![]() |
![]() |

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత కరుణానిధి రాజకీయ నాయకుడు మాత్రమే కాదు... మంచి రచయిత కూడా! తమిళ సినిమా టర్నింగ్ పాయింట్ గా చెప్పుకొనే 'పరాశక్తి'కి ఆయన స్క్రీన్ ప్లే రైటర్. కరుణానిధి తనయులు రాజాకీయాల్లో కొనసాగుతున్నారు. మనవలు మాత్రం సినిమాల్లోకి వచ్చారు. ఓ మనవడు ఉదయనిధి హీరో కాగా, మరో మనవడు దయానిధి అళగిరి నిర్మాతగా హిట్ సినిమాలు తీశారు. ఇప్పుడు ఆయన దర్శకుడిగా మారుతున్నారు.
ఫేమస్ కావడం కోసం ట్విట్టర్ వేదికను వాడుకున్న ఓ యువకుడి కథతో 'మాస్క్' అని తమిళంలో ఓ సినిమా తెరకెక్కింది. దీనికి దయానిధి అళగిరి దర్శకుడు. ఇటీవలే ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సినిమాను కామెడీగా తీశారట. కరోనా పరిస్థితులనూ సినిమాలో చూపించారట. కుటుంబాలను కరోనా ఎలా దగ్గర చేసిందనేది సినిమాలో ఉంటుందట.
![]() |
![]() |