![]() |
![]() |

హీరోయిన్లు సినిమాలు చేస్తున్నప్పుడు ఇంటిలో కుటుంబ సభ్యుల మధ్య కంటే సెట్ లో యూనిట్ సభ్యుల మధ్య ఎక్కువ ఉంటారు. అందుకని, పండగలు వచ్చినప్పుడు ఇళ్లకు వెళ్ళిపోతారు. కానీ, ఈ ఏడాది కొంతమంది షూటింగులకు సెలవులు వచ్చినప్పటికీ ఇళ్లకు వెళ్లడం లేదు. దీనికి కరోనా ముఖ్య కారణం అని చెప్పుకోవాలి. అసలు, ఈ ఏడాది ఇళ్లకు వెళ్లని హీరోయిన్లు ఎవరో ఓ లుక్కేయండి.
రాశి ఖన్నా

రాశి ఖన్నాది ఢిల్లీ. కానీ, హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కుని సెటిల్ అయింది. ఈ ఏడాది దీపావళిని ఆమె అటు ఢిల్లీ లేదా ఇటు హైదరాబాద్ లో జరుపుకోవడం లేదు. చెన్నైలో ఓ తమిళ సినిమా యూనిట్ సభ్యులతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీనికి కరోనాయే కారణం. రాశి తల్లితండ్రులకు వయసు ఎక్కువే. షూటింగుకు సెలవు పెట్టి తల్లితండ్రుల దగ్గరకు వెళ్లే అవకాశం ఉన్నప్పటికి... వాళ్ళ వయసు దృష్ట్యా కరోనా సమయంలో ప్రయాణం చేయడం శ్రేయస్కరం కాదని చెన్నైలో ఉండిపోయారు.
రష్మికా మందన్నా

రష్మికాది కర్ణాటకలోని కూర్గ్ దగ్గరలోని కొడగు. బెంగళూరులో కూడా ఆమె ఫ్యామిలీకి ఇల్లు ఉంది. ఈ దీపావళికి ఆమె కర్ణాటక వెళ్లడం లేదు. హైదరాబాద్ లో ఉంటున్నారు. పటాసులు, టపాకాయలు కాల్చడానికి తాను వ్యతిరేకం అని ఆమె చెప్పారు.
రకుల్ ప్రీత్ సింగ్

హైదరాబాద్ లో ఇల్లు కొనుకున్న మరో స్టార్ హీరోయిన్, ఢిల్లీకి చెందిన అమ్మాయి రకుల్ ప్రీత్ సింగ్. ఈ దీపావళికి ఆమె ఢిల్లీ వెళ్లడం లేదు. రెండు మూడు రోజుల క్రితం వరకూ హైదరాబాద్ లో ఆమె షూటింగ్ చేశారు. అందుకని, ఇక్కడ ఉండిపోయారు. తల్లితండ్రులను హైదరాబాద్ తీసుకొచ్చారట. మామూలుగా రకుల్ తమ్ముడు హైదరాబాద్ లో ఉంటారు. సో... ఫ్యామిలీ అంతా భాగ్య నగరంలో ఉన్నారన్నమాట.
ప్రణీతా సుభాష్

బాపుబొమ్మ, మరో బెంగళూరు భామ ప్రణీతా సుభాష్ సైతం ఈ ఏడాది దీపావళిని ఇంటిలో సెలబ్రేట్ చేసుకోవడం లేదు. ఇటీవల ఆమె మాల్దీవులు వెళ్లారు. అక్కడ సెలబ్రేట్ చేసుకోనున్నారు.
దిశా పటాని

వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'లోఫర్'లో హీరోయిన్ దిశా పటాని గుర్తుంది కదా! ఆమె కూడా ప్రస్తుతం మాల్దీవుల్లో ఉంది. బాయ్ ఫ్రెండ్, బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ తో కలిసి టూర్ వేసింది. మరికొంతమంది హీరోయిన్లు సైతం దీపావళికి ఇంటికి వెళ్లకుండా టూర్లలో ఉన్నారని టాక్.
![]() |
![]() |