![]() |
![]() |

మాస్ మహారాజా రవితేజ సినిమా అంటే ప్రేక్షుకులు వినోదం ఆశిస్తారు. ఏ మాత్రం ఎంటర్టైన్మెంట్ ఉన్నా చాలు సినిమాని హిట్ చేస్తారు. దానికి ఉదాహరణగా గతేడాది వచ్చిన 'ధమకా'ను చెప్పుకోవచ్చు. కంటెంట్ యావరేజ్ అయినప్పటికీ సాంగ్స్, రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్ కారణంగా ఆ సినిమా పెద్ద హిట్ అయింది. ఇదే కాదు రవితేజ కెరీర్ లో వచ్చిన హిట్ సినిమాలను గమనిస్తే.. మెజారిటీ సినిమాల్లో వినోదానికి పెద్ద పీట ఉంటుంది. కానీ మాస్ రాజా ఎందుకనో ఆ విషయాన్ని మరిచి చేతులు కాల్చుకుంటున్నాడు.
ఎంటర్టైన్మెంట్ ని పక్కన పెట్టి ప్రయోగం చేసిన ప్రతిసారీ రవితేజకు పరాజయమే ఎదురైంది. ఈ ఏడాది వచ్చిన సీరియస్ సినిమాలు 'రావణాసుర', 'టైగర్ నాగేశ్వరరావు' మాస్ రాజాకు షాకిచ్చాయి. గత 20 ఏళ్లలో ఆయనకు ఇలాంటి షాక్ లు ఎన్నో తగిలాయి. అయినప్పటికీ రవితేజ తగ్గేదేలే అంటున్నాడు. త్వరలో ఆయన మరో సీరియస్ ఫిల్మ్ తో రాబోతున్నాడు. అదే 'ఈగల్'. ఈ యాక్షన్ థ్రిల్లర్ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకులకు ముందుకు రానుంది. అసలే రవితేజ మార్క్ సినిమా కాదు, దానికి తోడు సంక్రాంతి సమయంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చూడటానికి ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. మరి ఈ అడ్డంకులను దాటుకొని ఈగల్ చిత్రం రవితేజకు విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.
![]() |
![]() |