LATEST NEWS
సాధారణంగా కుటుంబంలో శుభకార్యం జరుగుతుంటే బంధాలు బలపడతాయి. విభేదాలను పక్కన పెట్టి అంతా కలిసికట్టుగా శుభకార్యం కోసం నడుంబిగిస్తారు. అయితే..  వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో మాత్రం శుభకార్యం కుటుంబ విభేదాలను మరింత పెంచుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. జగన్, వైఎస్ షర్మిల మధ్య విభేదాల అగాధాన్ని షర్మిల కుమార్తె వివాహ వేడుక మరింత పెంచినట్లు కనిపిస్తోంది. షర్మిల కుమార్తె పెళ్లి వేడుకను వైసీపీయులు రాజకీయ రచ్చ చేయడానికి ఉపయోగించుకుంటున్నట్లు కనిపిస్తోంది.  షర్మిల కుమార్తె వివాహం వచ్చే నెల  25న జరగనున్న నేపథ్యంలో.. బెంగళూరులోని జగన్ నివాసంలో పెళ్లి నిర్వహించాలన్న ప్రతిపాదనకు జగన్ అంగీకరించలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మీడియాలో, సోషల్ మీడియాలో కూడా దీనిపై కథనాలు వెలువడ్డాయి. అన్నా చెల్లెళ్ల మధ్య ఆస్తులు, రాజకీయ విభేదాలు మరోసారి రచ్చకెక్కియి.  ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా పెద్దరికం మీదేసుకుని విభేదాల పరిష్కారానికి ప్రయత్నిస్తారు. అయితే వైఎస్ కుటుంబ పెద్దలు ఎవరూ ఇందులో జోక్యం చేసుకోకుండా వైసీపీ సీనియర్ నాయకుడు పేర్ని నాన్ని అన్నా చెల్లెళ్ల మధ్య మరింత చిచ్చు పెట్టేలా వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు.  అసలింతకీ బెంగళూరు ప్యాలెస్ లో షర్మిల కుమార్తె వివాహం అన్న అంశం దగ్గరకు వెడితే.. బెంగళూరులోని ఎలహంకలో జగన్, షర్మిలనివాసాలు  ఒకే కాంపౌండ్‌లో  పక్కపక్కనే ఉన్నాయి. వారిద్దరి నివాసాలకు ప్రవేశ మార్గం ఒక్కటే.   అందుకే షర్మిల కుమార్తె వివాహం అక్కడ జరగడం విషయంలో వింతా లేదు.. సప్పోజ్ ఫర్ సప్పోజ్ షర్మిల తన కుమార్తె వివాహానికి యలహంక ప్యాలెస్ ప్రతిపాదన జగన్ వద్ద చేయడంలో తప్పూలేదు. రాజకీయ, ఆస్తుల విభేదాలు శుభకార్యం జరుగుతున్నప్పుడు పక్కన పెట్టడం మంచిదని ఆమె భావించడం సహజమే. అయితే షర్మిల, జగన్ మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయనీ, పైపెచ్చు జగన్ ప్రాణాలకు హాని ఉన్న నేపథ్యంలో ఆయనకు అత్యున్నత స్థాయి భద్రత కల్పించారనీ పేర్కొన్న పేర్ని నాని..  జగన్ వంటి హైప్రొఫైల్ వ్యక్తి నివసించే కాంపౌండ్‌లో పెళ్లి వేడుక నిర్వహించడం సాధ్యం కాదని, అయినా ఆయన నివాసమేమీ ఫంక్షన్ హాల్ కాదనీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పెళ్లంటే అతిథులు రావడం, క్యాటరింగ్ సిబ్బంది, డెకరేషన్‌ వాళ్లు, ఇతర పనివాళ్ల రాకపోకలు ఉంటాయని.. ఇలాంటి పరిస్థితుల్లో భద్రతా పరమైన ఇబ్బందులు ఉంటాయనీ పేర్కొన్న పేర్ని నాని, షర్మిల ఒక వేళ యలహంక ప్యాలెస్ లో తన కుమార్తె పెళ్లి అన్న ప్రతిపాదన చేసి ఉంటే అది తప్పు అని చెప్పారు.   అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవలసిందేమిటంటే.. ఈ విషయంలో పేర్ని నాని ఎందుకు మాట్లాడారన్నదే. పెళ్లి ఎక్కడ, ఎలా జరగాలి అన్నది  కుటుంబ సభ్యుల మధ్య పరిష్కరించుకోవాల్సిన అంశం.  దానికి రాజకీయ వివరణలు, మీడియా విమర్శలతో బయటి వారు జోక్యం చేసుకోవలసిన అవసరం ఏమొచ్చింది? అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.    పేర్ని నాని జోక్యం జగన్, షర్మిల మధ్య విభేదాలను మరింత రెచ్చగొట్టేవిగా ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  షర్మిల నిజంగా ఎలహంక ప్యాలెస్ లో తన కుమార్తె వివాహం అన్న ప్రతిపాదనను జగన్ వద్ద చేశారా? అందుకు జగన్ తిరస్కరించారా? తిరస్కరిస్తే ఆయన చెప్పిన కారణాలు ఉమిటి?  అన్న ప్రశ్నలకు వివరణ లేదా సమాధానం అంటూ వస్తే అది జగన్ నుంచి, షర్మిల నుంచీ రావాలి. కానీ పేర్ని నాని ఎందుకు మధ్యలో గొంతు సవరించుకుని మాట్లాడుతున్నారన్న ప్రశ్న అటు రాజకీయవర్గాలలో, ఇటు వైఎస్ కుటుంబ సభ్యులలో వినవస్తోంది.    [Perni Nani  stoking Divisions Between  Jagan YS Sharmila, Sharmila Daughter Marriage, alahanka Palace, Telugu One]
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ దేశం నుంచి అత్యున్నత గౌరవం దక్కింది. ఆ దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ వేడుకలో భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌తో కలిసి ఈ జ్యోతిని వెలిగించాల్సిందిగా నెతన్యాహు కోరడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మేరకు ఇరు దేశాల అధినేతలు టెలిఫోన్ వేదికగా పరస్పరం పలు కీలక అంశాలపై ముచ్చటించారు. గురువారం జరిగిన ఈ ఫోన్ సంభాషణలో ప్రధాని మోదీకి నెతన్యాహు ఈ ప్రతిపాదనను అంకితం చేశారు. దీనికి మోదీ సానుకూలంగా స్పందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ శాంతి, భద్రతల పరిరక్షణలో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. గత సెప్టెంబర్ నెలలో దుబాయ్ నుంచి టెల్ అవీవ్ బయలుదేరిన 'ఫ్లైదుబాయ్' విమానంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆ విమానంలో సహ పైలట్ అకస్మాత్తుగా దాడికి పాల్పడగా, భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించారు. ఆ దాడిలో తీవ్ర గాయాలపాలైనప్పటికీ ఏమాత్రం బెదరకుండా, ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు మచ్చర్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. నిందితుడిని విజయవంతంగా సిబ్బందికి అప్పగించి, విమానాన్ని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చిన ఆయన సాహసం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఉగ్రవాద మూలాలను ఏరివేయడంలో భారత్, ఇజ్రాయెల్ దేశాల ఉమ్మడి దృక్పథాన్ని ఈ ఘటన మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. నేలపైనా, గగనతలంలోనూ ఉగ్రవాద శక్తులపై ఉక్కుపాదం మోపేందుకు ఇరు దేశాలు నిరంతరం సిద్ధంగా ఉన్నాయని నేతలు అభిప్రాయపడ్డారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి స్థాపన, ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయడంపై ఈ సంభాషణలో ప్రధానంగా చర్చించారు. అంతర్జాతీయ వేదికలపై రెండు దేశాలు ఒకరికొకరు మద్దతుగా నిలుస్తున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న ఈ స్వాతంత్ర్య వేడుకల వేదికగా భారత్-ఇజ్రాయెల్ మైత్రి మరింత బలపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అరుదైన ఆహ్వానం ద్వారా రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు నూతన శిఖరాలను తాకనున్నాయని ప్రజలు, రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.       [ PM Narendra Modi, Benjamin Netanyahu, Smith Macher, Israel Independence Day, India Israel relations, TeluguOne News, India Israel Relations, Telugu One, Telugu News ]  
ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరో వాతావరణ గండం ఆందోళనకు గురిచేస్తోంది. బంగాళాఖాతంలో తాజాగా పుట్టుకొచ్చిన ఒక అసాధారణ వాతావరణ వ్యవస్థ క్రమంగా బలపడుతుండటంతో, రాష్ట్ర తీర ప్రాంతాలపై తుపాను ముప్పు పొంచివుందన్న హెచ్చరికలు వెలువడుతున్నాయి. ఈ పరిణామంతో అధికారులు, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ నిపుణులు గుర్తించారు. ఈ ఆవర్తనం ప్రభావం వల్ల రాగల కొద్ది గంటల్లోనే బంగాళాఖాతంలో బలమైన వాతావరణ మార్పులు సంభవించవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆగ్నేయ మరియు తూర్పు మధ్య బంగాళాఖాగంలో నూతనంగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) స్పష్టం చేసింది. ఈ అల్పపీడనం క్రమంగా బలపడి మరింత తీవ్రరూపం దాల్చే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏటా ఈ సీజన్‌లో బంగాళాఖాతంలో ఇలాంటి వ్యవస్థలు ఏర్పడటం సాధారణమే అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు మరింత అనుకూలంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సముద్ర ఉపరితలం వెచ్చగా ఉండటం మరియు గాలిలో తేమ శాతం అధికంగా ఉండటం వంటి అంశాలు అల్పపీడనం త్వరితగతిన వాయుగుండంగా మారేందుకు దోహదపడతాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వాతావరణ వ్యవస్థ పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ క్రమంగా ఆంధ్రప్రదేశ్ తీరం వైపునకు కదిలే అవకాశాలున్నాయని ప్రాథమిక అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఇదే గనుక నిజమైతే, రాబోయే రోజుల్లో కోస్తాంధ్ర ప్రాంతాలపై తీవ్ర వాతావరణ ప్రభావం పడే అవకాశం ఉంది. తీర ప్రాంత జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉండటంతో పాటు, సముద్రం అల్లకల్లోలంగా మారి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని కఠిన నిబంధనలు జారీ చేశారు. ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే అన్ని జిల్లాల అధికారులను అప్రమత్తం చేసింది. సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. తుపాను గమనం, దాని తీవ్రతపై వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు ఇస్తున్న అప్‌డేట్స్‌ను గమనించాలని ప్రజలకు సూచిస్తున్నారు.     [ Andhra Pradesh Cyclone, Bay of Bengal Low Pressure, IMD Weather Alert, Coastal Andhra Rains, Andaman Sea Weather System ]  
ALSO ON TELUGUONE N E W S
ఒక బయోపిక్ కోసం స్టార్ హీరోయిన్లను సంప్రదించడం.. చివరకు ఆ పాత్ర మరో నటికి దక్కడం.. సాధారణంగా జరిగేదే. ఇప్పుడు ‘గరివిడి లక్ష్మి’ బయోపిక్ విషయంలోనూ ఇదే జరిగింది. మొదట సాయి పల్లవి, నివేదా థామస్, నిత్యా మీనన్‌లకు ఈ కథను వినిపించినట్లు దర్శకుడు గౌరి నాయుడు జమ్ము వెల్లడించారు. ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ బుర్రకథ కళాకారిణి రెడ్డి విజయలక్ష్మి, ‘గరివిడి లక్ష్మి’గా ఎలా గుర్తింపు తెచ్చుకున్నారన్నది ఈ బయోపిక్‌లో ప్రధాన అంశం. ఆమె జీవితంలోని ముఖ్య ఘట్టాలను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ పాత్ర కోసం మొదట సాయి పల్లవిని సంప్రదించారట. ఆ తర్వాత నివేదా థామస్, నిత్యా మీనన్‌లకు కూడా కథ వెళ్లినట్లు దర్శకుడు ఇటీవల మూవీ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో రివీల్ చేశారు. కొన్ని కారణాల వల్ల ఆ హీరోయిన్స్ ఈ ప్రాజెక్టులో భాగం కాలేకపోయారని దర్శకుడు తెలిపారు. చివరకు ఈ కీలక పాత్రను ఆనంది అంగీకరించారు. గరివిడి లక్ష్మి సినిమాలో ఆనంది పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమా చూసిన తర్వాత ఆ పాత్రలో ఆనందిని తప్ప మరో నటిని ఊహించుకోలేకపోతున్నామని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. రాగ్ మయూర్, నరేశ్, రాశి, ఎల్‌బీ శ్రీరామ్ తదితరులు కూడా ఈ చిత్రంలో నటించారు. చరణ్ అర్జున్ సంగీతం అందించారు. ప్రముఖ కళాకారిణి జీవితాన్ని బయోపిక్‌గా తీసుకురావడం ఒకవైపు ఆసక్తి రేపితే, ఈ పాత్ర కోసం పలువురు ప్రముఖ హీరోయిన్లను సంప్రదించారన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: టాలీవుడ్‌లో భారీ మైథలాజికల్ మూవీ.. శ్రీవిష్ణుతో ‘రంగబలి’ డైరెక్టర్ బిగ్ స్కెచ్.!     [Three Heroines Missed Garividi Lakshmi, Garividi Lakshmi Biopic, Garividi Lakshmi Movie, Sai Pallavi, Nivetha Thomas, Nithya Menen, Anandhi, Gowri Naidu Jammu, Telugu Film News]  
ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు సీఈవో కావ్య మారన్‌ పెళ్లి వార్తలు ప్రస్తుతం సినీ, క్రికెట్‌ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. గత కొంతకాలంగా వీరిద్దరి వివాహంపై ప్రచారం జరుగుతుండగా, తాజాగా ఈ వేడుకకు సంబంధించిన కీలక సమాచారం బయటకు వచ్చింది. కావ్య మారన్‌ తండ్రి, సన్‌ గ్రూప్‌ అధినేత కళానిధి మారన్‌ తన భార్య కావేరితో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా కుమార్తె కావ్య, అనిరుధ్‌ వివాహ రిసెప్షన్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు.  ఈ రిసెప్షన్‌ నవంబర్‌ 21న చెన్నైలో జరగనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. మరోవైపు, వీరిద్దరి వివాహ వేడుక గ్రీస్‌లో నవంబర్‌ 10, 11 తేదీల్లో జరగవచ్చని పలు కథనాలు పేర్కొంటున్నాయి. అయితే, వివాహ వేడుకకు సంబంధించిన పూర్తి వివరాలను అనిరుధ్‌, కావ్య మారన్‌ స్వయంగా ప్రకటించలేదు.  అనిరుధ్‌ దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకోగా, కావ్య మారన్‌ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ద్వారా క్రికెట్‌ అభిమానులకు సుపరిచితమయ్యారు. వీరిద్దరి పెళ్లి వార్తల నేపథ్యంలో సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరవుతారా అనే ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా రజనీకాంత్‌ సినిమాలకు సంగీతం అందించిన అనిరుధ్‌ పెళ్లి వేడుకపై అభిమానులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు.     [Anirudh Ravichander Wedding, Kavya Maran Wedding, Anirudh Kavya Maran Reception, Anirudh Wedding Date, Kavya Maran News, Anirudh Marriage Update, Chennai Wedding Reception]
