![]() |
![]() |

మెగా కాంపౌండ్‌కి అచ్చొచ్చిన సంగీత దర్శకుల్లో టాలీవుడ్ రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని ‘సుప్రీమ్’ హీరో సాయి తేజ్ వరకు దాదాపు ఈ కాంపౌండ్ హీరోలందరి కాంబినేషన్స్‌తోనూ డీఎస్పీకి మంచి విజయాలే ఉన్నాయి. మరీ ముఖ్యంగా.. ఈ కాంపౌండ్ హీరోలతో చేసిన ఫస్ట్ కాంబినేషన్ ఫిలిమ్స్ అన్నీ మ్యూజికల్‌గా మెప్పించడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్ వెంచర్స్‌గా నిలిచాయి.
మెగాస్టార్ చిరంజీవితో దేవి శ్రీప్రసాద్ తొలిసారిగా కలిసి పనిచేసిన ‘శంకర్‌దాదా ఎం.బి.బి.ఎస్’ (2004) ఘన విజయం సాధించగా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో మొదటిసారిగా జట్టుకట్టిన ‘జల్సా’ (2008) ఆడియోపరంగా సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాకుండా.. బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ కాంబినేషన్‌లో దేవి శ్రీ ట్యూన్స్ కట్టిన ‘ఆర్య’ (2004) కూడా అటు ఆడియోపరంగానూ, ఇటు సినిమాపరంగానూ అమితాదరణ పొందింది. అలాగే, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ - డీఎస్పీ ఫస్ట్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఎవడు’ కూడా హిట్ సినిమాల లిస్టులో చేరింది. అదే విధంగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కోసం దేవి శ్రీ తొలిసారి బాణీలందించిన ‘ఎఫ్ 2’ (2019).. సాయి తేజ్‌తో ఫస్ట్ కాంబినేషన్‌లో వచ్చిన ‘చిత్రలహరి’(2019) కూడా విజయవంతమైన చిత్రాల జాబితాలో చేరిపోయాయి. దీంతో మెగా కాంపౌండ్ హీరోలతో డీఎస్పీ జట్టుకట్టిన మొదటి సినిమా విజయం సాధిస్తుందనే సెంటిమెంట్ బలపడింది.
ఈ నేపథ్యంలోనే.. ఆ కాంపౌండ్‌లో మరో కథానాయకుడితో దేవి శ్రీప్రసాద్ కలిసి పనిచేస్తుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. చిరంజీవి మేనల్లుడు, సాయి తేజ్ తమ్ముడు అయిన వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ‘ఉప్పెన’కి దేవి శ్రీప్రసాద్‌నే స్వరకర్త. ఆల్రెడీ ‘ఉప్పెన’ నుండి రిలీజైన రెండు పాటలు కూడా సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తున్న నేపథ్యంలో.. ‘ఉప్పెన’పై మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి.. మెగా సెంటిమెంట్‌ని కొనసాగిస్తూ ‘ఉప్పెన’ కూడా విజయం సాధించి.. వైష్ణవ్ తేజ్, డీఎస్పీకి మెమరబుల్ ఫస్ట్ కాంబినేషన్ మూవీగా నిలుస్తుందేమో చూడాలి.
![]() |
![]() |