How to Stop Loss of Protiens & Vitamins

ప్రొటీన్లు , విటమిన్లు పోకుండా ఉండాలంటే ... శరీరానికి అవసరమైన శక్తిని సమకూర్చేది, ఆరోగ్యాన్ని

అందించేది మనం తీసుకునే ఆహారమే కనుక అందుకోసం మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి.

శరీర పెరుగుదల, వికాసాలకు ప్రొటీన్లు, విటమిన్లు ముఖ్యమని గుర్తించాలి.

అందుగ్గానూ కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. అవేంటో చూద్దాం.

పచ్చికూరగాయల్నికడిగినప్పుడు, ముక్కలుగా తరిగినప్పుడు, చెక్కు తీసినప్పుడు,నీటిలో

నానబెట్టినప్పుడు వివిధ దశల్లో రసాయనిక చర్యలు జరుగుతాయి.

ఆ కారణంగా, కొన్ని రకాల ఖనిజాలు, విటమిన్ ‘సి’, ‘బి’ – కాంప్లెక్స్ మొదలైనవి నీటిలో కరిగిపోయే

లక్షణాన్ని కలిగి ఉన్నందున కూరగాయల్లో ప్రొటీన్లు, విటమిన్లు తగ్గుతాయి లేదా నశిస్తాయి.

కొన్ని రకాల కూరగాయల ముక్కలకి ఉప్పురాసి పక్కన పెడుతుంటాం. ఇలా చేయడంవల్ల, వాటిల్లోని

విటమిన్లు, ఖనిజాలు వాటినుండి ఊరి నీటిద్వారా బయటకు విడుదలై వచ్చేస్తాయి. కనుక

ఎక్కువసేపు అలా ఉంచకూడదు.

ప్రొటీన్లు, విటమిన్లు పోకుండా ఉండేందుకు కూరగాయల్నిమూత పెట్టి ఉడికించాలి.

కూరగాయలు, పండ్లకు చెక్కు తీయడంవల్ల వాటిల్లో విటమిన్లు నశిస్తాయి. పైగా కోసిన తర్వాత

నిల్వచేసినట్లయితే మరిన్ని ప్రొటీన్లు, విటమిన్లు పోతాయి..

ప్రొటీన్లు, విటమిన్ల కోసం ఈ జాగ్రత్తలు పాటించాలి.

+ తరిగిన ముక్కలను నీళ్ళలో వేయకూడదు.

+ పళ్ళు, కూరగాయలకు చెక్కు తీసేటప్పుడు మందంగా కాకుండా పల్చగా ఉండేలా చూసుకోవాలి.

+ కూరగాయల్ని మరీ చిన్న ముక్కలుగా తరగకూడదు.

+ ఆహారపదార్థాలను తక్కువ నీళ్ళతో ఉడికించాలి. ఆవిరిపై ఉడికిస్తే మరీ మంచిది. అప్పుడు ప్రొటీన్లు,

విటమిన్లు నశించకుండా ఉంటాయి.

+ కూరగాయలు ఉడికించిన నీటిలో ప్రొటీన్లు ఉంటాయి కనుక, ఆ నీటిని పారబోయకుండా కూరల్లో

లేదా చారులో వాడటం మంచిది.

+ ఆహార పదార్ధాలను ఇనుప కళాయి లేదా రాగి పాత్రల్లో ఉంచితే పోషక విలువలు నసించడమే

కాదు, ఆహారం పాడయ్యే అవకాశం ఉంది.

+ వండిన కూరలు లేదా ఇతర ఆహారపదార్థాల్ని ఇంకోసారి, మరోసారి వేడిచేయడం మంచిది కాదు.

తినేముందు వండుకోవడం ఉత్తమం.

+ చాలామందికి వంట సోడా ఉపయోగించడం అలవాటు. దాన్ని బాగా తగ్గించడం లేదా అసలే

వాడకపోవడం మంచిది.