ఈ రోజు పాన్ ఇండియా కట్ అవుట్ ప్రభాస్ పుట్టిన రోజు. ఫ్యాన్స్ కైతే ఫెస్టివల్. నార్త్ సినిమా తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన ఈ బాహుబలి గురించి నిత్యం సోషల్ మీడియా వేదికగా ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. అదేంటంటే ప్రభాస్ కి ఎందుకు ఇంత క్రేజ్ అని. మరి క్రేజ్ తాలూకు మ్యాటర్ చూద్దాం.    కేవలం సినిమాలు, బాక్సాఫీస్ కలెక్షన్లు మాత్రమే ఒక నటుడిని సూపర్ స్టార్‌ని చేయవు. అసలు ప్రభాస్‌కు భారతీయ సినిమా చరిత్రలో మరే ఇతర నటుడికీ దక్కని స్థాయిలో దాదాపు 100 శనశాతం మంది ప్రేక్షకుల నుండి అభిమానం లభించడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఆయనలోని అసాధారణమైన సింప్లిసిటీ. ఎంత పెద్ద విజయం సాధించినా, 1000 కోట్ల బాక్సాఫీస్ క్లబ్‌లో అడుగుపెట్టినా ఆయన ప్రవర్తనలో ఏమాత్రం మార్పు ఉండకపోవడం ప్రభాస్ ప్రత్యేకత. వేల కోట్ల బిజినెస్ ఆయన పేరు మీదే జరుగుతున్నప్పటికీ, మీడియా ముందుకు వచ్చినప్పుడు లేదా సెట్స్‌లో సాధారణ కార్మికులతో మాట్లాడేటప్పుడు ఆయన చూపించే నిరాడంబరత ప్రతీ ఒక్కరి హృదయాలని గెలుచుకుంటుంది. తోటి నటీనటులకు, చిత్ర బృందానికి ప్రతిరోజూ రుచికరమైన ఇంటి వంటకాలను వడ్డించే డార్లింగ్ ప్రభాస్ ఆతిథ్యం సినీ వర్గాల్లో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆత్మీయతే ఆయనను మిగతా హీరోల కంటే భిన్నంగా, అత్యంత ఆత్మీయుడిగా నిలబెట్టింది. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ చూస్తే ఏ భారతీయ నటుడికీ సాధ్యం కాని రీతిలో అద్భుతమైన ప్రాజెక్టులతో ప్రపంచవ్యాప్తంగా సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల విడుదలైన 'కల్కి 2898 AD' చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారతీయ సినీ రికార్డులను తిరగరాసింది. ఈ దృశ్య కావ్యం అందించిన మైండ్ బ్లాకింగ్ విజయం తర్వాత, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'కల్కి 2' (Kalki 2) పార్ట్ ప్రొడక్షన్ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. మొదటి భాగంలో భైరవగా అలరించిన ప్రభాస్, రెండవ భాగంలో పూర్తి స్థాయి కర్ణుడి అవతారంలో కనిపించి ప్రేక్షకులకు అపూర్వమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతున్నారు. మరోవైపు, క్లాసిక్ ఫిల్మ్ మేకర్ హను రాఘవపూడి దర్శకత్వంలో రాబోతున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ' (Fauji - వర్కింగ్ టైటిల్) పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 1940ల కాలం నాటి యుద్ధ నేపథ్యంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ప్రభాస్ ఒక సైనికధికారిగా, వీరోచిత పోరాటం చేసే యోధుడిగా కనిపించనున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ ప్రత్యేకంగా సరికొత్త మేకోవర్ సాధిస్తుండటం విశేషం. దానికితోడు మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న రొమాంటిక్ హారర్ ఎంటర్‌టైనర్ 'రాజా సాబ్', అలాగే సందీప్ రెడ్డి వంగా అత్యంత వైలెంట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించనున్న 'స్పిరిట్' సినిమాలు కూడా ప్రభాస్ ఖాతాలో ఉన్నాయి. ఇది కూడా చదవండి: హాలీవుడ్ లో విషాదం: మీ అభిమాన నటుడు టామ్ స్కెరిట్ కన్నుమూత!   ఈ భారీ ప్రాజెక్టుల విస్తృతి మరియు విభిన్న కథాంశాలు చూస్తుంటే, రాబోయే ఐదేళ్ల పాటు బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ హవా నిరంతరం కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్ని భారీ బడ్జెట్ సినిమాలు చేసినా, ప్రపంచవ్యాప్త పాపులారిటీ సొంతం చేసుకున్నా, తన నిజ జీవితంలోని వినయం, స్వచ్ఛమైన నవ్వు, ఎదుటివారికి ఇచ్చే గౌరవంతో ప్రభాస్ ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో 'డార్లింగ్'గానే ఉంటారు. ఆయన క్రేజ్ తగ్గకపోవడానికి, రోజురోజుకీ పెరుగుతుండటానికి కారణం ఆ సింప్లిసిటీ మరియు మాస్ మాసివ్ సినిమాల పర్ఫెక్ట్ కాంబినేషనే.   [Prabhas Craze Secret, Prabhas Birthday special, Prabhas Craze Reason, Prabhas Simplicity, Kalki 2 Updates, Fauji Prabhas Movie, Prabhas Pan India Movies,  Telugunews, TeluguCinema, Tollywood, Tollywood News]  
Cast: Charan Lakkaraju, Chaithra J. Achar, Preethi Pagadala, Ramesh Indira, Surya Raj Veerabathini Crew: Presented by Prashanth Neel Cinematography by Dinesh Divakaran Music by Venky GG Editing by Akul Avinash Written and Directed by Kirtan Nadagouda Produced by Mythri Movie Makers Scary and Horror movies in Telugu have been rare and Ram Gopal Varma tried to make it mainstram but the genre remained rather not so box office friendly. Challenging that trope, 418, presented by Prashanth Neel and produced by Mythri Movie Makers, released on 23rd October. Kirtan Nadagouda debuted as director and let's discuss in detail.  Plot:  Vivek (Surya Raj) joins a well-known Vedagiri Institute of Medical Sciences set in rural and coastal Karnataka. Locals do not give rooms to medical students as they had worst experiences with them spoiling around. So, he is forced to join the Boys Hostel but strictly women are not allowed into it. Vivek's loving mother tries to enter to give him snacks but she is forcefully thrown out as an invisible force activates. It is revealed that Boys Hostel was a psychiatric ward and one woman killed herself, killing everyone who tried to stop her.  Vivek takes 417 room with strict instructions to not open 418 and he befriends Rohith (Charan Lakkaraju). Rohith doesn't believe in ghosts and God but Vivek is fearsome. They meet a rebellious Saisha (Preethi Pagadala) who is infected by Covid. She gets to know about locked room 418 and challenges to enter it. But Vivek faces a nightmarish ghostly possession and talks to college psychiartist (Ramesh Indira). They talk about patient Devika (Chaitra Achar). Who is she? Is she behind haunting? Why? Watch the movie to know more.  