మహిళలలో ముఖం మీద అవాంఛిత రోమాలు...ఇలా చేస్తే మాయం అవుతాయి..!


ఆడవాళ్ల ముఖం అందంగా కనిపించాలని కోరుకోవడం చాలా సహజం. అయితే ముఖం అందంగా ఉన్నా ముఖం మీద పై పెదవి, గడ్డం వంటి ప్రాంతాలలో లైట్ గా మగవాళ్లకు లాగా వెంటుక్రలు ఉంటాయి చాలామందికి.  ఇలా వెంట్రుకలు ఉండటాన్ని నేటి కాలం అమ్మాయిలు అస్సలు భరించలేరు. వీటిని తొలగించడానికి చాలామంది థ్రెడ్డింగ్,  వ్యాక్సింగ్ లేదా రేజర్ తో షేవ్ చేయడం వంటివి ఫాలో  అవుతారు. ఇవి వెంట్రుకలను తొలగిస్తాయి తప్ప.. వెంట్రుకలు పెరగడాన్ని అయితే ఆపవు.  పైగా ఈ పద్దతుల వల్ల చర్మానికి చాలా హని జరుగుతుంది. అయితే ఇంట్లోనే ఒక పానీయాన్ని  తయారు చేసుకుని తాగడం వల్ల అవాంఛిత రోమాలు తగ్గిపోతాయట.  అంతేకాదు మళ్లీ రావు కూడా..  ఇంతకీ ఇదేంటో.. దీన్ని తయారు చేసే విధానం ఏంటో తెలుసుకుంటే..

కారణం..

ముఖం పైన వెంట్రుకలు రావడానికి ఆండ్రోజెన్ అనే హార్మోన్ పెరుగుదలే కారణం.  ఇది పురుష హార్మోన్.  ఈ హార్మోన్ మహిళలలో కూడా రిలీజ్ అయినప్పుడు ఇలా ముఖం మీద అవాంఛిత రోమాలు పెరగడం జరుగుతుంది. ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గితే  అవాంఛిత రోమాలు రావడం కూడా తగ్గుతుంది. అందుకే ఈ హార్మోన్ ఉత్పత్తిని నియంత్రించడానికి ఆరోగ్యకరమైన పానీయాన్ని నిపుణులు సూచించారు.

ఇలా తయారు చేసుకోవాలి..

కావలసిన పదార్థాలు..

నీళ్లు.. 1 గ్లాసు

మెంతులు.. 1టీస్పూన్

దాల్చిన చెక్క పొడి.. చిటికెడు

పుదీనా ఆకులు.. కొన్ని

తయారు విధానం..

స్టౌ మీద ఒక గిన్నె ఉంచి అందులో ఒక గ్లాసు నీరు పోయాలి.  అందులో ఒక స్పూన్ మెంతులు కూడా వేయాలి.  అందులో చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి రంగు పసుపు రంగులోకి వచ్చే వరకు మరిగించాలి.  మరిగిన తరువాత స్టౌ ఆఫ్ చేసి అందులో కొన్ని పుదీనా ఆకులు వేసి మూత పెట్టి 5నిమిషాల పాటు అలాగే వదిలేయాలి.  5 నిమిషాల తరువాత ఫిల్టర్ చేసి తాగాలి. లేదంటే ఈ పానీయంలో పుదీనా ఆకుల బదులు స్పియర్మింట్ టీ బ్యాగ్ వేసి 5 నిమిషాల తరువాత తాగవచ్చు.  ఇలా 2 నెలలు చేస్తే ముఖం మీద అవాంఛిత రోమాలు తగ్గుతాయట.

ప్రభావం..

స్పియర్‌మింట్ టీ యాంటీ-ఆండ్రోజెనిక్ ప్రభావాలను కలిగి ఉంటుంది.   టెస్టోస్టెరాన్ స్థాయిలను  నేరుగా తగ్గిస్తుందని, అదే సమయంలో LH,  FSH లను పెంచుతుందని, అండాశయ సమతుల్యతను ప్రోత్సహిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని వారాల పాటు ఈ టీని తాగిన  తర్వాత PCOS,  ఇతర ఆండ్రోజెన్ హార్మోన్  సమస్యలు  ఉన్న మహిళల్లో ముఖంపై వెంట్రుకలు తగ్గుతాయని స్పష్టంగా చెబుతున్నారు.

మెంతి గింజలు ముఖంపై వెంట్రుకల పెరుగుదలను తగ్గించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. మెంతుల గింజలు ఈస్ట్రోజెన్ లాంటి చర్య కలిగిన మొక్కల సమ్మేళనమైన డయోస్జెనిన్‌ను కలిగి ఉంటాయి. వీటిలో ఉండే ఫైటోఈస్ట్రోజెన్‌లు  ఆండ్రోజెన్‌లను స్వల్పంగా ఎదుర్కోవడం ద్వారా హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడతాయి. అండాశయ పనితీరుకు సంబంధించిన హార్మోన్ల నియంత్రణకు ఇది సపోర్ట్ ఇస్తుందని అంటున్నారు.

దాల్చిన చెక్కలో పాలీఫెనాల్స్ ఉంటాయి, ఇవి ఇన్సులిన్ గ్రాహకాలపై పనిచేస్తాయి.  సెల్యులార్ గ్లూకోజ్ శోషణను పెంచుతాయి. తద్వారా రక్త ఇన్సులిన్ స్థాయిలను తగ్గిస్తాయి. అధిక ఇన్సులిన్ అండాశయాలను ఎక్కువ టెస్టోస్టెరాన్ ఉత్పత్తి చేయడానికి ప్రేరేపిస్తుంది. దాల్చిన చెక్క పరోక్షంగా ఆండ్రోజెన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. PCOS ఉన్న మహిళల్లో, దాల్చిన చెక్క సప్లిమెంటేషన్ మెరుగైన ఫలితాలను ఇస్తుంది. ఇది మెరుగైన హార్మోన్ల బ్యాలెన్స్ ను చేకూరుస్తుంది.


                                        *రూపశ్రీ.