![]() |
![]() |

'పెళ్ళిచూపులు' (2016)తో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయమయ్యాడు తరుణ్ భాస్కర్. మొదటి ప్రయత్నంలోనే అటు ప్రేక్షకులను, ఇటు విమర్శకులను మెప్పించడమే కాకుండా పలు పురస్కారాలు కూడా దక్కించుకున్నాడు. అయితే, ఆ తరువాత వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది?' చిత్రం మాత్రం ఓ వర్గం ప్రేక్షకులను మాత్రమే మురిపించింది.
ఈ నేపథ్యంలో.. విక్టరీ వెంకటేష్ తో తరుణ్ భాస్కర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుందని ఆ మధ్య కథనాలు వచ్చాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా వాయిదా పడిందని సమాచారం. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. యువ సామ్రాట్ నాగచైతన్య కాంబినేషన్ లో తరుణ్ థర్డ్ డైరెక్టోరియల్ ఉంటుందని తెలిసింది. ఇప్పటికే ఈ మేరకు చైతూ, తరుణ్ మధ్య చర్చలు జరిగాయని బజ్. త్వరలోనే నాగచైతన్య, తరుణ్ భాస్కర్ కాంబినేషన్ మూవీకి సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.
మరి.. చైతూ కాంబినేషన్ మూవీతో తరుణ్ భాస్కర్ మళ్ళీ సాలిడ్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.
![]() |
![]() |