Home

»

Latest News

Keneeshaa Francis: జయం రవికి గుడ్ బై చెప్పేసిన కెనీషా.. అతడు ఇక మీవాడే అంటూ ఎమోషనల్ పోస్ట్

May 16, 2026 9:28AM

 


జయం రవి(Jayam Ravi)ఆయన భార్య  ఆర్తి విడాకులకి నేను కారణం కాదంటూ నిన్న సోషల్ మీడియా వేదికగా ప్రముఖ గాయని స్పిరిచువల్ హీలర్ కెనీషా ఫ్రాన్సిస్(Keneeshaa Francis)ఒక ఎమోషనల్ వీడియో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మరో సంచలన పోస్ట్ చేసింది.

తన పోస్ట్ లో 'నేను జయం రవితో బంధాన్ని తెంచుకుంటు చెన్నైని వదిలి వెళ్ళిపోతున్నాను. నేను ఈ కథలోకి ఎంతో ప్రేమతో అడుగుపెట్టాను. కానీ ఇప్పుడు పూర్తి నిశ్శబ్దంతో వెనుతిరుగుతున్నాను. కొన్ని చోట్ల అహంకారం, తప్పుడు ప్రచారాలు ఎక్కువైపోయినప్పుడు మంచికి తావుండదు. ఒక మనిషిని రక్షించే ప్రయత్నంలో చాలా కోల్పోయాను. ప్రదర్శన్లకే ప్రాధాన్యం ఇచ్చే లోకం ఇది.  ఇకపై ఎలాంటి వివరణలు ఇచ్చుకోను. నావి కాని యుద్ధాల్లో కూడా నేను పోరాడలేను. సినిమా ఇండస్ట్రీకి, ప్రజలకు, అతడిని ఇష్టపడేవారికి, ద్వేషించేవారికి నేను చెప్పేది ఒక్కటే.. 'అతడు ఇక పూర్తిగా మీవాడే'. నేను అతడిని పూర్తి ప్రశాంతతతో, ప్రేమతో విడిచిపెట్టేస్తున్నాను

ఆన్‌లైన్ బుల్లీయింగ్, వేధింపులు భరించలేక నేను  చెన్నై నగరాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను. నా కెరీర్ అయిన సంగీతాన్ని, థెరపీని కూడా పక్కన పెడుతున్నాను.   ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు అన్ని సామాజిక మాధ్యమాల ఖాతాలను లాగౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. "ఫెమినిజం.. నువ్వు గెలిచావు, సంతోషం. నువ్వు ఓడిపోయావు" అంటూ కాస్త ఘాటుగానే ఆమె తన పోస్ట్‌ని ముగించారు.

 


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com