ఐస్ ఫేషియల్ చేస్తున్నారా...ఈ నిజాలు తెలుసా!

 

 

ఈ మధ్యకాలంలో సౌందర్య రక్షణలో ఐస్ ప్రధాన పాత్ర పోషిస్తోంది.  ఐస్ ముక్కలు వేసిన నీటిలో ముఖాన్ని కొన్ని సెకెన్ల పాట్లు ముంచి ఉంచడం,  ఐస్ ముక్కలతో ముఖం మీద రబ్ చేయడం వంటివి చాలామంది ఫాలో అవుతున్నారు. ఇది ముఖాన్ని కాంతివంతంగా, అందంగా మారుస్తుందని అంటుంటారు.  అయితే ఇలా మంచు ముక్కలను ముఖానికి అప్లై చేయడం మంచిదేనా?  ఇది ఎంతవరకు మంచి చేస్తుంది తెలుసుకుంటే..

ముఖం మీద ఐస్ క్యూన్స్ వేయడం లేదా చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవడం వంటివి చాలా మంది చేస్తున్నారు.  వీటి వల్ల అప్పటికప్పుడు  చాలా విషయాలలో కొంతవరకు ఉపశమనం అయితే లభిస్తుంది. కానీ చర్మ సంరక్షణ నిపుణులు మాత్రం ముఖం మీద అసలు ఐస్ వేయకూడదు అని అంటున్నారు. ఇలా చేయడం వల్ల క్రమంగా ముఖంలోని నరాలు దెబ్బతింటాయట.

ముఖం మీద ఐస్ అప్లై చేస్తూ ఉంటే ముఖం నరాలు విచ్చిన్నమై క్రమంగా ముఖం మీద ఎర్రటి మచ్చలు,  లేదా దద్దుర్లు వంటి గుర్తులు వస్తాయట. ఇలాంటి వాటిని విరిగిన కేశనాళికలు  అని అంటారట.

నిజానికి ఈ ఐస్ ఫేషియల్ అనేది మన దేశంలో మొదటి నుండి లేదు. ఇది విదేశాల ట్రెండ్. విదేశాల ప్రజలు ఇప్పటికే చల్లని వాతావరణంలో నివసిస్తుంటారు.  అలాంటి వారు ఐస్ క్యూబ్స్ అప్లై చేసినా,  ఐస్ వాటర్ లో ముఖాన్ని ముంచినా వారికి ఎక్కువ ప్రబావం ఉండదు.  ఎందుకంటే వారి చర్మం చల్లదనానికి అలవాటు పడి ఉంటుంది.

ఉష్ణ ప్రాంతాలలో నివసించే భారతీయ ప్రజలకు ఇలాంటి ఐస్ ఫేషియల్స్ అవసరం లేదు.  భారతీయుల చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ఐసింగ్ కు బదులు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అలాగే చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే చర్మానికి తగినంత సూర్యరశ్మి, తేమ అవసరం.

భారతీయులు చర్మానికి ఐస్ క్యూబ్స్ అప్లై చేస్తుంటే చాలా నష్టాలు ఉంటాయి.  భారతీయుల చర్మంలో మెలనిన్ ఎక్కువగా ఉంటుంది. జలుబు లేదా చికాకు వంటివి ఎదురైనప్పుడు వాటి నుండి చర్మం సేఫ్ గా ఉండటం కోసం చర్మం మెలనిన్ ను ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. దీని వల్ల బుగ్గలు, ముక్కు,  నుదురు మొదలైన ప్రాంతాలలో నల్లని మచ్చలు కనిపిస్తాయి.

భారతీయులు చర్మానికి ఐస్ వేయడం వల్ల చర్మంలోని తేమ తగ్గుతుంది. ఇది చర్మంలో ఉండే సహజ నూనెలు తగ్గడానికి కూడా కారణం అవుతుంది.  దీని కారణంగా చర్మం పొడిగా, బిగుతుగా అనిపిస్తుంది.

ముఖానికి ఐస్ అప్లై  చేయడం వల్ల ముఖంలో రక్తనాళాలు కుచించుకుపోతాయి. ఇలా పదే పదే చేయడం వల్ల ముఖం లో రక్త ప్రసరణ తగ్గుతుంది. చర్మానికి ఆక్సిజన్ తక్కువగా అందుతుంది. దీని వల్ల చర్మం వాడిపోయినట్టు నీరసంగా కనిపిస్తుంది. అందుకే ముఖానికి ఐస్ అప్లై చేయడం మంచిది కాదు.


                                       *రూపశ్రీ