
వ్యాక్సింగ్ లేకుండానే అవాంఛిత రోమాలను మాయం చేసే సూపర్ చిట్కా..!
వ్యాక్సింగ్ లేకుండానే అవాంఛిత రోమాలను మాయం చేసే సూపర్ చిట్కా..!

అమ్మాయిలను చాలా ఇబ్బంది పెట్టే సమస్యలలో అవాంఛిత రోమాలు కూడా ప్రధానమైనవి. అవాంఛిత రోమాలు అందాన్ని చాలా దెబ్బతీస్తాయి. చాలామంది అవాంఛిత రోమాలు తొలగించుకోవడానికి వ్యాక్సింగ్ ను ఎంచుకుంటారు. కానీ ఇది చాలా నొప్పిగా ఉంటుంది. ఇప్పట్లో మార్కెట్లో చాలా రకాల క్రీమ్ లు కూడా దొరుకుతాయి. మరికొందరు హెయిర్ ట్రిమ్మింగ్ విధానానని ఎంచుకుంటారు. కానీ ఇవి చర్మానికి హాని కలిగిస్తాయని చర్మ సంరక్షణ నిపుణులు చెబుతారు. థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్ మరియు ప్లకింగ్ వంటి పద్ధతులలో అవాంఛిత రోమాలు చాలా తొందరగా తిరిగి పెరుగుతాయి. చర్మం మీద అవాంఛిత రోమాలు తొలగించుకోవడానికి ఇంట్లోనే సూపర్ టిప్ ఫాలో కావచ్చు. కేవలం మూడు పదార్థాలు ఉపయోగించి అవాంఛిత రోమాలు తొలగించుకోవచ్చు. ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటే..
అవాంఛిత రోమాలు తొలగించే రెసిపి..
కావలసిన పదార్థాలు..
గోధుమపిండి..
తేనె..
పసుపు..
పాలు..
పైన పేర్కొన్న పదార్థాలను అవసరానికి కావలసినంత తీసుకోవాలి.
తయారీ విధానం..
ఒక చిన్న గిన్నెలో గోధుమ పిండి తీసుకోవాలి. అందులో తేనె, పసుపు, పాలు వేసి పేస్ట్ లాగా చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి. అది ఆరిపోయేవరకు అలాగే ఉంచాలి. ఆ తరువాత చర్మం మీద హెయిర్ పెరిగె వ్యతిరేక దిశలో సున్నితంగా రుద్దుతూ ముఖం మీద పేస్ట్ ను తొలగించాలి. ఇలా తొలగించేటప్పుడు ఎండిన పేస్ట్ తో పాటు చర్మం మీద అవాంఛిత రోమాలు కూడా తొలగిపోతాయి. థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్ తో పోలిస్తే ఇది చాలా తక్కువ నొప్పి కలిగి ఉంటుంది.
ఈ టిప్ ను వారానికి ఒకసారి ఫాలో అవుతూ ఉంటే ముఖం మీద అవాంఛిత రోమాలు అనేవి అసలు కనిపించవు. ఇందులో ఎలాంటి రసాయనాలు, హాని చేసే పదార్థాలు లేవు కాబట్టి దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి నిస్సంకోచంగా దీన్ని ఉపయోగించవచ్చు.
*రూపశ్రీ.
