![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం `ఆచార్య` ఏప్రిల్ 29న విడుదల కాబోతోంది. మరోవైపు `గాడ్ ఫాదర్`, `మెగా 154`, `భోళా శంకర్` సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు చిరు. వీటిలో `గాడ్ ఫాదర్`, `భోళా శంకర్` ఇదే ఏడాది జనం ముందుకు వచ్చే అవకాశముందంటున్నారు.
ఇదిలా ఉంటే.. `ఛలో`, `భీష్మ` చిత్రాల దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్ లోనూ మెగాస్టార్ ఓ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. `మెగా 156` అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను జూన్ లో జరిపి.. జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ బాట పట్టనున్నారని సమాచారం. అంతేకాదు.. 2023 వేసవిలో రిలీజ్ చేయాలన్న ఆలోచనతో యూనిట్ ఉందని బజ్. త్వరలోనే `మెగా 156`కి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశముది. మరి.. చిరంజీవి, వెంకీ కుడుముల ఫస్ట్ కాంబినేషన్ లో రానున్న ఈ సినిమా బాక్సాఫీస్ ముంగిట ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. అలాగే `ఛలో`, `భీష్మ` వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అనంతరం వస్తున్న ఈ చిత్రంతో వెంకీ కుడుమల హ్యాట్రిక్ అందుకుంటాడా? లేదా? అన్నది కూడా ఆసక్తికరమే.
![]() |
![]() |