![]() |
![]() |

'కబీర్ సింగ్' బ్లాక్‌బస్టర్ కావడంతో బాలీవుడ్‌లో పెద్ద స్టార్‌గా మారాడు షాహిద్ కపూర్. అతని నెక్ట్స్ ఫిల్మ్ 'జెర్సీ'పై ఎక్స్‌పెక్టేషన్స్ భారీ లెవల్లో ఉన్నాయి. మరోవైపు 'ద ఫ్యామిలీ మ్యాన్' సిరీస్‌తో డైరెక్టర్లు రాజ్ అండ్ డీకే కూడా బ్లాక్‌బస్టర్ సాధించి ఓటీటీ కింగ్స్ అనిపించుకుంటున్నారు. ఇప్పుడు వారు 'షాహిద్'తో అమెజాన్ ప్రైమ్ ప్లాట్‌ఫామ్ కోసం ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి కూడా నటించనున్నాడు. అటు షాహిద్‌కూ, ఇటు సేతుపతికీ ఇది డిజిటల్ ఎంట్రీ కావడం గమనార్హం.
అయితే దానికి మించిన విశేషం ఇంకోటుంది. ఈ సిరీస్‌లో నటిస్తున్నందుకు షాహిద్ కంటే సేతుపతికే ఎక్కువ రెమ్యూనరేషన్ దక్కుతోందనేది విశ్వసనీయ సమాచారం. షాహిద్‌కు రూ. 40 కోట్లు రెమ్యూనరేషన్ లభిస్తుండగా, సేతుపతికి అనూహ్యంగా రూ. 55 కోట్లు ఇచ్చేందుకు అమెజాన్ ప్రైమ్ యాజమాన్యం అంగీకరించింది! లోకేశ్ కనకరాజ్ సినిమా 'మాస్టర్' రిలీజయ్యాక విజయ్ సేతుపతి ప్యాన్ ఇండియా యాక్టర్ అయిపోయాడు. దేశవ్యాప్తంగా అతనికి వచ్చిన పాపులారిటీతో షాహిద్‌కి మించి సేతుపతికి రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది అమెజాన్ ప్రైమ్.
కాకపోతే, ఈ సిరీస్ మూడు సీజన్ల పాటు కొనసాగుతుందనీ, రెండు, మూడు సీజన్లకు షాహిద్ రెమ్యూనరేషన్ పెరుగుతూ వస్తుందని ఇన్‌సైడర్స్ చెబుతున్నారు. ఆ కండిషన్‌తోనే అమెజాన్‌తో షాహిద్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడంటున్నారు. మరోవైపు విజయ్ సేతుపతి ఇలాంటి కండిషన్ ఏమీ పెట్టలేదు. అంటే అతనికి మూడు సీజన్ల పాటు ఒకే రకమైన రెమ్యూనరేషన్ అందుతుందన్న మాట.
షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి కాంబినేషన్ అనేది సూపర్‌గా వర్కవుట్ అవుతుందనీ, వీక్షకులు ఈ కాంబోని బాగా ఆదరిస్తారనే అభిప్రాయంతో అత్యంత భారీ బడ్జెట్‌ను ఈ సిరీస్ కోసం అమెజాన్ ప్రైమ్ కేటాయించింది.
![]() |
![]() |