![]() |
![]() |

మహేశ్‌బాబు హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'సర్కారు వారి పాట' ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మొదలైన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రోత్సాహకరంగా ఉన్నాయి. తెలంగాణలో టికెట్ ధరలు పెంచినా కూడా పలు థియేటర్లలో ఓపెనింగ్ షోలు చాలావరకు అప్పుడే హౌస్‌ఫుల్ కాగా, మిగతావి ఫిల్లింగ్ ఫాస్ట్‌గా కనిపిస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌లో టికెట్స్ అమ్ముడవుతున్న తీరు చూస్తుంటే తెలంగాణలో ఈ మూవీ భారీ ఓపెనింగ్స్ సాధించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే ఓవర్సీస్‌లోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది.
తాజా రిపోర్టుల ప్రకారం హైదరాబాద్ సిటీలో అడ్వాన్స్ బుకింగ్ రూపేణా ఇప్పటికే 'సర్కారు వారి పాట'కు రూ. 3 కోట్ల వరకు టికెట్లు సేల్ అయ్యాయి. దీంతో డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉన్నారు. దేశవ్యాప్తంగా చూస్తే రూ. 6 కోట్ల దాకా ఇప్పటికే వసూళ్లు వచ్చాయి. విడుదలకు ఇంకా రెండు రోజుల టైమ్ ఉండటంతో ఈ కలెక్షన్లు భారీ స్థాయిలో ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఒక్క హైదరాబాద్ సిటీలోనే ఫస్ట్ డే రూ. 7 కోట్లకు మించి కలెక్షన్ వస్తుందని అంటున్నారు.
యు.ఎస్. విషయానికి వస్తే ప్రీమియర్స్ రూపేణా ఇప్పటికే 350 వేల డాలర్లకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ప్రీమియర్స్ స్టార్ట్ అయ్యే సమయానికి ఈ లెక్కలు రెట్టింపు కావచ్చని అంచనా వేస్తున్నారు.
కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటించిన 'సర్కారు వారి పాట'లో సముద్రకని విలన్‌గా నటించారు. సుబ్బరాజు, వెన్నెల కిశోర్ మరో రెండు కీలక పాత్రలు చేసిన ఈ సినిమాకి పరశురామ్ పేట్ల దర్శకుడు.
![]() |
![]() |