![]() |
![]() |

సినిమాలో 'మ మ మహేశా' అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు స్టెప్పులేస్తే ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు. అలాంటిది లైవ్ లో స్టేజ్ మీద స్టెప్పేస్తే ఇంకేమన్నా ఉందా!. ఫ్యాన్స్ కి మాటల్లో చెప్పలేనంత కిక్. చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. ఇలాంటి అద్భుతమే 'సర్కారు వారి పాట' సక్సెస్ మీట్ లో చోటు చేసుకుంది.
'సర్కారు వారి పాట' సక్సెస్ మీట్ సోమవారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ వేడుకలో 'మ మ మహేశా' సాంగ్ కి డ్యాన్స్ వేస్తున్న డ్యాన్సర్స్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ని స్టేజ్ మీదకు ఆహ్వానించారు. డాన్సర్స్ తో కలిసి తమన్ కాస్త కష్టంగా స్టెప్పులేస్తున్న సమయంలో.. మహేష్ ఒక్కసారిగా స్టేజ్ మీదకు వచ్చి సర్ ప్రైజ్ ఇచ్చాడు. 'మ మ మహేశా' సిగ్నేచర్ స్టెప్ వేసి అదరగొట్టాడు. దీంతో వేడుకలో ఉత్సాహం ఒక్కసారిగా వంద రెట్లు పెరిగింది.
సాధారణంగా మహేష్ స్టేజ్ పై స్టెప్పులేయడు. ఎవరైనా వేయమని అడిగినా చిన్న స్మైల్ ఇచ్చి సున్నితంగా నో చెప్తాడు. అలాంటి మహేష్ ఇప్పుడు తనంతట తానుగా వేదికపైకి వెళ్లి మాస్ స్టెప్పులేసి అలరించడం ఫ్యాన్స్ తో పాటు అందరినీ ఆశ్చర్యపరిచింది. 'సర్కారు వారి పాట' రిజల్ట్ పట్ల తాను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పడంతో పాటు ఫ్యాన్స్ లో మరింత జోష్ నింపాలన్న ఉద్దేశంతో మహేష్ ఇలా లైవ్ లో మాస్ డ్యాన్స్ తో అదరగొట్టాడన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
![]() |
![]() |