Analysis:  Chaitra Achar is splendid in the character of Devika. She commands the screen with her silent reactions and creates the eerie around her just with her expressions. She even took training to perform Yakshagaana in the film but the makers did not use it fully. She is the stand-out performer. Ramesh Indira is good but writing lacks any spine for his character. All others either overact or just look blank at the camera. Preethi Pagadala majorly is a big let down.  Music by Venky GG is underwhelming and lacks any sort of memorable quality. Cinematography by Dinesh Divakaran is very good. But the choice to go for dutch angles, extreme close-ups and tilted angles continuously underwhelms the quality behind his work. Editing by Akul Avinash is forgettable as he tries to ape Prashanth Neel template in major sequences making it more frustrating than rewarding.  Kirtan Nadagouda tried to follow the genre principles and cliches making a horror film but majority of his scenes feel cliched. Devika portion, Yakshagaana connect does help but the set-up lacks any sort of connectivity and relatability. The over-stretched introduction, dragged out trauma portions of Vivek do not build on the anticipation rather create no interest.  As soon as Devika portions start, even the screenplay starts to become more interesting. Again, when Saisha portions start it feels like two distinct films joined together forcefully. Sound Design tries to induce the eerie atmosphere and succeeds to an extent. Overall, the real story in 418 lies with Devika character and as her portions do work to an extent, the movie is watchable.  Positives: Chaitra's performance Sound Design Production Design Potential in point about postpartem stress Negatives: Lethargic Screenplay Tried and Tested Tropes Cliched narrative Draggy first half Bottomline: 418 tries to touch postpartem, depression, anxiety built up due to imagination but doesn't cohesively deliver.  Rating: 2.5/5  Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.  
వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీవిష్ణు.. ఇప్పుడు మరో కొత్త జానర్‌లోకి అడుగుపెట్టబోతున్నారా? ఇప్పటివరకు కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ కథలతో మెప్పించిన ఈ నటుడు.. ఈసారి మైథలాజికల్ అడ్వెంచర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ‘రంగబలి’ ఫేమ్ పవన్ బాసంశెట్టితో శ్రీవిష్ణు ఓ సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ నిర్మించనుందని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్. ఈ సినిమా నిజంగా మైథలాజికల్ అడ్వెంచర్ కథతో తెరకెక్కితే.. శ్రీవిష్ణు కెరీర్‌లో ఇది భిన్నమైన ప్రయత్నం కానుంది. అయితే కథ, ఆయన పాత్ర, ఇతర నటీనటులు, చిత్రీకరణ ప్రారంభం వంటి వివరాలపై ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు శ్రీవిష్ణు నటిస్తున్న ‘ఫ్యామిలీ ప్యాక్’ సంక్రాంతి 2027 విడుదల లక్ష్యంగా సిద్ధమవుతోంది. ఈ మైథలాజికల్ ఫిల్మ్ తర్వాత దర్శకుడు వివేక్ ఆత్రేయతో ఓ ప్రాజెక్ట్ లైన్ లో ఉండనే ప్రచారం కూడా వినిపిస్తోంది. శ్రీవిష్ణు-వివేక్ ఆత్రేయ కాంబోలో గతంలో 'మెంటల్ మదిలో', 'బ్రోచేవారెవరురా' సినిమాలు వచ్చాయి. ఈ ప్రాజెక్టులన్నీ కార్యరూపం దాలిస్తే శ్రీవిష్ణు లైనప్ మరింత ఆసక్తికరంగా మారనుంది. ముఖ్యంగా పౌరాణిక కథలో ఆయనను ఎలా చూపించబోతున్నారు? కామెడీకి భిన్నంగా కొత్త అవతారంలో కనిపిస్తారా? అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇది కూడా చదవండి: నాని స్టార్ పవర్.. నెట్‌ఫ్లిక్స్‌ టాప్ ట్రెండింగ్‌లో ప్యారడైజ్.!       [Sree Vishnu Next Movie, Mythological Adventure, Rangabali Director Pawan Basamsetti, Telugu Mythology, Sree Vishnu, Pawan Basamsetti, Family Pack Movie, Vivek Athreya, Telugu Film News]  
సూపర్‌స్టార్ రజనీకాంత్‌, లోకనాయకుడు కమల్ హాసన్‌ కలిసి నటించనున్న మల్టీస్టారర్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు దిగ్గజ నటులు మరోసారి ఒకే సినిమాలో కనిపించనుండటంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రచార వీడియో ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. అయితే, ప్రకటన వచ్చి కొన్ని నెల‌లు అవుతున్నా కొత్త అప్‌డేట్స్ లేకపోవడంతో సినిమా ఆగిపోయిందంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.  తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా పనులను దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరవెనుక వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. నవంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే, షూటింగ్ తేదీపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. రజనీకాంత్‌, కమల్ హాసన్‌ ఇద్దరి కాల్‌షీట్లు సమన్వయం చేయడంతో పాటు, భారీ ప్రాజెక్టుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సి ఉండటంతో ఆలస్యం జరుగుతున్నట్లు భావిస్తున్నారు.  ఇక ఈ మల్టీస్టారర్‌ను 2028 వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, విడుదల తేదీ కూడా ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. సినిమా ఆగిపోయిందనే ప్రచారానికి తెరదించుతూ, షూటింగ్ ప్రారంభం, విడుదలపై త్వరలో స్పష్టత వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. రజనీకాంత్‌, కమల్ హాసన్‌లను మరోసారి వెండితెరపై కలిసి చూడాలనే ప్రేక్షకుల నిరీక్షణకు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.     [Rajinikanth Kamal Haasan Multistarrer, KH x RK Movie, Nelson Dilipkumar, Rajinikanth Upcoming Movie, Kamal Haasan Upcoming Movie, KH x RK Shooting Update, Rajinikanth Kamal Haasan 2028 Release]
