LATEST NEWS
పశ్చిమ బెంగాల్ సీఎం రేసులో ముందు వరుసలో కనిపిస్తున్న సువేందు అధికారి ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు.  ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి..  మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.  ఈ సందర్భంగా సువేందు స్పందిస్తూ.. తమ తదుపరి టార్గెట్ ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలేనని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో..  బీజేపీకి ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ అధినేతను ఉద్దేశించి..  మమతా బెనర్జీ, తేజస్వి యాదవ్, రాహుల్ గాంధీల పనైపోయిందని.. తర్వాతి వంతు అఖిలేశ్ యాదవేనని హెచ్చరించారు.  తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీతో పోల్చారు సువేందు. ఆప్‌లాగే టీఎంసీ కూడా అవినీతిమయమైందని, పతనం ఖరారైందని విమర్శించారు. ఆ పార్టీకి ఎలాంటి సిద్ధాంతాలు లేవని.. అందుకే నందిగ్రామ్‌ ప్రజలు మరోసారి తనను గెలిపించారన్నారు. దీదీ రాజకీయ బహిష్కరణ ఖాయమైందని పేర్కొన్నారు. త్వరలోనే టీఎంసీ ఎంపీలు బీజేపీలో చేరతారని   జోస్యం చెప్పిన సువేందు అధికారి.. ఇక తమ   దృష్టిపి  సమాజ్‌వాదీ పార్టీపై కేంద్రీకరిస్తామని అఖిలేశ్ యాదవ్‌కు హెచ్చరిక జారీచేశారు.  ఒకప్పుడు మమతా బెనర్జీకి కుడిభుజంగా.. తూర్పు మిడ్నాపూర్ వంటి జిల్లాలలో టీఎంసీ ఎదుగుదలలో సువేందు కీలక పాత్ర పోషించారు. కానీ.. 2020లో మమతతో విబేధించి బీజేపీలో చేరారు. ఆపై ఆమె ఓటమిని శాసించారు. నందిగ్రామ్‌లో టీఎంసీకి చెందిన పవిత్ర కర్‌ను కూడా సువేందు ఓడించారు. ఇప్పుడు బీజేపీ సీఎం రేసులో ఆయన పేరు ముందు వరుసలో ఉంది.
అస్సాం మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో   అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అక్రమాలకు పాల్పడిందనీ,  పద్ధతి ప్రకారం ఓట్ల చోరీని అమలు చేసిందనీ ధ్వజమెత్తారు.   కేంద్రంలోని అధికార పార్టీ తన బలాన్ని ఉపయోగించి ఓటర్ల తీర్పును తారుమారుచేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు.  ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో  బీజేపీ  ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు. ఈ మేరకు సోమవారం (మే 4)   తన అధికారిక 'ఎక్స్' ఖాతాలో చేసిన ఓ పోస్టులో.. పశ్చిమ బెంగాల్‌లో వందకు పైగా సీట్లలో ఫలితాలను బీజేపీ తారుమారు చేసిందన్న తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపణలతో తాను ఏకీభవిస్తున్నానని పేర్కొన్నారు.  ఇది బీజేపీకి తెలిసిన పాత వ్యూహమేనని, గతంలో మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర రాష్ట్రాలతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇదే తరహా పద్ధతిని చూశామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.  బీజేపీ ఎన్నికలనే కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలను పరిరక్షించే వ్యవస్థల విశ్వసనీయతను కూడా దెబ్బతీస్తోందని ఆయన ధ్వజమెత్తారు.   
