![]() |
![]() |

మెగా మేనల్లుడు సాయి తేజ్‌కి పెళ్లి కాలేదు. బ్యాచిలర్. మంచు మనోజ్ కూడా ప్రజెంట్ సింగిలే. మ్యారేజ్, లవ్ రిలేషన్‌షిప్‌లో లేడు. మరి, వీళ్లిద్దరూ వియ్యంకులు ఎలా అవుతారని అనుకుంటున్నటున్నారా? అయితే, అసలు మేటర్ తెలుసుకోండి.
మనోజ్, సాయి తేజ్ మంచి ఫ్రెండ్స్. పైగా, పెట్ లవర్స్. ఇద్దరూ సెర్బియన్ హస్కీ జాతికి చెందిన కుక్కలను పెంచుకుంటున్నారు. ఒకరి పెట్ డాగ్ పేరు టాంగో, మరొకరి పెట్ డాగ్ పేరు జోయా. మనుషులు స్నేహాన్ని కోరుకున్నట్టు డాగ్స్ కూడా కోరుకుంటాయి కదా! సాధారణంగా క్రికెట్ ఆడేటప్పుడు, హ్యాంగ్ అవుట్ అయ్యేటప్పుడు కలిసే హీరోలు ఇద్దరూ, పెట్ డాగ్స్ కోసం ఓసారి కలిశారు. సాయి తేజ్ పెట్ డాగ్‌తో తన పెట్ డాగ్‌కి పెళ్లి చేస్తానని మనోజ్ అంటున్నారు.
"మంచి అల్లుడిని ఇచ్చినందుకు నా వియ్యంకుడు సాయి తేజ్ కి థాంక్స్. త్వరలో ముహూర్తాలు పెట్టించి శుభలేఖలు వేయిస్తాం" అని మనోజ్ సరదాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదీ సంగతి!
![]() |
![]() |