఆశ్రయించేది "మల్టీవిటమిన్ టాబ్లెట్లు" (Multivitamin Tablets). అయితే, ఈ టాబ్లెట్లను ఎప్పుడు వాడాలి? ఎలా వాడాలి? ఎక్కువగా వాడితే ఎలాంటి నష్టాలు జరుగుతాయి? అనే విషయాలపై ప్రముఖ వైద్యులు డాక్టర్ లక్ష్మి కోన గారు అందించిన పూర్తి వివరాలు ఈ VIDEO ద్వారా తెలుసుకుందాం. మల్టీవిటమిన్ టాబ్లెట్ల ఉపయోగాలు (Uses of Multivitamins) మన శరీరంలో వివిధ అవయవాలు సక్రమంగా పనిచేయడానికి, రోగనిరోధక శక్తి బలంగా ఉండటానికి విటమిన్లు ఎంతగానో తోడ్పడతాయి. మల్టీవిటమిన్ల వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు: పోషకాహార లోపాన్ని భర్తీ చేయడం: మనం తినే ఆహారంలో లోపించిన ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్‌ను ఇవి శరీరానికి అందిస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుదల (Immunity Boost): విటమిన్ C, D, మరియు జింక్ వంటి పోషకాలు శరీరంలో ఇమ్యూనిటీని పెంచి, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. శక్తిని అందించడం (Energy Levels): విటమిన్ B-కాంప్లెక్స్ శరీరంలో ఆహారాన్ని శక్తి గా మార్చడంలో సహాయపడుతుంది, దీనివల్ల అలసట, నీరసం తగ్గుతాయి. చర్మం, జుట్టు ఆరోగ్యం: విటమిన్ E, బయోటిన్ వంటివి చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఎముకల బలం: క్యాల్షియం మరియు విటమిన్ D కలిసిన మల్టీవిటమిన్లు ఎముకలను, దంతాలను దృఢంగా ఉంచుతాయి. సరైన డోసేజ్ మరియు వేసుకునే విధానం (Correct Dosage & Guidelines) మల్టీవిటమిన్లను ఎప్పుడు పడితే అప్పుడు, ఎన్ని పడితే అన్ని వేసుకోకూడదు. వాటికంటూ ఒక పద్ధతి ఉంటుంది: మల్టీవిటమిన్ టాబ్లెట్లను సాధారణంగా ఉదయం లేదా मధ్యాహ్నం భోజనం తర్వాత వేసుకోవడం మంచిది. పరగడుపున (ఖాళీ కడుపుతో) వేసుకుంటే కొంతమందిలో కడుపులో మంట లేదా వికారం కలగవచ్చు. కొన్ని విటమిన్లు (A, D, E, K) కొవ్వులో కరిగేవి (Fat-soluble vitamins). కాబట్టి, కొద్దిగా కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారం తీసుకున్న తర్వాత వీటిని వేసుకుంటే శరీరం బాగా గ్రహిస్తుంది. ఎల్లప్పుడూ డాక్టర్ సూచించిన డోస్ మాత్రమే వాడాలి. సొంత నిర్ణయాలతో రోజుకు ఒకటి కంటే ఎక్కువ టాబ్లెట్లు వేసుకోకూడదు. జాగ్రత్త: మితిమీరిన విటమిన్ల వాడకం  చాలామంది మల్టీవిటమిన్లు ఆరోగ్యానికి మంచిదే కదా అని విపరీతంగా వాడుతుంటారు. కానీ, డాక్టర్ లక్ష్మి కోన గారి ప్రకారం, విటమిన్లు ఎక్కువైతే "విటమిన్ టాక్సిసిటీ" (Vitamin Toxicity / Hypervitaminosis) అనే ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా విటమిన్ A, D, E, K లు శరీరంలో పేరుకుపోయి కాలేయం (Liver) మరియు మూత్రపిండాల (Kidneys) పై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు, విటమిన్ D ఎక్కువైతే శరీరంలో క్యాల్షియం పెరిగిపోయి కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఏర్పడే అవకాశం ఉంది. అలాగే విటమిన్ A ఎక్కువైతే తలనొప్పి, వాంతులు మరియు కాలేయ సమస్యలు రావచ్చు. దుష్ప్రభావాలు (Side Effects) సాధారణంగా పరిమితికి లోబడి వాడినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ కొంతమందిలో క్రింది లక్షణాలు కనిపించవచ్చు: కడుపులో అశాంతి, వికారం లేదా వాంతులు. మలబద్ధకం (Constipation) లేదా విరేచనాలు (Diarrhea) - ముఖ్యంగా