.webp)
బిగ్ బాస్ ఇంట్లో పదో వారం ఫ్యామిలీ టైం నడుస్తోంది. ఈ క్రమంలో కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్లు బిగ్ బాస్ ఇంట్లో సందడి చేస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్లో త్రిగుణ్ భార్య, కూతురు వచ్చారు. అలాగే త్రిగుణ్ కూతురు, భార్య కూడా వచ్చారు. త్రిగుణ్ కూతురిని చూసి కంటెస్టెంట్స్ అంతా మురిసిపోయారు. ఆ తర్వాత నీతూ కోసం ఇంట్లోకి నటరాజ్ మాస్టర్ వచ్చాడు. కూతురిని కూడా నటరాజ్ మాస్టర్ తీసుకు వచ్చాడు.
గత కొన్ని రోజులుగా నీతూ ఎమోషనల్ బ్రేక్‌డౌన్ అవ్వడం, నీతూపై వంశీ, త్రిగుణ్ టార్గెట్ చేస్తున్నారు అన్నట్టుగా బయట వీడియోలు వదులుతూ నటరాజ్ మాస్టర్ నానా హంగామా చేశాడు. త్రిగుణ్, వంశీలను తిడుతూ.. నీతూ మాస్టర్ మీద నెగెటివ్ కామెంట్లు చేసే వారిని తిడుతూ నటరాజ్ వీరంగం సృష్టించాడు.బయట ఆ ఇద్దరినీ విమర్శించిన నటరాజ్.. లోపలకు వెళ్లిన తర్వాత మాత్రం కూల్‌గా మారాడు. వంశీ, త్రిగుణ్‌లకు నటరాజ్ మాస్టర్ కౌంటర్ వేస్తాడని అంతా భావించారు. కానీ ఆ ఇద్దరితో నటరాజ్ ఎంతో కూల్‌గా కనిపించాడు. నీ కూతురిని చూసి ఫిదా అయ్యానంటూ వంశీతో నటరాజ్ నవ్వుతూ కనిపించాడు. రెండు సార్లు మీరు వచ్చారు.. మీకు తెలీదా మాస్టర్ అని త్రిగుణ్ కూడా నటరాజ్‌తో నవ్వుతూనే మాట్లాడాడు.
నీతూ గురించి, ఆమె ఆడిన టాస్కుల గురించి నటరాజ్ గొప్పగా చెప్పాడు. అసలు అంత బరువు ఎలా మోశావని నటరాజ్ అంటాడు. నువ్వు ఆ టాస్కుతో ఎక్కడికో వెళ్లిపోయావని నటరాజ్ చెప్తాడు. నీకు చాలా బలం ఉంది మమ్మి.. నాకు తెలుసు.. అందుకే మోయగలిగావని కూతురు అన్న మాటలకు నీతూ మరింతగా మురిసిపోతుంది. ఒకప్పుడు నీతూకి రోడ్డు దాటడం కూడా రాదు.. నేనే రోడ్డు దాటించేవాడ్ని.. కానీ ఇప్పుడు నన్ను చేయి పట్టుకుని నడిపిస్తోందని నటరాజ్ ఎమోషనల్ అయ్యాడు.నీతూ పెళ్లాం అంటే నటరాజ్‌కి డబుల్ అని.. నువ్వు లోపల ఆడు, నేను బయట ఆడతాను.. ఏడవకు అని భార్యకి ధైర్యం చెప్పాడు నటరాజ్. కన్నీటిని బలంగా మార్చుకొని ఆడాలని చెప్పాడు. బయట రెచ్చిపోయిన నటరాజ్ లోపల కూల్‌గా మారడంపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి నీతూ ఈ ధైర్యంతో గేమ్‌లో దూసుకుపోతుందా లేదా అనేది చూడాలి మరి.





.webp)
