![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన కనువిందు చేసిన నాయికల్లో శ్రుతి హాసన్ ఒకరు. గబ్బర్ సింగ్ కోసం తొలిసారి జట్టుకట్టి హిట్టుకొట్టిన ఈ జంట.. ఆపై కాటమరాయుడులో సందడి చేశారు. ఈ వేసవిలో విడుదలకు సిద్ధమైన వకీల్ సాబ్ లోనూ ఈ ఇద్దరూ జోడీగా ఎంటర్ టైన్ చేయనున్నారు. పవన్, శ్రుతి కలసి నటించిన ప్రతీ సందర్భంలోనూ రీమేక్ లతోనే అలరిస్తున్నారని గతంలో ప్రస్తావించాం.
మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కూడా ఈ కాంబోకి ఉంది. అదేమిటంటే.. పవన్, శ్రుతి పెయిర్ అప్ అయిన ప్రతీసారి వేసవిలోనే సందడి చేస్తున్నారు. వీరిద్దరి ఫస్ట్ కాంబో మూవీ గబ్బర్ సింగ్ 2012 వేసవి(మే 11)లో రిలీజైతే.. సెకండ్ జాయింట్ వెంచర్ కాటమరాయుడు 2017 వేసవి (మార్చి 24)లో విడుదలైంది. కట్ చేస్తే.. ఇప్పుడు వీరిద్దరు జతగా నటించిన మూడో చిత్రం వకీల్ సాబ్ 2021 వేసవి (ఏప్రిల్ 9)లో వినోదాలు పంచనుంది.
మొత్తమ్మీద.. పవన్ కళ్యాణ్, శ్రుతి హాసన్ జంట అటు రీమేక్ లతోనూ, ఇటు సమ్మర్ సీజన్ లోనూ ఎంటర్ టైన్ చేస్తూ భలేగా వార్తల్లో నిలుస్తోంది.
![]() |
![]() |