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తలరాతలు మార్చేశాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ ప్రభుత్వాధినేత పినరయి విజయన్‌లు మాజీలుగా మిగిలిపోనున్నారు. మరోవైపు అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిల్లో సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకుంది. అదనంగా పశ్చిమబెంగాల్‌లో ఎన్టీఏ హవా కొనసాగింది. కేరళలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న ఎల్‌డీఎఫ్ విజయకేతనం ఎగరవేసింది. తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకేల ఆధిపత్యానికి విజయ్ సారథ్యంలోని టీవీకే చెక్ పెట్టింది.  పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ..  2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి   ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.  ఇక తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్ కరుణానిధి తండ్రి కరుణానిధి మరణానంతరం పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి ఎన్నికల్లోనే ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. ఈ ఎన్నికల్లో డీఎంకే భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమిదే విజయమని అత్యధిక ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అయితే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమై, విజయ్ సారథ్యంలోని టీవీకే తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకేల అధిపత్యాన్ని తుడిచిపెట్టింది.  దాంతో పదేళ్ల తర్వాత డీఎంకేను తిరిగి అధికారంలోకి తెచ్చిన సీఎం స్టాలిన్ మాజీగా మిగిలిపోనున్నారు. కేరళ చరిత్రలో వరుసగా రెండు సార్లు సీఎం బాధ్యతలు నిర్వర్తించిన పినరయి విజయన్‌కు తాజా ఎన్నికల ఫలితాలతో షాక్ తప్పలేదు. ప్రతి ఎన్నికల్లో విలక్షణ తీర్పునిస్తూ ప్రభుత్వాన్ని మార్చేసే కేరళ ఓటర్లు సీపీఐ(ఎం)కు చెందిన విజయన్‌పై నమ్మకంతో వరుసగా రెండో సారి పట్టం కట్టారు.  2016 ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ కూటమి నుంచి గెలిచి మొదటి సారి సీఎం అయి, పూర్తి పదవీ కాలం పూర్తి చేసుకుని, తిరిగి 2021 ఎన్నికల్లో ఎన్నికైన కేరళ మొదటి ముఖ్యమంత్రి ఆయనే. అయితే ఈ సారి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ఎల్‌డీఎఫ్‌ను చిత్తుగా ఓడించింది. ఆ క్రమంలో పినరన్ మాజీ సీఎంల జాబితాలో చేరనున్నారు. ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో అస్సాం, పుదుచ్చేరిల్లో వరుసగా రెండో సారి సీఎం బాధ్యతలు చేపట్టబోతున్న ఎన్డీఏ సీఎంలు  హిమంత బిశ్వ శర్మ, ఎన్.రంగస్వామిలు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుసగా రెండోసారి గెలుపొందడం విశేషం.
ALSO ON TELUGUONE N E W S
భారత చలనచిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ నిర్మాత, సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్.బి. చౌదరి హఠాన్మరణం చెందడం పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణవార్త విన్న మెగాస్టార్ చిరంజీవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.   ఆర్.బి. చౌదరి మృతి పట్ల చిరంజీవి స్పందిస్తూ, ఆయనతో తనకు ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇటీవల సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మాణంలో వచ్చిన "గాడ్ ఫాదర్" సినిమా కోసం ఆయనతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలను చిరంజీవి పంచుకున్నారు. చౌదరి గారు ఎందరో ప్రతిభావంతులైన దర్శకులకు, నటులకు కెరీర్‌ను ప్రసాదించారని, లెక్కలేనన్ని అద్భుతమైన కథలను వెండితెరకు పరిచయం చేశారని ఆయన కొనియాడారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన కృషి వెలకట్టలేనిదని చిరంజీవి పేర్కొన్నారు.  ఈ ఊహించని నష్టాన్ని భరించే శక్తిని ఆ దేవుడు ఆయన కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని కోరుకుంటూ చిరంజీవి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.  
ప్రముఖ చలనచిత్ర నిర్మాత ఆర్.బి. చౌదరి మరణం పట్ల నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగపూరితమైన సందేశాన్ని పంచుకున్నారు. ఆర్.బి. చౌదరి గారి మృతి వార్త న‌న్ను తీవ్రంగా కలచివేసింది.  తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన నిర్మించిన అద్భుతమైన సినిమాల్లో నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. చౌదరి గారి సినిమాల ద్వారా వచ్చిన మంచి సందేశాలు, మధురమైన పాటలు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆ మహానుభావుని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నాను అంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు బండ్ల గ‌ణేశ్‌. 
ప్రముఖ నిర్మాత, సూపర్ గుడ్ ఫిల్మ్ అధినేత శ్రీ ఆర్ బి చౌదరి గారు మరణం దిగ్భ్రాంతి కలిగించింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీ చౌదరి గారు దుర్మరణం చెందారనే దుర్వార్త నమ్మలేకపోయాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. నేను నటించిన ‘సుస్వాగతం’ చిత్రాన్ని శ్రీ చౌదరి గారు నిర్మించారు.  ఘన విజయం సాధించింది. చిత్ర నిర్మాణం, సంబంధిత వ్యాపారంపై సాధికారత ఆయనకి సొంతం. కుటుంబ సమేతంగా చూడదగ్గ కథలను ఎంపిక చేసుకుని, చక్కటి గీతాలు ఉండేలా చిత్రాలు నిర్మించారు. అన్నవరం చిత్రంలోని సిస్టర్ సెంటిమెంట్ కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటు తెలుగు, అటు తమిళ చిత్ర పరిశ్రమల్లో నిర్మాతగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. శ్రీ ఆర్ బి చౌదరి గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. (పవన్ కళ్యాణ్) ఉప ముఖ్యమంత్రి
సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో అగ్ర నిర్మాతగా పేరుగాంచిన, సూపర్‌గుడ్‌ ఫిల్మ్స్‌ అధినేత ఆర్‌బీ చౌదరి మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్‌బీ చౌదరి తన వ్యక్తిగత పనుల నిమిత్తం రాజస్థాన్ పర్యటనకు వెళ్లారు. ఉదయ్‌పూర్ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు కంట్రోల్ త‌ప్పి ప్ర‌మాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆర్.బి. చౌదరి మరణ వార్త సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో, ముఖ్యంగా తెలుగు మరియు తమిళ భాషల్లో ఎన్నో అద్భుతమైన కుటుంబ కథా చిత్రాలను అందించిన ఆయన ప్రస్థానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.  రాజస్థాన్‌కు చెందిన కుటుంబంలో జన్మించిన ఆర్‌.బి.చౌదరి, వ్యాపార రంగం నుండి సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. మొదట మలయాళ చిత్రాలతో తన నిర్మాణ ప్రయాణాన్ని మొదలుపెట్టి, ఆ తర్వాత చెన్నై కేంద్రంగా 'సూపర్ గుడ్ ఫిల్మ్స్' బ్యానర్‌ను స్థాపించారు.  'పుదు వసంతం' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. తెలుగులో కూడా ఆయన నిర్మించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. కేవలం స్టార్ హీరోలతోనే కాకుండా, కొత్త దర్శకులకు మరియు నటీనటులకు అవకాశం ఇవ్వడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో 100కు పైగా  సినిమాలు నిర్మించారు.  రాజా, సూర్యవంశం, నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా, సంక్రాంతి, ర‌చ్చ వంటి ఎన్నో గొప్ప చిత్రాలు ఆర్‌.బి.చౌద‌రి నిర్మించారు. ఆయన కుమారులు జీవా, జితన్ రమేష్ హీరోలుగా రాణిస్తున్నారు. మరో కుమారుడు బి. సురేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆర్‌.బి.చౌద‌రి మృతి ప‌ట్ల చిత్ర ప‌రిశ్ర‌మలోని ప్ర‌ముఖులు త‌మ సంతాపాన్ని తెలియ‌జేస్తూ ఆయ‌న‌ మ‌ర‌ణం చిత్ర ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోటు అని వ్యాఖ్యానిస్తున్నారు.  
Megastar Chiranjeevi's highly anticipated socio-fantasy epic, Vishwambhara, is currently making a lot of noise, but this time the buzz is about an unexpected shake-up in the technical crew. Directed by Vashistha Mallidi, the film features Trisha Krishnan and Ashika Ranganath as the leading ladies and promises to be a massive cinematic spectacle.   However, strong rumors in film circles indicate a major change regarding the movie's background score. While Oscar-winning composer M.M. Keeravaani was initially brought on board to handle the entire musical output, gossip suggests he has stepped down from the re-recording duties due to his tight schedule with S.S. Rajamouli's upcoming prestigious project.  To fill this gap, the makers have reportedly handed over the BGM responsibilities to young sensation Hari Gowra, who recently delivered solid scores for films like Hanu-Man. Meanwhile, UV Creations is leaving no stone unturned to ensure the movie delivers world-class visuals.  The production house is spending a huge budget on post-production, with top-tier international VFX studios working around the clock to bring this magical world to life. If the music rumors hold true, Hari Gowra's fresh energy combined with the grand visual scale could make this a truly epic theatrical experience.     Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.    
The entire Indian film fraternity has been plunged into deep sorrow following the sudden and tragic demise of veteran producer R.B. Choudary. The legendary founder of Super Good Films passed away in a devastating road accident in Rajasthan today. This shocking news has left fans and industry insiders completely heartbroken. According to the latest reports, the fatal car crash occurred while the senior producer was traveling in his home state of Rajasthan. Despite the immediate efforts, he succumbed to the severe injuries sustained during the collision. Arrangements are currently being made by his family to bring his mortal remains back to Chennai for the final rites. R.B. Choudary leaves behind a monumental legacy in Indian cinema. Over the decades, he has produced some of the biggest family entertainers and blockbusters across Tamil, Telugu, Malayalam, and Hindi languages, including massive hits like Suryavamsam and Nattamai. He is also the father of popular actors Jiiva and Jithan Ramesh, who are currently receiving an outpouring of support from their colleagues.   This sudden void will be deeply felt by the industry, as he was known for encouraging fresh talent and delivering wholesome entertainment. The entire South Indian film community is currently mourning this massive loss, with several celebrities taking to social media to express their deepest condolences to the grieving family.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.    