ఐరన్ (Iron) ఎక్కువగా ఉన్న మల్టీవిటమిన్ల వల్ల మలం నల్లగా రావడం మరియు మలబద్ధకం జరుగుతుంది. నోటిలో వింత రుచి (Metallic Taste). ఇతర మందులతో పరస్పర చర్యలు (Drug Interactions) మీరు ఇప్పటికే ఇతర ఆరోగ్య సమస్యల కోసం మందులు వాడుతుంటే, మల్టీవిటమిన్లు వేసుకునే ముందు జాగ్రత్త వహించాలి: యాంటీబయాటిక్స్: మల్టీవిటమిన్లలో ఉండే క్యాల్షియం, ఐరన్, జింక్ వంటి మినరల్స్ కొన్ని రకాల యాంటీబయాటిక్స్ (ఉదాహరణకు Tetracyclines) శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. కాబట్టి వీటి మధ్య కనీసం 2 గంటల వ్యవధి ఉండాలి. బ్లడ్ థిన్నర్స్ (రక్తాన్ని పలచబరిచే మందులు): విటమిన్ K రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది. ఒకవేళ మీరు రక్తాన్ని పలచబరిచే మందులు (Warfarin వంటివి) వాడుతుంటే, విటమిన్ K ఉన్న మల్టీవిటమిన్లు వాటి పనితీరును దెబ్బతీస్తాయి. చివరిగా:-  మల్టీవిటమిన్ టాబ్లెట్లు అనేవి సమతుల్య ఆహారానికి ప్రత్యామ్నాయం కావు.. సహజసిద్ధమైన పండ్లు, కూరగాయలు, ఆకుకూరల ద్వారా వచ్చే పోషకాలే శరీరానికి అత్యంత శ్రేష్ఠమైనవి.  మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
గుండె మానవ శరీరంలో అత్యంత కీలకమైన అవయవం, ఇది శరీరమంతటికీ ఆక్సిజన్ , పోషకాలను అందించడానికి నిరంతరం రక్తాన్ని పంపింగ్ చేస్తుంది. అయితే, మారుతున్న జీవనశైలి, ఒత్తిడి,  ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం,  శారీరక శ్రమ లేకపోవడం వల్ల గుండె జబ్బుల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గుండె సమస్యలు వచ్చే వారిలో మొదట్లోనే చిన్న చిన్న లక్షణాలుగా కనిపిస్తాయి. కానీ చాలామంది వీటిని పెద్దగా పట్టించుకోరు.  ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ లక్షణాలను ముందుగానే గుర్తించడం వల్ల తీవ్రమైన గుండె జబ్బులను , గుండెపోటు వంటి ప్రాణాంతక పరిస్థితులను నివారించవచ్చు. శరీరంలో ఏ లక్షణాలు గుండె జబ్బులను సూచిస్తాయో.. ఆ లక్షణాలు మీకు ఉన్నాయేమో ఒక్కసారి చెక్ చేస్కోండి.. ఛాతీ నొప్పి.. ఛాతీ నొప్పి, బిగుతుగా అనిపించడం, బరువుగా ఉండటం లేదా ఒత్తిడి వంటివి గుండె జబ్బు  అత్యంత సాధారణ లక్షణాలు. ఈ నొప్పి కొన్ని నిమిషాల పాటు ఉండవచ్చు లేదా పదేపదే రావచ్చు. కొన్నిసార్లు ఈ నొప్పి భుజం, మెడ, వీపు లేదా చేతికి కూడా వ్యాపించవచ్చు. ఇలా పదేపదే జరుగుతుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఊపిరి ఆడకపోవడం.. మెట్లు ఎక్కేటప్పుడు  విపరీతమైన అలసటగా లేదా ఆయాసంగా అనిపిస్తే, అది గుండె బలహీనతకు సంకేతం కావచ్చు. గుండె సరిగ్గా రక్తాన్ని పంప్ చేయలేనప్పుడు, ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరిగి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. అలసట, బలహీనత.. విశ్రాంతి తీసుకున్నప్పటికీ నిరంతరం అలసటగా అనిపిస్తుంటే, దానిని సాధారణ బలహీనతగా భావించి నిర్లక్ష్యం చేయకూడదు.  గుండె పనితీరు తగ్గినప్పుడు, శరీర భాగాలకు తగినంత ఆక్సిజన్ అందదు, దీనివల్ల అలసట , నీరసం ఏర్పడుతుంది. హృదయ స్పందన.. గుండె కొట్టుకునే వేగంలో ఆకస్మిక పెరుగుదల లేదా తగ్గుదల గుండె సమస్యకు సంకేతం కావచ్చు.  ఈ పరిస్థితి పదేపదే ఏర్పడుతుంటే వైద్య పరీక్ష చేయించుకోవడం చాలా అవసరం.                                        *రూపశ్రీ.