![]() |
![]() |

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట'. పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. తమన్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మే 12 న విడుదలవుతున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మీడియాతో ముచ్చటించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో వద్దనుకున్న సాంగ్ సూపర్ హిట్ అయిందని, అలాగే ఒక సాంగ్ ని చివరిలో మార్చేశామని చెప్పారు.
ఈమధ్య చాలా సినిమాలకు తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ హైలైట్ అని అంటున్నారు, అలాగే ఈ సినిమాకి కూడా తమన్ ప్రాణం పెట్టి పని చేశాడని మహేష్ తెలిపారు. తమన్ ఈ స్థాయికి చేరుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. "కళావతి ట్యూన్ విన్నప్పుడు ఈ సాంగ్ స్లోగా ఉంది, ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందా లేదా అని డైరెక్టర్ తో సహా అందరం అనుకున్నాం. కానీ తమన్ ఇది పక్కా పెద్ద హిట్ అవుతుందని, మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెప్పాడు. అతని నమ్మకమే నిజమైంది, సాంగ్ కి ట్రెమండ్రస్ రెస్పాన్స్ వచ్చింది" అని మహేష్ చెప్పుకొచ్చారు.
"మ మ మహేశా సాంగ్ కంటే ముందు 'మురారి' అనే సాంగ్ చేశాం. అయితే ఒక మాస్ సాంగ్ ఉంటే బాగుంటుందని 'మ మ మహేశా' సాంగ్ చేశాం. అప్పటికప్పుడు అనుకోని చేసినా చాలా మంచి ఔట్ పుట్ వచ్చింది. మురారి సాంగ్ సినిమాలో ఉండదు కానీ యూట్యూబ్ లో విడుదల చేస్తాం" అని మహేష్ తెలిపారు.
![]() |
![]() |