హాలీవుడ్ చిత్ర సీమలోఒక శకం ముగిసింది. 'టాప్ గన్', 'ఏలియన్' వంటి ప్రపంచ ప్రఖ్యాత చిత్రాలతో కోట్లాది మంది ప్రేక్షకుల మనసులని  గెలుచుకున్న లెజెండరీ నటుడు టామ్ స్కెరిట్ (Tom Skerritt)  కన్నుమూశారు.మొన్న 21న వృద్ధాప్య సహజ కారణాల వల్ల తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు, పబ్లిసిస్ట్ అధికారికంగా వెల్లడించారు.  ఈ అకస్మిక వార్త హాలీవుడ్ చిత్రసీమని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అనేక దశాబ్దాల పాటు తన అద్భుతమైన నటనతో వెండితెరను ఏలిన ఒక గొప్ప నటుడి నిష్క్రమణ పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.   టామ్ స్కెరిట్ తన సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో అసాధారణమైన మైలురాళ్లను దాటారు. ఆయన కెరీర్‌లో ఏకంగా 150కి పైగా చలనచిత్రాలు మరియు టెలివిజన్ ప్రొడక్షన్స్‌లో (over 150 on-screen credits)  కీ రోల్స్  పోషించి తిరుగులేని ముద్ర వేశారు.  ముఖ్యంగా 1979లో విడుదలైన సైన్స్ ఫిక్షన్ మాస్టర్‌పీస్ 'ఏలియన్' చిత్రంలో ఆయన పోషించిన కెప్టెన్ ఆల్డస్ డల్లాస్ పాత్ర ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాగే 1986లో సూపర్ స్టార్ టామ్ క్రూజ్ సరసన ఆయన నటించిన 'టాప్ గన్' సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో పాటు ఆయనకంటూ అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది.కేవలం సినిమాలలోనే కాకుండా టెలివిజన్ రంగంలోనూ టామ్ స్కెరిట్ తన సత్తా చాటుకున్నారు. 'పికెట్ ఫెన్సెస్' (Picket Fences) టెలివిజన్ డ్రామాలో ఆయన చేసిన అత్యుత్తమ నటనకు గాను ప్రతిష్టాత్మకమైన ఎమ్మీ (Emmy) అవార్డును సొంతం చేసుకున్నారు. తన కెరీర్‌లో రెండుసార్లు ఎమ్మీ నామినేషన్లు దక్కించుకోవడం ఆయన ప్రతిభకు నిదర్శనం. 'మాష్' (MAS*H) వంటి క్లాసిక్ ప్రాజెక్ట్‌లలోనూ ఆయన చేసిన అద్భుతమైన అభినయం టెలివిజన్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయన కేవలం నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుకుని బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నారు.   ఆయన వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే, టామ్ స్కెరిట్ తన భార్య జూలీ టోకాశికితో కలిసి నివసిస్తున్నారు. ఆయనకు మొత్తం ఐదుగురు సంతానం - ఆండీ, ఎరిన్, మాట్, కోలిన్ మరియు ఎమికో ఉన్నారు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, ఆయనకు పలువురు మనమలు (సారా, మాడిసన్, సన్నీ, లూయిసా, జార్జియా) అలాగే ఇద్దరు మునిమనమలు (మారిగోల్డ్, రవి) ఉన్నారు. ఆయన మృతి పట్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక భావోద్వేగ ప్రకటన విడుదల చేశారు. ఇది కూడా చదవండి: 418 Movie Review Telugu: 418 మూవీ రివ్యూ   "ప్రపంచం టోమ్‌ని ఒక గొప్ప నటుడిగా గుర్తిస్తే, మేము మాత్రం ఆయనలోని హాస్య చతురత, జిజ్ఞాస, విజ్ఞత మరియు మా జీవితాల్లోకి ఆయన తెచ్చిన అనంతమైన ప్రేమను చూశాము" అంటూ వారు పేర్కొన్నారు.సృజనాత్మకత, కథ చెప్పే కళ, సైనిక అనుభవజ్ఞుల సంక్షేమం మరియు తోటి వారికి సహాయం చేయడం పట్ల టామ్ స్కెరిట్ ఎప్పుడూ మక్కువ చూపేవారని కుటుంబీకులు గుర్తు చేసుకున్నారు. ఆయన వదిలి వెళ్లిన కళాఖండాలు, నటనలోని విలువలు రాబోయే తరాల నటులకు ఎప్పటికీ మార్గదర్శకం అవుతాయి. 93 ఏళ్ల సుదీర్ఘ జీవితంలో ఆయన కనబరిచిన అంకితభావం, కళాసేవ చిరస్మరణీయమైనవి. టామ్ స్కెరిట్ భౌతికకాయానికి సంబంధించిన స్మారక కార్యక్రమ వివరాలను త్వరలోనే కుటుంబ సభ్యులు వెల్లడించనున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు, అభిమానులు నివాళులర్పిస్తున్నారు. అయన వయసు 93 సంవత్సరాలు. డేట్ ఆఫ్ బర్త్ 1933 ఆగస్టు 25 .    [Tom Skerritt Passes Away, Tom Skerritt dead, Tom Skerritt actor, Top Gun star Tom Skerritt, Alien movie actor, Tom Skerritt age 93, Telugunews, TeluguCinema, Tollywood, Tollywood News]
నేచురల్ స్టార్ నాని, కయాదు లోహర్ జంటగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన సినిమా ‘ది ప్యారడైజ్’. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా థియేటర్లలో మాత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే ఓటీటీలోకి వచ్చేసరికి సీన్ మారిపోయింది. టాక్ ఎలా ఉన్నా.. నాని స్టార్ పవర్ మాత్రం తగ్గలేదని ట్రెండింగ్‌లో సినిమా సాధిస్తున్న స్థానమే చెబుతోంది. నాని సినిమాలకు ఓటీటీలో మంచి ఆదరణ ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చిన ‘ది ప్యారడైజ్’కు అనూహ్య స్పందన లభిస్తోంది. విడుదలైన కొద్ది సమయంలోనే ఇండియా వైడ్‌గా టాప్ ట్రెండింగ్‌లోకి రావడం ఆసక్తికరంగా మారింది. థియేటర్లలో సినిమాపై వచ్చిన చర్చలు, విమర్శలతో సంబంధం లేకుండా ఓటీటీలో ప్రేక్షకులు ఈ సినిమాను చూస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా నాని నటన, శ్రీకాంత్ ఓదెల టేకింగ్‌పై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి కూడా ఈ ట్రెండింగ్‌కు ఒక కారణంగా కనిపిస్తోంది. మరి ఇండియా వైడ్‌గా నంబర్ వన్ ట్రెండింగ్‌లోకి వచ్చిన ‘ది ప్యారడైజ్’ ఇదే జోరును ఎన్ని రోజులు కొనసాగిస్తుంది? ఓటీటీలో ఈ సినిమా సాధించే ఆదరణ నాని మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనేది ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: అక్క ట్రైలర్‌.. కీర్తి సురేశ్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా?.. మామూలు రచ్చ కాదు.!       [The Paradise Trending On Netflix, The Paradise OTT, The Paradise Netflix, Nani Paradise OTT, Nani Latest Movie, The Paradise, Natural Star Nani, Srikanth Odela, Kayadu Lohar, Telugu Film News]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
