![]() |
![]() |

ఈ రోజు జస్ట్ ఒక సినిమా టీజర్ రిలీజ్ అయింది. ఇక అంతే ఆ సినిమా గురించి ఇప్పుడు అందరు మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకోవడమే కాదు సినిమా రిలీజ్ ఎప్పుడు ఉంటుందా అని కూడా అనుకుంటున్నారు. టీజర్ ద్వారా అంతలా సంచలనం సృష్టించిన మూవీ డెకాయిట్.
విభిన్న చిత్రాల కధానాయకుడు అడవి శేష్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా డియోని దాస్ దర్శత్వంలో తెరకెక్కుతున్న మూవీ డెకాయిట్..నిశ్శబ్దంగా ఉన్న ఒక ప్లేస్ లో కొద్దిసేపటి క్రితమే అక్కడ ఒక నరమేధం జరిగిందనే గుర్తుగా కొంత మంది పోలీసులు చనిపోయి ఉన్నారు. అక్కడే ఒక ప్లేస్ లో ఉన్న అడవి శేషు అదే ప్లేస్ లో చేతిలో తుపాకీ పట్టుకొని ఎవరినో చంపాలని చూస్తున్న శృతి హాసన్ కి ఫోన్ చేసి జూలియట్ ఎన్నేళ్ళయ్యింది మనం కలిసి అని అంటాడు. అప్పుడు శృతి హాసన్ కలిసి కాదు విడిపోయి అని అంటుంది.అందుకు అడవి శేషు అసలు నేను నీకు గుర్తున్నానా అని కూడా అంటాడు. నీ మోసం నేను మర్చిపోలేదు అని శృతి అంటుంటే అయితే ఇప్పుడు నేను ఎక్స్ నా సరే నేను వెధవనా, దొంగనా, విలన్ నా అని అంటాడు. ఆతర్వాత ఇద్దరు కలిసి ఒకరినొకరు గన్స్ గురిపెట్టుకుంటారు. ఇలా టీజర్ ఉంది కొంచం సేపే అయినా కూడా సినిమా మీద ఆసక్తిని రేకెత్తిస్తుంది.

అలాగే అడవి శేషు తమ మెడ వెనుక గాడ్ ఈజ్ డెడ్ అనే పచ్చబొట్టుని కూడా రాయించుకోవడం చూస్తుంటే రేపు సినిమా పెద్ద విజయం సాధించడం ఖాయమని పక్కాగా అర్ధం అవుతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ,ఎస్ ఎస్ క్రియేషన్స్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ, ఏషియన్ సునీల్ లు ఈ డెకాయిట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
![]() |
![]() |