![]() |
![]() |

జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయ్యాడు హైపర్ ఆది. షోలో హైపర్‌గా పంచ్‌లు వేసే ఆదికి అనసూయ తోడైతే ఇంకేమైనా వుందా! ఓ రేంజ్‌లో రచ్చ చేయరూ.. సరిగ్గా అదే చేశారు. ఈ షోకి అనసూయ గ్లామర్ ఓ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తోంది. ఈ షోని కామెడీ స్కిట్‌ల కోసం కంటే అనసూయ గ్లామర్ తళుకుల కోసం చూసే వాళ్లే ఎక్కువ. అంతగా తన గ్లామర్‌తో వీక్షకుల్ని కట్టిపడేస్తున్న అనసూయ ఇటీవల హైపర్ ఆదిని కూడా సమ్మోహితుడిని చేసింది.
ఇటీవల రిలీజ్ చేసిన ప్రోమోలో వీరిద్దరూ కలిసి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అనసూయ కనపడగానే అదుపు తప్పి పంచ్‌లు వేసే ఆది రోబో స్కిట్‌తో అదరగొట్టేశాడు. ఇక ఇందులో వశీకర్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి సనా పాత్ర కోసం ఏకంగా అనసూయనే ఎంచుకున్నాడు. ఇంకేముంది.. అనసూయ కూడా ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. "ఎప్పుడూ ల్యాబ్‌లోనే వుంటారా? నేను ఒక్కదాన్నే వున్నానని మరిచిపోయారా? ఒక ముద్దు లేదూ ముచ్చటా లేదు ఛీ ఛీ".. అని అనసూయ అనడమే ఆలస్యం "సరే రా మరి" అంటూ కౌగిలింత కోసం ఎగబడుతూ చేతులు చాపాడు హైపర్ ఆది...
ఆది చేష్టలకు షాక్ తిన్న అనసూయ "ఏయ్ ఆది.. చంపేస్తా. ఒరిజినల్ డైలాగ్ చెప్పు" అంటూ చిలిపి నవ్వుతో అతన్ని డైవర్ట్ చేసింది. అయినా ఆది అదే హైపర్‌తో "నేను ఈ వర్క్ సక్సెస్ అయ్యే వరకు మరో వర్క్ పెట్టుకోదల్చుకోలే"దంటూ అనసూయకు షాకిచ్చాడు. చిలిపి చేష్టలతో గిలిగింతలు పెట్టిన జబర్దస్త్ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్‌లో సందడి చేస్తోంది. రేపటి జబర్దస్త్ షోలో ఈ స్కిట్ ప్రసారం కానున్నది.
![]() |
![]() |