![]() |
![]() |

మాస్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న కింగ్ నాగార్జున చిత్రాల్లో `సోగ్గాడే చిన్ని నాయనా` ఒకటి. కళ్యాణ్ కృష్ణకి దర్శకుడిగా తొలి అవకాశమిస్తూ.. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జునే ఈ సినిమాని స్వయంగా నిర్మించారు. అంతేకాదు.. తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. 2016 సంక్రాంతికి విడుదలైన `సోగ్గాడే చిన్ని నాయనా`.. నాగార్జున కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సీక్వెల్ గా `బంగార్రాజు` పేరుతో మరో చిత్రం రాబోతున్నట్లు చాన్నాళ్ళ క్రితమే వెల్లడించారు నాగ్. వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న ఈ ప్రాజెక్ట్.. ఎట్టకేలకు పట్టాలెక్కనుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగ్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించడం విశేషం. జూలై రెండో వారం నుంచి `బంగార్రాజు`ని చిత్రీకరణకు తీసుకెళ్ళే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. నవంబర్ నాటికి షూటింగ్ కంప్లీట్ అయ్యే అవకాశముందని టాక్. అలాగే `సోగ్గాడే..`లో `బంగార్రాజు` పాత్రకి జోడీగా నటించిన రమ్యకృష్ణ.. ఈ సీక్వెల్ లోనూ కొనసాగనున్నారు. కళ్యాణ్ కృష్ణ నే దర్శకుడిగా కంటిన్యూ కానున్నారు. మరి.. `బంగార్రాజు` రూపంలో నాగ్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ చేరుతుందేమో చూడాలి.
![]() |
![]() |