![]() |
![]() |

బిగ్ బాస్ 14 కంటెస్టెంట్ పవిత్ర పూనియా తండ్రి తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ విషయం తెలియగానే ముంబైలో 'బాల్‌వీర్ రిటర్న్స్' సీరియల్ షూటింగ్‌లో ఉన్న పవిత్ర, ఉన్నపళాన షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని ఢిల్లీకి పరుగులు పెట్టారు. ఢిల్లీలోని ఓ హాస్పిటల్‌లో పవిత్ర తండ్రికి చికిత్స అందిస్తున్నారు. ఉన్నపళ్లాన కళ్లు తిరిగి పడిపోవడంతోటే ఆయనకు తీవ్ర గాయాలయ్యాయని సమాచారం.
"అవును. తన తండ్రికి గాయాలైన కబురు తెలియగానే, ఆందోళన చెందిన పవిత్ర వెంటనే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆమె హాస్పిటల్‌కు వెళ్లి, డాక్టర్లను కలిసిన తర్వాతే ఆయన ఆరోగ్య స్థితిపై క్లారిటీ వస్తుంది. ఆయన త్వరగా రికవరీ కావాలని ప్రార్థించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం" అని పవిత్ర పీఆర్వో తెలిపారు.
'బాల్‌వీర్ రిటర్న్స్' షోలో పవిత్ర దుష్ట రాణి టిమ్నాసా పాత్రను ఆమె పోషిస్తున్నారు. ఇటీవలే ఈ సీరియల్ షూటింగ్‌లోకి వచ్చిన ఆమె, తండ్రిని వెంటనే చూడాలనే ఆదుర్దాతో సెట్స్‌ను వదిలి ఢిల్లీకి వెళ్లారు. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్ బాస్ 14లో కంటెస్టెంట్‌గా పాల్గొని, తన గ్లామర్‌తో అలరిస్తూ వచ్చిన ఆమె ఎలిమినేషన్‌కు గురయ్యారు. ఆ షోలో తోటి కంటెస్టెంట్ ఐజాజ్ ఖాన్‌తో ఆమె రొమాన్స్ టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది.
![]() |
![]() |