Home  »  News  »  జానీ మాస్టర్ హీరోగా సినిమా స్టార్ట‌య్యింది

Updated : Dec 28, 2020

 

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా సోమ‌వారం ఓ చిత్రం ప్రారంభ‌మైంది. ఆయ‌న స‌ర‌స‌న ‘హిప్పీ’ ఫేమ్ దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. మురళిరాజ్ తియ్యాన దర్శకత్వంలో సుజి విజువల్స్ బ్యానర్‌పై కె. వెంకటరమణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోస్‌లో జరిగింది. ఈ ప్రారంభ వేడుకకు ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్, నిర్మాత లగడపాటి శ్రీధర్, ప్రముఖ నటుడు నాగబాబు, యాంకర్ ప్రదీప్ హాజరయ్యారు. తొలి షాట్‌కు వీవీ వినాయక్ క్లాప్ కొట్టి, డైరెక్ట్ చేశారు. నటుడు నాగబాబు కెమెరా స్విచ్చాన్ చేశారు. 

లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ, ‘‘జానీ మాస్టర్ డెఫినెట్‌గా వండర్‌పుల్ యాక్టర్ అవుతారు. ఎంటర్‌టైనింగ్ హీరోగా అవుతారనే నమ్మకం బలంగా కలిగింది. ఫస్ట్ లుక్ పోస్టర్లు చూస్తే చాలా ఇన్నోవేటివ్‌గా ఉన్నాయి. వాటితో దర్శకుడు అభిరుచి ఏమిటో తెలిసింది. త్వరలోనే జానీ మాస్టర్‌తో 'స్టైల్ 2' సినిమా ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నాం. చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఆయనతో మున్ముందు అసోసియేట్ కావాలనుకొంటున్నాను" అని అన్నారు. 

యాంకర్ ప్రదీప్ మాట్లాడుతూ, ‘‘మా జానీ మాస్టర్ హీరోగా పరిచయం అవుతున్నారంటే మాకు చాలా ఆనందం. కెమెరా ముందు ఎంత యాక్టివ్‌గా ఉంటారో.. కెమెరా వెనుక కూడా అంతే ఎనర్జీతో రౌండ్ ది క్లాక్ ఉంటారు.  మాకు డార్లింగ్.. హీరోగా ఆయన మొదటి ప్రయత్నం ఇది. మా మాస్టర్ హీరోగా సక్సెస్‌ఫుల్ కావాలని కోరుకొంటున్నాను. ఇప్పటి వరకు తెర మీద డ్యాన్స్ మాత్రమే చూశాం. ఇక తెర మీద ఆయన యాక్టింగ్, డైలాగ్ డెలివరీ ఎప్పుడెప్పుడూ చూడాలా అని ఎదురు చూస్తున్నాం. ఆయన కొరియోగ్రాఫి చేస్తే ఎన్ని కోట్ల వ్యూస్ వస్తాయో ఆయన సినిమాకు అన్ని కోట్ల కలెక్షన్లు రావాలని కోరుకొంటున్నాను’’ అన్నారు. 

హీరోయిన్ దిగంగన సూర్యవంశీ మాట్లాడుతూ.. "జానీ మాస్టర్‌తో నటించడం చాలా ఎక్సైటింగ్‌గా ఉంది.  ఈ సినిమా స్క్రిప్ట్ బ్రిలియెంట్" అన్నారు. 

హీరో జానీ మాస్టర్ మాట్లాడుతూ, ‘‘నాకు కొరియోగ్రఫి అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కూడా శివకార్తికేయన్‌ నటించే సినిమాలోని పాటకు కొరియోగ్రఫీ చేస్తున్నాను. ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణాలు చెప్పలేను. నాకు కొరియోగ్రఫి, డైరెక్షన్ అంటే ఇష్టం. దర్శకుడికి అదే విషయాన్ని చెప్పాను. యాక్టింగ్ అంతగా ఇష్టం లేదని చెప్పాను. కానీ దర్శకుడు చెప్పిన కథ విన్న తర్వాత తప్పకుండా చేయాలని డిసైడ్ అయ్యాను. నాకు షూటింగ్ లేనప్పుడు టీవీ షూటింగ్‌లకు వెళ్తాను. ఇప్పుడు కొరియోగ్రఫీ విషయంలో విరామం దొరికితే సినిమా షూటింగుకు వెళ్తాను. నీవు చేయకపోతే సినిమా చేయనని నిర్మాత వెంకటరమణ చెప్పడంతో మరింత కనెక్ట్ అయ్యాను. నా పక్కన నటించడానికి ముందుకొచ్చిన దిగంగనకు థ్యాంక్స్’’ అని అన్నారు.

నిర్మాత వెంకటరమణ మాట్లాడుతూ, ‘‘జానీ మాస్టర్ గారి కోరియోగ్రఫీ మాకు చాలా ఇష్టం. ఆయనతో ఎప్పుటికైనా సినిమా చేయాలి అనుకున్నాం. అది ఈ విధంగా కుదిరింది. కథని నమ్మి ఆయన దగ్గరికి వెళ్ళాం, ఆయనకి మా డైరెక్టర్ మురళి చెప్పిన కథ నచ్చడంతో మెచ్చుకుని సినిమా చేస్తా అన్నారు. మంచి టీమ్ కూడా కుదిరింది" అని అన్నారు. 

నాగబాబు గారు మాట్లాడుతూ, "జానీ మాస్టర్ మా అందరికీ, ముఖ్యంగా మా మెగా ఫామిలీ కి చాలా ఆత్మీయుడు. చాలా టాలెంటెడ్ కొరియోగ్రాఫర్. అద్భుతమైన దర్శకత్వ ప్రతిభ ఉన్న వ్యక్తి. తను వచ్చి హీరోగా సినిమా చేస్తున్నాను అని చెప్పగానే సరైన నిర్ణయమే తీసుకున్నాడు అనిపించింది. ఎందుకంటే మన కళ్ళ ముందే డాన్స్ మాస్టర్లు లారెన్స్, ప్రభుదేవాలు హీరోలుగా మారి మంచి సక్సెస్ ని కూడా అందుకున్నారు. అద్భుతమైన డాన్స్ ప్రతిభ, అలాగే అందం ఉన్నవాడు జానీ. ఇలాంటి మంచి కథ తో హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటాడని నేను నమ్ముతున్నాను. కానీ ఎంత పెద్ద హీరో అయినా, ఎంత మంచి సక్సెస్ వచ్చినా కొరియోగ్రఫీ మాత్రం వదలద్దని మాత్రం జానీకి నా వ్యక్తిగత సలహా" అని చెప్పారు. 

సాంకేతిక బృందం:
నిర్మాత: వెంకటరమణ కె.
దర్శకత్వం: మురళిరాజ్ తియ్యాన 
సినిమాటోగ్రాఫర్: శ్యామ్ కే నాయుడు
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు
సంగీత దర్శకుడు: రధన్
ఆర్ట్: డైరెక్ట‌ర్‌: పీవీ రాజు
డైలాగ్స్: యశోద గౌరీశంకర్
డిజిటల్ పబ్లిసిటి: సుధీర్ తెలప్రోలు
బ్యానర్: సుజి విజువల్స్






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.