![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్లు పెద్ద సెలబ్రేటీలు కాదన్న విమర్శ షో ప్రారంభం నుంచే వినిపిస్తోంది. కరోనా సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న బిగ్ బాస్ నిర్వహకులు బిగ్ హౌస్ లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్లను తప్పనిసరిగా క్వారంటైన్ లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. దాంతో చాలామంది సెలబ్రిటీలు మూడునెలలు హౌస్ లో, అంతకు ముందు 15 రోజులు క్వారంటైన్ లో ఉండేందుకు ఇష్టపడటం లేదు. దాంతో సీజన్ 4లో సెలబబ్రిటీల కంటే సెలబ్రిరేటీలు అవుదామని వచ్చిన వారి సంఖ్యనే ఎక్కువగా ఉంది. వీరిలో చాలామంది టెలివిజన్ ప్రేక్షకులకు కొత్త ముఖాలే. వారిని గుర్తుంచుకోవడానికే వారం రోజులు పట్టింది ప్రేక్షకులకు. కరోనా సమయంలో ఎదో ఒక వినోదం అంటూ మొదటివారం సరిపెట్టుకున్నారు. హౌస్ లో జోష్ కోసం కుమార్ సాయిని ఫస్ట్ వైల్డ్ కార్జ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపాడు నాగార్జున. అదేవారం జబర్దస్త్ అవినాష్ ను రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ హౌస్ లోకి పంపించాడు.
అయితే హౌస్‌లో గ్లామర్ పాలు తక్కువైంది అన్న విమర్శ రావడంతో ముచ్చటగా ముడోవారం మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అందాల హీరోయిన్ స్వాతి దీక్షిత్ ను ఇంటిలోకి పంపించాడు బిగ్ బాస్. స్వాతి దీక్షిత్ 2009లో అందమైన భామలు టెలివిజన్ షో ద్వారా పరిచయం అయ్యింది. టైటిల్ గెలుచుకున్న తర్వాత సినిమా అవకాశాలు వచ్చాయి. 2014లో రాంగోపాల్ వర్మ చిత్రంలోనూ ఆమె నటించింది. అయితే ఆ సినిమా విడుదల కాలేదు. ఆ తర్వాత అల్లరి నరేష్ సరసన హీరోయిన్ గా 'జంప్ జిలానీ' సినిమాలో నటించింది. తెలుగుతో పాటు తమిళం, బెంగాలీ చిత్రాల్లోనూ అవకాశాలు వచ్చాయి. 'నామ్’, ‘లేడీస్ అండ్ జెంటిల్‌మెన్’, ‘సింబా’ సినిమాలు స్వాతి దీక్షిత్‌కు హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చాయి.ఇప్పుడు మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ హౌస్ లోకి అడుగుపెడుతున్న ఆమె హౌస్ లో గ్లామర్‌ని ఏ మేరకు పెంచుతుందో చూడాలి.

![]() |
![]() |