![]() |
![]() |

మాస్ మహారాజా రవితేజ హీరోగా 'సూర్య వర్సెస్ సూర్య' ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఈగల్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.
'ఈగల్' ట్రైలర్ బుధవారం సాయంత్రం విడుదలైంది. రెండు నిమిషాల పది సెకన్ల నిడివి గల ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. "తుపాకీ నుంచి వచ్చే బుల్లెట్ ఆగేదెప్పుడో తెలుసా?.. అది పట్టుకున్న వాడిని తాకినప్పుడు" అంటూ అనుపమ పరమేశ్వరన్ తో నవదీప్ చెప్పే మాటతో ట్రైలర్ ప్రారంభమైంది. "విషం మింగుతాను, విశ్వం తిరుగుతాను, ఊపిరి ఆపుతాను, కాపలా అవుతాను.. విధ్వంసం నేను, విధ్వంసాన్ని ఆపే వినాశనం నేను" అంటూ రవితేజ చెప్పే డైలాగ్ తో, దానికి తగ్గ విజువల్స్ తో ట్రైలర్ నడిచింది. ఇందులో రవితేజ రెండు కోణాల్లో కనిపిస్తున్నాడు. ఒక గెటప్ లో స్టైలిష్ గా కనిపిస్తుండగా, మరో గెటప్ లో గుబురు గడ్డం, మీసకట్టుతో మాస్ గా కనిపిస్తున్నాడు. "ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు, ఆయుధంతో విధ్వంసాన్ని ఆపేవాడు దేవుడు. ఈ దేవుడు మంచోడు కాదు, మొండోడు" అంటూ రవితేజ ట్రైలర్ లో విధ్వంసం చూపించాడు. అలాగే ట్రైలర్ లో రవితేజ పాత్రను ప్రత్తి పండించే రైతు అన్నట్టుగా చూపించారు. మరి రైతు ఇంత విధ్వంసం ఎందుకు సృష్టించాడు అనేది ఆసక్తికరంగా మారింది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెప్పించాయి.
మాములుగా రవితేజ సినిమాల్లో వినోదం ఆశిస్తారు ప్రేక్షకులు. కానీ ఈగల్ కంప్లీట్ సీరియస్ ఫిల్మ్ లా ఉంది. సంక్రాంతి కానుకగా 2024, జనవరి 13న విడుదల కానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మాస్ రాజాకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
![]() |
![]() |