Sumanth Prabhas is stepping completely out of his comfort zone for his upcoming rural family drama, Godari Gattupaina. After breaking out with a strong Telangana backdrop in his debut film Mem Famous, the young actor spent four solid months mastering the Godavari dialect to ensure authenticity. Releasing worldwide on May 8, the movie has already generated a decent buzz among moviegoers, largely thanks to its creative promotional campaigns designed by the actor himself. Directed by Subhash Chandra, who brings his vast experience from directing over a hundred short films, the project is backed by producer Abhinav. The makers made a conscious decision to shoot entirely in real locations to capture the natural beauty of the Godavari region. Instead of the typical rugged mass portrayal, Sumanth will be seen playing an innocent and lovable auto driver, complete with an exciting auto race sequence. The casting choices also add a very interesting layer to the film. Veteran actor Jagapathi Babu is taking a much-needed break from his recent string of fierce antagonist roles to play a soft, highly relatable character reminiscent of his classic family hits like Shubhalagnam. He is joined by Nidhi Pradeep as the female lead, who learned Telugu specifically for her part, and Devi Prasad, who plays a crucial father figure to the hero. With a strong focus on a father-daughter bond and a breezy rural love story, the team is hoping to strike the right emotional chord this summer and deliver a solid theatrical hit.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం ‘పెద్ది’ (Peddi). జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ ఇండియాలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ అడ్వాంటేజ్‌ను సొంతం చేసుకోబోతోంది. ఈ ఏడాది జూన్ 4న ‘పెద్ది’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ రిలీజ్ డేట్ ‘పెద్ది’కి పెద్ద ప్లస్ పాయింట్‌గా మారనుంది. తెలుగు రాష్ట్రాల్లో సోలోగా విడుదలవుతోంది. 'టాక్సిక్' పోస్ట్ పోన్ కావడంతో సౌత్ లో ఎటువంటి పోటీ లేదని చెప్పవచ్చు. ఇక నార్త్ ఇండియాలోనూ భారీ బాలీవుడ్ సినిమాల పోటీ లేకపోవడం రామ్ చరణ్‌కు కలిసి రానుంది. ఓపెనింగ్స్ పరంగా ‘పెద్ది’ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఓపెనింగ్స్ కి తగ్గట్టుగా పాజిటివ్ టాక్ తోడైతే.. రామ్ చరణ్ బాక్సాఫీస్‌ పవర్ పాన్ ఇండియా స్థాయిలో మోతమోగిపోవడం ఖాయం. చిత్ర ప్రమోషన్ల విషయంలో కూడా యూనిట్ చాలా పక్కాగా వ్యవహరిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో హీరో హీరోయిన్లు స్వయంగా పాల్గొని సినిమాను ప్రమోట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్‌కు ఉన్న గ్లోబల్ ఇమేజ్, జాన్వీ కపూర్ క్రేజ్ ఈ సినిమాకు నార్త్ బెల్ట్‌లో మంచి మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. ఇతర భాషల్లో కూడా ఆ సమయంలో భారీ రిలీజ్‌లు లేకపోవడంతో ‘పెద్ది’కి పాన్ ఇండియా రేసులో లైన్ క్లియర్ అయినట్లే కనిపిస్తోంది. మొత్తానికి, బుచ్చిబాబు మార్కు ఎమోషనల్ కంటెంట్ గనుక ప్రేక్షకులకు కనెక్ట్ అయితే, ‘పెద్ది’ మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్‌గా నిలవడం ఖాయం. సరైన రిలీజ్ టైమింగ్, బలమైన ప్రమోషన్లతో మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విజయం కొందరే సాధిస్తారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి.  