దీపావళి, వివాహ వేడుకల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ అందంగా, ప్రకాశవంతంగా కనిపించాలని కోరుకుంటారు. ఈ ప్రత్యేక వేడుకల కోసం సిద్ధమయ్యే క్రమంలో చర్మానికి సరైన సంరక్షణ అందించడం చాలా ముఖ్యం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పండుగలకు ముందు మెరిసే చర్మాన్ని పొందడానికి హైడ్రాఫేషియల్, కెమికల్ పీల్స్ మరియు లేజర్ ట్రీట్‌మెంట్లు అత్యంత ప్రజాదరణ పొందిన పద్ధతులు. అయితే, ఇవన్నీ వేర్వేరు పద్ధతుల్లో పనిచేస్తూ వివిధ చర్మ సమస్యలను పరిష్కరిస్తాయి. మీ చర్మం తత్వం, సమస్యలు, వైద్య చరిత్ర మరియు పండుగకు మీ దగ్గర ఉన్న సమయాన్ని బట్టి సరైన చికిత్సను ఎంచుకోవాలి. జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ ఏస్తెటిక్ డెర్మటాలజీ నివేదిక ప్రకారం, హైడ్రాఫేషియల్ అనేది క్లెన్సింగ్, ఎక్స్‌ఫోలియేషన్, ఎక్స్‌ట్రాక్షన్ మరియు హైడ్రేషన్‌లను మిళితం చేసే ఒక నాన్-ఇన్వాసివ్ చర్మ సంరక్షణ పద్ధతి. ఇది చర్మంపై ఉన్న మృతకణాలు మరియు మలినాలను తొలగించడానికి ఒక ప్రత్యేకమైన పరికరాన్ని ఉపయోగిస్తుంది. డెర్మటాలజిస్ట్ డాక్టర్ అదితి వాధ్వా తెలిపిన వివరాల ప్రకారం, ఈ చికిత్స తక్కువ లేదా అసలు రికవరీ సమయం లేకుండా తక్షణ కాంతిని, తేమను మరియు నునుపైన చర్మాన్ని కోరుకునే వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇది పండుగకు ముందు ఎలాంటి చికాకు లేకుండా తక్షణ మెరుపును ఇస్తుంది. మరోవైపు, కెమికల్ పీల్స్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి గ్లైకోలిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ మరియు సాలిసిలిక్ యాసిడ్ వంటి జాగ్రత్తగా ఎంచుకున్న ఆమ్లాలను ఉపయోగిస్తాయి. ఇవి అసమాన చర్మపు రంగు, తేలికపాటి వర్ణద్రవ్యం, మొటిమలు మరియు గరుకైన చర్మ ఆకృతిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అయితే, భారతీయ చర్మ తత్వాలు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలి; ఎందుకంటే సరైన పీల్ ఎంచుకోకపోతే లేదా అనంతర సంరక్షణ లోపిస్తే హైపర్‌పిగ్మెంటేషన్ సమస్య రావచ్చు. అందువల్ల ఈ పద్ధతిని నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయించుకోవాలి. జర్నల్ ఆఫ్ లేజర్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ నివేదిక ప్రకారం, లేజర్ చికిత్సలు నిర్దిష్ట చర్మ సమస్యలను నేరుగా లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్రీకృత కాంతి శక్తిని ఉపయోగిస్తాయి. ఇవి మొటిమల మచ్చలు, మొండి పిగ్మెంటేషన్, వృద్ధాప్య సంకేతాలు మరియు కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అయితే లేజర్ చికిత్సలకు ఎక్కువ ముందస్తు ప్రణాళిక అవసరం, ఎందుకంటే ఎరుపు, వాపు లేదా పొరలు ఊడిపోవడం వంటి లక్షణాలు ఉండవచ్చు మరియు మెరుగైన ఫలితాల కోసం బహుళ సెషన్లు అవసరమవుతాయి. కాబట్టి పండుగకు ముందే నిపుణులను సంప్రదించడం మంచిది.     Hydrafacial Vs Chemical Peel Vs Laser, Best Skin Treatment For Glow, Festive Skincare Routine, Dermatology Treatments For Face, Hydrafacial Benefits, Chemical Peel For Glowing Skin, Laser Skin Rejuvenation.
ఇంట్లో పండగలు వచ్చినా, ప్రత్యేక వేడుకలు జరిగినా లేదా దేవుడికి నైవేద్యం సమర్పించాలన్నా ముందుగా గుర్తుకు వచ్చే అద్భుతమైన పిండివంటకం జ్యూసీ జ్యూసీగా ఉండే రవ్వ లడ్డూ. ఈ రుచికరమైన మిఠాయిని ఎంతో సులభంగా, పక్కా కొలతలతో ఎలా తయారు చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ రెసిపీలో చెప్పిన కొలతల ప్రకారం తయారు చేస్తే సుమారు 30 నుంచి 32 గుండ్రని, రుచికరమైన లడ్డూలు తయారవుతాయి. ఈ రెసిపీ తయారీకి కావలసిన పదార్థాలను పరిశీలిస్తే: ప్రధాన పదార్థమైన బొంబాయి రవ్వ 2 కప్పులు, నెయ్యి పావు కప్పుతో పాటు అదనంగా మరో 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు 10, కిస్మిస్ 10, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు (లేదా దీనికి బదులుగా ఎండు కొబ్బరి పొడిని కూడా వాడవచ్చు), పంచదార సుమారు 1.75 కప్పులు (అంటే దాదాపు అర కిలో), యాలకులు 10, అలాగే మిశ్రమం కలపడానికి తగినన్ని గోరువెచ్చటి పాలు అవసరమవుతాయి. ముందుగా స్టవ్ మీద మందపాటి అడుగు గల, వెడల్పాటి పాన్‌ను పెట్టి అందులో పావు కప్పు నెయ్యి వేయాలి. నెయ్యి కరిగాక, ముందుగా సిద్ధం చేసుకున్న 10 జీడిపప్పులు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత, 10 కిస్మిస్‌లను కూడా వేసి అవి బాగా ఉబ్బే వరకు వేయించి, నెయ్యి లేకుండా ఒక ప్లేట్‌లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లోని మిగిలిన నెయ్యిలో 2 కప్పుల బొంబాయి రవ్వ వేసుకోవాలి. రవ్వ అడుగు మాడిపోకుండా ఉండటానికి మందపాటి పాన్ ఎంతగానో సహాయపడుతుంది. తక్కువ మంటపై రవ్వ నుంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు, రంగు కొద్దిగా మారేంత వరకు నిరంతరం కలుపుతూ వేయించాలి. రవ్వ చక్కగా వేగడానికి కొంత సమయం పడుతుంది, కానీ ఇది లడ్డూల టేస్ట్‌కి అత్యంత ముఖ్యం. రవ్వ బాగా వేగిన తర్వాత దానిని ఒక పెద్ద పళ్ళెంలోకి మార్చుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ అదే పాన్‌ను ఉపయోగించి, 1 కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేయించాలి. తక్కువ మంటపై కొబ్బరిలోని తేమ పూర్తిగా తగ్గి, పొడిపొడిలాడేంత వరకు వేయించాలి. ఆ తరువాత, మరో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, కొబ్బరి ఎర్రగా మారుuntil వేయించాలి. ఇలా వేయించిన కొబ్బరి లడ్డూలకు మంచి సువాసనను, ఎక్కువ కాలం నిల్వ ఉండే గుణాన్ని ఇస్తుంది. ఈ వేయించిన కొబ్బరిని కూడా రవ్వ ఉన్న పళ్ళెంలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో 1.75 కప్పుల పంచదార, 10 యాలకులు వేసి, మరీ మెత్తని పౌడర్‌లా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పంచదార పొడిని రవ్వ, కొబ్బరి మిశ్రమంలో కలపాలి. స్పూన్‌తో కాకుండా చేతితో కలిపితే అన్ని పదార్థాలు చక్కగా కలిసిపోతాయి. బాగా రబ్ చేస్తూ మిశ్రమం ఒకేలా తయారయ్యేలా కలపాలి. ఇప్పుడు గోరువెచ్చటి పాలను కొద్దికొద్దిగా పోసుకుంటూ మిశ్రమాన్ని కలుపుకోవాలి. పాలు మరీ వేడిగా లేదా చల్లగా ఉండకూడదు. మొత్తం పాలు ఒకేసారి పోయకుండా, మిశ్రమం ముద్దగా అయ్యేలా చూసుకుంటూ సుమారు అర గ్లాసు పాలను తీసుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని ఒక పళ్ళెంలో పెట్టి, పైన కొద్దిగా అదిమి, 15 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల రవ్వ పాలను పీల్చుకొని మరింత జ్యూసీగా మారుతుంది. 15 నిమిషాల తర్వాత, నానిన రవ్వ మిశ్రమాన్ని ఒకసారి మళ్ళీ బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్‌లను కలపాలి. కొద్దికొద్దిగా మిశ్రమాన్ని తీసుకుంటూ చేతితో గట్టిగా నొక్కుతూ లడ్డూలుగా చుట్టుకోవాలి. పైన అలంకరణ కోసం ఒకటి రెండు జీడిపప్పులు, కిస్మిస్‌లు పెట్టి కొంచెం గట్టిగా నొక్కితే ఊడిపోకుండా ఉంటాయి. ఇలా మొత్తం మిశ్రమాన్ని ఎంతో రుచికరమైన లడ్డూలుగా చుట్టుకుంటే, నోట్లో వేస్తే కరిగిపోయే కమ్మటి రవ్వ లడ్డూలు సిద్ధమవుతాయి.     Juicy Rava Laddu, Sooji Ladoo Recipe, Rava Laddu with Perfect Measurements, Indian Festival Sweets, Easy Semolina Laddu, Traditional Sweet Recipes, Homemade Rava Laddu.  
