![]() |
![]() |

కోలీవుడ్ బ్లాక్ బస్టర్ 'అసురన్'కి రీమేక్ గా తెరకెక్కతున్న చిత్రం 'నారప్ప'. విక్టరీ వెంకటేష్ టైటిల్ రోల్ లో నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ని శ్రీకాంత్ అడ్డాల రూపొందిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ తో పాటు వి క్రియేషన్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తోంది. కాగా, ఇప్పటికే సింహభాగం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమాకి సంబంధించిన తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోందని టాక్.
అంతేకాదు.. ప్రస్తుతం క్లైమాక్స్ కి సంబంధించిన దృశ్యాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం. త్వరలోనే మిగిలిన షూటింగ్ ని కూడా పూర్తిచేసి, వేసవి ఆరంభంలో సినిమాని విడుదల చేయాలని 'నారప్ప' టీమ్ భావిస్తోందట.
'నారప్ప'లో వెంకీకి జోడీగా ప్రియమణి నటిస్తుండగా.. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నారు. మరి.. రెండు పార్శ్వాలున్న 'నారప్ప' పాత్రలో వెంకీ ఏ స్థాయిలో అలరిస్తారో తెలియాలంటే మరికొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
'ఎఫ్ 2', 'వెంకీమామ' వంటి విజయవంతమైన చిత్రాల తరువాత వెంకీ నుంచి వస్తున్న సినిమా కావడంతో 'నారప్ప'పై మంచి అంచనాలే ఉన్నాయి.
![]() |
![]() |