అయితే జీవితంలో విజయం సాధించాలంటే.. కొన్ని పనులను అస్సలు వాయిదా వేయకూడదని చెబుతాడు ఆచార్య చాణక్యుడు.  ఆచార్య చాణక్యుడు గొప్ప ఆధ్యాత్మిక వేత్త,  తత్వవేత్త.. మనిషి జీవితం గురించి ఎన్నో విషయాలను ఆయన రెండు వేల సంవత్సరాల క్రితమే ఎంతో క్షుణ్ణంగా వివరించి చెప్పాడు.  లైఫ్ లో సక్సెస్ కావాలంటే ఏ పనులను వాయిదా వేయకూడదు? ఆచార్య చాణక్యుడు ఏం చెప్పాడు? తెలుసుకుంటే.. ముఖ్యమైన పనులు.. ఒక మనిషి  సక్సెస్ ఫుల్  వ్యక్తి కావాలంటే ఆ వ్యక్తి తన ముఖ్యమైన పనులకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలి.  తమకు ముఖ్యమైన పనుల విషయంలో  వారు చూపించే చురుకుదనమే వారిని ఆ పనిలో విజయం సాధించేలా చేస్తుంది.ముఖ్యమైన పనులు ఏవైనా సరే.. మళ్లీ చేద్దాంలే అనే ఆలోచనతో వాయిదా వేయకూడదు.  సమయం చాలా విలువైన ఆస్తి అని,  పనులను వాయిదా వేయడం వల్ల ఎంతో గొప్ప ఆస్తిని కోల్పోయినట్టేనని, దీని వల్ల  ఒత్తిడి పెరగడమే కాకుండా భవిష్యత్తులో పెద్ద సమస్యలు కూడా తలెత్తుతాయని ఆచార్య చాణక్యుడు చెబుతాడు. నేర్చుకోవడం.. నేర్చుకోవడాన్ని అభ్యాసం అని అంటారు. చాణక్యుడి  ప్రకారం, జ్ఞానమే మనిషి  నిజమైన శక్తి. విజయవంతమైన వ్యక్తులు నేర్చుకోవడం ఎప్పుడూ ఆపరు. వారు ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి, తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కృషి చేస్తారు. ఎందుకంటే, ఈ రోజు తాము సంపాదించే జ్ఞానమే రేపటి విజయానికి పునాది వేస్తుందని వారికి తెలుసు. కష్టం.. విజయానికి కష్టపడటమే ఏకైక, ప్రధాన  మార్గం. సక్సెస్ కావాలంటే.. పనులను భారంగా కాకుండా.. వాటిని చాలెంజ్ గా తీసుకుని పూర్తీ చేయాలి. తమకు ఎదురొచ్చే ప్రతి పని, తమ ఎదుగుదలకు ఒక గొప్ప మార్గంగా చూడాలి. సోమరితనం , వాయిదా వేయడం మానవ పతనానికి దారితీస్తాయి. అందుకే చాణక్యుడు ప్రతి  పనిని సమయానికి పూర్తి చేయమని సలహా ఇస్తాడు. తప్పులు.. తప్పు చేసినప్పుడు దాన్ని సరిదిద్దుకోకుండా పారిపోవడం  వైఫల్యానికి ప్రదాన కారణం అవుతుంది.   తన తప్పుల గురించి తెలుసుకుని,  వెంటనే వాటిని అంగీకరించి, ఏమాత్రం సమయం వృథా చేయకుండా సరిదిద్దుకునే వ్యక్తి జీవితంలో విజయం సాధించగలుగుతాడు. తప్పులను సకాలంలో సరిదిద్దుకోకపోతే, అవి భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. అవకాశాలు.. జీవితంలో సువర్ణావకాశాలు కాలంతో పాటు వస్తూ ఉంటాయి. అలాగే కాలంతో పాటు చేజారి పోతాయి కూడా. ఒకసారి అవకాశం చేజారితే అది తిరిగి రాదని తెలిసి, దానిని గుర్తించి ఆలస్యం చేయకుండా వినియోగించుకోవడంలో నేర్పరి అయినవాడే విజయం సాధిస్తాడని చాణక్య నీతి చెబుతుంది.                            *రూపశ్రీ.
భారతీయుల ఇళ్లలో చాలా వరకు కరివేపాకు మొక్క పెంచుతూ ఉంటారు. ఇంటి బయట ఏ మాత్రం కాస్త స్థలం ఉన్నా సరే.. మొదటగా కరివేపాకు మొక్కనే పెంచుతూ ఉంటారు. కరివేపాకు మొక్క ఎదుగుదలకు కూడా భారతీయ వాతావరణం చాలా చక్కగా సహకరిస్తుంది. అయితే వేసవి కాలం మాత్రం కరివేపాకు మొక్కలకు కష్టకాలం అని చెప్పవచ్చు. వేసవిలో ఉండే తీవ్రమైన ఎండ కారణంగా కరివేపాకు మొక్క బాగా వాడిపోవడం,  ఎదుగుదల మందగించడం జరుగుతుంది.  అయితే మొక్క తిరిగి తాజాగా మారాలన్నా,  ఆరోగ్యంగా పెరగాలన్నా కేవలం నీరు పోస్తే సరిపోదు. ఇందుకోసం ఇంట్లోనే ఉండే ఒక పానీయం చక్కగా సహాయపడుతుంది.   అదేంటో తెలుసుకుంటే.. మజ్జిగ.. భారతీయుల చాలా ఇళ్లలో కరివేపాకు మొక్క ఉన్నట్టే.. వేసవి కాలంలో ప్రతి ఇంట్లో పెరుగు, మజ్జిగ ఖచ్చితంగా ఉంటుంది.  