![]() |
![]() |

దర్శకుడు అనురాగ్ కశ్యప్ మీద లైంగిక వేధింపుల కేసు పెట్టిన పాయల్ ఘోష్, గురువారం మరోసారి కేసు పెట్టిన ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్‌కి వెళ్లారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాల కోసం ఆమెను పోలీసులు సంప్రదించడంతో నేరుగా స్టేషన్‌కి వెళ్లి కలిసి ఆధారాలు అందజేశారని పాయల్ లాయర్ నితిన్ తెలిపారు. అనంతరం దర్యాప్తు ముమ్మరం చేయబోతున్నారని అన్నారు.
తనపై వచ్చిన ఆరోపణలను అనురాగ్ కశ్యప్ ఖండించాడు. అతడికి మాజీ భార్యలు, కొందరు కథానాయికల నుండి మద్దతు లభించింది. అనురాగ్ మీద ఆరోపణలు చేయడంతో పాటు తనకు లైంగిక సుఖం అందించిన కారణంగా రిచా చద్దా, హ్యూమా ఖురేషికి అవకాశాలు ఇచ్చానని అతడు తనతో చెప్పినట్టు పాయల్ చెప్పారు. ఆమె వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రిచా చద్దా లీగల్ నోటీసు పంపారు. హ్యూమా ఖురేషి కూడా ఖండించారు. ఇప్పుడు హ్యూమాకు మద్దతుగా ఆమె సోదరుడు, నటుడు సాకిబ్ షకీబ్ సలీమ్ నిలిచాడు. అక్కకి సపోర్టుగా మాట్లాడాడు.
![]() |
![]() |