![]() |
![]() |

ప్రభాస్ బంధుమిత్రుల నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్‌తో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌కి మంచి అనుబంధం ఉంది. యువి నిర్మాతలలో ఒకరైన విక్రమ్ అతడికి క్లోజ్ ఫ్రెండ్. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై చరణ్ నిర్మించిన సినిమాలను యువి డిస్ట్రిబ్యూట్ కూడా చేసింది. ఎప్పటినుండో యువిలో చరణ్ ఓ సినిమా చేయాలని అనుకుంటున్నారు. చాలామంది దర్శకులను పిలిపించుకుని కథలు విన్నారు. చివరకు... 'ఛలో', 'భీష్మ' ఫేమ్ వెంకీ కుడుముల కథకు ఓకే చెప్పారని ఫిలింనగర్ సమాచారం.
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' చేస్తున్నారు రామ్ చరణ్. దాని తరవాత సినిమా ఇంకా ఖరారు కాలేదు. యువి వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం... 'ఆర్ఆర్ఆర్' తరవాత యువిలో వెంకీ కుడుముల దర్శకత్వంలో చరణ్ సినిమా చేయనున్నాడు. విజయదశమికి పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమాను లాంఛ్ చేయాలని అనుకుంటున్నారట. ఓపెనింగ్ ఈ ఏడాది చేసినా... సెట్స్ మీదకు వెళ్ళడానికి టైమ్ పడుతుందని టాక్. ముందు 'ఆర్ఆర్ఆర్' ఫినిష్ చేయాలి కదా!
![]() |
![]() |