కలివేపాకు మొక్కకు మజ్జిగను ఉపయోగించడం వల్ల వాడిన మొక్క తిరిగి తాజాగా మారడమే కాకుండా మొక్క ఆరోగ్యంగా కూడా పెరుగుతుంది. మజ్జిగ ఎందుకు సహాయపడుతుంది? కరివేపాకు మొక్కల పెరుగుదలకు ఆమ్ల నేల అవసరం. మజ్జిగలో ఆమ్లం ఉంటుంది. కరివేపాకు మొక్క పాదులో  మజ్జిగను పోసినప్పుడు నేల  pH స్థాయి సమతుల్యంగా ఉంటుంది, ఇది మొక్క నేల నుండి పోషకాలను గ్రహించడానికి వీలు కల్పిస్తుంది. నత్రజని ఇస్తుంది.. కరివేపాకు పచ్చగా, దట్టంగా ఉండటానికి నత్రజని చాలా అవసరం. మజ్జిగలో కూడా నత్రజని ఉంటుంది, ఇది మొక్కల పెరుగుదలకు ఎంతో మేలు చేస్తుంది. మజ్జిగలోని పోషకాలు ఆకులను మరింత ముదురుగా, పచ్చగా మారడానికి సహాయపడతాయి. మజ్జిగను వాడటం కొత్త చిగుళ్ల పెరుగుదలను ప్రేరేపిస్తుంది. కీటకాల నుండి రక్షణ.. కరివేపాకు మొక్కలకు తరచుగా తెల్లటి బూజు లేదా కీటకాలు పడతాయి. మజ్జిగ ఒక సహజ శిలీంధ్రనాశకం. దానిలో ఉండే లాక్టిక్ ఆమ్లం ఈ బ్యాక్టీరియా , శిలీంధ్రాలను చంపి, మొక్క పెరగడానికి సహాయపడుతుంది. పోషకాలు.. మజ్జిగలో కాల్షియం మాత్రమే కాకుండా ఫాస్ఫరస్ , ప్రోబయోటిక్ బ్యాక్టీరియా కూడా ఉంటాయి. ఈ బ్యాక్టీరియా నేలను సారవంతం చేస్తుంది. కరివేపాకు మొక్కలు బాగా ఏపుగా పెరగడానికి  మజ్జిగను ఉపయోగించవచ్చు.                               *రూపశ్రీ.
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే.. కూలర్ ఉపయోగించేటప్పుడు కూలర్ లో నీరు చేపల వాసన వస్తూ ఉంటుంది. కొందరు కూలర్ నుండి వాసన వస్తూ ఉందనే కారణంతో దాన్ని ఆఫ్ చేస్తారు. అయితే కూలర్ ను వాడకుండా ఉండటం పరిష్కారం కాదు.  కూలర్ ట్యాంక్ లోని పాత నీరు,  నాచు, తేమ కారణంగా కూలర్ లో చేపల వాసన లాగా వస్తూ ఉంటుంది. ఈ సమస్యకు చాలా సులువుగా చెక్ పెట్టవచ్చు.  అందుకోసం అనుసరించాల్సిన చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. కూలర్ నుండి చేపల వాసన ఎందుకు వస్తుంది? కూలర్‌లో చేపల వాసన రావడానికి అత్యంత సాధారణ కారణం ట్యాంక్‌లో పేరుకుపోయిన బయోఫిల్మ్ , బ్యాక్టీరియా. ట్యాంక్‌లో నీరు ఎక్కువ సేపు నిలిచి ఉన్నప్పుడు, సూక్ష్మజీవులు వృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. నిలిచిపోయిన నీరు బయోఫిల్మ్‌ను ఏర్పరుస్తుంది, ఇది వాసనకు కారణమవుతుంది.  అది మాత్రమే కాకుండా కూలర్‌లోని మురికి, దుమ్ము , తేమ కూడా ఈ వాసనకు కారణం అవుతాయి. వాసన ఎలా తొలగించాలంటే.. కూలర్ నుండి దుర్వాసనను తొలగించడానికి  వైట్  వెనిగర్‌ను ఉపయోగించవచ్చు. వైట్  వెనిగర్‌ను ఉపయోగించడం వల్ల కూలర్ నీటి నుండి వచ్చే చేపల వాసనను తొలగిపోతుంది. ఒకవేళ వైట్ వెనిగర్ లేకపోతే దానికి  ప్రత్యామ్నాయంగా బేకింగ్ సోడాను కూడా ఉపయోగించవచ్చు. వెనిగర్ అనేది దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపే ఒక సహజ క్రిమిసంహారకం. మొదటగా  కూలర్ ట్యాంక్‌ను ఖాళీ చేయాలి. ఆ తర్వాత, ట్యాంక్‌లో వెనిగర్ పోసి కాసేపు అలానే ఉంచాలి. తర్వాత, ట్యాంక్‌ను శుభ్రంగా రుద్దాలి. ఆ తర్వాత 2 నుండి 3 టీస్పూన్ల బేకింగ్ సోడా కలపాలి. ట్యాంక్ శుభ్రం చేయాలి. దీని తర్వాత ట్యాంక్‌ను నీటితో నింపాలి. దీనివల్ల కూలర్‌లోని దుర్వాసన పోతుంది. ఎసెంటియల్ ఆయిల్స్.. ట్యాంక్‌ను శుభ్రం చేసిన తర్వాత నీటిని నింపి ఆ  నీటిలో ఎసెంటియల్ ఆయిల్స్  ఉపయోగించవచ్చు. కూలర్ నీటిలో 2 నుండి 3 చుక్కల టీ ట్రీ ఆయిల్ లేదా లెమన్‌గ్రాస్ ఆయిల్ కలపాలి. ఇది కూలర్ నుండి స్వచ్ఛమైన గాలి ప్రవహించడానికి సహాయపడుతుంది. కూలర్‌లోని నీటిని ప్రతి 2 నుండి 3 రోజులకు మార్చితే కూలర్ నుండి దుర్వాసన రాదు. చాలా మంది కూలర్ లో  నీటి మట్టం తగ్గగానే ప్రతిరోజూ నీటిని అయితే నింపుతూ ఉంటారు. కానీ.. పూర్తీగా కూలర్ ట్యాంక్ ను క్లీన్ చేసి కొత్త నీటిని నింపుతూ ఉంటే కూలర్ నుండి వాసన అనేది రాదు.                                 *రూపశ్రీ.
