![]() |
![]() |

తెలుగులో మాత్రమే కాదు... హిందీలోనూ 'అర్జున్ రెడ్డి' బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకుంది. ఆ సినిమా రీమేక్ 'కబీర్ సింగ్'తో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. తరవాత అతడి మార్కెట్ పెరిగింది. 'జెర్సీ' రీమేక్ కోసం 30 కోట్ల రూపాయలతో పాటు లాభాల్లో వాటా తీసుకుంటున్నాడని టాక్. షాహిద్ క్రేజ్, మార్కెట్ గమనించి అతడికి నెట్‌ఫ్లిక్స్ భారీ ఆఫర్ ఇచ్చిందట.
హాలీవుడ్ స్టార్ హీరోలతో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీకి తమ ఫ్లాట్‌ఫార్మ్ కోసం సిరీస్‌లు, సినిమాలు నిర్మిస్తోంది. అలాగే, బాలీవుడ్ హీరోలతోనూ చేయాలని ప్లాన్ చేస్తోందట. అందుకోసం షాహిద్ కపూర్‌తో 100 కోట్ల డీల్ ఒకటి సెట్ చేసుకున్నదని ముంబై ఖబర్. అయితే, వంద కోట్లు ఒక్క సినిమాకి కాదు. ఒక సిరీస్ సహా కొన్ని ప్రాజెక్టులు చేయాలని అనుకుంటున్నారట.
షాహిద్ కపూర్‌తో నెట్‌ఫ్లిక్స్ డీల్ చేసుకుంటే... అజయ్ దేవగణ్, హృతిక్ రోషన్‌తో హాట్ స్టార్ ఓటీటీ డీల్ చేసుకుందట. ఆ హీరోలు ఇద్దరూ చెరో వెబ్ సిరీస్ చేయనున్నారని టాక్. హృతిక్ 80 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నాడట.
![]() |
![]() |