![]() |
![]() |

విక్టరీ వెంకటేష్ ఇప్పటి వరకు ఇద్దరు మహిళా దర్శకులతో కలిసి పనిచేశారు. రెండు సందర్భాల్లోనూ మంచి విజయాలే వరించాయి. ఆ చిత్రాలే.. ‘దృశ్యం’ (2014), ‘గురు’ (2017). దర్శకురాలిగా మారిన నటి శ్రీప్రియ రూపకల్పనలో తెరకెక్కిన ‘దృశ్యం’ అప్పటికే రెండు వరుస అపజయాలతో ఉన్న వెంకీని మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి తీసుకురాగా.. తెలుగమ్మాయి సుధ కొంగర రూపొందించిన ‘గురు’ కూడా ‘దృశ్యం’ తరువాత సరైన విజయంలేని వెంకీకి సాలిడ్ హిట్‌ని కట్టబెట్టింది. విశేషం ఏమిటంటే.. ఈ రెండు సినిమాలు కూడా రీమేక్ మూవీస్ కావడం! మలయాళ బ్లాక్‌బస్టర్ ‘దృశ్యం’ ఆధారంగా తెలుగు ‘దృశ్యం’ రూపొందితే.. హిందీలో ‘సాలా ఖడూస్’ పేరుతో, తమిళంలో ‘ఇరుది సుట్రు’ పేరుతో తనే స్వయంగా డైరెక్ట్ చేసిన బై-లింగ్వల్ మూవీ ఆధారంగా ‘గురు’ని తెరకెక్కించారు సుధ.
కట్ చేస్తే.. స్వల్ప విరామం అనంతరం మరో మహిళా దర్శకురాలితో వెంకీ సినిమా చేయబోతున్నారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే దర్శకురాలిగా తనేంటో నిరూపించుకున్న ఆ లేడీ డైరెక్టర్ .. వెంకీతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. అంతేకాదు.. ‘దృశ్యం’, ‘గురు’ తరహాలోనే ఇది కూడా రీమేక్ ఫిల్మేనని వినికిడి. ఆ లేడీ డైరెక్టర్ నందినీరెడ్డి అని వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం వెంకీ చేతిలో ‘నారప్ప’ ఉంది. ఆపై తరుణ్ భాస్కర్ కాంబినేషన్ మూవీ, ‘ఎఫ్ 2’ సీక్వెల్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ మూవీ, శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ఓ సినిమా లైన్‌లో ఉన్నాయి. వాటికి అటు ఇటుగా వెంకీ – నందినీరెడ్డి ఫిలిమ్ రూపొందే అవకాశం ఉంది.
![]() |
![]() |