![]() |
![]() |

కరోనా కాలంలో... అది 2020లో టూర్లకు వెళ్లిన సినీ తారల జాబితాలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖా వాణి కూడా చేరారు. కుమార్తె సుప్రియతో కలిసి ఆమె హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని హిల్ స్టేషన్ మనాలికి వెళ్లారు. తల్లీ కూతుళ్లు ఇద్దరూ కలిసి మంచుకొండల్లో షికార్లు చేస్తున్నారు. మంచులో సుప్రియ సంతోషంగా ఆటలు ఆడుతున్న వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
లాక్ డౌన్ కాలంలో ఇంటికి పరిమితమైన సురేఖా వాణి... అన్ లాక్ మొదలైన తరవాత ఓ తమిళ సినిమా షూటింగ్ చేశారు. విజయ్ సేతపతి, తాప్సీ జంటగా నటిస్తున్న ఆ సినిమా షూటింగ్ కోసం జైపూర్ వెళ్లి వచ్చారు. ఇప్పుడు కుమార్తెతో కలిసి ట్రిప్ వేశారు. అదీ సంగతి!








![]() |
![]() |