![]() |
![]() |
.jpg)
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం రోజురోజుకు ఉద్యమంలా కొనసాగుతోంది. ఈ చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటడానికి ప్రముఖులు, సెలబ్రిటీలు ఉత్సాహం చూపుతున్నారు. ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ శిల్పా రెడ్డి ఇచ్చిన ఛాలెంజ్ ను చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితా కొణిదెల స్వీకరించారు. తన భర్త విష్ణుప్రసాద్ తో కలిసి మంగళవారం జూబ్లీహిల్స్ లోని తమ కార్యాలయం ఆవరణంలో మూడు మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా సుస్మిత మాట్లాడుతూ, ఈరోజు మొక్కలు నాటడం నాకు చాలా సంతోషంగా ఉంది. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారు చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టి మాకు ఇష్టమైన పనైన మొక్కలు నాటే పనిని మాతో చేయించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కరోనా వైరస్ ప్రభావం వల్ల లాక్ డౌన్ సమయంలో ఏదైనా మంచి పని చేశాం అంటే.. అది ఈరోజు ఈ మొక్కలు నాటడమే. నాకు చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఇదేవిధంగా ఈ ఛాలెంజ్ ను ఇంకా పెద్ద ఎత్తున అందరు ముందుకు తీసుకోనిపోయి బాధ్యతగా మొక్కలు నాటాలనీ, వాటిని రక్షిస్తే అవి మనకు ఆక్సిజన్, నీడను ఇస్తాయనీ చెప్పారు.
ఈ సందర్భంగా ఆమె మరో ముగ్గురికి ఈ చాలెంజ్ విసిరారు. వారు సుస్మిత చెల్లెలు శ్రీజ, అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి, నిర్మాత సి. అశ్వినీదత్ కుమార్తె స్వప్నా దత్.

![]() |
![]() |