![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభమై మూడువారం పూర్తి కానేలేదు. అప్పుడే టీఆర్పీ 18 నుంచి 8కి పడిపోయింది. గత మూడు సీజన్ల మాదిరిగానే ఈ సీజన్ బిగ్ బాస్ కోసం కూడా ప్రేక్షకులు ఆసక్తితో ఎదురుచూశారు. కరోనా కారణంగా కాస్త ఆలస్యంగా అయినప్పటికీ ఎంతో ఉత్సాహంతో బిగ్ బాస్ కు స్వాగతం చెప్పారు. అయితే కంటెస్టెంట్ల ముఖాలు కొత్తగా కనిపించడంతో వారు ఎవరు అన్నది తెలుసుకునే ప్రయత్నంలోనే మొదటివారం గడిచిపోయింది. ఫస్ట్ వీక్ దాదాపు 4.5కోట్ల మంది ఈ షోను చూడగా 18.5గా టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ప్రతి ముగ్గురిలో ఇద్దరు బిగ్ బాస్ చూస్తున్నారని హలో బ్రదర్ తెగ సంతోషపడిపోయాడు.
రెండోవారం హౌస్ లోకి అడుగుపెట్టిన ఇద్దరు కంటెస్టెంట్లు కూడా ప్రేక్షకులు ఆశించినంత సెలబ్రెటీలు కాకపోవడంతో వీక్షించే వారి సంఖ్య తగ్గింది. అంతేకాదు ఐపీఎల్ ప్రారంభం కూడా బిగ్ బాస్ చూసేవారి సంఖ్య తగ్గడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. మొత్తానికి కంటెస్టెంట్ల కారణంగానో.. ఐపిఎల్ కారణంగానో రెండోవారం బిగి బాస్ రేటింగ్ 8.05గా నమోదు అయ్యింది. నాగార్జున హోస్ట్ గా వచ్చే వీకేండ్ షో రేటింగ్ కూడా 10.7గా ఉంది. బిగ్ బాస్ హౌస్ పై ఐపీఎల్ ఎఫెక్ట్ పడింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చెక్కర్లు కొడుతున్నాయి. ఐపీఎల్ ఎఫెక్ట్ ను తట్టుకుని ప్రేక్షకులను బిగ్ హౌస్ వైపు మళ్లించడానికి హౌస్ లో గ్లామర్ శాతం పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన ఫస్ట్ సీజన్ లో ప్రారంభంలో 16.2గా నమోదు అయిన టీఆర్పీ చివరికి 13.2 కు తగ్గింది. నాచురర్ స్టార్ నానీ హోస్ట్ చేసిన రెండో సీజన్ లో 15.1 నుంచి 10.7ను టీఆర్పీ తగ్గింది. ఇక మూడో సీజన్ లో నాగార్జున హోస్ట్ చేయగా ప్రారంభంలో 21.63గా ఉన్న టీఆర్పీ కొద్దికొద్దిగా పెరుగుతూ చివరికి 25.03గా నమోదు అయ్యింది. మొదటి, రెండో సీజన్ లో క్రమంగా టీఆర్పీ తగ్గితే మూడో సీజన్ లో పెరిగింది. మరి నాల్గో సీజన్ చివరి నాటికి టీఆర్పీ రేటింగ్ ఎలా ఉంటుందో చూడాలి.
![]() |
![]() |