.webp)
బిగ్ బాస్ తెలుగు సీజన్-10లో పదో వారం ఫ్యామిలీ వీక్ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి సందడి చేస్తున్నారు. కుటుంబ సభ్యుల రాకతో హౌస్‌లో ఎమోషనల్ వాతావరణం నెలకొంది. అయితే ఈ ఆనందాల మధ్య కంటెస్టెంట్లకు షాక్ తగలబోతున్నట్టు తెలుస్తోంది. ఈ వారం బిగ్ బాస్ హౌస్‌లో డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందనే సమాచారం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం సుధీర్, శ్వేత, నీతూ, ఆర్కే, వర్షిణి డేంజర్ జోన్లో ఉన్నారు. వీరిలో ఇద్దరు కంటెస్టెంట్లు ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఓటింగ్‌లో కూడా ఈ నలుగురు వెనుకబడి ఉండటం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. ముఖ్యంగా నీతూకి నటరాజ్ మాస్టర్ ఎంట్రీతో సపోర్ట్ వచ్చినా, ఓటింగ్‌లో అది పెద్దగా కనిపించడం లేదు. శ్వేత, వర్షిణి కూడా గత కొన్ని వారాలుగా ఓటింగ్‌లోనే కొనసాగుతున్నారు.
మరోవైపు ముఖేష్, త్రిగుణ్ మాత్రం టాప్ స్థానాల్లో కొనసాగుతూ దూసుకుపోతున్నారు. వీరిద్దరికి ప్రేక్షకుల నుంచి మంచి మద్దతు లభిస్తోంది. ఓటింగ్‌లో కూడా ఇద్దరు దాదాపు సమాన ఓట్లతో టాప్-2లో ఉన్నారు. వీరిద్దరిలో ఎవరు ఫస్ట్ అనేది చివరి వరకు ఉత్కంఠగా మారింది. వీరిని దాటి మిగతా వారు టాప్‌లోకి రావడం ప్రస్తుతానికి కష్టంగానే కనిపిస్తోంది. అయితే ఇది కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. బిగ్ బాస్ టీమ్ నుంచి డబుల్ ఎలిమినేషన్‌పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. గత సీజన్లలో ఫ్యామిలీ వీక్ తర్వాత డబుల్ ఎలిమినేషన్ పెట్టిన సందర్భాలు ఉండటంతో ఈసారి కూడా అదే జరుగుతుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. అసలు ఈ వారం ఒకరే వెళ్తారా, ఇద్దరు వెళ్తారా అనేది తెలియాలంటే వీకెండ్లో నాగార్జున ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.




.webp)

