Home

»

Tv News

నవ్య స్వామి క్ష‌మించ‌మంటోంది ఎందుకు?  

Jan 6, 2022 10:06AM

బుల్లితెర తార‌ల్లో న‌వ్య స్వామికి ఉన్న పాపులారిటీ వేరే రేంజ్‌. `ఆమె క‌థ‌` సీరియ‌ల్ తో న‌వ్య స్వామి మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది. ఇదే సీరియ‌ల్ ద్వారా న‌వ్య స్వామికి, ర‌వికృష్ణ‌కు మధ్య మంచి స్నేహం ఏర్ప‌డిన విష‌యం తెలిసిదే. ఈ జోడీ మ‌ధ్య కెమిప్ట్రీ బాగా కుద‌ర‌డంతో ఇద్ద‌రిపై చాలా రూమ‌ర్లు వ‌చ్చాయి. ఆ రూమ‌ర్ ల‌కు త‌గ్గ‌ట్టే బ‌య‌ట కూడా వీరిద్ద‌రు బాగా క్లోజ్‌గా క‌నిపించ‌డంతో ఈ జంట బాగుందంటూ ఆడియ‌న్స్ కామెంట్ లు చేశారు.  

Also read: బాల‌య్యా మ‌జాకా.. రానాని ఆడేసుకున్నాడుగా!

బుల్లితెర‌పై మ్యాజిక్ చేసిన ఈ జంట ప్ర‌తీ షోలోలో హాట్ టాపిక్ గా మారింది. అంతే కాకుండా ప్ర‌తీ ఈవెంట్ లోనూ ఇద్ద‌రు క‌లిస్తే ర‌చ్చ మామూలుగా వుండేది కాదు. ఈ ఇద్ద‌రిపై వ‌స్తున్న రూమ‌ర్ ల‌కు ర‌వికృష్ణ ఓ షో సాక్షిగా ఆజ్యం పోశాడు. టీవీ రియాలిటీ షోలోనే న‌వ్య స్వామికి ఏకంగా ముద్దు పెట్టేయ‌డం అప్ప‌ట్లో హాట్ టాపిక్ గా మారింది. `ఆమె క‌థ‌` సీరియ‌ల్ స‌మ‌యంలో న‌వ్య స్వామికి కోవిడ్ సోక‌డం... ఆ త‌రువాత ర‌వికృష్ణ‌కు సోక‌డంతో ఇద్ద‌రూ చాలా ఇబ్బందులు ప‌డ్డారు.

Also read: సిరి, ష‌ణ్ణు తెలిసే చేశారు.. మాన‌స్ బ‌య‌ట‌పెట్టేశాడు!

ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా న‌వ్య స్వామి త‌న అభిమానుల‌ని ఉద్దేశించి సోష‌ల్ మీడియా వేదిక‌గా పెట్టిన పోస్ట్ ఆక‌ట్టుకుంటోంది. ఈ కొత్త ఏడాదిలోకి క్లీన్ మైండ్‌, హార్ట్ తో అడుగుపెడుతున్నాన‌ని చెప్పుకొచ్చింది. గ‌త ఏడాది త‌న‌కు బాగా గ‌డిచింద‌ని చెప్పిన న‌వ్య ఈ విష‌యంలో మీరు నాకు రుణ‌పడి వుంటే దాని గురించి మ‌ర్చిపోండ‌ని, అయితే మీకు నేను అన్యాయం చేశాన‌ని అనిపిస్తే అందుకు నేను మీకు క్ష‌మాప‌ణ‌లు కోరుకుంటున్నాన‌ని తెలిపింది. "అస‌లే ఈ జీవితం చాలా చిన్న‌ది.. పెండింగ్ లో వున్న కోపం, ప‌గ‌లు అద‌న‌పు ఒత్తిడిని వ‌దిలేయండి.. 2022ని ఎంజాయ్ చేయండి" అని త‌న అబిమానుల‌కు తెలిపింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com