![]() |
![]() |

సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న ఈతరం దర్శకుల్లో మారుతి ఒకరు. ఇప్పటివరకు మారుతి తొమ్మిది చిత్రాలను తెరకెక్కించగా.. వాటిలో ఆరు సినిమాలు విజయపథంలో పయనించాయి. అలాంటి మారుతికి మార్చి 23 ఎంతో స్పెషల్. ఎందుకంటే.. సరిగ్గా పదేళ్ళ క్రితం ఇదే రోజున ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం `ఈ రోజుల్లో` ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పరిమిత బడ్జెట్ లో నూతన తారలతో మారుతి రూపొందించిన `ఈ రోజుల్లో`.. పెట్టుబడికి ఎన్నో రెట్లు లాభాలు చూసి అప్పట్లో టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయింది.
శ్రీ, రేష్మ రాథోర్ హీరోహీరోయిన్లుగా పరిచయమైన ఈ సినిమాలో సాయికుమార్ పంపన, ఎమ్మెస్ నారాయణ, భార్గవి, అంబటి శ్రీనివాస్, మధుమణి, రాగిణి ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వగా ఆనంది ఓ ప్రత్యేక గీతంలోనూ, తమ్మారెడ్డి భరద్వాజ ఓ ప్రత్యేక పాత్రలోనూ కనిపించారు.
Also Read: విజయదశమి బరిలో `హరిహర వీరమల్లు`!?
జేబీ సంగీతమందించిన ఈ చిత్రంలోని ``రింగ్ ట్రింగ్`` పాట యువతరాన్ని విశేషంగా అలరించగా.. ``నిన్న మొన్న``, ``ఏదో ఏదో``, ``సెల్ సాంగ్``, ``కనురెప్పలు`` గీతాలు కూడా ఆకట్టుకున్నాయి. గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై నిర్మితమైన `ఈ రోజుల్లో`.. కన్నడంలో `ప్రీతి ప్రేమ` (2017) పేరుతో రీమేక్ అయింది. 2012 మార్చి 23న విడుదలై ఘనవిజయం సాధించిన `ఈ రోజుల్లో`.. నేటితో పదేళ్ళు పూర్తిచేసుకుంది. అంటే.. దర్శకుడిగా మారుతి ప్రస్థానానికి కూడా పదేళ్ళు పూర్తయ్యాయన్నమాట.
![]() |
![]() |