కాలం మారినా మనిషి జీవన పోరాటం మాత్రం మారదు.  కొందరు కాలంతో పోటీ పడి ఎండ, వాన, చలి వంటి వాటిని లెక్క చేయకుండా సాగుతూ ఉండాలి. లేకపోతే వారితో పాటు వారిని నమ్ముకున్న కుటుంబాలు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  ఇక ప్రస్తుతం వేసవి కాలం నడుస్తోంది.  ఈ వేసవి కాలంలో అడుగు బయట పెట్టాలంటే భయపడాల్సి వస్తోంది. కానీ కొందరు మాత్రం ఎండలో కూడా బయటకు వెళ్లాలి,  ఎండలో తిరిగి పనులు చేయాల్సి వస్తుంది.  చాలామంది బయటి పనులకు బైక్ వాడుతూ ఉంటారు. సాధారణ రోజులలో బైక్ ప్రయాణం ఏమంత సమస్య అనిపించదు. కానీ.. వేసవిలో,  తీవ్రమైన ఎండలో మాత్రం బైక్ ప్రయాణించే వారు చాలా జాగ్రత్త పడాలి. లేకపోతే వడగాలులు,  డీహైడ్రేషన్ సమస్య చాలా తొందరగా దెబ్బతీస్తాయి.  బైక్ రైడర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుంటే.. సరైన దుస్తుల ఎంపిక.. ఎండలో ప్రయాణించేటప్పుడు సురక్షితమైన దుస్తులు , హెల్మెట్ ధరించడం అత్యంత ముఖ్యం. చెమట త్వరగా ఆవిరైపోయి, శరీరాన్ని చల్లగా ఉంచడానికి తేలికైన, గాలి ప్రసరించే దుస్తులు ధరించాలి.  హెల్మెట్ సరిగ్గా బిగువుగా సరిపోయేలా ,  తలను ఎండ నుండి రక్షించేలా  ఉండేలా చూసుకోవాలి. నీరు..  తగినంత నీరు , ఎలక్ట్రోలైట్లను తీసుకోవడం చాలా ముఖ్యం. వేడిలో, శరీరం నుండి నీరు , ఖనిజాలు వేగంగా నష్టపోతాయి, దీనివల్ల డీహైడ్రేషన్ , బలహీనత ఏర్పడతాయి. నీటితో పాటు కొబ్బరి నీరు లేదా ఎలక్ట్రోలైట్ పానీయాలను తీసుకోవడం శరీరంలోని నీరు , ఖనిజాల సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. సమయం.. ఎక్కువ సేపు ఎండలో బైక్ డ్రైవ్ చేయడం మానుకుంటే మంచిది. తెల్లవారుజాము లేదా సాయంత్రం వంటి చల్లని సమయాల్లో బైక్ డ్రైవింగ్ మేలు. దీనివల్ల ఎండ వేడిమి, అలసట తగ్గుతాయి. మధ్యాహ్నం 12 నుండి 4 గంటల మధ్య ఎండ తగలకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. విశ్రాంతి.. తప్పనిసరి పరిస్థితిలో బయటకు వెళితే..  బైక్ వేగాన్ని అదుపులో ఉంచుకోవాలి.  విశ్రాంతి తీసుకోవడానికి, శరీరాన్ని  చల్లార్చుకోవడానికి అక్కడక్కడా ఆగుతూ,  విశ్రాంతి తీసుకుంటూ వెళ్లడం మంచిది. ఎక్కువ సేపు అధిక వేగంతో ప్రయాణించడం వల్ల శరీర వేడి పెరిగి అలసటకు దారితీస్తుంది. చిన్న చిన్న విరామాలు తీసుకోవడం శరీరాన్ని కూల్ చేసుకోవడానికి, సురక్షితమైన ప్రయాణానికి సహాయపడతాయి. గ్లౌజులు,  సన్ స్క్రీన్.. తీవ్రమైన ఎండ  నుండి ప్రొటెక్షన్ కోసం సన్‌స్క్రీన్ , చేతికి గ్లౌజులు వాడాలి. సన్‌స్క్రీన్ చర్మాన్ని UV కిరణాల నుండి రక్షిస్తుంది, అదే సమయంలో గ్లౌజులు  బైక్ నడుపుతున్నప్పుడు  చేతుల చర్మాన్ని రక్షిస్తాయి. ఇది చర్మం కాలిన గాయాలు , నష్టం కలిగే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.                               *రూపశ్రీ.
