![]() |
![]() |

తెలుగునాట చాన్నాళ్ళ తరువాత తెరకెక్కుతున్న సిసలైన మల్టిస్టారర్ 'ఆర్ఆర్ఆర్'. పిరియడ్ డ్రామాగా రూపొందుతున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ లో యంగ్ టైగర్ జూనియర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకులుగా నటిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.
ఇదిలా ఉంటే.. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న 'ఆర్ఆర్ఆర్'లో అజయ్ దేవగణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ఇందులో ఫ్రీడమ్ ఫైటర్ గా అజయ్ పాత్ర ఉంటుందని.. ఇంటర్వెల్ టైమ్ లో ఎంటర్ అయి కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలపై ప్రభావం చూపించే ఈ పాత్ర.. ప్రీ క్లైమాక్స్ లో చనిపోతుందని సమాచారం. శక్తిమంతంగా సాగే ఈ పాత్ర సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని టాక్. మరి.. ఈ కథనాల్లో నిజానిజాలెంతో తెలియాలంటే వచ్చే ఏడాది ద్వితీయార్ధం వరకు వేచిచూడాల్సిందే.
స్వరవాణి కీరవాణి బాణీలు అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
![]() |
![]() |