![]() |
![]() |
తొలి చిత్రం ‘అర్జున్‌రెడ్డి’తోనే టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సందీప్‌రెడ్డి వంగా ఆ చిత్రాన్ని ‘కబీర్‌సింగ్’ పేరుతో హిందీలో రీమేక్ చేసి బాలీవుడ్‌లోనూ డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. రణబీర్ కపూర్ హీరోగా తన మూడో చిత్రం ‘యానిమల్’తో దేశంలోని టాప్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరిపోయారు. డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా దాదాపు రూ.850 కోట్లు కలెక్ట్ చేసి ఇప్పటికీ థియేటర్స్‌లో సందడి చేస్తూనే ఉంది. ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ చూసి బాలీవుడ్ సినీ వర్గాలు షాక్ అయ్యాయి. రణబీర్ కపూర్ కెరీర్‌లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా ‘యానిమల్’ రికార్డు క్రియేట్ చేసింది. కేవలం మూడు సినిమాలతోనే సందీప్‌రెడ్డి టాప్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరడం వెనుక అతని కుటుంబం చేసిన గొప్ప త్యాగం ఉంది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన సందీప్‌కి డైరెక్టర్‌గా మారేందుకు అవకాశాలు రాలేదు. డైరెక్టర్‌గా తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకునేందుకు ఎంతో కష్టపడ్డాడు. అయితే ఒక సందర్భంలో అతను మోసపోయాడు. ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు సినిమా కోసం ఏ కుటుంబం చేయని త్యాగం చేసింది. తరతరాలుగా వారి కుటుంబం కోసమే అనుకున్న 36 ఎకరాల భూమిని అమ్మేశారు.
ఈ విషయాన్ని ‘యానిమల్’ చిత్రంలో నటించిన సిద్ధాంత్ కర్ణిక్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడిరచాడు. ‘యానిమల్’ సినిమా షూటింగ్ సమయంలో సందీప్‌కి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. అతని సోదరుడు ప్రణయ్ ఈ విషయాలను నాతో పంచుకున్నాడు. డైరెక్టర్‌గా అవకాశాలు రాకపోవడంతో తనే సొంతంగా సినిమా నిర్మించాలనుకున్నాడు. అందుకోసం స్నేహితులతో కలిసి ప్రొడక్షన్ కంపెనీని స్టార్ట్ చేశాడు. అయితే చివరి క్షణంలో అతని స్నేహితులు హ్యాండ్ ఇవ్వడంతో అతను చెయ్యాలనుకున్న సినిమా ప్రారంభ దశలోనే ఆగిపోయే పరిస్థితి వచ్చింది. విషయం తెలుసుకున్న సందీప్ కుటుంబ సభ్యులు అతన్ని ముందుకు నడిపించేందుకు ఊళ్ళో ఉన్న 36 ఎకరాల మామిడితోటను అమ్మేశారు. ఆ డబ్బుతోనే ‘అర్జున్‌రెడ్డి’ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు సందీప్. ఇది విని నేను చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే సినిమా కోసం ఏ కుటుంబం ఇలాంటి సాహసం చేయదు’ అంటూ సందీప్ డైరెక్టర్‌గా నిలదొక్కుకోవడం వెనుక జరిగిన విషయాలను పంచుకున్నాడు సిద్ధాంత్ కర్నిక్. అయితే ‘అర్జున్‌రెడ్డి’ సినిమా నిర్మించడం వెనుక ఎన్ని కష్టాలు పడిరదీ గతంలో సందీప్ కూడా తెలిపాడు. అయితే ఇప్పుడు యానిమల్ సాధించిన విజయం, టాప్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న క్రమంలో మరోసారి అర్జున్‌రెడ్డి ప్రస్తావన వచ్చింది.
![]() |
![]() |