  వేసవి అంటే మండే ఎండలు, వేడి గాలులు,  చెమటలు పట్టించే వాతావరణం.. ఇవన్నీ ఉంటాయి.  ఇలాంటి రోజుల్లో  రోడ్డు పక్కన అమ్మే చెరకు రసం తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. నిమ్మరసం, నల్ల ఉప్పు, పుదీనా కలపడం వల్ల చెరకు రసం  రుచి మరింత ఇనుమడిస్తుంది.  పైగా మార్కెట్ లో అమ్మే కూల్ డ్రింకులతో పోలిస్తే.. చెరకు రసం చాలా సహజమైన పానీయం.  అందుకే వేసవిలో చాలామంది చెరకు రసం తాగడానికి చాలా ఇష్టపడతారు.  కానీ ఎంతో  ఆరోగ్యకరమైనదని, తక్షణ చల్లదనాన్ని ఇచ్చేదాని అనుకునే  చెరకు రసం  తాగడం నిజంగా సురక్షితమేనా? ఈ విషయం నేటి కాలంలో చాలా సందేహమైన ప్రశ్నగా మారుతోంది.  వేసవి కాలంలో చెరకు తాగడం ఆరోగ్యానికి ఎంత వరకు మంచిది? దీని గురించి వైద్యులు ఏం చెప్తున్నారో తెలుసుకుంటే.. చెరకు రసం మంచిదే.. కానీ ఎక్కువగా తాగితే.. వేసవిలో చెరకు రసం చాలా ఎక్కువగా తాగుతుంటారు.  చెరకు రసం  శరీరానికి తేమను అందించి, తక్షణ శక్తిని ఇస్తుంది.  చెరకు రసంలోని  సహజ చక్కెర శరీరానికి తక్షణ శక్తిని అందించి, అలసట , డీహైడ్రేషన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. అందుకే మండుటెండలలో   ఉపశమనం కోసం చాలామంది చెరకు రసం తాగుతారు. చెరకు సహజంగానే తీపిగా ఉన్నప్పటికీ, రసంగా తీసుకున్నప్పుడు దానిలోని చక్కెర శాతం మరింత ఎక్కువగా మారుతుంది. రసం తీయడం వల్ల ఫైబర్ దాదాపు పూర్తిగా తొలగిపోతుంది, ఇది సాధారణంగా శరీరం చక్కెరను గ్రహించడాన్ని నెమ్మదింపజేస్తుంది. అందువల్ల, చెరకు రసం తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది.  చెరకు రసం మధుమేహ వ్యాధిగ్రస్తులకు  మంచిది కాదని చెబుతారు. అంతేకాకుండా, ఫ్యాటీ లివర్, ఊబకాయం లేదా జీవక్రియ సమస్యలు ఉన్నవారు చెరకు రసం తాగడాన్ని చాలా తగ్గించాలని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ చక్కెర శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమై ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. చెరకు రసం పరిశుభ్రత.. చెరకు రసం విషయంలో ఉన్న మరొక  ప్రమాదం దాని పరిశుభ్రత. తరచుగా చెరకు  రసాన్ని ఆరుబయట తయారు చేస్తారు, చెరకు పైన ఉండే తెల్లని పొడిని శుభ్రపరచకుండా చెరకు నుండి రసం తీస్తుంటారు.  పైగా చెరకు రసం తీసే చోట  యంత్రాలు, ఐస్, నీరు , గ్లాసులు సరైన పరిశుభ్రతతో ఉండవు. వైద్యుల ప్రకారం, రసం తయారీలో ఉపయోగించే యంత్రాలు లేదా ఐస్  శుభ్రంగా లేకపోతే, బ్యాక్టీరియా , వైరస్‌లు సులువుగా అటాక్ అవుతాయి. దీనివల్ల టైఫాయిడ్, కలరా , హెపటైటిస్ వంటి నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. చెరకు రసం విషయంలో ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే.. చెరకు రసం తాగే విషయంలో కొందరు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.  ముఖ్యంగా మధుమేహం, ఊబకాయం, లేదా ఫ్యాటీ లివర్ ఉన్నవారు,  రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతున్నవారు చెరకు రసం తాగే ముందు జాగ్రత్త వహించాలి. చెరకు రసాన్ని ఎల్లప్పుడూ శుభ్రమైన , పరిశుభ్రమైన ప్రదేశం నుండే కొనుగోలు చేయాలి.                                *రూపశ్రీ.