ఇంట్లో పాలు కాచే సమయంలో కొన్నిసార్లు పాలు విరిగిపోతుండటం సర్వసాధారణం. అలా విరిగిన పాలను చూసి చాలామంది వాటిని వృథాగా పారేస్తుంటారు లేదా ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతుంటారు. కానీ, ఆ విరిగిన పాల మీగడతో కూడా ఎంతో రుచికరమైన, స్వచ్ఛమైన దేశీ నెయ్యిని అత్యంత సులభంగా తయారు చేసుకోవచ్చనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుస్తుంది. దీనికోసం ఎటువంటి ఖరీదైన వస్తువులు లేదా ప్రత్యేకమైన పరికరాలు అవసరం లేదు. ముందుగా మీరు సేకరించిన తగినంత మీగడను తీసుకుని, అది గడ్డకట్టేలా లేదా పెరుగు రూపంలోకి మారేలా చూసుకోవాలి. ఆ తర్వాత ఆ పెరుగును ఒక మీడియం సైజు గిన్నెలోకి తీసుకుని, తగినన్ని నీటిని కలుపుతూ మజ్జిగ కవ్వంతో లేదా బ్లెండర్ సహాయంతో బాగా గిలకొట్టాలి. కొద్దిసేపటి తర్వాత పెరుగు నుంచి వెన్న వేరుపడటం గమనించవచ్చు. ఈ ప్రక్రియలో అడుగున మజ్జిగ మొత్తం పూర్తిగా ద్రవ రూపంలోకి మారుతుంది, పైకి తేలిన స్వచ్ఛమైన వెన్నను ఒక శుభ్రమైన స్పూన్ సహాయంతో జాగ్రత్తగా వేరు చేసి మరో పాత్రలోకి మార్చుకోవాలి. వెన్నకు అంటుకుని ఉన్న మిగిలిన మజ్జిగను పూర్తిగా తొలగించడానికి, దానిని స్వచ్ఛమైన నీటితో ఒకటి రెండు సార్లు సున్నితంగా కడగాలి. ఇలా చేయడం వల్ల నెయ్యి తయారీకి అసలైన వెన్న చక్కగా సిద్ధమవుతుంది. ఆ తరువాత ఒక చిన్న పాన్ లేదా గిన్నెను స్టవ్ మీద పెట్టి, మీడియం మంటపై ఈ వెన్నను వేడి చేయాలి. మంటను ఎప్పుడూ మితంగా ఉంచాలి, ఎందుకంటే మంట ఎక్కువగా ఉంటే వెన్న త్వరగా మాడిపోయే అవకాశం ఉంటుంది. వెన్న క్రమంగా కరుగుతూ చిన్న చిన్న బుడగలు మంచిగా ఏర్పడతాయి. ఈ సమయంలో అడుగు అంటకుండా గరిటెతో నిరంతరం కలుపుతూ ఉండాలి. క్రమంగా వెన్నలోని తేమ మరియు నీరు మొత్తం ఆవిరైపోయి, స్వచ్ఛమైన నెయ్యి స్పష్టంగా బంగారు రంగులో కనిపిస్తుంది. అప్పుడు మంచి సువాసన వెలువడిన వెంటనే గ్యాస్‌ను ఆఫ్ చేయాలి. ఆ తర్వాత ఈ నెయ్యిని గది ఉష్ణోగ్రత వద్ద పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత, ఏ మాత్రం తడి లేని శుభ్రమైన సన్నని జల్లెడ లేదా కాటన్ వస్త్రం ద్వారా దీనిని వడకట్టి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నిల్వ ప్రక్రియలో నెయ్యిలో కొద్దిగా కూడా నీరు చేరకుండా చూసుకోవడం చాలా ముఖ్యం, అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ తడి చెంచాలను దీనిలో ఉపయోగించకూడదు. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే, మీరు ఇంట్లోనే తయారు చేసుకున్న స్వచ్ఛమైన దేశీ నెయ్యి నెలల తరబడి పాడవకుండా తాజాగానే ఉంటుంది.     Make Ghee From Spoiled Milk, Desi Ghee From Sour Milk, Curdled Milk Malai Hack, Homemade Pure Ghee Recipe, Kitchen Tips And Hacks, Reuse Spoiled Milk Ideas, Traditional Ghee Making.  
ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో ధనియాల నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? రోజూ నీళ్లు తాగే విషయంలో మనం చేసే పొరపాట్లు ఏమిటి? భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగవచ్చా? నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఆయుర్వేదం నీటిని తాగే విధానం గురించి ఏం చెబుతోంది? ఇలాంటి సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. ఈ TeluguOne Health వీడియోలో సీనియర్ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ శిరీష నీటి ప్రాముఖ్యత, నీళ్లు తాగే సరైన పద్ధతులు, ఉదయం నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు, ధనియాల నీటి వినియోగం గురించి వివరిస్తున్నారు. అలాగే భోజనం చేసే సమయంలో నీళ్లు తాగడం మంచిదా కాదా, జీర్ణక్రియకు సంబంధించి ఉన్న అపోహలు ఎంతవరకు నిజం, ఆయుర్వేదంలో చెప్పే ఫాంట (Phanta) తయారీ విధానం వంటి ఆసక్తికరమైన విషయాలను వివరిస్తారు. మన శరీరానికి నీరు ఎంతో అవసరం. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం, పోషకాలు శరీరంలోని వివిధ భాగాలకు చేరడం, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లడం వంటి అనేక ముఖ్యమైన పనులకు నీరు సహాయపడుతుంది. అయితే నీటిని ఎప్పుడు తాగాలి, ఎంత తాగాలి, భోజనానికి ముందు లేదా తర్వాత తాగాలా అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి. ఈ విషయాలపై సరైన అవగాహన కలిగి ఉండటం ఆరోగ్యకరమైన జీవనశైలికి ఉపయోగపడుతుంది. ధనియాలను నీటిలో నానబెట్టి లేదా తగిన విధంగా తయారుచేసి తీసుకునే పద్ధతుల గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ధనియాల నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది? దానిని ఎలా తయారుచేసుకోవాలి? నీటిని తాగే విషయంలో పాటించాల్సిన పద్ధతులు ఏమిటి? అనే అంశాలపై డాక్టర్ శిరీష వివరణను తెలుసుకోండి. అలాగే ఆయుర్వేదంలో ఫాంట (Phanta) అని పిలిచే మూలికా పానీయాన్ని ఎలా తయారుచేస్తారు, దాని తయారీలో పాటించాల్సిన విధానం ఏమిటి అనే విషయాలను తెలుసుకోవచ్చు. జీర్ణక్రియకు సంబంధించిన అపోహలను తొలగించుకోవడానికి, రోజువారీ నీటి వినియోగంపై అవగాహన పెంచుకోవడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి, వయస్సు, శారీరక శ్రమను బట్టి నీటి అవసరాలు మారవచ్చు. కిడ్నీ లేదా గుండె సంబంధిత సమస్యల కారణంగా నీటి పరిమాణంపై పరిమితులు ఉన్నవారు వైద్యుల సూచనలను పాటించాలి. ధనియాల నీటిని ఏదైనా వ్యాధికి నిర్ధారిత చికిత్సగా భావించకూడదు. ధనియాల నీటిని తాగే పద్ధతి, నీటి ప్రాముఖ్యత, భోజన సమయంలో నీళ్లు తాగడం, జీర్ణక్రియపై అపోహలు, ఆయుర్వేద ఫాంట తయారీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి TeluguOne Health వీడియోను పూర్తిగా చూడండి.  
ఇయర్ బడ్స్ పెట్టుకుని రాత్రిళ్లు నిద్రపోయే అలవాటుందా.. ఈ నిజాలు తెలుసుకోండి..! ఈరోజుల్లో చాలామందికి రాత్రి పడుకునే ముందు ప్రశాంతంగా నిద్ర పట్టడం కోసం ఇయర్ బడ్స్ పెట్టుకుని పాటలు, భజనలు లేదా పాడ్‌కాస్ట్‌లు వినే అలవాటు ఉంటుంది. ఈ చిన్న అలవాటు త్వరగా నిద్రపోవడానికి సహాయపడుతుందని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాత్రి అంతా లేదా ఎక్కువ సమయం పాటు ఇయర్ బడ్స్ ధరించి పడుకోవడం వల్ల  చెవుల ఆరోగ్యానికి ఎంతో హానికరమని వైద్యులు చెబుతున్నారు. ఈ చిన్న అలవాటు వల్ల భవిష్యత్తులో చెవులకు సంబంధించి పెద్ద సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. రాత్రి సమయంలో ఇయర్ బడ్స్ పెట్టుకుని పడుకోవడం వల్ల మన చెవుల్లో రకరకాల ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా నిద్రలో అటు ఇటు తిరుగుతున్నప్పుడు లేదా  బోర్లా పడుకున్నప్పుడు దిండుకు ఇయర్ బడ్స్‌కు మధ్య పడే ఒత్తిడి కారణంగా చెవి భాగంలో తీవ్రమైన నొప్పి, చికాకు లేదా మంట పుట్టే అవకాశం ఉంటుంది. ఈ విధంగా రోజూ జరగడం వల్ల చెవి చుట్టూ ఉన్న సున్నితమైన చర్మం దెబ్బతింటుంది , నొప్పి మరింత పెరుగుతుంది. ఇయర్ బడ్స్ చెవి రంధ్రంలో బిగుతుగా ఉండటం వల్ల చెవి లోపలికి గాలి సరిగ్గా వెళ్లకుండా అడ్డుపడుతుంది. దీనివల్ల చెవిలో తేమ , చెమట పేరుకుపోయి బ్యాక్టీరియా పెరగడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇది చెవిలో ఇన్‌ఫెక్షన్లు రావడానికి ప్రధాన కారణం అవుతుంది. కొందరు ఇయర్ బడ్స్‌ను శుభ్రం చేయకుండా వాడటం లేదా ఇతరులతో షేర్ చేసుకోవడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. చెవుల్లో దురద, వాపు లేదా ఒక రకమైన ద్రవం కారడం వంటి లక్షణాలు కనిపిస్తే అది ఇన్‌ఫెక్షన్‌గా గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదించాలి. రాత్రి మొత్తం ఇయర్ బడ్స్ ద్వారా పెద్ద శబ్దాలతో మ్యూజిక్ వినడం వల్ల మన వినికిడి శక్తి క్రమంగా మందగించే ప్రమాదం ఉంది. ఎక్కువ గంటలు చెవులకు శబ్దం తగలడం వల్ల చెవిలోని నరాలు బలహీనపడతాయి. కొందరు తక్కువ సౌండ్ పెట్టుకుని   వింటున్నాము కదా అనుకుంటారు, కానీ రోజంతా లేదా రాత్రంతా చెవుల్లో ఆ పరికరాలు ఉంచుకోవడం వల్ల చెవి లోపల ఉండే సున్నితమైన భాగాలకు  నష్టం కలుగుతుంది. దీనివల్ల భవిష్యత్తులో వినికిడి సమస్యలు వచ్చే ముప్పు పెరుగుతుంది. మ్యూజిక్ వింటే ప్రశాంతంగా నిద్ర పడుతుందని అనుకుంటాం కానీ, రాత్రి అంతా పాటలు లేదా పాడ్‌కాస్ట్‌లు ప్లే అవుతూ ఉంటే  మెదడు పూర్తిగా విశ్రాంతి తీసుకోలేకపోతుంది. శబ్దాల కారణంగా మధ్యమధ్యలో నిద్రకు డిస్టర్బ్  కలుగుతుంది. దీనివల్ల ఉదయం లేచిన తర్వాత కూడా శరీరం అలసిపోయినట్లుగా , సుస్తీగా అనిపిస్తుంది. నిద్ర నాణ్యత దెబ్బతినడం వల్ల రోజంతా ఉత్సాహం లోపిస్తుంది. ఈ సమస్యలన్నింటి నుంచి సురక్షితంగా ఉండాలంటే కొన్ని చిన్న జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం... మీకు ఒకవేళ మ్యూజిక్ వింటూ నిద్రపోయే అలవాటు ఉంటే, పాటలు ఆటోమేటిక్‌గా ఆగిపోయేలా టైమర్ సెట్ చేసుకోవడం మంచిది. వీలైతే ఇయర్ బడ్స్‌కు బదులుగా తక్కువ సౌండ్‌తో రూమ్‌లో చిన్న స్పీకర్ ఉపయోగించవచ్చు.  ఇయర్ బడ్స్‌ను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి , అంతేకాదు  ఎవరితోనూ వాటిని షేర్ చేసుకోకూడదు. చెవుల్లో ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే వైద్య నిపుణుల సలహా తీసుకోవడం చాలా మంచిది.                                                                                                                                                *రూపశ్రీ.