![]() |
![]() |

నటరత్న నందమూరి తారక రామారావు కెరీర్ లో 1962 క్యాలెండర్ ఇయర్ ఎంతో స్పెషల్. ఎందుకంటే.. ఆ ఏడాది ఎన్టీఆర్ నటించిన చిత్రాల్లో సింహభాగం విజయపథంలో పయనించాయి. నటుడిగా ఎన్టీఆర్ స్థాయిని పెంచాయి. వాటిలో `దక్ష యజ్ఞం` ఒకటి. మైథలాజికల్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో శివుడి పాత్రలో అభినయించి అలరించారు రామారావు. దక్షుడిగా మరో మహానటుడు ఎస్వీ రంగారావు నటించిన ఈ సినిమాలో సతీ దేవిగా ఆకట్టుకున్నారు దేవిక. కన్నాంబ, చిత్తూరు వి. నాగయ్య, రాజనాల, రామకృష్ణ, మిక్కిలినేని, పద్మనాభం, సూరి బాబు, రఘురామయ్య, బాలకృష్ణ, రాజశ్రీ, ఛాయాదేవి, మీనా కుమారి, వాసంతి, అంబికా సుకుమారన్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. కడారు నాగభూషణం స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఆరుద్ర మాటలు, పాటలు అందించారు.
సాలూరి హనుమంతరావు స్వరాలు సమకూర్చిన ఈ చిత్రంలో ``నమో నమో నాదరాజ``, ``జాబిలి ఓహోహో జాబిలి``, ``హర హర మహదేవ``, ``కోయిల తెలుపవటే``, ``ఇది చక్కని లోకం`` తదితర గీతాలన్ని రంజింపజేశాయి. కన్నాంబ సమర్పణలో వరలక్ష్మి పిక్చర్స్ పతాకంపై నిర్మితమైన `దక్ష యజ్ఞం`.. 1962 మే 10న విడుదలై జననీరాజనాలు అందుకుంది. నేటితో ఈ చిత్రం 60 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |