![]() |
![]() |

రామ్‌గోపాల్ వర్మ ఇప్పుడు నిర్మిస్తున్న ఫిలిమ్స్‌లో క్వాలిటీ గురించీ, కంటెంట్ గురించీ మాట్లాడుకోవడం అనవసరం. సెక్స్, స్కిన్ షో మీద ఆధారపడి ఆయన నాసిరకం వెబ్ మూవీస్ తీస్తున్నాడు. వీటిపై సెన్సారింగ్ లేదు కదా. యూట్యూబ్‌లో ఉచితంగా ఇలాంటి సినిమాలు ఎన్నో మనం చూడొచ్చు. వాటికంటే క్వాలిటీగా వర్మ సినిమాలు ఉండటం లేదు. శృంగారంతో నిండిన పెద్దల సినిమాలెన్నో మనకు యూట్యూబ్‌లో అందుబాటులో ఉండగా ఆర్జీవీ తీస్తున్న సెక్స్ సినిమాల్ని, న్యూడ్ సినిమాల్ని ఎందుకు చూడాలి? అదే మరి.. వర్మలో ఉన్న టాలెంట్. ఆయనలా పబ్లిసిటీ స్కిల్స్ ఉన్న ఫిల్మ్ పర్సనాలిటీ ఇండస్ట్రీలో మనకు మరొకరు కనిపించరు. ఓటీటీ లేదా ఏటీటీ యాప్స్ కోసం తీస్తున్న సినిమాల్ని ఆయన ప్రమోట్ చేస్తున్న తీరు చూసి, ఆకర్షితులవుతన్న వాళ్లు తీరా ఆ సినిమాల్ని చూసి చికాకు పడుతున్నారు.
ఆ పబ్లిసిటీ వల్లే వర్మ తీసిన మొదటి వెబ్ మూవీ 'క్లైమాక్స్' ఆయనకు మంచి డబ్బు తెచ్చి పెట్టింది. ఇప్పుడు రెండో సినిమా 'నేక్డ్' కూడా స్వల్ప కాలంలో భారీ స్థాయి వ్యూస్‌తో పాటు డబ్బునూ సంపాదించి పెడుతోంది. కేవలం 22 నిమిషాల ఈ నగ్న చిత్రంలో స్వీటీ అనే కొత్తమ్మాయి నటించింది. పే వ్యూస్ ద్వారా 24 గంటల్లోనే ఆర్జీవీ, ఆయన టీమ్ రూ. 80 లక్షలు ఆర్జించిందని చెప్పుకుంటున్నారు. దాన్ని తీయడానికి ఆయన ఖర్చుపెట్టింది కేవలం రూ. 2 లక్షలేనంట. దీన్ని బట్టి జనం బలహీనతలే పెట్టుబడిగా ఆయన ఏ రేంజిలో సంపాదిస్తున్నాడో ఊహించుకోవాల్సిందే. ఇంటి యజమానురాలు కావాలనుకుంటూ ఊహల్లో ఉండే ఒక పనిమినిషి కథ 'నేక్డ్'. సినిమాలో మనకు చూపించేదేమంటే.. ఆ నటి తొడలు, ఇతర అవయవాలు, ముప్పాతిక వంతు బహిర్గతమయ్యే ఆమె వక్షస్థలం. ఈ సినిమాలో కథేమిటని మాత్రం అడక్కండి. సాఫ్ట్ పోర్న్ సినిమాల్లో ఏం కథ ఉంటుంది?!
![]() |
![]() |