![]() |
![]() |

విజయ్ దేవరకొండ అంటే కొంత కాలం క్రింతం దాకా ఒక అనామక నటుడు. ఇవాళ తను ఒక యూత్ ఐకాన్, ఒక ఫినామినా. 'అర్జున్‌రెడ్డి' సినిమా అతని కెరీర్ దిశను మార్చేసింది. 'గీత గోవిందం' సినిమా అతడిని అన్ని వర్గాల ప్రేక్షకులకూ దగ్గర చేసింది. ఫలితంగా అతని ఫ్యాన్ బేస్ మరింతగా విస్తృతమైంది. సోమవారం అతను తన పుట్టినరోజును కశ్మీర్‌లో తన లేటెస్ట్ సినిమా సెట్స్ మీద జరుపుకున్నాడు. ఈ సందర్భంగా మంగళవారం ఫ్యాన్స్‌ను ఉద్దేశిస్తూ అతను పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది.
నిల్చొని ఒక పక్కకు చూస్తూ ఉన్న విజయ్‌ను కూర్చొని వున్న తల్లి మాధవి అతడిని కౌగలించుకొని పొట్టమీద తల ఆనించి కళ్లు మూసుకొని ఉంటే, అతడు తల్లి తలను రెండు చేతులతో పట్టుకొని ఉన్నాడు. తల్లీకొడుకుల అనుబంధానికి అద్దం పట్టినట్లు ఉన్న ఆ ఫొటోను షేర్ చేసిన విజయ్, "15 సంవత్సరాల వయసులో పుట్టినరోజులు జరుపుకోవడం మానేసిన నన్ను, మీ ప్రేమ వారిపై శ్రద్ధ పెట్టేలా చేసింది. ఎనిమిదేళ్ల క్రితం, నా పేరు, నా ఉనికి మీకు తెలీదు. ఇవాళ మీరు నన్ను ఉత్సాహపరుస్తున్నారు, నాకోసం పోరాడుతున్నారు, నన్ను నమ్ముతున్నారు, మీలో అనేకమంది బేషరతు ప్రేమను ఇస్తున్నారు. మీకు తెలియజేయాలనుకుంటున్నాను, దాన్ని తిరిగిస్తాను. ఒక మార్గం లేదా ఇంకో మార్గం, మీ నుంచి నేను ఫీల్ అవుతున్న ప్రేమ, నా నుంచి మీరు ఫీల్ అవుతున్న ప్రేమ.. ఫుల్ లవ్, మీవాడు విజయ్ దేవరకొండ" అంటూ రాసుకొచ్చాడు.
ప్రస్తుతం అతను శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. అతని జోడీగా సమంత చేస్తోంది. ఇప్పటికే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అతను పూర్తిచేసిన పాన్ ఇండియా మూవీ 'లైగర్' ఆగస్ట్‌లో విడుదలకు రెడీ అవుతోంది.
.webp)
![]() |
![]() |